‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


తిక్కనామత్యునికి తన యుద్ధ తంత్రాన్ని వివరించింది రుద్రమ.

‘‘అసలు ఈ రక్కస గండడే ఈ యుద్ధానికి వ•లం. అతడు అతి చిన్నసైన్యం కలవాడు అనేది అందరికి తెలిసిందే. కాని అలాంటివాడు కాకతీయ సామంత రాజ్యంలోకి చొచ్చుకువచ్చాడంటే.. వీడి వెనుక ఏదో బలీయమైన శక్తి ఉందని నా అనుమానం తాతగారు. అది దేవగిరి సంఘణ దేవుడో, ఆయన అనుచర వణిజుడో, ఆయన మరో ప్రతినిధో కావచ్చని నా సందేహం. అతడు నా మేనమామగా మా కుటుంబంతో ఆప్యాయత నటిస్తూనే కాకతీయ వంశ నాశనానికి కుట్రలు చేస్తున్నాడు. అందుకు ఈ రక్కస గండడిని ప్రయో గించాడు. నేనా కుట్రను ఛేదించాలని నిర్ణయించు కున్నాను. అందుకు అనుజ్ఞ ఇవ్వండి మహామాత్యా..’’ చేతులు జోడించి అడిగింది రుద్రమ.

‘‘తెలుగు సామ్రాజ్య లక్ష్య సాధనలో ఎవరు అడ్డు వచ్చినా సహించేది లేదు వీరనారీ! ప్రత్యక్ష యుద్ధ్దాన్ని వదలి పరోక్ష యుద్ధానికి ఇటీవల కొందరు మహారాజులు ఆసక్తి చూపుతున్నారు. అందుకు వాణిజ్య శ్రేణులను అడ్డు పెట్టుకుంటున్నారు. ఈ కుట్రలను ఛేదించాల్సిందే. అందుకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. జయహో..’’

త్రిముఖ యుద్ధం భారీగా మొదలయ్యింది. సర్వసైన్యాధ్యక్షునిగా గంగయ సాహిణీ మొత్తం యుద్ధ నిర్వహణ చేపట్టగా రుద్రమ రెండవ యుద్ధ బృందంతో సిద్ధంగా ఉంది.

సందివిగ్రహిని రక్కస గండడి స్కంధావారానికి పంపి రుద్రమదేవి గోల్లెనకు వచ్చాడు గంగయ సాహిణీ. అంగరక్షకులతో మాట్లాడుతున్న రుద్రమ- గంగయ సాహిణీని చూసి వారిని బయటకు పంపించివేసింది.

‘‘జయము జయము వీరనారీ..’’ అన్నాడు గంగయ సాహిణీ.

అతని ముఖం చూస్తే ఏదో సంశయిస్తున్నాడని రుద్రమ గుర్తించింది.

‘‘జయము జయము కే•••ర దేవా..’’ అన్నది.

నిర్విణ్ణుడయ్యాడు గంగయ సాహిణిగా ప్రసిద్ధ్దుడైన కే•••రదేవుడు.

ఏమీ అనలేక, ‘‘అమ్మా..’’ అని మాత్రం అనగలిగాడు. తన అసలు పేరు కూడా మర్చిపోయేంతగా ఈ పదేళ్లలో తెలుగు రాజ్యాల్లో గంగయ సాహిణిగా ప్రసిద్ధుడ•య్యాడతను.

‘‘క్షమించండి మామా..’’

అతనికి దగ్గరగా వచ్చింది.

‘‘ఆ రోజు మీ గోల్లెనలో ఆమె.. మీ భార్య.. తండ్రిగారిపై పగబట్టిన ఆమె.. బాలకవ్వల కదూ.. ఆమె ఆ రోజు నా తండ్రిని స్వహస్తాలతో తీవ్రంగా కొట్టింది. అదంతా నేను గోల్లెన వెనుక నుండి చూశాను.. విన్నాను..’’ నివ్వెరపోతూ వెనకడుగు వేశాడు గంగయ. అతనిది ఊహించని సంగతి.

ఆరోజు గణపతిదేవునితో పాటు రుద్రమ కూడా వచ్చిందని కే•••రకు ఇప్పుడు గుర్తొచ్చింది. దిగ్భ్రమతో నోట మాట రాలేదు. అలా కళ్లప్పగించి చూస్తున్నాడామెను.

