Posts Tagged “08-14 January 2018”

పాక్‌ను కట్టడి చేయాల్సిందే

By |

పాక్‌ను కట్టడి చేయాల్సిందే

– పాక్‌లో జాదవ్‌ కుటుంబానికి తీవ్ర అవమానం – ఇది హిందువుల పట్ల చేసిన అవమానమే – భారత ఉదారవాదులు ఎందుకు ఖండించలేదు – పాక్‌ దుర్మార్గాన్ని కట్టడి చేయాల్సిందే ఒకవంక పాకిస్తాన్‌ తన దురాగతాల పరంపరను నిర్విఘ్నంగా కొనసాగి స్తూండగా, మరొక పక్క భారతదేశం పాకిస్తాన్‌కు ఇచ్చిన ‘అత్యంత ప్రియమైన దేశం’ హోదాను ఉపసంహరించక పోవడమే కాక, సింధునది జలాల ఒప్పందం విషయంలో సైతం స్వప్రయోజన విధానం అనుసరించలేక పోతోంది. వీటిని కూడా భారత్‌ వెంటనే…

Read more »

జాతిని మేల్కొలిపిన స్వామి వివేకానంద

By |

జాతిని మేల్కొలిపిన స్వామి వివేకానంద

జనవరి 12 స్వామి వివేకానంద జయంతి ప్రత్యేకం ‘నిరంతరం శ్రమిస్తూ అంతులేని ఆత్మస్థైర్యం, ఓరిమి కలిగి ఉన్న సామాన్య ప్రజలే ఈ దేశానికి వెన్నెముక. తనకు జైజైకారాలు పలుకుతున్నప్పుడు, తనకు గొప్పవాడుగా గుర్తింపు లభిస్తున్నపుడు పిరికివాడు కూడా ప్రాణత్యాగానికి వెనుకాడడు. తన గొప్పతనానికి మూలాధారమైన నైతిక విలువలు పాటిస్తూ అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన క్రిందిస్ధారు ప్రజలలోనే భారతజాతి జీవించి ఉన్నది. వారితోనే మళ్ళీ ఈ జాతి విశ్వగురుత్వ స్థానానికి ఎదుగుతుంది. ఆ గుడిసె వాసుల నుండే…

Read more »

తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌

By |

తేనె తుట్టెను కదిపిన ట్రంప్‌

జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించిన యుఎస్‌ను అరబ్‌ దేశాలు విమర్శించాయి. ‘మరల తేనెతుట్టెను కదిపిన ట్రంప్‌’ అంటూ చైనా అధికార గ్లోబల్‌ టైమ్స్‌ విమర్శించింది. ఇజ్రాయెల్‌ గాఢమిత్రుడు, చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడు జెమెన్‌ ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరిని పిరికితనంగా పేర్కొన్నారు. జెరుసలెం విషయంలో భారతదేశం తన వైఖరిని స్పష్టం చేసింది. జెరుసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అసమ్మతిని పెంచింది. ఎన్నికల వాగ్దానాలను నిలుపుకోవడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించిన…

Read more »

విశ్వ గురువుగా భారత్‌ – స్వయంసేవకుల పాత్ర

By |

విశ్వ గురువుగా భారత్‌ – స్వయంసేవకుల పాత్ర

ఒక శిల శిల్పంగా మారడానికి శిల్పి చేతిలో అనేక విధాల మార్పులు చేర్పులకు గురి అవుతుంది. సుత్తిదెబ్బలు, ఉలి చెక్కుడులను సహిస్తుంది. చివరికి ఆకర్షణీయమైన శిల్పంగా మారి అందరి మన్ననలు అందుకొంటుంది. పూజార్హమవుతుంది. అదేవిధంగా సంఘం చేస్తున్న భగవత్కార్యంలో తమ పాత్రను, అర్హతను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి. మంచిమార్పు కావాలని అందరూ కోరుకొంటారు. కానీ ‘ఆ మార్పు నా దగ్గర ప్రారంభం కావాలి’ అనుకోవాలి. భారతదేశం అనాదిగా సకల విశ్వానికి గురువుగా మార్గదర్శనం చేస్తోంది….

Read more »

నికార్సయిన కాల గణనకు నిదర్శనం సంక్రారతి !

By |

నికార్సయిన కాల గణనకు నిదర్శనం సంక్రారతి !

