భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పో•లో విశిష్ట బహుమతికి ఎంపికైన రచన

డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

‘‘ఏదీ శాశ్వతం కాదు. వెలితిగా చావకు. తృప్తిగా సెలవు తీసుకో! బతుకు మూన్నాళ్ల ముచ్చట అని తెలిసిన విజ్ఞుడవు. మరు జన్మలో నువ్వు కోరుకున్న జీవితం నీకు లభించాలని మనస్పూర్తిగా ఆ దేవుడ్ని… విశ్వ శక్తిని వేడుకుంటున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడవు!’’ చేయి అందించి కౌగలించుకుని వదిలేశాను.

అతని కళ్లల్లో తడిని చూసాను. పెదవులపై బలవంతపు చిరునవ్వును గమనించాను. అంతే శ్వాస నిలిచి పోయింది.

నా చుట్టూ నిలుచున్న వాళ్ల ముఖాలలో ఆశ్చర్యం? విభ్రాంతి చూపులు చూసి నవ్వాను.

మా మావ నన్ను దూరంగా లాక్కుపోయి? ‘‘అదేవిటి అలా ఆశీర్వదించావు? బతికున్నవాళ్లు దురదృష్టవంతులా? చచ్చినోళ్లంతా అదృష్ట వంతులా!?’’ చిరాకుగా తప్పు చేసినట్టుగా అడిగాడు.

‘‘అవును. వ్యాధులతో, ఈతి బాధలతో పిల్లల దగ్గర నానా అవమానాలు పడుతూ, ఇంకా కుళ్లి చావా మంటావా? అర్థం చేసుకున్నాడు. మృత్యు కౌగిలిలో స్వర సుఖాలు అనుభవిస్తాడు.’’

‘‘అదేవిటి? పిల్లలు లేరా?’’

‘‘విదేశాలలో ఉన్నారంట. రారు! ఈ సమయంలో విమాన టికెట్లు చాలా జాస్తి అట. వచ్చినా.. నిమిషాల్లో తగలబెట్టి తల్లిని మూలదోసి, ఉన్నది జౌరుకుపోతారు.’’

మావ కాస్సేపు మౌనంగా ఉండి బాధతో ‘‘మానవ సంబంధాలు ఇంతగా దిగిజారి పోతాయని అనుకోలేదు. స్నేహం, బంధం, అనుబంధం, వాత్సల్యానురాగాలు డబ్బుతో, స్వార్థంతో బంధించబడి దిక్కులేకుండా బతుకుతాయనుకోలేదు’’ అన్నాడు.

‘‘మరి చావడంలో సంతోషం లేదంటావేమిటి?’’

‘‘నువ్వు మరీ కర్కోటకంగా మాట్లాడుతున్నావు. అయ్యో పాపం అని జాలి కూడా లేదు’’ అన్నాడు రుసరుసలాడుతూ.

‘‘ఎందుకు? సంసారాన్ని ఆదుకునేవారు చనిపోతే జాలికి అర్థ్దముంది’’

‘‘చావకూడని వారు ఎందుకు చస్తున్నారు. చావాల్సిన వారు ఎందుకు బతికి ఉంటున్నారు?’’ పరుషంగా అడిగాడు.

‘‘ఎక్కువకాలం బతకడం వంశ పారంపర్యం అయిఉండొచ్చు. చావడం వాతావరణ కాలుష్యం అవొచ్చు. మానవ నిర్లక్ష్యం కూడా అయి ఉండవచ్చు’’

‘‘దేవుని ప్రమేయం లేదంటావా?’’