‘‘ఆ కవ్వల తన పగను మర్చిపోయిందని మనమంతా అనుకునేలా ఇన్నేళ్ల యుద్ధం నిశ్శబ్దంగా కనిపిస్తూ, తన పని తాను చేసుకుపోతోంది. కాకతీయరాజ్య పతనం, గణపతిదేవుని దుర్మరణం.. ఆమె ఆశయాలు. ఇప్పుడు ఇలా ఈ యుద్ధం ద్వారా మళ్లా బయటకు వచ్చాయి. ఈ యుద్ధ్దానికి రక్కస గండడు కేవలం ముఖం మాత్రమే. అసలు మీపై.. మనపై యుద్ధం చేస్తోంది ఆమె.. ఆ బాల కవ్వలాబాయి!!’’

వాస్తవాన్ని, యుద్ధం వెనుకనున్న అసలు శత్రువులను వారి బలాబలాలను రుద్రమ కచ్చితంగా గుర్తించింది.

ముఖ్యంగా బాల కవ్వలను గుర్తించడం రుద్రమ ప్రతిభకు నిదర్శనం.

ఈ అంశం అప్పటికే గంగయ సాహిణికి తెలిసింది. రక్కసగండడి వెనుక ఉన్నది వణిజ ప్రముఖుడు నానప్పశెట్టి.

బాల కవ్వలాబాయికి, సింఘణ దేవునికి ఈ శెట్టి పరమవిధేయుడు. బాలకవ్వలాబాయి కే•••రను పక్కన పెట్టి ఎవరినో పెళ్లి చేసుకున్నట్లు గూఢ చారులు అతనికి తెలియజేశారు కూడా. ఆ కొత్త మొగుడు ఈ నానప్పశెట్టి కావచ్చునని గంగయకు అందిన సమాచారం!

ఇప్పుడు రుద్రమదేవి పూర్తి అవగాహనతో మాట్లాడటం అతడిని చకితుడ్ని చేసింది.

రుద్రమ గణపతిదేవుడి అంగరక్షకులను పటిష్టపరచింది. రెండు అంచెల భద్రత ఏర్పరచింది. ఇవేవీ గణపతిదేవునికి తెలియవు. ఆయన, తిక్కనార్యునితో కలసి వ•డు యుద్ధ బృందాలను సమన్వయం చేస్తూ యుద్ధ వార్తల సైనికులతో.. లేఖకులతో ఊపిరి సలపకుండా ఉన్నాడు.

‘‘గంగయ సాహిణీ.. మహావీరా.. మీరు యుద్ధ రంగంలో ప్రచండంగా విజృంభించండి. నేను ఆ దుర్మార్గురాలి సంగతి తేలుస్తాను. మహాకవులన్నట్లు ఇది అంతిమయుద్ధం.. తెలుగు జాతికి, కాకతీయ వంశానికి కూడా..’’

ఆమె చెప్పడం ఆపాక కూడా ఆ గోల్లెనలో ఆమె ప్రకటించిన ఉద్వేగం.. చాలాసేపు గంగయను ఊపిరి తీసుకోనివ్వలేదు. మాటలు రాక.. ఆమెకు నమస్కరించి మౌనంగా వెనుదిరిగాడు గంగయ సాహిణి.

ఆయన గోల్లెన వీడగానే రుద్రమ అంగరక్షకులు మళ్లీ లోపలికి వచ్చారు.

***

బెలగావి పట్టణానికి దూరంగా యుద్ధ క్షేత్రం.

పూర్తిగా యుద్ధ దుస్తులు..కొడవ వీరుల యుద్ధ దుస్తులలో పూర్తిగా మగవీరుడిలా ఉంది రుద్రమ. వ•తికి అడ్డంగా గుడ్డ చుట్టుకుంది. ఒంటరిగా గుర్రంపై వెళుతోంది. ఆమెకు తగినంత దూరంలో అంగరక్షకులు సాధారణ పౌరుల్లా వెంట వస్తున్నారు. ఆమెకు ఎవరి నుండైనా ప్రమాదం వస్తే లిప్తకాలంలో వారిని అడ్డంగా నరికివేయడానికి తగినంత దూరంలో కదులుతున్నారు వాళ్లు.. పాతికమంది.

