Posts Tagged “10-16 December 2018”

ఇది కాదా పక్షపాతం..!

By |

ఇది కాదా పక్షపాతం..!

ధరలు పెరిగినపుడు ప్రధాని మోదీని బాధ్యుడిని చేసిన ప్రతిపక్షాలు, మీడియా ధర తగ్గినపుడు దాన్ని మోదీ ఖాతాలో వేయడానికి వెనుకాడు తున్నాయి. ఇది పక్షపాతం కాదా ? జాతి సంక్షేమం, జాతీయ ప్రయోజనాల పట్ల బాధ్యత కల రాజకీయ నేతల స్వభావం ఇలా ఉంటుందా ! అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా పెట్రోలు, డీజిలు ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదలను నకిలీ లౌకిక మీడియా గుర్తించడం లేదు. ధరలు…

Read more »

ఇప్పుడు వినిపిస్తున్నమాట మేధో ఉగ్రవాదం

By |

ఇప్పుడు వినిపిస్తున్నమాట మేధో ఉగ్రవాదం

అర్బన్‌ నక్సల్స్‌! లాగి విడిచిన బాణంలా, బ్యారెల్‌ వదిలిన తూటాలా ఇప్పుడు భారతదేశంలో మారుమోగుతున్న మాట ఇది. ఈ మాట ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు? ఎవరి సృష్టి? ఈ ప్రశ్నలన్నీ సహజమే అయినా, ఈ పదబంధం పుట్టిన నేపథ్యం గాఢమైనదని గమనించాలి. ‘అర్బన్‌ నక్సల్స్‌’, ”హాఫ్‌ మావోయిస్ట్స్‌’, ‘భారత అదృశ్య శత్రువులు’ ఇలాంటి పదాలు ఈ ఆగస్టు చివర ఒక్కసారిగా దేశమంతటా ప్రతిధ్వనించాయి. అంటే ఇవి మావోయిస్టు మద్దతుదారులను ఉద్దేశించి అంటున్నవే. నగర…

Read more »

చట్టం తేవాల్సిందే..

By |

చట్టం తేవాల్సిందే..

అయోధ్య రామజన్మభూమి అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాజకీయ లబ్ది కోసం ఈ అంశాన్ని వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, వాస్తవానికి ఈ పరిస్థితికి కారణం న్యాయస్థానం చేస్తున్న అంతులేని జాప్యమే. దశాబ్దాల తర్వాత అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ విచారణకు రావడానికి మరో ఎనిమిదేళ్లు పట్టింది. పైగా వాయిదాలు. న్యాయం కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలంటూ రామభక్తులు ఆగ్రహం…

Read more »

బెలూచిస్తాన్‌ మరో టిబెట్‌ కాబొతున్నదా !

By |

బెలూచిస్తాన్‌ మరో టిబెట్‌ కాబొతున్నదా !

 అది ఆర్థిక నడవా కాదా ! మరేమిటి ?  బెలూచిస్తాన్‌లో 5 లక్షల చైనీయులా ?  వారిపై బెలోచీలు ఎందుకు దాడి చేస్తున్నారు?  పాక్‌ పట్ల చైనా అసలు ఉద్దేశం ఏమిటి ?  అమెరికా మాజీ కల్నల్‌ ఏమి రాశాడు ? ఆర్ధిక నడవా ప్రాజెక్ట్‌ ఖరారు కాగానే పాకిస్తాన్‌ ప్రభుత్వం బెలోచీలను పిలిచి ఈ ప్రాజెక్ట్‌లో వారిదే కీలకపాత్ర అని చెప్పింది. అలాగే దీనివల్ల వారి పేదరికం తొలగిపోతుందని నమ్మబలికింది. కానీ ఎప్పుడైతే చైనా తన…

Read more »

అన్నయ్య ప్రధాని అయినా మా టీకొట్టు అలాగే ఉంది !

By |

అన్నయ్య ప్రధాని అయినా మా టీకొట్టు అలాగే ఉంది !

మన ప్రధాని నరేంద్రమోదీ గురించిన చిన్ననాటి వివరాలను తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికుండదు..! ఆ అవకాశం రావాలే గాని ఆ విశేషాలను ప్రత్యేక శ్రద్ధతో వినరూ..! ఆ అవకాశం జాగృతి పాఠకులకు కలిగించడానికే అన్నట్లుగా ప్రధాని సోదరుడు (తమ్ముడు) ప్రహ్లాద్‌ భాగ్యనగరం విచ్చేశారు. మన ప్రధాని చిన్ననాటి విశేషాలు కొన్నిటిని మనకందించారు. చదవండి.. భారత ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ గత నెలలో భాగ్యనగర్‌ బండ్లగూడలోని శ్రీశారదాధామానికి వచ్చారు. నరేంద్ర మోదీకి సోదరుడే అయినా రాజకీయాలతో ప్రహ్లాద్‌…

Read more »

దరిద్రానికి మతం ఉందా ?

