Posts Tagged “14-20 January 2019”

రిజర్వేషన్‌లలో కొత్తశకం కోసం

By |

రిజర్వేషన్‌లలో కొత్తశకం కోసం

చరిత్ర నుంచి వర్తమాన భారతావనికి వారసత్వంగా వచ్చిన సమస్యలు తీక్షణమైనవి. క్రూరమైనవి. వాటి విషపు గోళ్లు ఈ సమాజపు శరీరంలో చాలా లోతుకు దిగబడి ఉన్నాయి కూడా. సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, సమానావకాశాల అలభ్యత ఇవన్నీ మన గతం నుంచి మనకు అందినవే. కొన్ని శతాబ్దాల విదేశీ పాలన ఇందుకు ఒక కారణం. తన రుగ్మతలను గుర్తించడంలో వైఫల్యం, గత అనుభవాలు చెబుతున్న పాఠాలను వినలేక పోవడమనే అశక్తత, మన సమాజ స్వయంకృతాపరాధం కూడా కాదనలేనివి….

Read more »

మాది రక్షణ, వారిది భక్షణ

By |

మాది రక్షణ, వారిది భక్షణ

భారత పార్లమెంట్‌ అనేక అంశాల మీద సుదీర్ఘ ఉపన్యాసాలతో ఓలలాడింది. అవి ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు. దేశ రక్షణ, మౌలిక విలువలు, అంతర్గత భద్రత, విదేశీ విధానం, పేదరికం, విద్య వంటి ఎన్నో అంశాలు ఆ చర్చలలో ఉన్నాయి. అయితే అలాంటి ఉపన్యాసాలు ఇప్పుడు లేవు. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అని అంతా ప్రశ్నించుకుంటున్న సందర్భంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగళ్ల మీద కాంగ్రెస్‌, రాహుల్‌ చేస్తున్న ఆరోపణకు…

Read more »

మరో మోసానికి పాక్‌ పాల్పడుతోందా !

By |

మరో మోసానికి పాక్‌ పాల్పడుతోందా !

పాకిస్థాన్‌తో రాజకీయ ప్రయోజనాల కోసం జట్టుకట్టడం దేశం పట్ల కాంగ్రెస్‌ భక్తి, నిబద్ధతపై సందేహాన్ని కలిగిస్తోంది. ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ‘ఇమ్రాన్‌ ఖాన్‌ వేసిన గుగ్లీకి గింగిరాలు తిరుగుతూ భారత ప్రభుత్వం ఇద్దరు మంత్రులను ఇక్కడికి పంపక తప్పలేదు’ అని గొప్పలు చెప్పుకున్నాడు. దానినిబట్టి కర్తార్పూర్‌ నడవా కేవలం ఒక వల మాత్రమేనని స్పష్టమవుతోంది. కర్తార్పూర్‌ నడవా భూమిపూజకు ఇద్దరు కేబినెట్‌ మంత్రులను పంపడం…

Read more »

ప్రకృతి నుండి ప్రగతి

By |

ప్రకృతి నుండి ప్రగతి

భావనగర్‌ సమీపాన సముద్రతీరంలో విహరిస్తుండగా జెమ్‌షెడ్‌జి పెదవులపై సముద్రపు నీరు వచ్చి పడింది. ‘అబ్బ! ఎంత ఉప్పగా ఉంది!’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, తన సహచర శాస్త్రజ్ఞుడు, ‘ఒక్క ఉప్పేంటి, సముద్రపు నీటిలో పొటాషియం, బ్రోమిన్‌, క్లోరిన్‌, అయోడిన్‌లతో కూడిన ఎన్నో లవణాలు (Chemicals) ఉన్నాయి’ అన్నాడు. పర్యవసానం టాటా కెమికల్స్‌ కంపెనీ స్థాపన. మానవులు ఆకలి దప్పులు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలకూ విపత్తులకూ బలికాకుండా, చల్లగా సుఖంగా ఉంటూ, సహజ శారీరిక శక్తికి మించి…

Read more »

సంక్రాంతి – లోగిళ్లు కళకళ ఐశ్వర్యం గలగల

By |

సంక్రాంతి – లోగిళ్లు కళకళ ఐశ్వర్యం గలగల

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి. సూర్యుడు నెలకొక రాశిలోకి మారుతాడు. కొత్త రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయన్నమాట….