ఆమె ఎవరికీ అనుమానం రాకుండా కేవలం క్రీగంట విపులంగా చుట్టూ పరికిస్తూ మెల్లగా గుర్రాన్ని నడుపుతోంది. అలా వెళ్లి వెళ్లి శత్రు స్కంధావారం వెనుకవైపు ప్రదేశానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరికిస్తోంది.

విశాలమైన స్కంధావారమే కాని అందులో వెనక భాగంలో ఓ పాడుబడిన భవనం కనిపించింది. సాధారణంగా జనావాసాలు ఉన్నచోట తాత్కాలికంగా స్కంధావారం నిర్మిస్తారు. కాని ఈ స్కంధావారం చివర ఓ పాడుపడిన భవంతి ఉండటం ఆమెను ఆకర్షించింది. ఆ భవంతిని ఎందుకు స్కంధా వారంలో భాగం చేశారు. ఎందుకెందుకు??

ఆమె వెనక్కు తిరిగి అంగరక్షకులైన లెంకలకు చూపులతో సందేశమిచ్చి గుర్రం దిగి మెల్లగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ భవంతి దగ్గరగా వెళ్లింది. లెంకలు తమ గుర్రాలు దిగి ఆమె గుర్రపు కళ్లేన్ని అందుకుని.. ఆమెకు అన్నివైపులా చుట్టూ పరివేష్టించి కదులుతున్నారు.

భవంతి దగ్గరగా వెళ్లింది రుద్రమ. దాని ద్వారాలు వ•సి ఉండటం వల్ల కాపలి భటులు లేరు కాబోలు అనుకుంటూ మరింత దగ్గరగా వెళ్లింది.

లోపల ఎవరివో కదలికలు.. ఎవరో మనుష్యు లున్నట్లు తెలుస్తోంది. రుద్రమ మ్రాన్పడిపోయింది.

ఇదేమి చోద్యం?!.. ఇదే వీళ్ల యుద్ధ తంత్రం కాబోలు!!

దూరంగా అరుపులు, కేకలు వినవస్తుండటంతో చెవులు రిక్కించి జాగ్రత్తగా వింటూ ఓ కిటికీ దగ్గరకు వెళ్లి మెల్లగా దాని ద్వారాలు కదిపి చూసింది. కేవలం కొంచం మాత్రమే తలుపులు కదిలాయి. లోపల ఆముదపు కాగడా వెలుగులో దృశ్యం స్పష్టాస్పష్టంగా తెలుస్తోంది. మరాఠీ సాంప్రదాయ దుస్తులలో ఉన్న ఓ మహిళ అటూ ఇటూ తిరుగుతూ చెబుతోంది. వినపడటం లేదు కాని ఆమె కాస్త కనపడుతోంది. బహుశా ఎదురుగా కొందరు వ్యక్తులున్నారు. ఏదో చెబుతోంది. బహుశా ఏవో సూచనలు..

యుద్ధభూమిలో మహిళ? సాధారణంగా ఉండరు.. ఉన్న ఈమె ఎవరై ఉండవచ్చు??!

చురుకయ్యింది రుద్రమ. ఈమె.. ఆమె కావచ్చు??

ఏదైతే సందేహించిందో ఆ సందేహమే బలపడు తోంది.

లోపల ఉన్నది బాల కవ్వలాబాయి. లోపల సంభాషణలు వివరంగా తెలియడం లేదు. అవతల యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మరేదో చర్చ ఏవిటి?? ఏదో కుట్ర జరుగుతోంది. రుద్రమలో ఉత్సుకత పెరిగిపోతోంది. తెలుసుకోవాలి.. ఎలా ఎలా..

తలెత్తి పైకి చూసింది. భవంతిపైన వెలుతురు కోసం తలుపులులేని కిటికీ ఉన్నట్లు కనిపించింది. దూరంనుండి పరికిస్తున్న అంగరక్షకులలో ఒకరిని దగ్గరకు రమ్మంటూ వ్రేలితో సంజ్ఞా చేసి పిలిచింది. అతడు వచ్చి గోడ వద్ద వంగి నిలబడగా రుద్రమ అతని వీపు పైకెక్కి లోపలికి తొంగిచూసింది.

