Posts Tagged “06-12 August 2018”

పటాలం ప్రతిష్ఠిస్తున్న ప్రధాని

By |

పటాలం ప్రతిష్ఠిస్తున్న ప్రధాని

అంతా అనుకున్నట్లే పాకిస్తాన్‌ ఎన్నికలలో ఇమ్రాన్‌ఖాన్‌ విజేతగా నిలిచారు. కానీ విచ్చలవిడిగా రిగ్గింగ్‌, ఇతర అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఇమ్రాన్‌ దేశ నాయకత్వం అందుకోబోతున్నారు. క్రికెట్‌ పిచ్‌ నుంచి ప్రధాని పీఠానికి సాగించిన ప్రయాణంలో ఇమ్రాన్‌ అనేకసార్లు తనను తాను మార్చుకున్నారు. అనేక ముసుగులు తొడుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయోనని ఎదురు చూస్తున్నది. కారణం.. ఆయనకు ఉన్న గందరగోళ, సందిగ్ధ ధోరణి, అనుభవ లేమి. ఇందువల్ల ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న పాకిస్థాన్‌…

Read more »

ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?

By |

ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?

‘ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. మనం మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించాలా, వద్దా? అనే అంశం దగ్గరే ఊగిసలాడుతున్నాం!’ ఆ మధ్య ఒక మహిళా జర్నలిస్ట్‌ రాసిన వ్యాసంలో ఒలకబోసుకున్న ఆవేదన ఇది. శబరిమలైలోని స్వామి అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం గురించిన వివాదం కేరళ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ఆమె ఆ వ్యాసం రాశారు. మనం అంటే మొత్తం భారతదేశంలో మహిళల గురించి మాత్రం కాదు. ఇంతకీ అయ్యప్పస్వామి ఆలయంలోకి…

Read more »

మోదీ ఆఫ్రికా పర్యటన

By |

మోదీ ఆఫ్రికా పర్యటన

– రువాండాకు 2 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన మోదీ – ఉగాండా పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం – ఆఫ్రికా అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటన ఆఫ్రికా దేశాలతో భారత్‌ సంబంధాలను పటిష్టపరచే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజులపాటు మూడు ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. రువాండాతో ప్రధాని పర్యటన ప్రారంభమైంది. ఈ ఆఫ్రికా దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని మోదీయే. రువాండా దేశాధ్యక్షుడు పాల్‌ కాగెమే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం చెప్పారు. ఒకప్పుడు…

Read more »

ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రావణమాసం

By |

ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రావణమాసం

వేసవి ముగిసిన తరువాత వచ్చే మొదటి పవిత్ర మాసం శ్రావణమాసం. ఈ ఆగస్టు 12న ప్రారంభమయ్యే శ్రావణమాసం వచ్చే నెల 9తో ముగుస్తుంది. ప్రారంభ, ముగింపు దినాలు రెండూ ఆదివారాలే కావడం గమనార్హం. ఈ పవిత్ర మాసంలో ప్రతి ఇంటిలోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంటిలోని మహిళలు ప్రతిరోజూ తలంటు స్నానాలు చేస్తూ, నూతన వస్త్రాలు ధరించి, దైవపూజలు చేస్తూ, దేవాలయాలు సందర్శిస్తూ, దేవునికి ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూ నిత్యం ఉత్సాహంగా ఉంటారు. శ్రావణమాసం చంద్రుడి…

Read more »

మతమార్పిళ్లకు లైసెన్సు

By |

మతమార్పిళ్లకు లైసెన్సు

The Indian Church has reason to be glad that the Constitution of the country guarantees her an atmosphere of freedom and equality with other much stronger religious communities. Under this protection of this guarantee she is able, ever since independence, not only to carry on but to increase and develop her activity as never before…

Read more »

