Posts Tagged “20-26 August 2018”

ఇలాంటి ఘోరాలు ఇంకానా?

By |

ఇలాంటి ఘోరాలు ఇంకానా?

స్త్రీలు, బాలికల పట్ల గౌరవంతో, మానత్వంతో సమాజం వ్యవహరించకపోతే అది నాగరికత అనిపించుకోదు. అది అధర్మం. అంతకు మించి అన్యాయం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం దీని గురించే ఆక్రోశిస్తున్నది. కొన్ని సంస్థలు ఈ దుష్ట సంస్కృతికి వ్యతిరేకంగా నినదిస్తున్నాయి. ఉద్యమిస్తున్నాయి. ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి. భారతీయ ధర్మం స్త్రీని, బాలికను సగౌరవంగా చూడమని వందల ఏళ్లుగా ప్రబోధిస్తున్నది. కానీ వాస్తవం ఏమిటి ? జరుగుతున్నదేమిటి ? స్త్రీని అసభ్యంగా చిత్రించడం ఇప్పుడు సర్వేసర్వత్రా కనిపిస్తున్న దారుణం. అంతేనా!…

Read more »

కాంగ్రెస్‌కు లోకసభలో లెంపకాయ, రాజ్యసభలో మొట్టికాయ

By |

కాంగ్రెస్‌కు లోకసభలో లెంపకాయ, రాజ్యసభలో మొట్టికాయ

రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి ఎన్నిక రానున్న ఎన్నికలకు రాజకీయ రిహార్సల్‌! వివిధ కూటముల బలాబలాల మొహరింపుకు ఇది ముందస్తు సూచన. కాంగ్రెస్‌ కొత్త మిత్రులను పొందలేకపోతోందన్న వాస్తవాన్ని ఈ ఎన్నిక ఎత్తి చూపింది. మరో విషయం ఏమిటంటే కాంగ్రెస్‌కు లోకసభలో అవిశ్వాస పరాజయం, రాజ్యసభలో ఉపాధ్యక్ష ఎన్నికలో ఓటమి – ఈ రెండింటి పుణ్యమా అని ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరగటం గమనార్హం. రాజకీయాల్లో వారం అంటే చాలా కాలం కింద లెక్క. అలాంటిది…

Read more »

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

By |

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

చైనా రూపొందించిన ప్రపంచపటంలో భారతదేశంలో కశ్మీర్‌ను ‘ఇండియా కంట్రోల్డ్‌ కశ్మీర్‌’ అని ముద్రించి తన కుటిలత్వాన్ని ప్రకటించుకుంది. చైనాలో ఓ చలన చిత్రంలో జమ్ముకశ్మీర్‌ గురించి తప్పుగా చూపించినా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేట్‌ అభ్యంతరాలు తెలుపలేదు. మనదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌ గురించి అభ్యంతరకరంగా రూపొందించిన ఆ సినిమా మొదటివారంలోనే అక్కడ 56 కోట్లు సంపాదించింది. దీన్ని ప్రపంచమంతటా ప్రదర్శిస్తున్నారు. ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయన్న స్పృహ కూడా సీబీఎఫ్‌సీ అధికారులకు…

Read more »

బొఫోర్స్ మచ్చను మరిపించేందుకే రాఫెల్‌పై రాద్ధాంతం!

By |

బొఫోర్స్ మచ్చను మరిపించేందుకే రాఫెల్‌పై రాద్ధాంతం!

ప్రజల ఆశీస్సులు మళ్లీ మాకే – మీడియాతో ప్రధాని మోదీ బొఫోర్స్‌ భూతాన్ని వదిలించుకునేందుకు కాంగ్రెస్‌ అవతలి వారి మీద బురద జల్లుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూకదాడులకు పాల్పడడం హేయమైన చర్య అని, ఆ సంగతి ఇదివరకు కూడా వెల్లడించానని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి దాడుల వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ అది నేరమేనని స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విధానాలు తయారు చేయడం తమ ప్రభుత్వ సిద్ధాంతం కాదని కూడా చెప్పారు….

