Posts Tagged “04-10 March 2019”

మహిళాశక్తికి జేజేలు

By |

మహిళాశక్తికి జేజేలు

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ‘ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది’ అన్నారు గురజాడ. రాజకీయ రంగంలో, పరిపాలనా రంగంలో, వాణిజ్యరంగంలో, సాహిత్య విద్యారంగాలలో, కళలో మహిళ కూడా తన స్థానం తను పొందగలిగితే ఈ చరిత్ర కొత్త మలుపు తిరుగడం ఇక ఒక లాంఛనమే మరి! భారత దేశంలోనే కాదు, ప్రపంచ జనాభాలోను మహిళల సంఖ్య దాదాపు పురుషులతో సమం. వారి సామర్థ్యం కూడా పురుషులతో సమానమేనని విశ్వం మొత్తం అంగీకరిస్తున్నది. కానీ చాలా ఆదర్శాలు…

Read more »

ఆర్థిక స్వాతంత్య్రమే సాధికారతకు తొలి అడుగు

By |

ఆర్థిక స్వాతంత్య్రమే సాధికారతకు తొలి అడుగు

మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తేనే సాధికారత సాధ్యమవుతుందని అంటున్నారు పల్లవి ఆకురాతి (ఐఎఎస్‌). మహిళలకు చదువుకునే అవకాశం వచ్చింది. కానీ నేడున్న సామాజిక వాతావరణం ఆ అవకాశం దక్కకుండా అడ్డుపడుతోందని పల్లవి భావన. యాభయ్‌ శాతం రిజర్వేషన్లు మహిళల అన్ని సామాజిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారమని పల్లవి అంటున్నారు. పల్లవి పదహారణాలా తెలుగు మహిళ. తెలుగు మీడియంలో చదివి ఐఎఎస్‌ అయ్యారు. కర్ణాటక కేడర్‌కు చెందిన పల్లవి ప్రజల అధికారిగా పేరు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా…

Read more »

సౌదీ యువరాజు పర్యటన ఒకపక్క మోదం – మరోపక్క ఖేదం

By |

సౌదీ యువరాజు పర్యటన  ఒకపక్క మోదం – మరోపక్క ఖేదం

ఉగ్రవాద దాడి నేపధ్యంలో సౌదీ అరేబియాతో పాటు జారీ చేసిన సంయుక్త ప్రకటనలో పాకిస్తాన్‌ పేరు చేర్చలేకపోయారంటూ విమర్శకులు మోదీని నిలదీయవచ్చు. అయితే ప్రధాని చూపిన దౌత్యపరమైన చతురత వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. కానీ పాకిస్తాన్‌కు ఆర్ధిక సహాయం అందించబోమని హామీ ఇవ్వడంలో సౌదీ యువరాజు విఫలమయ్యారని చెప్పక తప్పదు. పుల్వామా ఉగ్రదాడి తరువాత మన దేశ పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఏం చెపుతారోనని రాజకీయ…

Read more »

పోటెత్తుతున్న సాగరం.. పొంచి ఉన్న ప్రమాదం

By |

పోటెత్తుతున్న సాగరం.. పొంచి ఉన్న ప్రమాదం

పర్యావరణం దృష్ట్యా భూ ఉపరితల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తున్నాయి. అవి భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న పెనుతుఫానులు, సునామీలు కావచ్చు. అయితే మన తరువాత తరాలవారు ఎదుర్కొనబోయే పరిణామాలు మాత్రం చాలా ఘోరంగానే ఉంటాయి. భూ ఉపరితల వాతావరణం పెరుగు తూండడంతో ఒకపక్క ధృవాల మధ్య, అతిశీతల ప్రాంతాలలో మంచు కరుగుతూండడం, మరోపక్క సముద్రజలాలు వేడెక్కి వ్యాకోచించడం వలన 1992 నుంచి సగటున ఏడాదికి సముద్రమట్టం…

Read more »

మరో మోతాదు

By |

మరో మోతాదు

ఇది ప్రతీకారం కాదు. మత ఛాందసం నెత్తికెక్కిన ఉగ్రవాద మూకలకు భారత్‌ చెప్పిన మరో గుణపాఠం. ఫిబ్రవరి 26 వేకువన భారత వైమానిక దళ విమానాలు అధీన రేఖను దాటి జైష్‌ ఎ మహమ్మద్‌ కీలక శిబిరం మీద దాడి చేశాయి. అందిన సమాచారాన్ని బట్టి ఇది చావుదెబ్బ. ఈ మాట మన అధికారులు చెప్పలేదు. ఇలాంటి భీకర దాడి ఒకటి జరిగినట్టు పాకిస్తాన్‌ అధికారులు ఆగమేఘాల మీద చేసిన ట్వీట్‌తో లోకానికి తెలిసింది. చాలా నష్టం…

Read more »

కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

By |

కన్నుమూసిన ‘గోల్కొండ సింహం’

