Posts Tagged “16-22 July 2018”

50% పెరిగిన మద్దతు ధరలు ఇది ఆరంభం మాత్రమే

By |

50% పెరిగిన మద్దతు ధరలు ఇది ఆరంభం మాత్రమే

మనదేశం వ్యవసాయాధార దేశం. 60 శాతానికి పైగా రైతులున్న దేశం. దేశ వాసులందరికీ అన్నం పెట్టే ఈ రైతులంతా బాగుంటేనే దేశమూ బాగుంటుంది. మరి రైతు బాగుండాలంటే అతని ఆదాయమూ బాగుండాలి. రైతు ఆదాయం 2022 నాటికి రెండింతలు కావాలని కేంద్రంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం కొలువుదీరిన సంవత్సరంలోనే (2014) నిర్ణయించింది. అలా కావాలంటే రైతు పండించిన పంటకు సరైన ధరను ప్రకటించాలి. ఆ దిశలో మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. రైతు సంక్షేమ…

Read more »

పట్టణాల్లో మావోయిస్టులు..?

By |

పట్టణాల్లో మావోయిస్టులు..?

మహాత్మాగాంధీ హత్య జరిగిన సమయంలో భారతదేశంలో అంతర్యుద్ధ నిర్మాణానికి అప్పటి రష్యా అధినేత ఇక్కడి కమ్యూనిస్టులకు పిలుపునిచ్చాడు. అది సాధ్యం కాలేదు. రష్యా విప్లవం కమ్యూనిస్టులను నడిపిస్తూంటే; చైనా విప్లవం నక్సల్స్‌ను నడిపిస్తున్నది. రష్యాలో కమ్యూనిజం విఫలమైన తరువాత కూడా ఇక్కడి కమ్యూనిస్టులు తమ పంథాను మార్చుకోలేదు. చైనా విప్లవం సృష్టించిన మారణహోమం; ఆ తదుపరి జరిగిన పరిణామాలతో మేల్కొన్న చైనా మావో సిద్ధాంతాలను పక్కన పెట్టింది. అయినప్పటికీ ఇక్కడి మావోయిస్టులు మావోయిజాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. భారతదేశం…

Read more »

చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

By |

చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

చైనా విస్తరణవాదాన్ని మొదట్లో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పుడు కళ్ళు తెరిచింది. అంతర్జాతీయ విత్త నిధి (ఇంటర్‌ నేషనల్‌ మోనిటరీ ఫండ్‌) కూడా చైనా విధానాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ దేశాలను హెచ్చరించింది. దీనితో చైనా నిర్వహించే వార్షిక సమావేశాల పట్ల తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఆసక్తి తగ్గిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హంబన్‌తోట నౌకా కేంద్రంపై హక్కులను ఎలా వదులుకోవలసివచ్చిందో వివరిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల…

Read more »

అపర భగీరథుడు

By |

అపర భగీరథుడు

ప్రముఖ ఇంజనీర్‌ కానూరి లక్ష్మణరావు జయంతి ప్రత్యేకం భారతదేశంలో నదుల అనుసంధానం గురించి మొట్టమొదట ప్రస్తావన చేసిన రైతు బాంధవుడు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు రూపకర్త కీ.శే. డా|| కానూరి లక్ష్మణరావు. నీటి పారుదల, విద్యుత్‌ రంగాలలో మనదేశానికి దిశానిర్దేశం చేసి మౌలిక వసతుల కల్పనలో తన మేధోశక్తిని భారతమాతకు ధారపోసిన మహాను భావుడాయన. అంతటి గొప్ప వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికి గర్వకారణం. కె.ఎల్‌. రావు కృష్ణా జిల్లా కంకిపాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో 1902…

Read more »

మన రూటే వేరు !

By |

మన రూటే వేరు !

పెక్యులరిజం – 4 సెక్యులర్‌ వ్యవస్థలో అన్ని మతాలనూ సమానంగా చూసే తీరాలా? ఒక మతానికి ప్రత్యేక గౌరవస్థానం ఇచ్చి మిగతా మతాలను కొంచెం తక్కువగా చూస్తే తప్పా? తప్పేమీ లేదు. సెక్యులర్‌ రాజ్యం ఇలాగే ఉండాలి, అందులో మతాల ప్రమేయం లేక ప్రాముఖ్యం ఈ రకంగానే ఉండి తీరాలన్న నిబంధన ఎక్కడా లేదు. సెక్యులర్‌ దేశాల్లో మతాల హెచ్చుతగ్గులు ఉన్న దృష్టాంతాలు కావలసినన్ని. ‘ది చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌’ ఇంగ్లాండులో ఆధికార మతం. దానికి సంబంధించిన…

Read more »

కొబ్బరి నూనె పేటెంటు దక్కించుకుందామా !

