Posts Tagged “02-08 July 2018”

అది దుష్ప్రచారం

By |

అది దుష్ప్రచారం

ఇటీవల అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సి (సి.ఐ.ఎ) వరల్డ్‌ ఫ్యాక్ట్స్‌ బుక్‌ తాజా సంచికలో విశ్వహిందూ పరిషత్‌, బజరంగదళ్‌ సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పేర్కొనడం వారి అవగాహనా రాహిత్యం మాత్రమే కాక, పక్షపాత ధోరణితో కూడుకొన్న దుష్ప్రచారం కూడా. 50 లక్షల మంది కఠోర పరిశ్రమ చేయగలిగిన సభ్యులు కలిగిన శక్తివంతమైన యువకుల సంస్థ బజరంగదళ్‌ను కలుపుకుని సుమారు కోటి మందికి పైగా సభ్యులు కలిగిన సంస్థ విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి). ఇది సన్యాసుల,…

Read more »

అందరికీ విద్యుత్‌

By |

అందరికీ విద్యుత్‌

స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 ఏప్రిల్‌ 2018కి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించే పని ఆ రోజున సాకారమైంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలకు గానీ ఈ పని పూర్తిచేయలేకపోయాం. అది కూడా నరేంద్ర మోదీ నేతత్వంలో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జరిగింది. 2014 మేలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి దేశంలోని మొత్తం 5.97 లక్షల గ్రామాల్లో 18,400 గ్రామాలు…

Read more »

ముగిసిన సంకీర్ణం – దేనికి సంకేతం ?

By |

ముగిసిన సంకీర్ణం – దేనికి సంకేతం ?

రంజాన్‌ కాల్పుల విరమణ తరువాత తన చర్యలను ముమ్మరం చేసిన సైన్యం జైషే మహమ్మద్‌ తీవ్రవాదులిద్దరిని మట్టుపెట్టింది. రాష్ట్రంలో గవర్నర్‌ పాలన ఉండటం వలన సైన్యానికి స్వేచ్ఛగా తీవ్రవాదులను ఏరివేసే అవకాశముంది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వెంటనే ఎన్నికలు జరపాలని కోరింది. కాని బిజెపి రాష్ట్రంలో గవర్నర్‌ పాలనకే మొగ్గు చూపింది. జమ్మూకశ్మీర్‌లో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మాట్లాడుతూ ‘ఇక జమ్మూకశ్మీర్‌లో పిడిపితో కలిసి అధికారం పంచుకోవడం…

Read more »

ఇది విపక్షాల గెరిల్లా యుద్ధమే !

By |

ఇది విపక్షాల గెరిల్లా యుద్ధమే !

ధైర్యంగా ఎదురుగా నిలిచి శత్రువుతో యుద్ధం చేయలేని వారిలో తెలివైన వారు దొంగచాటుగా యుద్ధం చేస్తుంటారని, దానిని గెరిల్లా యుద్ధమని అంటారని మనకు తెలుసు. ఇటువంటి విషయాలలో బాగా నిపుణులైన వారు అనుసరించే పద్ధతిని ‘వేయి గాయాలు చేయి, రక్తంకారి చావనీయి (Death by thousand cuts to bleed the enemy) అనే మాటలలో వ్యక్తీకరిస్తారు. నరేంద్రమోదీని ప్రత్యక్షంగా ఎదిరించి, నిలువజాలమని గ్రహించిన ప్రతిపక్షాల వారు, మేధావులు, మీడియాలోని ఒకవర్గంవారూ ఇప్పుడు ఈ విధానాన్ని అనుసరించాలని…

Read more »

దేశ సమైక్యతలో సమిధ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ

By |

దేశ సమైక్యతలో సమిధ శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ

జూలై 06 డా|| శ్యామప్రసాద్‌ ముఖర్జీ జయంతి ప్రత్యేకం బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇచ్చే ముందు అఖండ భారతావని ముక్కలు చేసి పాకిస్తాన్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ పాకిస్తాన్‌ పుట్టక ముందే దాన్ని చీల్చడంలో సఫలీకతు డయ్యారో నాయకుడు. పశ్చిమ బంగ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్‌లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే. తర్వాత కాలంలో జమ్మూ కశ్మీర్‌ విషయంలో ‘ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌…

Read more »