‘‘ఆయనకెందుకు!! నువ్వు ఉపనిషత్తులు చదవలేదేమో! ముఖ్యమైన ఛాందోగ్య ఉపనిషత్‌ ‌పదమూడవ అధ్యాయంలో స్వర్గం అంటే మానవ శరీరము. దానికి కాపలాగా కళ్లు, ముక్కు, చెవులు, మేధస్సు, ఊపిరి! నీ మేధస్సు అంతులేని, అందుకోలేని ప్రపంచం! వాటి కాంతి రేఖలే మనుషులలో ఉన్న అంతర్గత శక్తి అంటే మనలోని అంతరాత్మ! అందుకే నువ్వే దేవుడవు అంటారు. ఇది అందరూ భగవద్గీతను అనుసరించి లేక వాళ్ల విజ్ఞాన బలంతో మహోన్నతులైన ఆధ్యాత్మిక గురువులు మరీ మరీ చెప్పేది. చావు, దేవుని ఇష్టాఇష్టాలు ప్రకారం జరగదు. అది కాల నిర్ణయం.’’

‘‘కాలానికి అవసరం ఏవిటి? అతలాకుతలమైన ఈ జన్మ చావడానికేనా? అదృష్టం, దురదృష్టం, విధి, రాత ఎవరో రాస్తే మనం ఎందుకు? జీవితానికి అర్థం ఏవిటి?’’

ఇంతలో రోడ్డుమీద ఇద్దరు యువకులు చంపుకునేటట్లు కిందా మీదపడుతూ వినలేని బూతుమాటలు మాట్లాడుకుంటూ ఇనపరాడ్లుతో తలలు పగలగొట్టు కుంటున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి…?

తీరా విచారిస్తే ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించి నీదా? నాదా? అని గొడవ.

ఇంతలో మధ్య వయసు మధ్య తరగతి పెద్ద మనిషి ఏడుస్తున్న నాలుగు సంవత్సరాల పిల్లాడ్ని లాక్కుంటూ ఎత్తుకుని ఆ గొడవ చూసి, ‘‘ఏం జరిగింది సార్‌ !’’ అడిగాడు. మావ. ఏం చెప్పాలో తెలియక నా వైపు చూస్తూ?’’ అదేదో అమ్మాయిల గొడవ’’ అని ‘బిడ్డ ను ఎక్కడికి తీసుకుపోతున్నావు ఈ ఎండలో !’’ అడిగాడు మావ. .

రోడ్డు వైపే చూస్తూ, ‘‘సెల్‌ఫోన్‌ ‌కావాలంట’’ అని చెబుతూ, ‘‘చూడండి సార్‌ ఈ ‌దరిద్రం. ఆ సందులో ఏం జరుగుతుందో’’ అన్నాడు.

చూస్తే, ఇద్దరు యువతీయువకులు అత్యంత ఆధునిక దుస్తులతో సభ్యతమరచి నాన భంగిమలు ప్రదర్శిస్తున్నారు. ఇద్దరం కళ్లు దించుకున్నాము. పోదామని పిల్లాడు తండ్రిని లాగుతూ పెద్దగా ఏడుస్తూ లాగుతున్నాడు. అదుపు తప్పిన శృంగారాన్ని చూస్తూ పరిసరాలు మరిచిపోయి ఉన్నాడతను.

‘‘సరే! మీరు వెళ్లండి. బిడ్ద చూడకూడదు. ఈ వయస్సులో సెల్‌ఫోన్‌ ఇవ్వకూడదు’’

‘‘నాలుగు నెలలకే అమ్మలు వేగలేక ఇచ్చేస్తున్నారు. వాళ్లమ్మకు వీడు డాక్టరో, ఇంజనీరో కావాలని రెండు లక్షలు పెట్టి పెద్ద స్కూల్లో చేర్పించింది. వాడిని స్కూలుకు పంపేదే గగనమౌతుంది. సైకిలు, చెవిలో పెట్టుకుని పాటలు వినేది కావాలని, లేకుంటే చస్తానని ముందుగానే చెప్పేసి ఉన్నాడు. ఎందుకురా? అంటే స్కూల్లో అందరికి ఉంది మరి నాకు లేకపోతే అవమానం కాదా అని ఇంగ్లీషులో పెడసరపు సమాధానం.’’ అన్నాడు కొంచెం బాధగానే.

‘‘మీరేం పని చేస్తారు?’’