మహిళ చేతులు కదుపుతూ చెబుతుండగా ఓ సైనిక బృందం వింటున్న దృశ్యం స్పష్టంగా కనబడుతోంది కానీ వినపడటం లేదు. కాసేపటికి ఆమెతో సహా ఆ బృందం కదిలి మరోవైపు వెళ్లింది. రుద్రమ లోపలికి వంగి కాళ్లు కిందికి దింపి కిందున్న కిటికీ తలుపులు కాలివేళ్లతో మరి కాస్త తెరచి వేగంగా పైకి ఎగిరి బయటకు వచ్చేసి అంగరక్షకులు దగ్గరకు రాగానే కిందికి ఉరికింది. వాళ్లు ఆమె కిందపడకుండా పట్టుకున్నారు. తర్వాత ఆ కిటికీ మరింత తెరచి ఒకరిని లోపలికి వెళ్లమంది. అతని వెనక రుద్రమ కూడా లోపలికి వెళ్లింది.మళ్లీ ఆమె, ఆ బృందం వస్తున్న అలికిడి వినపడి ఇద్దరూ చటుక్కున మరో గదిలోకి పరుగుపెట్టి వ•లగా దాక్కున్నారు.

ఇప్పుడు రుద్రమ, ఆమె అంగరక్షకుడైన లెంక ఆ భవంతిలో చాటుగా దాగి వాళ్ల మాటలు, ప్రణాళికలు వినసాగారు. ఆమె తన వ్యూహం ఏదో మెల్లగా వివరంగా వాళ్లకు చెబుతోందని తెలుస్తోంది కాని అవతల యుద్ధారావాలు.. గుర్రాల సకిలింపులు, మహామత్తగజాల ఘీంకారాలు, కత్తుల కణకణల మధ్య పూర్తిగా తెలియడం లేదు. కాని ఆమె ఏదో చాలా పెద్ద వ్యూహం రచించి అమలు చేయ బోతోందని రుద్రమ గుర్తించింది.

ఓరగా తలుపుల చాటుగా ఆమెను పరీక్షగా చూసింది. సందేహం లేదు ఆమె.. ఆనాడు ఆ గోల్లెనలో తన తండ్రిని ఏదేదో దూషిస్తూ.. చురుకైన చేతులతో ఆయన ముఖంపై కొట్టి కొట్టి ఏడ్చిన మహిళ.. బాలకవ్వల!!

తను చూసినప్పటి కంటే కొంచెం ముదురుగా కనిపిస్తోంది కాని మరింత చురుగ్గా మరింత వేగంగా కదలుతోంది. బాగా పదును పెట్టిన చురకత్తిలా తోచింది రుద్రమకు. అతి పెద్ద అంతిమ యుద్ధ్దానికి పూర్తిగా సిద్ధ్దమైనట్లు కనిపిస్తోందామే.

శత్రువు బలమైనదే అనుకున్నది రుద్రమ.

అప్పుడు చూసింది అసలు ఆ భవంతి ఏవిటోనన్నట్లు. అదొక కోష్టాగారంలా కనిపించింది. నిజానికి అదొక పాడుబడిన భవంతి కాని దానినొక యుద్ధ్ద కోష్టాగారంలా ఉపయోగిస్తున్నారు. అందుకే ఆమె దీనిని కూడా స్కంధావారంలో కలిపిందని రుద్రమ గుర్తించింది.

మళ్లీ సందేహం వచ్చి ఆ మందిరాన్ని వివరంగా చూసింది. లోపలి గదులన్నీ ఆయుధాలతో నిండిపోయి ఉన్నాయి. కాని ఆ బృందమున్న మందిరం మాత్రం ఏదో దుస్తుల మందిరంలా..

రుద్రమ బుర్రలో ఏదో తళుక్కున మెరిసింది.

శరీరమంతా వణికింది. ఆమె దుష్టపన్నాగం అర్థం అయ్యేసరికి కళ్లు తిరిగి పడిపోయేలా తూలిపోయింది.

లెంక వేగంగా వచ్చి ఆమెను పట్టుకున్నాడు.

రుద్రమకు ఆనాడు తమ అంతఃపురంలో తండ్రి తల్లికి మధ్య జరిగిన సంభాషణ, ఆ తర్వాత తల్లి తనకు చెప్పిన అంశాలు గుర్తుకొచ్చాయి.