By |

కొబ్బరి నూనె పేటెంటు దక్కించుకుందామా !

అమెరికా వారు పసుపును పేటెంటు చేసుకున్నారని తెలిసి పలువురు భారతీయులు గుండెలు బాదుకున్నారు. పసుపు క్రిమిసంహారిణి అని తెలిసే భారతీయ మహిళలు పసుపు రాసుకుంటారు, ఔషధ గుణాలున్నాయని తెలిసే మనం అనాదిగా పసుపును వంటకాల్లో వాడుతున్నాం. పేటెంటు అమెరికా వారికెలా ఇస్తారని అరిచి గీపెట్టి ప్రయోజనం లేదు. మన విద్యావంతులు, పట్టాలు పొరదిన డాక్టర్లు ఎవరూ పసుపు గురిరచి ఇలా చెప్పేవారు కాదు. చెప్పకపోగా ముఖానికి, కాళ్ళకు పసుపు రాసుకోవడం ఓ మూఢనమ్మకం, అనాగరిక ఆచారం అని…

Read more »

ఏ సంస్థలో ఉద్యోగం ?

By |

ఏ సంస్థలో ఉద్యోగం ?

నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై దనర్చు, నా నీరమె శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభీన్‌ ; పౌరుష వృత్తులి ట్లధము మధ్యము నుత్తము గొల్చు వారికిన్‌ కాలిన పెనం మీద పడిన నీటిబొట్టు వెంటనే ఆవిరైపోతుంది. అదే నీటిబొట్టు తామరాకు మీద పడితే కొంతకాలం ముత్యంలా ప్రకాశిస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలో పడితే నిజంగానే ముత్యంగా మారుతుంది. అలాగే అధముని సేవలో ఉన్నవాడు ఆవిరైపోతాడు….

Read more »

డా|| అక్కిరాజు రమాపతిరావుకు సహస్ర పూర్ణ చంద్ర దర్శనోత్సవ శుభాకాంక్షలు

By |

డా|| అక్కిరాజు రమాపతిరావుకు సహస్ర పూర్ణ చంద్ర దర్శనోత్సవ శుభాకాంక్షలు

ఎందరికో సుపరిచితులైన డా|| అక్కిరాజు రమాపతిరావు గత అరవై ఐదు సంవత్సరాలుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మెట్లెక్కారు. నూట ఇరవై పుస్తకాలు వివిధ ప్రక్రియలకు సంబంధించినవి సృజనాత్మక, పరిశోధనాత్మక, అనువాద, విమర్శనాత్మక, జీవిత చరిత్రాత్మక, సంపాదకత్వ బాధ్యత పుస్తకాలు ఆయన పేరుతో ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమి సమన్వయకర్తగా 2008-2012 మధ్య పనిచేశారు. కోలకత్తా భారతీయ భాషా పరిషత్తు 2011లో సమగ్ర రచనా పురస్కారం అందజేసి వీరిని గౌరవించింది. ఇతర భారతీయ భాషలలోకి వీరి రచనలు…

Read more »

ఇళ్ళ నిర్మాణంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

By |

ఇళ్ళ నిర్మాణంలో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (PMAY) క్రింద ఎన్‌.టి.ఆర్‌. గృహనిర్మాణ పథకం పేరుతో నిర్మించిన ఇళ్ళను పేదలకు అందించారు. పేదల స్వంత ఇంటి కలను సాకారం చేయటం కోసం 2014లో కేంద్రంలో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేర ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఇంతకు పూర్వం ‘అందరికీ పక్కా ఇళ్ళు’ అనే పేరుతో ఉండేది. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన యొక్క లక్ష్యం 2022 నాటికి 20 మిలియన్ల మంది…

Read more »

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు

By |

హైదరాబాద్‌ పోలీసుల అనూహ్య నిర్ణయాలు

గడిచిన వారం హైదరాబాద్‌లో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు పరిణామాలు తీవ్ర చర్చను లేవనెత్తాయి. చూడటానికి అవి వేరే అంశాలుగా కనిపించినా రాజకీయంగానూ కలకలం సష్టించాయి. వాటిలో ఒకటి హైదరాబాద్‌ నుంచి కత్తి మహేష్‌ బహిష్కరణ. రెండోది స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు స్వామీజీని గహ నిర్బంధంలో ఉంచడం. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి ధర్మాగ్రహ…

Read more »