సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి లభించి అవసరాలు తీరతాయి. సన్నిహితులు, స్నేహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధువుల క్షేమసమాచారాలు ఊరటనిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి. కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కుతాయి. పరిశోధకులు, క్రీడాకారులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. 12,13 తేదీల్లో సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విమర్శించిన వారే మీపై అభిమానం చూపుతారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. దేవాలయాలు సందర్శిసతారు. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. 14,15 తేదీల్లో శారీరక రుగ్మతలు. అకారణ విరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయులతో కొద్దిపాటి విభేదాలు నెలకొన్నా నేర్పుగా పరిష్కరించుకుంటారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. స్వల్ప శారీరక రుగ్మతలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు వరిస్తాయి. 9,10 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త సంస్థల ప్రారంభంలో బిజీగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. క్రీడాకారులు, పరిశోధకులకు విశేషమైన అభివృద్ధి కనిపిస్తుంది. 11,12 తేదీల్లో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. రాబడి కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి పూర్తి సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. బంధువులతో శుభకార్యాల ప్రస్తావన . ప్రత్యర్థులను చాకచక్యంగా ఆకర్షిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు దక్కుతాయి. 13,14 తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. శివాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలతో సతమతమవుతారు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిళ్లు. వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట లభిస్తుంది. 11,12 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కొత్త పరిచయాలు. కుటుంబసౌఖ్యం. దేవీఖడ్గమాల పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. చేపట్టిన కార్యక్రమాలను కొంత శ్రమపడ్డా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు మరింతగా లాభపడతారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులు, రచయితలకు కృషి ఫలించి ముందడుగు వేస్తారు. 14,15 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. వృథా ఖర్చులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్యమైన కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. అదనపు ఆదాయం సమకూరుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఎట్టకేలకు పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలకు అన్నింటా విజయమే. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు ఊహించని విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు కొత్త కంపెనీల ఏర్పాటులో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 14,15 తేదీలలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు.శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది . చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు, విధుల్లో ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. 9,10 తేదీల్లో అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. దేవీస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కుటుంబంలో అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఊహించని వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆదాయం గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని అంచనాలు నిజమవుతాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. రచయితలు, పరిశోధకులకు శ్రమ ఫలిస్తుంది. 13,14 తేదీల్లో ధనవ్యయం. శారీరక రుగ్మతలు, ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొన్ని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి మరింత పెరిగి అవసరాలు తీరతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. యుక్తితో శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారులు లాభాలబాటలో నడుస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులు, రచయితలకు వ్యయప్రయాసలు. 10,11 తేదీలలో కుటుంబంలో సమస్యలు, అనుకోని ఖర్చులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.