Posts Tagged “11-17 September 2017”

జల సిరి

By |

జల సిరి

నదుల అనుసంధానం ఫలితంగా రైతులు స్థిరత్వం లేని ఋతుపవనాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. లక్షలాది హెక్టార్ల వ్యవసాయ భూములకు సాగునీటి వసతి కలుగుతుంది. ఆహారం పుష్కలమవుతుంది. ఎగుమతులు పెరిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. జల సిరితో వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కూడా జరిగే అవకాశం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే జల సిరి దేశ సౌభాగ్యానికి బాటలు పరుస్తుంది. మానవ జీవనానికి, నాగరికత వికాసానికి, అభివద్ధికి నీరే మూలాధారం. అందుకే నదుల అంచునే ప్రపంచంలో మ¬న్నత నాగరికతలు వెలశాయి,…

Read more »

డోక్లాం – భారతీయ దౌత్య మైలురాయి

By |

డోక్లాం – భారతీయ దౌత్య మైలురాయి

దళాల పరస్పర ఉపసంహరణ ద్వారా డోక్లాం సమస్యకు లభించిన ముగింపు గుర్తుంచుకో వలసిన భారత దౌత్య విజయం. సముద్ర, భౌగోళిక విస్తరణ మైకంలో ఉన్న రివిజనిస్టు చైనాను లొంగదీయడం సామాన్య విషయం కాదు. చిన్న పొరుగు దేశ రక్షణకు ముందుకు రావడం ద్వారా మైత్రి ఒప్పందాన్ని అమలుచేసిన భారతదేశం మిత్రుల, పొరుగువారి విశ్వాసం సంపాదించింది. చైనా సైన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని భారతదళాలు నిరోధించడంతో జూన్‌ 16న మొదలైన డోక్లాం ప్రతిష్టంభన విజయవంతంగా ముగిసింది. దౌత్య మార్గాల్లో…

Read more »

తెలంగాణ విముక్తి దినం – సెప్టెంబర్‌ 17

By |

తెలంగాణ విముక్తి దినం – సెప్టెంబర్‌ 17

‘నేనెవరికీ భయపడను, నేనే దేవుణ్ణి’ అని ప్రచారం చేసుకొన్న ఏడవ నిజాం ఉక్కుమనిషి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ముందు విమానాశ్రయంలో తలవంచి నమస్కరించి స్వాగతం పలికాడు. దేశం మొత్తం 1947 ఆగస్టు 15వ తేదీనే పరతంత్రం నుండి విముక్తి పొందినా, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17న విముక్తి లభించింది. ‘మన అన్నల చంపిన మన చెల్లెళ్ళ చెరిచిన మానవాధములను మండలాధీశులను మరిచిపోకుండగ గుర్తుంచుకోవాలె కాలంబురాగానె కాటేసి తీరాలె పట్టిన చేతులను పొట్టులో బెట్టాలె తన్నిన కాళ్లను…

Read more »

కావేరీ ఝరీ హేళ దర్శిద్దాం పుష్కర వేళ

By |

కావేరీ ఝరీ హేళ దర్శిద్దాం పుష్కర వేళ

శ్రీ హేేవిళంబి నామ సంవత్సర భాద్రపద బహుళ సప్తమి 12 సెప్టెంబర్‌ 2017 మంగళవారం ఉ|| 6.51 ని||లకు సార్థ త్రికోటి దేవతా తీర్థరాజ సహిత దేవగురుడు బృహస్పతి తులారాశి ప్రవేశంతో మాతృశ్రీ కావేరి నదికి పుష్కరాలు ప్రారంభమవు తున్నాయి. 12 ఏళ్ళకోసారి పుష్కరాలు వస్తాయి. కానీ కావేరీ తీరవాసులు పుష్కరాలతోపాటు ఏటా సూర్యుడు తులారాశిలోకి వచ్చినపుడు ‘తీర్థోద్భవం’ అని నదిని పూజిస్తారు. కావేరీనది కర్ణాటక రాష్ట్రంలో తలకావేరీ కొడగులో జన్మించి దక్షిణ ప్రాగ్దిశలో ప్రవేశించి కర్నాటక,…

Read more »

విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి

By |

విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి

సెప్టెంబర్‌ 17 పరపాలన నుండి విముక్తి పొందిన రోజైతే, జూన్‌ 2 సత్వర అభివృద్ధి, పరిపాలనలో సౌలభ్యం కోసం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన రోజు. ఈ తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈ రెండు తేదీలు ముఖ్యమైనవే. ’17 సెప్టెంబర్‌’ లేకుండా ‘2 జూన్‌’ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం 2 జూన్‌తోపాటు 17 సెప్టెంబర్‌ నాడు కూడా అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ ప్రాంత చరిత్రలో 1948 సెప్టెంబరు 17 కు, 2014 జూన్‌…

Read more »

మీడియా విశ్వసనీయతను నిలుపుకోవాలి !

By |

మీడియా విశ్వసనీయతను నిలుపుకోవాలి !

