గత ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌విసిరిన పాచికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీటుగా ఎదుర్కొన్న తీరు యావత్‌ ‌ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది చివరికి సంతృప్తికరమైన భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటిం చేలా చేసింది. ఆ క్రమంలో మోదీ నెరపిన చాణక్యం కొన్నిసార్లు చికాకు పెట్టే స్నేహితులను, పాత బంధాలను విచ్ఛిన్నం చేయకుండా ఎలా కాపాడు కోవాలో తెలిపే ఒక చక్కని పాఠం.

గత ఆరు నెలల్లో ఇండో-అమెరికా సంబంధాలలో అల్లకల్లోల దశలో మోదీ చూపిన ఓర్పు, సంయమనం అంతర్జాతీయ దౌత్యంలో ఒక మాస్టర్‌ ‌క్లాస్‌గా నిలిచిపోతుంది. ఆయన నాయకత్వం భారతదేశానికి ఉన్నత స్థాయిలో స్థానం కల్పించింది. సుంకాలు, రక్షణ ఒప్పందాలకు సంబంధించి ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాల నేపథ్యంలో చాలామంది ప్రపంచ నాయకులు గందరగోళంగా, తడబడినట్లు, కాలు కాలిన పిల్లుల్లాగా పరిగెత్తుతున్నట్టు కనిపించి నప్పటికీ, మోదీ మాత్రం ప్రశాంతంగా, మౌనంగా ఉన్నారు. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం కొనసాగిస్తే 50 శాతం సుంకాలు, ఇతర శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు బెదిరించి నప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తూనే ఉన్నారు. ఫలితంగా 27 దేశాలతో కూడిన యూరోపియన్‌ ‌యూనియన్‌(ఈయూ)తో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిని యూరోపియన్‌ ‌కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ ‌డెర్‌ ‌లేయన్‌ ‘‘అన్ని ఒప్పందాలకు తల్లి’’గా అభివర్ణించారు. యూరోపియన్‌ ‌యూనియన్‌తో ఒప్పందాన్ని సాధించడానికి మోదీ నిశ్శబ్దంగా పని చేయడం ట్రంప్‌ను, ఆయన సలహాదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు తాము విసిరిన సవాలుకు భారతదేశం ఈ విధంగా స్పందిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. మొండిగా కొనసాగితే భారతదేశంతో ఒప్పందం కష్టమవుతుందని వారికి అప్పుడు స్పష్టమైంది. భారతదేశంతో ఒప్పందాన్ని ప్రకటిస్తూ తన డిమాండ్లన్నింటికీ భారతదేశం లొంగిపోయిందని నటించడానికి ట్రంప్‌ ‌ప్రయత్నించారు. సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ భారతదేశం తన డిమాండ్‌కు కట్టుబడిన తర్వాతే కొత్త సుంకాలు అమలులోకి వస్తాయని ఆయన చెప్పలేదు. ఇది ఎలా ఉందంటే మీసానికి మట్టి అంటినప్పటికీ విజయం నాదే అని చెప్పడం.
ఒప్పందాన్ని ప్రకటిస్తూ చేసిన ఒక బహిరంగ ప్రకటనలో, ట్రంప్‌ ‌ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ, ‘‘ఆయన (మోదీ) నా గొప్ప స్నేహితులలో ఒకరు. ఆయన తన దేశానికి శక్తిమంతమైన, గౌరవనీయ నాయకుడు’’ అని, ఆయనతో మాట్లాడటం సగౌరవంగా భావిస్తున్నానని చెబుతూ తన సాధారణ అతిశయోక్తిని ఉపయోగించారు. భారతదేశం రష్యన్‌ ‌చమురు కొనుగోలును నిలిపివేస్తుందని, అమెరికా నుండి బహుశా వెనిజులా నుండి చాలా ఎక్కువ కొనుగోలు చేస్తామని మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