ఆనాడు గణపతిదేవుడు, పెద్దకవ్వల దేవగిరి కోటలో దాగున్నది ఓ దుస్తుల కోష్టాగారంలో. అక్కడే కవ్వలను ఎవరో చంపేశారు. కాబట్టి గణపతిదేవుని ఇక్కడ.. ఈ యుద్ధంలో ఓడించి బంధించి, కోష్టాగారంలో ఆనాడు ఆమె అక్కను చంపినట్లే గణపతిదేవుని మట్టుపెట్టాలన్నది ఆమె వ్యూహం. అందుకే ఈ శిథి•ల భవంతిని కూడా దుస్తుల కోష్టాగారంలా మార్పించింది. అక్కడ నిర్వహించ వలసిన తతంగం ఏదో తన ముఖ్య అనుచరులకు వివరిస్తోంది.

పూర్తిగా అర్థమై ఒళ్లు జలదరించింది రుద్రమకు.

కర్తవ్యం గుర్తొచ్చింది. వేగంగా కదిలింది. చిరుతలా బయటకు పరిగెత్తింది. లెంకలను హెచ్చరించింది. వాయువేగ మనోవేగాలతో కాకతీయ స్కంధావారానికి వచ్చి పడింది.

కాని అప్పటికే జరగరాని ఘోరం జరిగి పోయింది.

గణపతిదేవుడు లేడు. ఆయన అంగరక్షకులు కొందరు చచ్చిపడి ఉన్నారు. ఆయనను బంధించి తీసుకుపోయారు. ఒళ్లంతా దెబ్బలతో ఓ చోట పడి ఉన్నాడు తిక్కనామాత్యుడు.

ఆయనకు ప్రథ•మచికిత్స చేసి కూర్చోబెట్టారు లెంకలు.

‘‘అమ్మో.. ఆమె ఆడది కాదు. ఆడ పిశాచి.. ఆడ దెయ్యం.. ఎంత పొగరు. మహా మండలేశ్వరు లనే చెంపలు వాయించి కింద పడేసి ఈడ్చుకు పోయింది. అడ్డొచ్చిన నన్ను కొట్టి పడేశారు ఆమెతో వచ్చిన ఆమె అంగరక్షకులు. అవతల వ•డు యుద్ధాలలో మనమే ముందంజలో ఉన్నామని వార్తలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు.. తెలుగు గ్రామీణులు.. స్వచ్ఛందంగా వచ్చి మన సైన్యానికి సహకరిస్తున్నారట. అది తెలిసి తండ్రిగారు, నేనూ సంతోషిస్తుంటే ఈ నీచురాలు వచ్చిపడింది. ఎప్పుడో ఎవ్వరో ఆమె అక్కను చంపారట. అందుకని మహానేత అని కూడా చూడకుండా మహామండ లేశ్వరునిపై విరుచుకుపడుతుందా.. హమ్మో..’’

జరిగింది అర్థ్ధమైంది రుద్రమకు.

మొదటి దశలో విజయం సాధించింది బాలకవ్వల.

రుద్రమ తప్పకుండా ఆమెను వెదుక్కుంటూ వస్తుందని ఊహించి, ఆమె కదలికలన్నీ తెలుసు కుంటూనే ఉంది. రుద్రమ ఆ భవంతి వద్దకు వచ్చాక లోపలికి వెళ్లడాన్ని గమనిస్తూనే భవంతి లోపలికి మరింతగా రానిచ్చి రుద్రమ ఇక్కడ కొన్నిగంటలు ఉండేలా చేసి అక్కడ గోల్లెనపై దాడిచేసి అంగరక్షకు లను చంపి తండ్రిగారిని పట్టి బంధించి తీసుకు పోయింది.

గుండె పట్టేసినట్లయ్యింది రుద్రమకు.

అద్భుతంగా ప్రణాళిక రచించి మరింత పకడ్బందీ అమలు చేసి విజయవంతంగా తన లక్ష్యమైన కాకతీయ మహామండలేశ్వరుని తన గుప్పిట్లో బంధించింది ఆ నీచురాలు కవ్వల.

తక్షణ కర్తవ్యం??

సైన్యమంతా యుద్ధభూమిలో ఉంది. ఇప్పుడు గణపతిదేవుని అదృశ్యం చెబితే అంతా రసాభాస అవుతుంది.

వీరులంతా గందరగోళమైపోతారు. యుద్ధం గాడి తప్పుతుంది.

తానిప్పుడు ఒంటరి!