‘‘భూములు అమ్మడం కొనడం,అక్కడుండే వాళ్లకు మందు వగైరాలను పంపితే మాకు అదీఇదీ ఇచ్చి, కొనేవాడి దగ్గర ఏవో ప•త్రాలలో తప్పులు చెప్పి డబ్బు లాగడం. ఖర్చుని గురించి నేనేం అనుకోవడంలే! ఒక్కగాని ఒక్కడు. అతి ముదిగారం. పెండ్లాం వాడి మీద ఒక్కమాట పడనివ్వదు అదురుతో చస్తున్నాను’’.

అడ్డదిడ్డంగా సంపాదిస్తే అంతేకదా! మావ నా వైపు చూసి చిన్నగా అని లేచి పక్కకు వెళ్లాం. మమ్మల్ని తోసుకుని ఒక యువకుడు గుబురు గడ్డం? అరగొరిగిన జుట్టు మాసిన బట్టలతో పరుగెత్తాడు. ఇంతలో ఒక తల్లి లబోదిబోమంటూ నానా కూతలు కూస్తూ అబ్బాయి వెనుక వీధిలోకి వచ్చింది.

‘‘ఈ వాడు ఇంటినే పట్టించుకోడు. పదో తరగతి తప్పి జులాయిలతో తిరుగుతూ కొత్త సినిమా వచ్చిందని టికెట్టు మూడు వేలు అని ఎత్తుకు పోయాడు. ఇంట్లో ఒక్క వస్తువు లేదు. కొనాలి. ఆయనుంటే పొదస్తమానం తాగి ఎక్కడపడి ఉంటాడో? పెన్షన్‌ ఒక్క పైసా చేతికి ఈడు. సారాయి అంగళ్లు వీధికొకటి పెట్టి సంసారాలను గుల్ల చేయడానికి ‘సాయం’ అనే పేరు ఎందుకంట!’’ ఏడుస్తూ తిట్టుకుంటూ వెళ్లిపోయింది.

మావా నా వైపు బాధగా చూస్తున్నాడు. నేను నవ్వాను.తలవంచుకున్నాడు.

‘‘నిజంగా సంసారాలు, సమాజం నాశనం గావడానికి తాగుడే ముఖ్య కార•ణం. పొగతాగడం కాదు. నేటి నవ నాగరికత చలన చిత్రాలు ప్రసార మాధ్యమాలు వాటిని సమర్ధిస్తున్నాయి’’ అన్నాను.

‘‘అవును! ఎవ్వరూ దేన్ని లెక్క చేయడం లేదు. వ్యసనాలకు బానిసలై చదువు మానేసి అమ్మాయిల కోసం కొట్టుకుంటూ గంజాయి, సారాయి మత్తులో అమ్మా, అబ్బలను అల్లాడిస్తూ భవిష్యత్తు ఒకటి ఉందని మరిచిపోయారు. అసాంఘిక కార్యాలకు నాయకులవుతున్నారు మారరు… మార్చలేరు.’’ నిరాశతో అన్నాడు మావ.

‘‘మార్పు, సత్సంఘం, పెంపకం? విద్య మీదనే ఆధారపడి ఉంది. పూర్వం గురుకులాలు ఉండేవి. చిన్నప్పటినుండి సభ్యత, సంస్కారం, మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని రంగరించి పోసేవాళ్లు. సంఘం, సమానత్వం ఎంత అవసరమో తెలియ చెప్పేవాళ్లు. వాళ్లకు ఇష్టమైన కళలో ప్రావీణ్యులను చేసేవాళ్లు. గణితం, గుణింతం, సంగీతం, అర్ధశాస్త్రం, ఖగోళ సాముద్రిక శాస్త్రాలు, నాట్యం… అన్నిటిని నిశితంగా, అనునయంతో, ఓర్పుతో మనసులో హత్తుకు పోయేటట్లు చేసేవారు.

మనసును ఎలా అదుపు చేసుకోవాలి, చెడ్డను ఎలా నియంత్రించుకోవాలి అనే దానిపై యోగ,ధ్యానం తప్పక చేయించేవారు. చదువులో వెనక పడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఆర్థిక స్తోమతలో పెద్ద,చిన్న అనే భేదం లేకుండా చూసేవాళ్లు. చదువు పూర్తి అయిన తరువాత గురుదక్షిణ వారికి తగ్గట్టు ఇచ్చేవారు. సమాజం ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజవంశస్తులను దేశాటనకు పంపేవారు. చక్రవర్తులు, మహారాజులు, ధనికులు వీటిని పోషించేవారు.’’