Read more »

సహనం మన సొంతం

By |

సహనం మన సొంతం

భారతీయతలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ హిందూ సంస్కృతి అలవర్చిన విశేషం. ఔత్సాహికులైన కొందరు పరిశోధక పాత్రికేయులు గత శతాబ్దిలో ప్రపంచంలోని వివిధ జాతుల, మతాల ప్రత్యేకతను గురించి అధ్యయనం జరిపారు. ప్రపంచం అంతటా జరిపిన వారి అధ్యయనంలో క్రైస్తవులు సేవలో, ముస్లిములు దానం చేయడంలో, హిందువులు మత సహనంలో సర్వ ప్రథములని తేలినట్లు వెల్లడించారు. హిందువులు మత సహనంలో ప్రథములనే విషయం ప్రపంచ చరిత్రను స్థూలంగా పరిశీలిస్తే కూడా మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. ప్రపంచం మొత్తరలో భారత్‌ మీద…

Read more »

యువత పైనే నా విశ్వసం స్వామి వివేకానంద

By |

యువత పైనే నా విశ్వసం స్వామి వివేకానంద

జాతీయ యువదినోత్సవ ప్రత్యేకం హిందునని గర్వించు.. హిందువుగా జీవించు.. ఒక మంత్రంలా కోట్లాది మందిని కదిలించిన నినాదమిది. ఈ నినాదంలో మనకు ఎలాంటి సంకుచితత్వం, స్వార్థం కనిపించదు. ఆత్మవిశ్వాసం, సార్వజనీనతను ఇందులో చూడవచ్చు. ఇంతకీ ఈ నినాదం ఎవరిది? దశాబ్దాలుగా ఆబాల గోపాల హృదయాలను కదిలించిన ఈ నినాదం ఇచ్చింది స్వామి వివేకానంద. ‘హిందుత్వం ఒక మతం కాదు, సనాతనమైన ధర్మం. భారతీయ ఆత్మ. దీని ఆధారంగానే జాతీయ తను, ఐక్యతను సాధించాలి. ప్రతి ఒక్కరూ తాము…

Read more »

భక్తి గంధ పరిమళం

By |

భక్తి గంధ పరిమళం

‘ఎందరో మహానుభావు-లందరికి వందనము చందురువర్ణుని అందచందమును హృదయార- విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా.. రెందరో మహానుభావులు…..’ ఈ కీర్తనే కాదు, ‘జగదానందకారక! జయ జానకీ ప్రాణనాయక! గగనాధివసత్కులజ! రాజరాజేశ్వర! సుగుణాకర! సురసేవ్య! భవ్యదాయక! సదాసకల…’ ఇంకా, ‘పవమానసుతుడు బట్టుాపాదారవిందములకు.. నీ నామరూపములకు -నిత్య జయమంగళం…’ ‘సామజవరగమన! సాధుహృత్సారసాబ్జ పాల! కాలాతీ! విఖ్యాత!’ ‘గంధము పుయ్యరుగా పన్నీరు అందమైన యదునందునుపై-కుందరదన పరిమళ’ ||గం|| వంటి కీర్తనలను వినని దాక్షిణాత్యులు ఉండరు. కానీ ఈ కీర్తనల కర్త ఎవరో వెంటనే…

Read more »

నాదోపాసకుడు త్యాగయ్య

By |

నాదోపాసకుడు త్యాగయ్య

సంగీతం శిశువులను, పశువులను కూడా సమ్మోహితులను చేస్తుంది. మనుషుల మధ్య సమైక్యతను తెస్తుంది కూడా. గానంతో పులకించిన మనుషులు కొన్ని క్షణాలైన తారతమ్యాలను మరచి పోగలుగుతారు. కాబట్టి స్వరాలకు ఎల్లలు లేవు. కీర్తనామృతానికి సరిహద్దులు లేవు. ఏ ప్రాంతానికి చెందిన మానవాళినయినా అవి గుండెను తాకి ఒకే రీతిలో స్పందింప చేస్తాయి. త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలను చూస్తే ఈ విషయం సులభంగానే అర్థమవుతుంది. గడచిన 171 సంవత్సరాలుగా ఆ ఉత్సవాలు జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో సంగీతాభిమానులు తమిళనాడులోని…

Read more »

కుంభమేళా పిలుస్తోంది!

By |

కుంభమేళా పిలుస్తోంది!

ప్రపంచ ప్రజానీకం ఎదురుచూసే కుంభమేళా మహోత్సవం మొదలవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (నిన్నటిదాకా అలహాబాద్‌) జనవరి 14వ తేదీ, 2019న ఈ తీర్థయాత్ర మహోత్సాహంగా ప్రారంభం కాబోతున్నది. అప్పటి నుంచి 48 రోజుల పాటు జరిగి మార్చి 4 (మహా శివరాత్రి) న ముగియనున్న ఈ మహా పండుగను అర్థ కుంభమేళ అంటున్నారు. కుంభమేళ అంటే లక్షలాది సాధారణ హిందువులతో పాటు, కాషాయాంబరధారులైన సాధుజనం, అఘోరాలు, హిందూ జీవన విధానంలోని వైవిధ్యాన్ని చాటుతూ వివిధ ఆరాధనా రీతులకు ప్రాతినిధ్యం…

Read more »