ఇమ్రాన్‌ పులి స్వారీ

By |

ఇమ్రాన్‌ పులి స్వారీ

పాకిస్తాన్‌ కొత్త ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణం చేయడానికి ముహూర్తం దాదాపు ఖరారయింది. అది భారత్‌, పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడానికి రెండు మూడు రోజుల ముందు. అంటే దాయాది దేశాల తలపులలో స్వాతంత్య్ర పోరాట జ్ఞాపకాలు రెపరెపలాడడానికి సిద్ధమవుతున్న తరుణం. ఆగస్టు 11న ఆయన ప్రమాణ స్వీకారం చేయవచ్చునని అంచనా. జూలై మధ్యలో జరిగిన పాకిస్తాన్‌ ఎన్నికల మీద ప్రపంచానికే సదభిప్రాయం లేదు. ఇలాంటి ఎన్నికల ఫలితాలు ఇమ్రాన్‌కు అనుకూలంగా వచ్చాయి. వీటిని గుర్తించబోవడం లేదని పాక్‌…

Read more »

ఈ పెంపు సజ్జ రైతులకు వరం

By |

ఈ పెంపు సజ్జ రైతులకు వరం

పంట మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా పంట సాగుకయ్యే ఖర్చుకు అదనంగా కనీసం 50 శాతం మేరకు తగ్గకుండా పెంచడం మనదేశ చరిత్రలో రైతుల సంక్షేమానికి చేపట్టిన మహత్తరమైన చర్య. ఇంతవరకు వరి, గోధుమ పంటలకు ఇస్తున్న ప్రాధాన్యానికి ధీటుగా ఈసారి మెట్ట ప్రాంత రైతులు సాగుచేసే చిరుధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధరలు గణనీయంగా పెంచటంతో ఆ ప్రాంత రైతాంగానికి చేయూత లభించినట్లయింది. వర్షాధార పంటలైన చిరుధాన్యాల (హైబ్రిడ్‌…

Read more »

నమస్కారం

By |

నమస్కారం

‘నమస్కారం చేయడానికి కూడా కొన్ని పద్ధతులున్నాయి’ అని నా చిన్నతనంలో మా తెలుగు టీచరు గారు అన్నారు. అయితే అప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించలేకపోయాను. మా మాస్టరు గారు క్లాసులోనికి రాగానే మేమందరం లేచి ‘నమస్కారం సార్‌!’ అని చెప్పి కూర్చునేవారం. కొందరు కొంటె పిల్లలు లేస్తున్నట్లు నటించేవారే కాని అసలు లేచేవారు కాదు. సమస్కారం పెట్టడం అయిపోగానే నేలమీద చతికిలపడి కూర్చునేవారం. ఆ రోజుల్లో డెస్కులు, బెంచీలు లేవు. ఒకరోజు మేం అలా నమస్కారం…

Read more »

సెటిలర్లకూ టిక్కెట్లు

By |

సెటిలర్లకూ టిక్కెట్లు

– టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దాపై పోరాటం చేయాలని సిడబ్ల్యూసిలో నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోని సెటిలర్లు సానుకూలంగా మారే అవకాశం ఉందని టిపిసిసి వర్గాలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో సెటిలర్లలో ఎక్కువమంది టిడిపి, బిజెపి కూటమికి మద్దతు ఇవ్వడం వల్లనే గ్రేటర్‌ పరిధిలో ఆ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని టిపిసిసి అంచనా వేస్తోంది. ఒక రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతామని తెలిసినా మాట నిలబెట్టుకొని తెలంగాణ ప్రత్యేక…

Read more »

ఎవరిది యూటర్న్‌ ?

By |

ఎవరిది యూటర్న్‌ ?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏ వ్యక్తికైనా ఎదుటివారిపై అసహనం పెరుగుతోందంటే వారి మీద ద్వేషం అయినా ఉండాలి లేక ఎదుటి వారి ముందు ఓడిపోతామన్న భయం అయినా ఉండాలి. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి రెండవ కోవకు చెందినదిగా కనపడుతోంది. జగన్‌, పవన్‌లు పాదయాత్రలు ప్రారంభించినప్పటి నుండి చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది. గత సంవత్సరం మొత్తం చంద్రబాబు, ఆయన తమ్ముళ్లు జగన్‌ను విమర్శించారు. కన్ను మూసినా తెరచినా నిత్యం వారి శక్తిని జగన్‌ను విమర్శించడానికే వినియోగించారు….

Read more »