ముస్లిం ఇలాకా పాతబస్తీలో గర్జించిన హిందూ సింహం తన యాత్రను ముగించింది. హిందూజాతి కోసం.. హిందువుల మనుగడ కోసం తన తరంలో చేసిన యుద్ధం ఇక చాలంటూ శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ‘కార్వాన్‌ టైగర్‌’, ‘గోల్కొండ సింహం’.. అభిమానులు, అనుచరులు ఎలా పిలుచుకున్నా నేనున్నానంటూ అండగా నిలిచిన ఓ భరోసా కానరాని తీరాలకు పయనమైంది. హైదరాబాద్‌లో బీజేపీకి, హిందూ సమాజానికి అండగా నిలిచిన బద్ధం బాల్‌రెడ్డి అనారోగ్యంతో అస్తమించారు. కార్వాన్‌ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించారు…

Read more »

సప్తస్వరాల సర్వస్వం

By |

సప్తస్వరాల సర్వస్వం

కర్ణాటక సంగీత కోశం (ఎన్‌సైక్లోపీడియా అప్‌ కర్ణాటక మ్యూజిక్‌) అనే గ్రంథాన్ని ఆసాంతం చదవడానికి ఒకవారం రోజులు, ఆకళింపు చేసుకొనడానికి మరోవారం పట్టింది. పుస్తకంలోని విషయానికి తగ్గట్టుగా (కాకతీయ శిల్పం) ముచ్చటగా ఉంది పుస్తకం పైన అట్ట. దక్షిణాది సంగీతానికి సంబంధించిన ఒక విలక్షణ గ్రంథం ఇది. లక్ష్య సంగీతానికి (ప్రాక్టికల్‌) సంబంధించినవి – గీతాలు, వర్ణాలు, కీర్తనలు, కృతులు మొదలైన రచనలతో కూడినవి – స్వర సహితంగా ఉన్న పుస్తకాలు విరివిగా ఉన్నాయి. ఇక లక్షణ…

Read more »

ఏ దేశంలో నివసిస్తే ఆ దేశపు చట్టాలనే అనుసరించాలి

By |

ఏ దేశంలో నివసిస్తే ఆ దేశపు చట్టాలనే అనుసరించాలి

ఇమామ్‌ షేక్‌ మహమ్మద్‌ తావిదితో ఇంటర్వ్యూ… ఇస్లాంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశిస్తున్న ఇమామ్‌ షేక్‌ మహమ్మద్‌ తావిది ఇరాన్‌లో జన్మించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. ఆయన విద్యావేత్త, మేధావి, చక్కని వక్త. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాంలో సంస్కరణల కోసం శ్రమిస్తున్న వారిలో తావిది ఒకరు. ముఖ్యంగా తీవ్రవాదం నశించాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తావిది వాషింగ్టన్‌ డి.సి. కేంద్రంగా పని చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇస్లాం సమావేశాలు జరిగినా ఇస్లాం సమాజం తరఫున…

Read more »

కేంద్రం ఇవ్వందే భారీ బడ్జెట్‌ సాధ్యమా?

By |

కేంద్రం ఇవ్వందే భారీ బడ్జెట్‌ సాధ్యమా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ అనేక తాయిలాలతో 2 లక్షల 26 వేల 177 కోట్లతో భారీ బడ్జెట్‌ను ఫిబ్రవరి 5 న శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గంటకు పైగా బడ్జెట్‌ ప్రసంగం చేసి అనేక అతిశయోక్తులు పలికారు. పనిలో పనిగా ‘విభజన వల్ల నష్ట పోయాము, కేంద్రం ఎలాంటి సహాయం అందిచ లేదు’ అని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఏమీ ఇవ్వకపోతే ఇంతటి భారీ బడ్జెట్‌కు రూపకల్పన ఏలా చేయగలిగారు? ఈ…

Read more »

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

By |

ఇంద్రియాలు-మానవ విజ్ఞానము

ఇక్కడి నుంచీ సృష్టిమార్గమే మారింది. సృష్టిలో ఒక నూతన ఆధ్యాయం ప్రారంభించింది. పశుపక్ష్యాది జీవరాసులు సృష్టిని మార్చే ప్రయత్నం చేయలేదు. సృష్టిలో లభించినవాటితో జీవించేవి. కాని మానవుడు వచ్చిన తర్వాత సృష్టినే మార్చడానికి పూనుకున్నాడు. అరణ్యాలు తీసివేసి నగరాలు నిర్మించాడు; భూమిని చీల్చి పైర్లు, ఫలవృక్షాలు పెంచాడు. యంత్రాలు నిర్మించి కాలదూరాలు నిర్జించాడు. పరిసరాలకు అనుకూలంగా మారడమే మానవ పూర్వ ప్రాణి వర్గాల జీవన మార్గమయితే, తనకనుకూలంగా పరిసరాలు మార్చుకోవడం మానవ జీవనమార్గం అయింది. అది సృష్టిలో…

Read more »