By |

దరిద్రానికి మతం ఉందా ?

పెక్యులరిజం – 24 ‘తక్కువేమి మనకు – మోది ఒక్కడుండు వరకు’ అని బోలెడు సంతోషపడ్డారు నష్టజాతకులైన హిందువులు. ”ప్రధానమంత్రి 15 అంశాల కార్యక్రమం” కింద మైనారిటీల మెహర్బానీ కోసం మౌనమోహన్‌ బినామీ సింగ్‌ 2008లో ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్పులను విచ్చలవిడిగా ప్రకటించినప్పుడు నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి. మెజారిటీ వర్గాన్ని దారుణ వివక్షకు గురిచేసే దిక్కుమాలిన పథకాన్ని తన రాష్ట్రంలో అమలు పరిచేది లేదని ఆయన ధైర్యంగా ఎదురు తిరిగాడు. కోర్టు తీర్పులను సైతం లెక్క చెయ్యక హిందువుల…

Read more »

రాజకీయ కశ్మలాన్ని కడిగేయాలి!

By |

రాజకీయ కశ్మలాన్ని కడిగేయాలి!

‘వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ మాన విత్త భంగ మందు ఆడి తప్పవచ్చు అఘము పొంద రధిప’ అని ఆర్యోక్తి. ఈ సూక్తిలో సత్యనిష్ఠకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ మినహాయింపుల్లో రాజకీయాలు లేవు. అంటే రాజ్యాధికారం కోరి గాని, అందుకోడానికి గాని, అందిన దాన్ని నిలుపుకోడానికి గాని ఆడి తప్పుట పాపమే అని అర్థం. ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలో ప్రజామోదం పొందిన ప్రజా ప్రతినిధులే ప్రభువులు, పాలనాధికారులు. కనుక ప్రజల ఓట్లు పొందడానికి మేము అధికారంలోకి వస్తే…

Read more »

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

By |

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

13 డిసెంబర్‌ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి రోజున ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ జరుపు కుంటారు. దీనినే ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. తారకా సురుని సంహరించడానికి శివపార్వతులకు పుట్టిన అవతారమే సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు బ్రహ్మ ద్వారా వరం పొంది గర్వంతో ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేసి, దేవతలపై దండెత్తుతాడు. కొంతకాలం తర్వాత హిమవంతునికి సతీదేవి (పార్వతి) జన్మిస్తుంది. శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. ఆ నూతన దంపతుల…

Read more »

కాస్త స్థలముంటే చాలా.. !

By |

కాస్త స్థలముంటే చాలా.. !

వ్యవసాయానికి మనదేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతన్నను అన్నదాతగా భావించి గౌరవించే సంస్కతి మనది. అయితే పట్టణీకరణ పెరిగిపోవడంతో అన్నదాతకు పల్లెల్లో ఆసరా లేకుండా పోతోంది. మార్కెట్లో పంటను అమ్ముకోవడానికి వస్తే ఆదరించే వారు కరువవుతున్నారు. చాలా వరకు పంట పొలాలు పచ్చదనానికి దూరమవుతున్నాయి. దేశానికి తిండి పెట్టే రైతన్న ప్రస్తుతం దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు. హైడ్రోఫోనిక్స్‌ నాగరికతకు చేరువ అవుతున్నాం అనుకునే నగరవాసులకు వ్యవసాయాన్ని దగ్గర చేసేందుకు హైడ్రోఫోనిక్స్‌ విధానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది….

Read more »

ధర్మం-శాసనం-పాలన

By |

ధర్మం-శాసనం-పాలన

ధర్మశాస్త్రాలనే స్మృతులని అంటారు. ధర్మ శాస్త్రకర్తలు లేదా స్మృతికర్తలు లోకహితం కోరినవారు. సమదృష్టి కలిగినవారు. అందుకే ఎంత పురాతనమైనా భారతీయ ధర్మశాస్త్రాల అధ్యయనం మీద నేటికీ ఒక విధమైన శ్రద్ధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిరపేక్ష రాజరికం లేనేలేదు. రాజు సర్వంసహ అధికారి కాడు. అంతేకాదు, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థలలో వేటి ఉనికి వాటిదేనని మొదటిగా గుర్తించినది మన ప్రాచీన భారతీయ న్యాయ వ్యవస్థేనని చాలామంది విజ్ఞుల అభిప్రాయం. ఈ సూక్ష్మ విభజన గురించి ఆసక్తి ఉండడం…

Read more »