Posts Tagged “25-31 March 2019”

‘భారతీయ’ ఓటు

By |

‘భారతీయ’ ఓటు

భారత రాజకీయాలు కనీవినీ ఎరుగని ఒక పెద్ద మలుపు దగ్గరకు చేరాయి. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల సమయానికే దేశ రాజకీయ దృశ్యంలో ఒక విభజన రేఖ స్పష్టంగా అవతరించింది. ‘హిందూత్వ’ రాజకీయాలు ఒక వైపు. హిందూయేతర రాజకీయాలు మరొకవైపు. ‘హిందూత్వ రాజకీయాలు’ అన్న పేరును నిజానికి హిందూత్వ రాజకీయ శిబిరం ప్రకటించుకోలేదు. ఈ పేరు పెట్టినది హిందూయేతర రాజకీయ శిబిరమే. పైగా హిందూత్వ రాజకీయాల పేరుతో ఇవాళ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న దాడి, విమర్శ ఇంత…

Read more »

ఇది జూలు విదిల్చిన భారతం!

By |

ఇది జూలు విదిల్చిన భారతం!

ఇప్పుడు భారత్‌ ధృఢంగా ఉంది భాజపా వచ్చేనాటికి సైనికుల వద్ద మందుగుండు కూడా లేదు రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది భారత జవానుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ దారుణ చర్యను ప్రతి భారతీయుడు ఖండించాడు. దేశ రక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న జవానుల మీద జరిగిన హత్యాకాండ అటు పాలకులలో, ఇటు ప్రజలలో కోపాన్ని రగిలించింది. ఇంతటి రాక్షసత్వానికి తెగబడిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని…

Read more »

జాతీయవాదం, జవాబుదారీతనం

By |

జాతీయవాదం, జవాబుదారీతనం

ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఒక భ్రమ, ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మాత్రమే పనికి వస్తుందని తెలిసిన తరువాత భారతీయత, జాతీయత అనే మెజారిటీ ప్రజల ఆకాంక్షల మీద దృష్టి పెట్టక తప్పదు. ఈ క్రమంలోనే ఒక రాజకీయ శక్తిగా భారతీయత ఎదిగిన క్రమాన్ని గమనించడం అవసరం. అదే సమయంలో ఆ ఆలోచనా ధోరణితో, చింతనతో దేశ రాజకీయాలలో పనిచేసిన ఆయా సంస్థల నేతల నేపథ్యం కూడా తెలుసుకోవాలి. ఏ దేశమైనా భవిష్యత్తును తీర్చి దిద్దుకొనే క్రమంలో…

Read more »

విదేశంలో మోదీ విజయపతాక

By |

విదేశంలో మోదీ విజయపతాక

దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం, ‘ప్రపంచమంతా ఒక కుటుంబంగా’ (వసుధైవకుటుంబకం) భావించడం మోదీ విదేశాంగ విధానంలోని ప్రధాన అంశాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రజా చైతన్యం అవగాహన, విధాన వేదిక (ఫౌండేషన్‌ ఫర్‌ పబ్లిక్‌ ఎవేర్‌నెస్‌ అండ్‌ పాలసీ) సదస్సులో మాట్లాడిన ఆమె విదేశాంగ విధానాన్ని వివరించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇతర దేశాలతో సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. విదేశీ వ్యవహారాలలో ఏమాత్రం అనుభవంలేని…

Read more »

కుక్కలు చింపిన విస్తరి కానీయరాదు

By |

కుక్కలు చింపిన విస్తరి కానీయరాదు

రాజకీయ పార్టీకి లక్ష్యంగా దేశ ప్రగతి, ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో పార్టీ నేతలకు మన రాజ్యాంగము, జాతీయత పట్ల స్పష్టమైన అవగాహన కూడా అంతే ముఖ్యం. ఈ కీలకమైన అంశమే తెలుగు పాలకుల్లో లోపించినట్లు తోస్తున్నది. ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఎడాపెడా విమర్శించడం, అలవి మాలిన వాగ్దానాలు కురిపించడం సహజమని, ఉపేక్షించే స్థాయికి పౌరసమాజం చేరుకున్నది. కానీ రాష్ట్రంలోని అత్యధిక పార్లమెంటు స్థానాల్లో తమను గెలిపిస్తే కేరద్రంలో చక్రం తిప్పుతామని, ఢిల్లీ మెడలు వంచి నిధులు…