‘ప్రధానమంత్రి మోదీ పట్ల స్నేహం, గౌరవం కారణంగా, ఆయన అభ్యర్థన మేరకు వెంటనే అమలులోకి వచ్చేలా ఒక వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాము. దీని ద్వారా అమెరికా సుంకాన్ని 25% నుండి 18%కి తగ్గిస్తుంది. అంతే శాతాన్ని వసూలు చేస్తుంది. అదేవిధంగా, భారతదేశం అమెరికాపై సుంకాలను తగ్గిస్తుంది. 500 బిలియన్‌ ‌డాలర్ల అమెరికన్‌ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చార’ని కూడా ఆయన పేర్కొన్నారు.
‘‘భారతదేశంతో మా అద్భుతమైన సంబంధం ముందుకు సాగితే మరింత బలపడుతుంది. ప్రధానమంత్రి మోదీ, నేను చాలా మందికి చెప్పాపెట్టకుండా పనులు పూర్తి చేసే వ్యక్తులం’’ అని ట్రంప్‌ ‌తెలిపారు.
మోదీని ఇంతగా ప్రశంసిస్తున్న సమయంలోనే భారతదేశం ఇకపై రష్యా చమురును కొనుగోలు చేయడం లేదని, భారతదేశం 500 బిలియన్‌ ‌డాలర్ల విలువైన అమెరికా వస్తువులను కొనుగోలు చేస్తుందని కూడా ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం అమెరికా నుండి దిగుమతుల కంటే పది రెట్లు ఎక్కువ.
డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌వ్యక్తం చేసిన భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా స్పందించారు. అలాగని ఆయన చెప్పిన ప్రతిదానిని ఆమోదించలేదు. అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం ‘‘అద్భుతం’’ అని, భారతదేశంలో తయారైన ఉత్పత్తులపై ఇప్పుడు అమెరికాలో సుంకం 18 శాతం ఉంటుందని, దీనిని తాను సంతోషంగా ఉన్నానని ఆయన అన్నారు. ‘‘రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పరస్పర ప్రయోజనకరమైన సహకారం కోసం అపారమైన అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’’ అని తెలిపారు. భవిష్యత్తులో ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు.
మోదీ రష్యన్‌ ‌చమురు గురించి అస్సలు ప్రస్తావించలేదు. అమెరికా నుండి భారతదేశం 500 బిలియన్‌ ‌డాలర్ల విలువైన వస్తువులు, సేవలను కొనుగోలు చేస్తుందని కూడా ఆయన అనలేదు. కానీ సుంకం 50 శాతం నుండి 18 శాతానికి తగ్గడం పట్ల సంతోషంగా ఉన్నారు.
భారతదేశంతో అమెరికన్లు వాణిజ్య ఒప్పందాన్ని ముగించిన తొందరపాటుకు అనేక రంగాలలో మోదీ నిర్ణయాత్మక చర్యలతో సంబంధం ఉంది. గత ఏడాది కాలంలో భారతదేశం దగ్గర ఉన్న 241 బిలియన్‌ ‌డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీ బిల్లులను 190 బిలియన్‌ ‌డాలర్లకు తగ్గించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదే సమయంలో, మోదీ ప్రభుత్వం 2022లో 760 మెట్రిక్‌ ‌టన్నులుగా ఉన్న తన బంగారు నిల్వలను 2025 నాటికి 880 మెట్రిక్‌ ‌టన్నులకు పెంచాలని అప్పట్లోనే నిర్ణయించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లాండ్‌ ‌వంటి విదేశీ బ్యాంకుల్లో నిల్వ చేసిన బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వదేశానికి తెప్పిస్తోంది.
ఈ చర్యలు, సంవత్సరానికి 7 శాతం కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి అంచనాలతో పాటు, భారతదేశంలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఈయూతో వాణిజ్య ఒప్పందం అత్యంత కీలకమైనది. ఈ ఒప్పందం ప్రపంచ వేదికపై భారతదేశం చేసిన అత్యంత ముఖ్యమైన, సాహసోపేతమైన చర్యగా పరిగణనలోకి వస్తుంది. అమెరికాను దాదాపు ఎదిరించినంత పనిచేసింది. ప్రపంచ దేశాల స్నేహ కూటమిలో తన సరైన స్థానాన్ని పదిలపరుచుకుంది.