‘‘ఇప్పుడు కూడా ఉన్నాయికదా మావ డబ్బులుంటే! భజగోవింద, అచేతన తల్లి కార్పొరేట్‌… ఆ‌శ్రమ బడులు! అవికూడా గురుకులాలేకదా!’’

‘‘కాదు. నాకు తెలిసీ, మనకున్నవి శాంతినికేతన్‌, ఋషివాలి! ఇప్పుడున్నవి ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాల కార్ఖానాలు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులుచేసి, తాకట్లు పెట్టి చదివిస్తున్నారు. సరిగ్గా మార్కులు రాకపోతే నిరాశతో కుంగి పోయి చేయకూడని పనులు చేస్తున్నారు. సృజనాత్మకత నశించి పోయి పైశాచికత్వం వాళ్ల వ్యక్తిత్వం అవుతున్నది. చదువంటే ఒక్క వైద్య వృత్తి, లేకుంటే ఇంజనీరింగ్‌ అనే తప్పుడు అభిప్రాయం ఏర్పడి పోయింది. పిల్లల్ని మానసిక హింసకు గురి చేస్తున్నారు’’

‘‘నిజమే! అయినా ప్రభుత్వ బడులలో అధ్యాపకులు ఉంటున్నారా! పాఠాలు చెపుతున్నారా?’’

‘‘ఉంటారు. అక్కడ చదివే ఎంతో మంది గొప్పవారు అయ్యారు. కానీ ఇప్పుడు ఈ చదువును వ్యాపారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్న విద్యాలయాలు ఈ ప్రభుత్వ బడులను అందులో పని చేసే వాళ్లను కొనేసారు. జీతంకోసమే పని చేస్తారు. బిడ్డలు వృద్ధివృద్దిలోకి రావాలని కాదు. ఎవరైనా ఒకరు చదువు చెప్పి, క్రమ శిక్షణలో పెట్టబోతే తల్లి తండ్రులు వాళ్లను కొట్టబోతున్నారు. ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. ఇంకేం చదువుతారు, యోగ్యులవుతారు!!

మన తరంలోముందు తరాలలో కూడా పెద్దబాలశిక్ష అనే ఒక గ్రంథ ఉండేది. ఇప్పుడుకూడా ఉంది.. అది చదివితేచాలు అన్నీ శాఖలను చదివినట్టే! పూర్వకాలంలో స్త్రీలకు బహిరంగ విద్య నిషేధం. ఆచార్యులను ఇంటికి పిలిపించి చెప్పించే వారు.గురుకులాలే సత్సమాజ నిర్మాణ దీపికలు !!’’

‘‘అవి ఎందుకు అంతమై పోయాయి?’’

‘‘టర్కీ సుల్తాన్‌ ‌బక్తియార్‌ ‌కిల్జీ నలంద గురుకుల విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసి తొమ్మిది లక్షలకు పైగా సంస్కృత గ్రంథాలను తగలబెట్టి,గురువులను శిష్యులను చంపేసాడు. తప్పించుకున్న శిష్యులు, గురువులు కొన్నిటిని ఎత్తుకు పోయారు. తక్షశిల, విక్రమార్షి, పుష్పగిరి ఆచార్య, శ్రీ స్వామి నారాయణ సంప్రదాయ విద్య ముఖ్యమైనది. వాటి తరపున దేశమంతా ఎన్నో గురుకులాలు ఉండేవి. ఇంకా సింధూతీరాన ఉన్న వాటి గతి కూడా అంతే!

ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు థామస్‌ ‌బాబింగ్టోన్‌ ‌మెకాలే, అందరూ ఇంగ్లిష్‌ ‌చదవాలని 1883 శాసనం చేసాడు. సంస్కృతం, మాతృభాష, ఆచార వ్యవహారాలు అన్నీ మారిపోయాయి. ఇంగ్లిష్‌ ‌ప్రపంచ భాషగా మారింది.