ఓ దళాన్ని గాని, ఓ పటాలాన్ని గాని అడిగితే గణపతిదేవుని అదృశ్యం చెప్పాల్సి ఉంటుంది. ఎవ్వరికి చెప్పలేని పరిస్థితి. అదేదో తనొక్కతే తేల్చుకోవాలి. అంగరక్షకుల వంక చూసింది. వాళ్లకు అంతా అర్థ్ధమయ్యింది.

ఆ పాతికమంది లెంకలకు నాయకుడైన పశుపతి లెంక అన్నాడు.

‘‘యువరాణీ. ఇది మన శక్తియుక్తులకు పరీక్ష. ఇక్కడ ఇప్పుడు యుద్ధం గందరగోళం అవుతుంది. మనం వెంటనే వెళ్లకపోతే మహామండలేశ్వరులను మనం దక్కించుకోలేం. పదండి పదండి..’’

బలిష్టులైన పాతికమంది లెంకలే తన మహాసైన్యంగా భావించి తిరిగి ఆ శత్రు భవంతి వైపు వేగంగా వెళ్లింది ర••ద్రమ. భవంతి వెనుక నుండి ప్రవేశించడాన్ని అడ్డుకున్న కాపలాభటులను సంహరించి లోపలికి ప్రవేశించారు. కానీ లోపల ఎవ్వరూ కనిపించలేదు. ముందు చూసిన మందిరం చిందర వందరగా ఉంది. మరింత వివరంగా చూస్తే అక్కడ గణపతిదేవుని అంగరక్షకులైన ముగ్గురు లెంకలు శవాలై పడి ఉన్నారు. అంటే ఆయనను బంధించి తీసుకువస్తున్నప్పుడు మరికొందరు ఆయన అంగరక్షకులు వెంబడించి ఉంటారు. ఇక్కడ ఆయన్ను బంధించగా విడిపించడానికై వాళ్లు పోరాడినట్లు.. ఆ పోరాటంలో చనిపోయినట్లు స్పష్టంగా అర్థ్ధమౌతోంది.

‘‘మనవాళ్లు తీవ్రంగా ప్రతిఘటించినట్లు కనిపిస్తోంది యువరాణీ! మళ్లీ మనం దాడిచేస్తామని గుర్తించి ఆమె మరో చోటుకి మార్చినట్లుంది..’’ అన్నాడు పశుపతి లెంక.

క్షణక్షణానికి రుద్రమలో అలజడి పెరిగిపోతోంది.

కాకతీయ ప్రభువు గణపతిదేవుని బంధించి తీసుకుపోవడమంటే చిన్న విషయం కాదు. యుద్ధభూమిలో అయితే శత్రువుతో ఎదురునిలిచి పోరాడటం ఉంటుంది. కానీ ఇలా శత్రువును ఎత్తుకుపోవడం యుద్ధ్దరీతి అసలే కాదు. ఆ కవ్వల తన వ్యక్తిగత పగతో ఇంత దారుణానికి ఒడికట్టింది.

ఓ మహాసామ్రాజ్యానికి పాలకుడు, నలభై ఏళ్లుగా ఓటమి ఎరుగని మహా యోధుడు..ముఖ్యంగా పాలనను ప్రజాపక్షం చేసి రాజ్యమంతటా.. అన్ని సామంత రాజ్యాల ప్రజలను కన్నబిడ్డల్లా సమస్త సౌకర్యాలతో కాపాడుతున్న మహామనిషిని తన పిచ్చి పగతో అపహరించి..

ఆలోచించినకొద్దీ రుద్రమలో క్రోధం పెరిగి పోతోంది.

ఏమి చెయ్యాలి?!

అంతా శూన్యం. దారి తెన్నూ తెలియడం లేదు.

ఆమెకు ఏడుపు రావడం లేదు. కన్నులనుండి నిప్పుల జ్వాల ఎగసిపడుతోంది. మహావీరులయిన లెంకలు చేతులు నలుపుకుంటూ ఒరల నుండి కత్తులు తీస్తూ ఏమీ చేయలేక మళ్లీ లోపల పెడుతూ ఉద్రేకంతో ఊగిపోతున్నారు.

ఏదైనా ఓ కోష్టాగారం వద్ద మాత్రమే తన తండ్రిని హింసించి చంపాలని కవ్వల ఆశయమని రుద్రమ భావన.