Read more »

దేశ సమైక్యత, సమగ్రతకు స్ఫూర్తి రక్షాబంధనం

By |

దేశ సమైక్యత, సమగ్రతకు స్ఫూర్తి  రక్షాబంధనం

భారతదేశంలో జరిగే ఉత్సవాలు మన పూర్వజుల దార్శనికతకు మచ్చుతునకలు. సమాజం మనుగడకు, వికాసానికి అవసరమైన దృష్టికోణాన్ని, జీవన దిశను అందించే దివ్యౌషధాలు. మన జాతి అనాదిగా జరుపుకునే ఉత్సవాలలో శ్రావణ పౌర్ణమినాడు జరుపుకునే రక్షాబంధన్‌కు ఇటువంటి విశిష్టత, ప్రత్యేకత ఉంది. కాలగమనంలో సమాజ భద్రతకు, రక్షణకు సవాళ్లు ఎదురయ్యే సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆ సమయంలో సమాజం మనోబలం నిలబెట్టి, వందరెట్లు పెంచి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని అందుకునే శక్తిని ఇచ్చేది రక్షాబంధన్‌ ఉత్సవం….

Read more »

గవర్నమెంటే బందిపోటు

By |

గవర్నమెంటే బందిపోటు

పెక్యులరిజం -9 ప్రభుత్వాలు ఉన్నది బందిపోట్లను అణచడానికి. కాని మన దేశంలో ప్రభుత్వాలే బందిపోట్లు! ఒక గుళ్లో దోపిడీ జరిగితే పోలీసులు కేసు పెడతారు. దొంగలను పట్టుకుంటారు. కోర్టులు వారిని శిక్షిస్తాయి. అన్ని గుళ్లనూ గవర్నమెంటే తెగబడి నిలువుదోపిడీ చేస్తూంటే ఏ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టాలి? ఆ దొంగలను ఎవరు పట్టుకోవాలి? ఏ కోర్టులు వారిని శిక్షించగలవు? మామూలు దొంగలు ఎవరూ లేని సమయం చూసి సాధారణంగా రాత్రివేళ కన్నం వేస్తారు. అందిన కాడికి దోచుకుంటారు….

Read more »

స్వతంత్రత సాకారం కోసం ప్రయత్నించాలి

By |

స్వతంత్రత సాకారం కోసం ప్రయత్నించాలి

భరతుని వల్ల మనదేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందని అందరికీ తెలుసు. ఆ భరతుడు ‘తన ప్రజలను పోషించి, రక్షించిన వాడు’ కావడంచేత భరతుడు అయ్యాడు అని చెప్పుకుంటాం. ‘ఈ చారిత్రిక నేపథ్యంతో భారత్‌ అయిన ఈ దేశంలో రక్షణ, పోషణలకు హామీ లేకపోతే దేశానికి భారత్‌ అనే పేరే అర్థరహితం!’ అరటారు ఏకాత్మ మానవ దర్శనంలో పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. స్వతంత్ర భారత ప్రస్థానం మొదలై ఏడు దశాబ్దాలు గడిచింది. కాబట్టి సాధించినదేమిటో సమీక్షించాలి. అంటే…

Read more »

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

By |

హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద

పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్‌ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా నిర్వహించడం! అమాయకులైన వనవాసులను (ఎస్‌.టి.) స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చడం, వారి హక్కులను హరించడం వంటి…

Read more »

సజ్జతో ఆరోగ్యం..

By |

సజ్జతో ఆరోగ్యం..

కేంద్ర ప్రభుత్వం సజ్జ పంటకు కనీస మద్దతు ధరను పెంచిన నేపథ్యంలో రైతులందరూ ఈ పంటపై దృష్టి పెట్టాలి. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి సజ్జకు ఉంది. మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట నిజంగా వరం. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు – కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. – రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పోటు రానివ్వదు. – కణ విభజనలో, కణ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది. –…

Read more »

పర్యావరణహితం – హరితహారం

By |

పర్యావరణహితం – హరితహారం

నీడనిచ్చే, ప్రాణవాయువునిచ్చే, చల్లని గాలినిచ్చే చెట్లే మనిషి మనుగడకు ఆధారం. మొక్కలు, చెట్లనుంచే మానవులకు ఆహారం లభిస్తుంది. పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. భూమి సారవంతమవుతుంది. ఏమాత్రం హాని లేకుండా.. ప్రయోజనాలు మాత్రమే కలిగించేవి చెట్లు. తెలంగాణ ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించింది. హరితహారం పేరిట బహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ప్రజలనూ భాగస్వాము లను చేసింది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు, సామాజిక సేవా సంస్థలను కూడా…

Read more »