 వేదాలు ఉపనిషత్తులో నిఘూడ సాంకేతిక రహస్యాలు ఉన్నాయని తెలుసుకున్న జర్మనీ అధినేత హిట్లర్‌, ‌సంస్కృతంలో అపార పాండిత్యం కలిగిన రాజమహేంద్రవరంలో నివసించే బ్రహ్మశ్రీ ధన్దిబాల విశ్వనాధ శాస్త్రిని పిలిపించుకుని వాటిలో యద్ధాలకు పనికి వచ్చే ఆయుధాల మర్మాలు తెలుసుకున్నారు. అవేగాక సభ్యత సంస్కారపు విలువలు,సుఖమయ జీవితం, సమాజ నిర్మాణ విధుల మర్మాలు మన ఉపనిషత్తులలో, వేదాలలో, పురాణాలలో ఉన్నాయి’’

‘‘అవి ఎవ్వరికి కావాలి. ఇప్పుడే చూశావుగా పెంపకం, దౌర్జన్యం, అశ్లీలత. అవి మారణాయుధాలు కావా? బతుకులను బుగ్గి చెయ్యడానికి అవి చాలవా?’’.

‘‘అదే నేటి దరిద్రం.కొన్ని గుణాలు స్వతహాగా వారసత్వంగా వచ్చేవి, మార్చడం అంత తేలికకాదు. ప్రయత్నిస్తే విద్యతో, ఓర్పుతో, సహనంతో, ప్రేమతో మార్చవచ్చు’’.

‘‘అవి ఎక్కడ దొరకుతాయి. తల్లిదండ్రి ఇద్దరికీ ఉద్యోగాల పరుగులు. సాయం కాలం అరుపులు, ఆగాలు! వాత్సల్యంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని ఆ చిన్న వయసులో తప్పులను సరిదిద్ది అన్యోన్యానురాగాలు చూపించే అవ్వా తాతలు కనుమరుగై పోయారు’’

‘‘దీనికంతా కారణం. బాధ్యతానుబంధాల మీద గౌరవం లేకపోవడం. విదేశీయ నాగరికతలోని విచ్చలవిడితనం నిజమైన విమోచనమనే పూర్తి నమ్మకం’’.

‘‘ఇక సుఖంగా ఎలా ఉంటాం? ఆ దేవుడు ఇలాంటి సృష్టిని ఎందుకు ఇచ్చాడు. ఎందుకంత కసి!’’

‘‘తొందరపాటు వరాలిచ్చి దేవుళ్లు భ•రించలేని కష్టాలు తెచ్చుకున్న సంగతి మరిచిపోతే ఎలా? నువ్వు చేసిన తప్పులకు దేవుడు కర్త ఎలా అవుతాడు? ఏ యుగంలో లేదు ఈ సంఘర్షణ. ఇచ్చినమాట కోసం హరిశ్చంద్ర మహారాజు, నలమహారాజు, బలి చక్రవర్తి, సీతారాములు, పాండవులు, మహర్షులు కష్టాలు, యాతనలు అనుభవించినవారే! తప్పించుకునే మార్గం వాళ్లకు తెలియదా?’’

‘‘ఆయన సృష్టించిన భూమిపై ఇన్ని ఘాతకాలు, ఘోరాలు చూస్తూ ఎలా ఉంటాడు. ఏదో ఒక అవతారమెత్తి సరి చెయ్యకూడదా?’’