Read more »

సోలార్‌ విద్యుదుత్పత్తి – పెరుగుతున్న అవకాశాలు

By |

సోలార్‌ విద్యుదుత్పత్తి – పెరుగుతున్న అవకాశాలు

బొగ్గు, సహజ వాయువు, నూనె నిక్షేపాలు మరో వంద – నూట ఏభై సంవత్సరాల వరకు మాత్రమే సరిపోతాయని ఒక అంచనా. అణు శక్తి ద్వారా విద్యుత్‌ ఉత్పాదన మరికొంత కాలం సాగవచ్చు. కాని, వీటివలన విపత్తులు సంభవించిన అనుభవం వల్ల ఈ నిక్షేపాలను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి చాలా దేశాలు శంకిస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన నిక్షేపాల మీదే ఆధార పడకుండా శక్తి ఉత్పాదనకు దూరదృష్టితో ఆలోచించవలసి ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుతోంది. నాగరికతా పెరుగుతోంది. సుఖ సంపదలూ…

Read more »

నవ గోవా నిర్మాత పారికర్‌

By |

నవ గోవా నిర్మాత పారికర్‌

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశ భద్రత. యూపీఏ ప్రభుత్వంలో అంతగా పట్టించుకోని శాఖలలో ఒకటి రక్షణ శాఖ. కానీ మోదీ ఆ శాఖను బలోపేతం చేయవలసిన అవసరాన్ని వెంటనే గుర్తించారు. అందుకే గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పారికర్‌ (డిసెంబర్‌ 18, 1955-మార్చి 17, 2019) ను ఏరికోరి తెచ్చి ఆ పదవిలో ప్రతిష్టించారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో ఉన్నారు….

Read more »

సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

By |

సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

అది గోవా పనాజీ ప్రాంతం. ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర హెల్మెట్‌ పెట్టుకొని స్కూటర్‌పై గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనకనుంచి 25 సంవత్సరాల యువకుడు కారులో ఉండి పదే పదే హారన్‌ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని. స్కూటర్‌పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి కోపంగా ‘నేనెవరినో తెలుసా నీకు! ఈ ప్రాంత డిఎస్‌పి కొడుకుని! నాకే దారి ఇవ్వవా!’ అంటూ ఆ…

Read more »

చిన్న వెంకటస్వామి మృతి

By |

చిన్న వెంకటస్వామి మృతి

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఓ.సి.వెంకటస్వామిగా అందరికీ సుపరిచితులైన ఔకు చిన్న వెంకటస్వామి (81) మార్చి 12న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన నంద్యాల పురపాలక ఉన్నత పాఠశాలలో గ్రేడ్‌-1 హిందీ పండితులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎందరో విద్యార్థులను చక్కని పౌరులుగా తీర్చిదిద్దారు. వారి కుటుంబం సంఘ కుటుంబంగా ఎందరో కార్యకర్తలను, ప్రచారకులనకు ఆదరించింది. సంతానం లేకున్నా జగమంతట కుటుంబంగా భావించి పరోపకార భావంతో అందరికీ ఆత్మబంధువుగా జీవించారు వెంకటస్వామి. నంద్యాలలో కీ.శే. కటకం నారాయణతో…

Read more »

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

By |

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావం మోగించారు. మొన్నటిదాకా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊసే ఎత్తని ఆయన ఆ వేదికపై తిరిగి కాంగ్రెస్‌, భాజపాలను తిట్టే కార్యక్రమానికి తెరదీశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే భారత్‌ దశ, దిశ మారుస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, భాజపాలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. భారతావనిని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని సైతం ఏర్పాటు…

Read more »