నరేంద్ర మోదీ తెలివి, దూరదృష్టి, సూక్ష్మమైన ప్రణాళికతో కూడిన సమయానుకూలమైన ఆపరేషన్‌ ‌చూసి ప్రపంచ మీడియా ముఖ్యంగా అమెరికన్‌ ‌వార్తాపత్రికలు విస్తుపోయాయి. ఈ ఒప్పందాన్ని ప్రశంసించాయి. సాధారణంగా మోదీని విమర్శించే న్యూయార్క్ ‌టైమ్స్, ‌వాషింగ్టన్‌ ‌పోస్ట్, ‌లండన్‌ ‌టెలిగ్రాఫ్‌ ‌కూడా ఈ ఒప్పందాన్ని కొనియాడాయి.
ఈ ఒప్పందం కోసం అనుసరించిన వ్యూహంతో, ట్రంప్‌ ‌ప్రభుత్వంలోని తన విమర్శకులను మాత్రమే కాకుండా భారతదేశంలోని విమర్శకులను కూడా మోదీ ఆశ్చర్యపరిచారు. ఆయన అమెరికన్‌ అధ్యక్షుడి పేరును ఎప్పుడూ ప్రస్తావించకుండా ట్రంప్‌ను ఎదిరించిన తీరుతో, ప్రపంచ నాయకులలో ముఖ్యంగా ఐరోపాలో కొత్త స్నేహితులను, ఆరాధకులను కూడా సంపాదించుకున్నారు. వాస్తవానికి, రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేయాలని ట్రంప్‌ ‌భారతదేశంపై ఒత్తిడి పెంచడం ప్రారంభించినప్పటి నుండి గత ఆరునెలల్లో ట్రంప్‌ ‌నుండి నాలుగు ఫోన్‌ ‌కాల్స్‌ను స్వీకరించడానికి మోదీ నిరాకరించారని ఒక జర్మన్‌ ‌నాయకుడు మీడియాకు తెలిపారు.
నాటో దేశాలలో ట్రంప్‌పై ఆగ్రహం పెరుగుతున్న సమయంలోనే ఈయూతో మోదీ చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గ్రీన్‌ల్యాండ్‌ను విలీనం చేసుకోవాలనే ట్రంప్‌ ‌కోరిక పట్ల, ఆ దిశగా ట్రంప్‌ ‌చేసిన ప్రకటనల పట్ల కోపంగా ఉన్న ప్రపంచ నాయకులు ఆయన్ను అతిపెద్ద ఆర్థిక కూటముల నుండి నిషేధించారని అమెరికన్‌ ‌మీడియా పేర్కొంది. గ్రీన్‌ల్యాండ్‌ ‌కోసం ట్రంప్‌ ‌చేసిన డిమాండ్‌ ‌నాటో పేరుతో అత్యంత జాగ్రత్తగా రూపొందించిన పాశ్చాత్య కూటమిని దాదాపుగా నాశనం చేసింది. అందుకే యూరోపియన్‌ ‌పార్లమెంట్‌ ‌యుఎస్‌ ‌వాణిజ్య ఒప్పందాన్ని ‘‘స్తంభింపజేయడానికి’’ ఓటు వేసింది. ఆ కారణంగానే కెనడా ప్రధానమంత్రి మార్క్ ‌కార్నీ అట్లాంటిక్‌ ‌కూటమి ‘‘పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది’’ అని కూడా అన్నారు.
అందువల్ల, భారతదేశం-ఈయూ ఒప్పందం సరైన సమయానికి జరిగింది. నాటో, ఈయూ, రష్యా, ఇప్పుడు భారతదేశంలో స్నేహితులను కోల్పోయిన ట్రంప్‌ ‌తాను ఏకాకిగా మిగిలిపోయినట్టు భావించారు. క్రికెట్‌ ‌పరిభాషలో చెప్పాలంటే అభిషేక్‌ ‌శర్మ ఇన్నింగ్స్ ‌మొదటి బంతిని స్టేడియం వెలుపలకు కొట్టినట్లుగా ఉంటుంది! ఈ సమయంలో నరేంద్ర మోదీకి బదులుగా మనకు బలహీనమైన ప్రధానమంత్రి ఉండి ఉంటే భారతదేశానికి ఏమి జరిగి ఉండేదో ఊహించుకుంటేనే ఒక విధమైన ఆందోళన కలుగుతుంది. ట్రంప్‌ ‌మనల్ని పూర్తిగా అణచివేసి ఉండేవారు. వెనిజులా అధ్యక్షుడు మదురోకు చేసినట్లుగా మనల్ని అవమానించేవారు.
ఈ రెండు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్న మోదీని భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో స్థానం పొందేలా చేసిన యుగ పురుషుడిగా కచ్చితంగా ప్రశంసించాలి.

ఎ. ‌సూర్యప్రకాశ్‌
‌మాజీ సీఈఓ, ప్రసారభారతి

About Author

By editor

Twitter
YOUTUBE