తెలంగాణ రాష్ట్రానికి తోటి రాష్ట్రాలతో పోటీ కాదని, టెక్నాలజీలో దూసుకు వెళ్తున్న ప్రపంచంలోని దేశాలతోనే పోటీ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జాతీయ స్థాయి నాయ కులే కాకుండా.. ఇతర దేశాలకు చెందిన అతిథులకు కూడా ఆహ్వానాలు పంపిం చింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు కసరత్తు చేసింది. ఈ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణ, రూపు రేఖలు, ఎజెండా, ఆహ్వా నాలు, విజయవంతం చేయడానికి అవసర మైన వ్యూహాల రూపకల్పన వంటి అంశాలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధా న్యత ఇచ్చారు. నవంబర్ చివరి వారంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా నిత్యం సమీక్షలు నిర్వహించారు. చివరగా నవంబర్ 30న తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాల ఆహ్వాన పత్రికను కూడా రిలీజ్ చేశారు.
తెలంగాణ రైజింగ్-2047 పేరుతో నిర్వహించే ఉత్సవాల్లో సమగ్ర విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ వల్లె వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వివిధ రంగాలు, అంశాల వారీగా ఈ విజన్ డాక్యుమెంట్‌లో భవిష్యత్ వ్యూహాలను, ప్రణాళికలను చేర్చారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ త్రి నగరాలకు సమాంతరంగా ఫోర్త్ సిటీని అభివృద్ధి చేస్తోంది. అక్కడే ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గత సంప్రదాయాలకు భిన్నంగా ఢిల్లీ అధిష్టానం కేంద్రంగా కాకుండా, తననే కేంద్రీకృతంగా ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అనే సంకేతాలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి.తనను తాను కేంద్రంగా పాలన సాగించే ప్రయత్నంలో అధికార వ్యవస్థలో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తనదైన విజన్‌ను రూపొందించుకుంది. ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థలను, పరిపాలనా సౌలభ్యాలు, భౌగోళిక వ్యవహారాలను ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని మూడు ఆర్థిక మండళ్లుగా విభజించింది. తమ ప్రభుత్వం భవిష్యత్తులో ఉన్నా, లేకున్నా… పాలనా వ్యవస్థ సజావుగా కొనసాగేలా రూపకల్పన చేసింది..
క్యూర్, ప్యూర్, రేర్ జోన్లతో త్రిముఖ వ్యూహం?
రాష్ట్ర ప్రగతికి త్రిముఖ వ్యూహం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండేళ్ల పాలన ముగిసే సమయంలో తమ విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించారు. తమ అభివృద్ధి ఫార్ములా క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పారు. ఈ మూడు రకాల వ్యవస్థలను, ప్రణాళికలను క్రోడీకరించి విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నట్లు్డ ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగాణ రైజింగ్- 2047 పేరుతో విజన్ డాక్యు మెంట్‌ను సిద్ధం చేశాం. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బన్)గా, ఓఆర్‌ఆర్-ట్రిపుల్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బన్)గా, ట్రిపుల్ ఆర్ అవతలి నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ప్రాంతాన్ని రేర్ (రూరల్ అగ్రికల్చరల్)గా వర్గీకరి స్తున్నాం. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నాం అని ము్యమంత్రి వివరించారు. ఆదాయాన్ని పెంచి, పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని.. ఇందుకోసం చైనా, జపాన్, జర్మనీని ఆదర్శంగా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తమ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల తోనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీ, ఆర్థిక అభివృద్ధికి ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడు లను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ – 2047 గ్లోబల్ సమిట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని సీఎం వెల్లడించారు. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం అద్భుతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రూపొందించిన డాక్యుమెంట్ దార్శనికత (విజన్), వ్యూహం (స్ట్రాటజీ) అనే రెండు ప్రధానాంశాలతో ఉందని, విధానాల అమలులో స్తబ్దత ఏర్పడకుండా ఈ డాక్యుమెంట్‌లో పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేశామని, ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను, నీతి ఆయోగ్, ఐఎస్‌బీ లాంటి సంస్థల సహకారం తీసుకున్నామని.. వెల్లడించారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్
తెలంగాణ రైజింగ్- 2047లో భాగంగా ప్రతిపాదించిన మూడు వ్యవస్థల్లో మొదటిది క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ). ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2,170 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. గతంలో ఇక్కడ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల మధ్య సమన్వయ లోపం వల్ల ట్రాఫిక్ జామ్‌లు, వరదలు, కాలుష్యం వంటి సమస్యలు తలెత్తాయి. పారిశ్రామిక, మూసీనది, వాహనాల కాలుష్యాలు వంటి ఎన్నో సమస్యలను తగ్గించి, కాలుష్య రహిత నగరంగా మార్చడానికి క్యూర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలలో ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో అలాంటిది ఇక్కడ రాకూడదన్న ఉద్దేశంతో ఈ 2,170 చ.కి. ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా మారుస్తున్నారు. కాలుష్య కారక పరిశ్రమలను బయటికి తరలించడం, చెరువులు, కుంటలు, నాలాల ప్రక్షాళన, మెట్రో రైలు విస్తరణ, మూసీ రివర్ డెవలప్‌మెంట్, ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి అన్ని అంశాలు క్యూర్ అభివృద్ధిలో భాగంగా ఉంటాయి.