‘‘ఇంకా సమయం రాలేదేమో? ఆయన చేతిలో లేదేమో! సృష్టి, దేవుడు సంగతి ఆలోచించకు. మనకు తెలిసిన పంచ భూతాలను గురించి ఆలోచించు. నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుని అత్యంత శక్తిగల విశ్వ అయస్కాంత కిరణాలు భూమిమీద ఉన్న జీవజాతులపై ఎల్లప్పుడూ పడుతూ ఉంటాయి. అందువలన మన మేధస్సులో కొన్ని మార్పులు జరగొచ్చు. బీజాక్షరాల పూజితమైన శ్రీచక్రాలను నిష్ఠ్టాగరిష్టులు ప్రతిష్ఠించిన విగ్రహాలు కోరికలు తీర్చే దేవుళ్లు, దేవతలు అవుతారు. మనకు ముక్కోటి దేవుళ్లున్నారు. సృష్టిలో ఉన్న ప్రతిదానిలోనూ దైవత్వం చూస్తాము. అదే హిందూతత్వ గొప్పతనం. కొందరికి అన్నీ ఉన్నా ప్రయత్నించింది ఒక్కటీ జరగదు. ఎందుకు? ఏవిటి? అదే అదృష్టం దరిద్రం! నమ్మితేనే అన్నీ నమ్మకపోతే ఏమీ ఉండదు!’’.

‘‘నమ్మేకదా కోట్లాది మంది గొంతెమ్మ కోరికలు తీరాలని ప్రతి చెట్టుకు, పుట్టకు మొక్కుతున్నారు.! మానవత్వం, మన్నన, సద్భుద్ది, దైవత్వమనేది మరిచి పోయారు’’

‘‘ఈ విశ్వం, తరువాత జీవులు, దేవుళ్లు ఎలా ఉద్భవించారు అనే విషయంలో భిన్న అభిప్రాయాలున్నాయి. రుగ్వేదంలోని పదో మండలంలో నూట ఇరవై తొమ్మిది సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం నిజం అనిపిస్తుంది. ఇయం! విసృష్టి! యథః!… యది! నా! నా! వేద !!’’

అంటే!! ఉద్భవించెను దేనినుంచో? ఎవరి ధారణ వలన నిలిచెనో?

ఉన్నతోన్నత వ్యోమమందున! అధిష్టించే దేవదేవుడు! సృష్టి మూలం చెప్పగలడో! తానుకూడా చెప్పలేడో?!. అదే మాయ, విశ్వమంతా నిండి ఉన్న నిఘూడ రహస్యం.’’

సునామీలు, భూకంపాలు, మారణహోమాలు, కొన్ని లక్షల మంది చావులకు దేవుడే కారణమని అనలేం. అంత మందికి దురదృష్టం ఒకేసారి వచ్చిందా? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచ భూతాలను కాలుష్య రహితంగా ఉంచుకోగలిగితే ఇవి కూడా జరగవేమో? ఇవి కోపగిస్తే దేవదేవుడు అనే విశ్వకర్త కూడా ఏం చెయ్యలేడు.

నిజ జీవితంలో కోపాలు, తాపాలు, విసుగులు, విరక్తులు కూడా వీటి చలవతోనే ఏర్పడి ఉంటాయని ఆలోచిస్తే అర్థం అవుతుంది. మనం అడవిలో ఒంటరిగా జీవించడం లేదు. రకరకాల మనస్తత్వాలు, మూర్ఖత్వం, ఈర్ష్యా ద్వేషాలు, మూడ నమ్మకాలు, దృఢమైన అభిప్రాయాలతో, మదంతో నిండిన సమాజంలో ఉన్నాం. మనకు ఇష్టం లేని పనులు ఎన్నో జరగొచ్చు. కామం, క్రోధం, లోభం, అహంకారం, అసూయలను అదుపులో పెట్టగల వ్యక్తిత్వం కావాలి. అది చైతన్యవంతమైన విద్య వలన, సభ్యతా సంస్కారాలు నేర్పే పెంపకం వలన మాత్రమే అవుతుంది! సృష్టిలో మనం ఒక భాగం. ధర్మార్థ్దకామాలను నియమబద్ధంగా ఆచరించగలిగితే మోక్షం. జీవితం స్వర్గం. లేకుంటే సృష్టి, సమాజం సర్వ నాశనం.?

‘‘గోవిందా.. గోవిందా! హరహర మహాదేవా!’’ అంటూ శంఖం ఊదుతున్న శబ్దాలకు ఈ లోకంలోకి వచ్చాం..

About Author

By editor

Twitter
YOUTUBE