అచ్చులో అబద్ధర ఉరడదని, అక్షర రూపంలో ఉన్నదంతా సత్యమే అని మన మధ్యనున్న మనుషుల్లో కొరదరు నమ్ముతున్నారంటే అది వారి అమాయకత్వర కాదు. సమాజం ఎరత దిగజారినా పరబ్రహ్మ (దైవ) స్వరూపమైన అక్షరంతో అపచారానికి ఒడిగట్టరని, అబద్ధాలు రాయరని గట్టి నమ్మకం ! ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామిక దేశాల్లో పత్రికలకు గౌరవం దక్కడానికి, పత్రికా స్వేచ్ఛ మనగలగడానికి రాజ్యారగ నియమాలు కారణం కావచ్చు. కాని భారతదేశంలో మాత్రం రాజ్యారగ నియమాలకన్నా భారతీయ దృక్పథమే ప్రధాన కారణం. భారత…

Read more »

కర్రపెండలం సాగు

By |

కర్రపెండలం సాగు

కర్ర పెండలం సాగు చేయాలంటే విత్తన ఎంపిక నుండి కోత వరకు అన్నీ దశలలో సరైన పద్ధతులు పాటించాలి. అన్ని దశలలోనూ సరైన పద్ధతులు పాటిస్తే ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి సాధించి, అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. విత్తన కర్రల నిల్వ : విత్తన కర్రలుగా ఎంపిక చేసిన కొమ్మలపై ముందు మాంకోజెబ్‌ లీటరుకు 3 గ్రాముల చొప్పున మరియు క్లోర్‌ఫైరిపాస్‌ (లీటరు నీటికి 2 మి.లీ.) మందు ద్రావణాన్ని పిచికారి చేయాలి. దానితో…

Read more »

తెలంగాణ అమర వీరుడు షోయబ్‌ ఉల్లాఖాన్‌

By |

తెలంగాణ అమర వీరుడు షోయబ్‌ ఉల్లాఖాన్‌

షోయబ్‌ ఉల్లాఖాన్‌ ముస్లిం యువకుడు. ఉత్సాహం ఉరకలేసే జర్నలిస్టు. పత్రికా వ్యాసంగంలో అభిరుచి ఉన్నవాడు. నిజాం సంస్థానంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రు డయ్యాడు. దేశ క్షేమం దృష్ట్యా నిజాం సంస్థానం భారత్‌లో విలీనం కావాలని కోరుకున్నాడు. రజాకార్ల దురాగతాలను సహించలేకపోయాడు. తాజ్‌ అనే ఉర్దూ వారపత్రిక సంపాదకీయ విభాగంలో కొంతకాలం పనిచేశాడు. 1947 అక్టోబర్‌ ఆఖరి దినాలలో ‘రయ్యత్‌’ అనే ఉర్దూ దినపత్రిక సంపాదకుడైన ముందుముల నర్సింగరావుని ఏడుస్తూ వెళ్ళి కలిసాడు. నర్సింగరావు అతనిని ఓదార్చి…

Read more »

క్రియాశీలం కావడమే నిజమైన శ్రద్ధాంజలి

By |

క్రియాశీలం కావడమే నిజమైన శ్రద్ధాంజలి

స్వర్గీయ అంగర త్రివిక్రమరావు శ్రద్ధాంజలి సభలో వక్తల సందేశం త్రివిక్రమ్‌జి ప్రాంత సంపర్క ప్రముఖ్‌గా ఉన్నప్పుడు ప్రతి స్వయంసేవక్‌ ఏదో ఒక సమాజ కార్యంలో క్రియాశీలంగా ఉండాలే తప్ప నిష్క్రియంగా ఉండకూడదని భావించి అతిసులభంగా చేయదగిన 100 పనులను వారు తయారు చేసి, అందులో కనీసం ఏదైనా ఒక పనిని క్రమంగా చేస్తూ ఉండాలనే తపనతో అందరి స్వయంసేవకులకు మార్గదర్శనం చేసారు. ఆ విధంగా వారు సూచించిన వంద పనులలో మనం చేయగలిగిన ఒక పనిని ఎంపిక…

Read more »

విమోచన దినం జరపడానికి వెనుకంజ దేనికి ?

By |

విమోచన దినం జరపడానికి వెనుకంజ దేనికి ?

సెప్టెంబర్‌ 17 భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టం. మొత్తం భారత దేశం త్రివర్ణ పతాకం నీడలోకి చేరినా, తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు మాత్రం ఒక నిరంకుశ నిజాం పాలనలో మగ్గిపోతున్న రోజులు. కనీసం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకుండా, తీవ్రమైన అణచివేతకు గురయ్యారు. భారతదేశంలో కలవడం కోసం ప్రజానీకం ఉద్యమాలు చేపడుతున్నా పాశవికంగా అణచి వేస్తున్న రోజులు. ఏడవ నిజామ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ భారత దేశంలో విలీనం కాకుండా, స్థానిక ప్రజలను ఊచకోత కోయడం…

Read more »