కాలం అవిచ్ఛిన్నమైనది. ఈ మాట అర్థమైనట్లు అనిపిస్తున్నా దీని భావం సంపూర్ణరగా అవగతం కావడం కష్టర. కాలాన్ని యుగాలుగా, సంవత్సరాలుగా, మాసాలుగా, వారాలుగా, రోజులుగా విభజిరచుకున్నార! రోజును ఉదయం, మధ్యాహ్నర, సాయంత్రం, రాత్రి అని కూడా విభజిరచుకున్నార. నిన్న, ఇవాళ, రేపు అని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా మొత్తర కాలాన్ని విభజిరచు కొరటురడగా కాలం అవిచ్ఛిన్నమేమిటి ? అనిపిస్తురది. కానీ, కాలంలో ఒక బిరదువు వద్దో, సమయాన్ని సూక్ష్మరగా లెక్కిరచే సెకను లేదా క్షణం వద్దో ఆగి…

Read more »

తెలంగాణలో నిరంతర విద్యుత్‌

By |

తెలంగాణలో నిరంతర విద్యుత్‌

తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ కోతల సమస్యను అధిగమించడం స్ఫూర్తిదాయకమే. పట్టుదల ఉంటే ఎలాంటి సవాళ్ళనైనా అధిగమించవచ్చన్న స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పక్కా కార్యాచరణతో కొనసాగించిన నిరంతర విద్యుత్‌ ప్రణాళికను కొనసాగించింది. రాష్ట్రం ఏర్పడిన మూడున్నరేళ్ళలోనే ఇది సాధించడం వెనుక ప్రభుత్వ కృషి ఉంది. నిరంతర విద్యుత్‌తో వ్యవసాయరంగంపైనే ఆధారపడుతూ వస్తున్న అన్నదాతలు లాభపడతారు. తక్కువ సమయంలోనే దేశంలో ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను చెప్పుకోవచ్చు. గతంలో నిరంతర విద్యుత్‌ కోతల కారణంగా…

Read more »

విశాఖ ‘భూ’ బకాసురులకు శిక్ష పడేనా !

By |

విశాఖ ‘భూ’ బకాసురులకు శిక్ష పడేనా !

ఏపి, తెలంగాణలో ఇటీవలి కాలంలో భూ బకాసురుల దందా పతాకస్థాయికి చేరుకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ, అధికార ముసుగులో అమాయకులైన పేద, మధ్యతరగతి ప్రజల భూము లను, ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జాచేసి వికటాట్ట హాసం చేస్తున్న పెద్దల నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. విశాఖ నగర పరిధిలో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయంటూ మీడియా వరుస కథనాలతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో అప్రమత్తమైన చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే….

Read more »

ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ ఎంత?

By |

ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ ఎంత?

ఆజాద్‌ కశ్మీర్‌ అంటే స్వతంత్ర కశ్మీర్‌. పాకిస్తాన్‌ చేతుల్లో ఉన్న జమ్మూకశ్మీర్‌ భూభాగాన్ని పాకిస్తాన్‌ ఆజాద్‌ కశ్మీర్‌ అని పిలుచుకుంటుంది. అంటే దీని అర్థం భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ ‘గులాం కశ్మీర్‌’ అని పాకిస్తాన్‌ అభిమతం. తమాషా ఏమిటంటే ఆజాద్‌ కశ్మీర్‌లో ఆజాదీ లేదు. కశ్మీర్‌ అంతకన్నా లేదు. ఇది చాలా మందికి తెలియని నిజం. పాక్‌ గుప్పెట్లో ఉన్న భూభాగానికి ఆజాదీ అంటే స్వేచ్ఛలేదు. అది కశ్మీర్‌ అంతకన్నా కాదు. పాకిస్తాన్‌ గుప్పెట్లో…

Read more »

జమ్మూ కశ్మీర్‌లో పద్మావతుల బలిదానం

By |

జమ్మూ కశ్మీర్‌లో పద్మావతుల బలిదానం

జౌహార్‌ అంటే అగ్గిని ఆలింగనం చేసుకునే ఆత్మశక్తి. జౌహర్‌ అంటే పరకీయుడి చెరలో పసిడిపాన్పుపై పడుకునే కన్న నిప్పుల నిచ్చెనలెక్కి స్వర్గారోహణం చేసే అత్యంత సాహసం. జౌహర్‌ అంటే రాణి పద్మిని, పద్నాలుగు వేల మంది మహిళలతో చిత్తోడ్‌ దుర్గంలో అగ్ని కీలల్లో నవ్వుతూ ఆహుతైపోయిన ఘట్టం. జౌహర్‌ అంటే పరకీయుడి నుంచి కాపాడుకునేందుకు రాణి కర్ణావతి చేసిన అపురూప త్యాగం. ఆధునిక యుగంలో అలాంటి జౌహర్‌ జమ్మూ కశ్మీర్‌లోనూ జరిగింది. దురదష్టం ఏమిటంటే ఇది పుస్తకాలకెక్కలేదు….

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఇక ‘రజనీ’ రాజకీయం – తమిళనాడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న శుభగడియలు వచ్చేశాయి. ‘ఆ దేవుడు శాశిస్తే…ఈ రజనీ పాటిస్తాడు’ అంటూ ఎప్పుడూ చెప్పే తమిళ తలైవర్‌ తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యత నేపథ్యంలో ఇప్పుడు సమయం వచ్చిందని భావించి క్రియాశీలక రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆయన ఎన్నో సార్లు రాజకీయాల్లోకి రావాలనుకొన్నా వెనకడుగు వేస్తూ వచ్చారు. ప్రాంతీయభావం ఎక్కువగా ఉన్న తమిళులు ఏ జాతీయ…

Read more »