ఆమె సింఘణదేవుని ప్రతినిధిగా వణిజులను తన నియంత్రణలో ఉంచుకుని.. వాళ్ల ద్వారా చిన్న ప్రాంతాల రాజులను ఆడిస్తూ తన లక్ష్యాలను సాధిస్తోందని గుర్తించింది. అందుకే ఇప్పుడు కూడా యుద్ధ్ద స్కంధావారంలో ఓ కోష్టాగారాన్ని కలుపుకుని ఏర్పాటు చేయించింది.

ఇక్కడ ఆమె ప్రణాళిక అమలు కష్టమైంది కనుక మరో చోటికి మకాం మార్చేసింది.

బహుశా బెలగావిలోని వణిజుని కోష్టాగారానికి తన తండ్రిని తరలించిందని రుద్రమకు తోచింది.

‘‘ఇలా ఇక్కడ చేతులు పిసుక్కుంటూ నిలబడటం వల్ల ప్రయోజనం లేదు. ఏమైనా చెయ్యాలి. ఆ దుర్మార్గురాలికి యుద్ధం పట్ల ఆసక్తి ఉండదు. కేవలం నా తండ్రిని దారుణంగా హింసించి చంపడమే ఆమె లక్ష్యం. అందుకు పదేళ్లుగా చాలా దుర్భేద్యంగా సిద్ధమైంది. ఆమెను ఎదుర్కోవాలంటే మనవ• అందుకు తగ్గట్లు బలిష్టంగా బలీయంగా ఉండాలి. అందుకు నేను స్ధ్దిం. నా తండ్రిపై ఈగ వాలినా నా శక్తియుక్తులు, నా బ్రతుకు వృథా. కదలండి. బెలగావి ఊళ్లోకి వెళదాం పశుపతి.. కదలండి!’’

తండ్రిని బందీని చేయడం రుద్రమ తట్టుకోలేకపోతోంది. లిప్త లిప్తకు ఉద్వేగంతో తల్లకిందులౌతోంది.

ఒక్క ఉదుటన గుర్రం అధిరోహించింది. ఆమెను మించి ఉద్రేకంతో సతమతమౌతున్నారు అంగరక్షకులైన లెంకలు. తాము రక్షణ వహించే ప్రధాన వ్యక్తి మరణించిన పక్షంలో ఈ లెంకలు ప్రాణత్యాగం చేస్తారు. శత్రువు తమ అధీనంలోని మహారాజును అపహరించడం భరించలేని అవమానం. అంతకంటే చావు నయం. గణపతి దేవుని లెంకలు ఆయన రక్షణలో కొందరు చనిపోయారని వీళ్లు గుర్తించారు. ఆయనను రక్షించుకోవాలి. అదే సమయంలో తమ రక్షణలోని యువరాణిని కూడా కాపాడుకోవాలి. తండ్రి కోసం ఆమె ఏ పోరాటానికయినా తెగిస్తోంది. అందుకు తగ్గ అప్రమత్తతతో ఉన్నారు వాళ్లు.

ఆమె ఎంత వేగంగా పోతుంటే అంతకంటే వేగంగా ఆమెకు ముందు.. వెనుకగా.. ఆ పాతికమంది..

రుద్రమ బృందం పోతూండగా ఓ గ్రామం వద్ద కాబోలు చాలామంది జనం గుమికూడి ఉన్నారు. వాళ్లు రుద్రమ బృందాన్ని ఆపలేదు కాని జనం వల్ల రుద్రమకు ముందున్న లెంకలు నెమ్మదించారు.

ఆ జనంలో ముందున్న వారిని అడిగాడు పశుపతిలెంక.

‘‘ఏమైంది.. ఎందుకు మీరంతా బయట గుమికూడారు?’’

అతడు తెలుగులో అడగడంతో వాళ్లంతా ఉత్సాహంగా అతని గుర్రం వద్దకు పరుగున వచ్చారు.

‘‘మేమంతా తెలుగువాళ్లమే.’’ అన్నారు వాళ్లు పరిచయం చేసుకుంటున్నట్లు.

‘‘తెలుగు రాజ్యం కోసం యుద్ధ్దాలు జరుగు తున్నాయి కదా. అదంతా మా కోసమే కదా.. అదే ఆనందం..’’ అన్నారు మరికొందరు.

ఒకరిద్దరు ఆ గుర్రం మీద ఉన్నది యుద్ధ దుస్తుల్లో ఉన్న మహిళ అని గుర్తించారు.