అర్బన్ రీజియన్ ఎకానమీ జోన్
విజన్ డాక్యుమెంట్‌లోని రెండో అంశం ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ) అవుటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం. ఆర్‌ఆర్‌ఆర్ దాదాపు 360 కిలోమీటర్లతో రాష్ట్రానికి రెండో మణిహారంగా మారనుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ జోన్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, ఇందులో భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీలు, ఐటీ సెజ్‌లు ఉంటాయని, రవాణా సౌకర్యాల కోసం బుల్లెట్ రైళ్లు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు రానున్నాయని వెల్లడించారు. సముద్ర తీరం లేని తెలంగాణకు రేవు అనుసంధానతను కల్పించేందుకు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించే విషయమై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో చర్చించి ప్రాథమిక ఒప్పందానికి వచ్చామని సీఎం వివరించారు. భవిష్యత్తులో వరంగల్, ఆదిలాబాద్, భదాద్రి కొత్తగూడెం, రామ గుండంలో నాలుగు విమానాశ్రయాలు నిర్మించను న్నట్లు ్ర పకటించారు. పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్‌పోర్టస్ కనెక్టివిటీ ద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లో పెట్టుబడులను ఆకర్షించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ప్రణాళికను రూపొందించామన్నారు.
రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ జోన్
విజన్ డాక్యుమెంట్‌లో మూడోది రేర్(రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ) రీజినల్ రింగ్‌రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతం. గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేవారన్న రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయదలు చుకోలేదని, ఈ స్టేట్ ఎకానమీలో వాళ్లను స్టేక్‌హోల్డ ర్స్‌గా మార్చదలుచుకున్నామని చెప్పారు. రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్, అగ్రికల్చర్ పార్కులు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌కు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తెలంగాణ భూములు అనుకూలమైనవని, సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే భూములు ఇక్కడ ఉన్నాయని, అందుకే దీనిని రేర్ పాలసీ కిందికి తీసుకువస్తున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి మొదలుపెట్టి మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావడమే కాకుండా, అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి నాలెడ్జ్ హబ్‌గా క్రియేట్ చేయదలుచుకున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాలెడ్జ్ హబ్ క్రియేట్ అయితే ఆటో మేటిక్‌గా పెట్టుబడులు వస్తాయని, దానితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో 5 శాతాన్ని తెలంగాణ రాష్ట్రం అందిస్తోందని, భవిష్యత్తులో అది 10 శాతానికి పెరిగేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆకర్షణీయంగా ఆహ్వాన పత్రం
రైజింగ్ గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను నీలిరంగులో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పత్రిక చుట్టూ పోచంపల్లి పట్టుచీర డిజైన్‌ను ముద్రించారు. లోపల రెండు పేజీలున్నాయి. ఎడమవైపు పేజీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లక్ష్యాలను పొందుపరిచారు. కుడివైపు పేజీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలుకుతున్న వివరాలను ముద్రించారు. ఈ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా ప్రపంచవ్యాప్త ప్రతినిధులకు వ్యక్తిగత లేఖ రూపంలో ఆహ్వానం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ముఖ్యులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. వారికి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వీరికి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఈ వివరాలను కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068