ఎమర్జన్సీ ప్రసాదం

By |

ఎమర్జన్సీ ప్రసాదం

పెక్యులరిజం – 2 1948 నవంబర్‌ 15 సోమవారం. భారత రాజ్యాంగ నిర్ణయ సభ న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ హాలులో ఉదయం 10 గంటలకు కొలువుతీరింది. ఉపాధ్యక్షుడు డాక్టర్‌ హెచ్‌.సి.ముఖర్జీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. స్వతంత్ర భారతావని కోసం తయారవుతున్న నూతన రాజ్యాంగం ముసాయిదాపై క్లాజుల వారీగా చర్చ కొనసాగుతున్నది. ‘ఇప్పుడు సవరణలలోకి వెళదాం. సవరణ నెంబర్‌ 98. ప్రొఫెసర్‌ కె.టి.షాది’ అని అధ్యక్షులు పిలవగానే బిహార్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ కె.టి.షా లేచి- ‘మొట్టమొదటి అధికరణంలోని మొదటి క్లాజులో…

Read more »

ఉగ్రనిరోధ వ్యతిరేక శక్తులను నిలువరిరచాలి

By |

ఉగ్రనిరోధ వ్యతిరేక శక్తులను నిలువరిరచాలి

జమ్ము కశ్మీర్‌ విషయంలో జాతి వ్యతిరేక శక్తుల ఆట మళ్లీ మొదలైరది. జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లరఘన జరుగుతోరదన్న ఐరాస ప్రకటన ఈ క్రీడలో భాగమే. క్షేత్రస్థాయిలలో స్వీయ విచారణ, వాస్తవ పరిస్థితుల నిర్ధారణ లేకురడా ఐరాసలోని అమెరికా దౌత్యాధికారి నిక్కీ హేలి నివేదిక ఆధారంగా ఐరాస ఈ ప్రకటన విడుదల చేయడం ఆక్షేపణీయం. దశాబ్దాల తరబడి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు, అక్రమ చొరబాటుదారులు జమ్ము కశ్మీర్లో జరుపుతున్న మారణకారడపై ఏనాడూ పల్లెత్తు మాట అనని ఐరాస…

Read more »

మనిషిలో దైవత్తం ఉదయిస్తేనే పుడమిపై స్వర్గం సాధ్యమౌతుంది

By |

మనిషిలో దైవత్తం ఉదయిస్తేనే పుడమిపై స్వర్గం సాధ్యమౌతుంది

గాయత్రీ పరివార్‌ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్‌ ‘అశ్వినీ’ సుబ్బారావు పసివాడిలోని అమాయకత్వం, ఉద్యమశీలిలోని పట్టుదల, వాణిజ్య వేత్తలోని సామర్థ్యం, పెద్దన్నయ్యలోని ప్రేమతో కూడిన గదమాయింపు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక చైతన్యం నుంచే ఆర్ష భూమి అభ్యుత్థానం ఉందన్న అపారమైన నమ్మకం, ఆ దిశగా మాటలతో సరిపెట్టుకోకుండా ఆచరణ దిశగా వడివడి నడకలు నడిచే దృఢ సంకల్పం. ఇవన్నీ కలగలిస్తే అశ్విని సుబ్బారావు అవుతారు. అశ్విని ఉత్పాదనలతో ఆరోగ్యాన్ని కాపాడే అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా దక్షిణాదిలో గాయత్రీ…

Read more »

మెంటా మస్తాన్‌రావుకు నివాళి

By |

మెంటా మస్తాన్‌రావుకు నివాళి

విశ్వహిందూపరిషత్‌ జ్యేష్ఠ కార్యకర్త మెంటా మస్తాన్‌రావు 83 సంవత్సరాల వయస్సులో 2018 జూన్‌ 18 ఉదయం 9 గంటలకు విజయవాడలోని వారి స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. మస్తాన్‌రావు గత 40 సంవత్సరాలుగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కోశాధ్యక్షులుగా, విజయవాడ మహానగర్‌ అధ్యక్షులుగా, శ్రీ సత్యనారాయణ సేవా సమితికి కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వహిందూ పరిషత్‌ని బలోపేతం చేయడం, కార్యకర్తలకు దిశానిర్దేశం ఇవ్వడంలో మంచి కృషి సల్పినట్లు అఖిల భారత వి.హెచ్‌.పి. సంయుక్త ప్రధాన కార్యదర్శి వై.రాఘవులు…

Read more »

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి

By |

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి

సై అంటే సై అంటున్న నేతలు తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సై అంటున్నారు సిఎం కెసిఆర్‌. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న ప్రచారం ఊపందుకోవడంతో కెసిఆర్‌ కూడా కదన రంగంలో కాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి సవాలుకు కాంగ్రెస్‌ కూడా దీటుగానే స్పందించింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కెసిఆర్‌ సవాల్‌కు సై అన్నారు. తాము ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే అని…

Read more »