‘‘అమ్మా.. తమరు ఎవరు? గణపతిదేవుని కుమార్తె యుద్ధం చేస్తుందని విన్నాం.. తమరు??’’

‘‘అదిసరే గాని.. ఇటుగా ఎవరైనా మహరాజు గారిని బంధించి తీసుకుపోవడం మీరు చూశారా??’’ అంది ఆమె. రెండు లిప్తల కాలం అయోమయంతో వెర్రి చూపులు చూశారు. ఆనక హఠాత్తుగా అన్నారు.

‘‘మన తెలుగు మహారాజు గారిని ఎవరో ఎత్తుకుపోతున్నారా! ఎవరు వాళ్లు? మేమంతా వాళ్లను చంపేస్తాం.’’ అంటూ ఒకరిద్దరు రెచ్చిపోయి గొంతు పెంచి అందరికి వినిపించేలా అన్నారు.

‘‘ఒరే..మన తెలుగు మహారాజుగారిని ఎవరో పల్లకిలో ఎత్తుకుపోతున్నారంట. మన మహారాజు గారికి రక్షించుకోవాలి మనం. లగెత్తండోహో..’’ అంటూ గోలగోలగా అరుస్తూ రుద్రమ బృందానికి ముందు వెనగ్గా ప్రవాహమై పరుగులు పెట్టసాగారు.

‘‘పదండి పదండి..’’

గుర్రాల ముందు వెనకా జనం పరుగులు పెడుతున్నారు. చెప్పినా వినే పరిస్థితి లేదు.

జన ప్రవాహానికి మధ్యగా రుద్రమ, లెంకలు కదిలారు. గుర్రాలు పోతున్నాయి. గుర్రాలకు ముందూ వెనగ్గా పరుగులు పెడుతూ జనం. తెలుగు జనం.. ఒక చిన్న ఊరు దాటాక మరో ఊరు అలా అలా….జనం పెరిగిపోతున్నారు. పోయి పోయి నానప్పశెట్టి కోష్టాగారం వద్ద ఆగారు. పెద్ద కోలాహలం.

తన తండ్రి ప్రాణాపాయస్థితిలో ఉన్న సంగతి ఆమెను అతలాకుతలం చేస్తోంది. అదే సమయంలో తెలుగుప్రజలు ఏకమై దేనికైనా సిద్ధం అన్నట్లు తమను వెన్నంటి రావడం బావుంది కాని ఈ జనప్రవాహం తనకు అనుకూలమో, ప్రతికూలమో తెలియడం లేదు.

‘‘మన మహారాజును ఇక్కడే బంధించారా మహారాణీ?’’ అన్నారెవరో జనాంతికంగా.

ఏమీ చెప్పకుండానే గుర్రం దిగి పరుగున వెళ్లి కోష్టాగారం తలుపు వద్ద ఆగింది. లెంకలు వేగంగా ఆమెను సమీపించారు. మెల్లగా తలుపులు తడుతూ.. కిటికీలగుండా లోపలికి చూడడానికి యత్నిస్తున్నారు. జనం రాను రానూ నిగ్రహం తప్పిపోతున్నారు. ఉద్రేకం తప్ప ఏవి జరుగుతోందో వాళ్లకు అర్థం కావడం లేదు.

‘‘తలుపులు బద్దలు కొట్టండ్రా..’’ అరిచారెవరో.

ఈ హడావిడికి ఆ పిచ్చి బాలకవ్వల తన తండ్రికి ఏమి కీడు చేస్తుందోనని రుద్రమ చిరాకుపడుతోంది.

‘‘ఆగండి..ఆగండి..’’ పిచ్చెక్కినట్లు అరిచింది రుద్రమ. కానీ అప్పటికే పరిస్థితి కట్టు తప్పింది.

జనం కోష్టాగారం పైబడి కర్రలతో కత్తులతో బరిసెలు పుచ్చుకుని తలుపులు, కిటికీలు బద్దలు కొట్టసాగారు.

నిమిషాల వ్యవధిలో కోష్టాగారం తలుపులన్నీ విరిగిపోయాయి. గోడలు పడిపోయాయి. జనం లోపలికి పరుగులు పెట్టారు. రుద్రమ, లెంకలు కూడా లోపలికి పోయి అన్నివైపులా వెదకసాగారు.

వ్యర్థం!! ఎవ్వరూ లేరు.

– ‌మత్తి భానుమూర్తి

About Author

By editor