సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆశయాలు కొన్ని నెరవేరతాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. తరచూ ప్రయాణాలు సంభవం. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయ వేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 3,4 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధు వులతో వివాదాలు. శివాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రు వులను సైతం ఆదరిస్తారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్యావ కాశాలు సాధిస్తారు. వ్యాపారులు నూతన పెట్టు బడులను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులకు ముఖ్య సమాచారం అందుతుంది. 8,9 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. దేవాలయ దర్శనాలు. ఇంటి నిర్మాణాల్లో జాప్యం తొలగుతుంది. వ్యాపారులకు  ఆశించిన లాభాలు ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. పారిశ్రామి వేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు విస్తృత అవకాశాలు. 4,5 తేదీల్లో దుబారా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఇంటి నిర్మాణాలు కొలిక్కి వస్తాయి. కుటుం బంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు శుభ దాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలు గుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపా రులు లాభాలదిశగా అడుగులేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమాచారం రాగలదు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులు, రచయితలకు ఒత్తిడులు తొలగు తాయి. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారులు అనుకున్న విధంగా విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగ స్తులకు మరింత అనుకూల కాలం. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దూర ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

గృహ నిర్మాణయత్నాలు సాను కూలం. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 6,7 తేదీల్లో వ్యయప్రయాసలు. ఖర్చులు. అనారోగ్యం. కుటుంబ సభ్యులతో తగాదాలు. వేంకటేశ్వరస్వామిని పూజిం చండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

పలుకుబడి పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగవర్గాలు నూతనోత్సాహంతో విధులు నిర్వర్తిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. 4,5 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. బంధు విరోధాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దేవా లయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు శుభవర్త మానాలు. అప్పులు కూడా తీరే సమయం. రాజకీయ వేత్తలు, కళాకారులు, పరిశోధకులు విశేష గుర్తింపు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.  వ్యాపారులకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు లోటురాదు. 3,4 తేదీల్లో దూర ప్రయాణాలు.  శివా లయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

అరుదైన ఆహ్వానాలు రాగలవు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు తథ్యం. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించు కుంటారు. వ్యాపారులు స్వశక్తితో లాభాలబాటలో నడుస్తారు. రాజకీయవేత్తలు, రచయితలు, కళాకారు లకు పట్టింది బంగారమే. 6,7 తేదీల్లో దూర ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు. కొత్త వ్యక్తులు పరిచయ మవుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టు కుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు. 7,8 తేదీల్లో అనారోగ్యం. బంధువు లతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్య కార్యక్రమాలలో కొద్దిపాటి అవరోధాలు.  వాహన, కుటుంబసౌఖ్యం. నిరుద్యోగులు నిరాశ చెందుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇక్కట్లు తప్పవు. ఉద్యోగులకు స్థానచలనం. వ్యాపా రులకు సామాన్య లాభాలు దక్కుతాయి. కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులకు పురస్కారాలు అందుతాయి. 8,9 తేదీల్లో ఆకస్మిక ధనలాభం, యత్న కార్యసిద్ధి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 6,7 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఖర్చులు. కుటుంబంలో చికాకులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE