26/11 గాయానికి పదేళ్లు

26/11 గాయానికి పదేళ్లు

నిత్యం ఉరుకులు పరుగులు తీసే ముంబైపై ఆ పూట ఒక్కసారి పెను ఉత్పాతమే విరుచుకుపడింది. 2008 నవంబర్‌ 26 తేదీ రాత్రి 8 గంటల సమయంలో సముద్ర మార్గంలో ఓ చేపల వేట బోటు ద్వారా 10 మంది సాయుధులు ప్రవేశించారు. వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు మొదలు పెట్టారు. వచ్చిన వారు ఉగ్రవాదులేనని స్పష్టమైపోయింది. వెంటనే పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.

26 నవంబర్‌, 2008.

భారతదేశ చరిత్రలో మరో మాయని గాయంగా మిగిలిపోయిన తేదీ. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై హేయమైన దాడులకు తెగించడం ద్వారా మన దేశ భద్రతకే సవాలు విసిరింది పాకిస్తాన్‌. ఆనాటి భయోత్పాతాన్ని తలచుకొని నేటికీ వణికిపోతున్నారు ముంబై వాసులు. ఈ ఘోర ఘటన జరిగి పదేళ్లవుతున్న సందర్భంలో ఆనాటి గాయాన్ని గుర్తు చేసుకొని, ఘటనలో ఉగ్ర తూటాలకు బలైన అమరులకు శ్రద్ధాంజలి ఘటిద్దాం.

నిత్యం ఉరుకులు పరుగులు తీసే ముంబైపై ఆ పూట ఒక్కసారి పెను ఉత్పాతమే విరుచుకుపడింది. 2008 నవంబర్‌ 26 తేదీ రాత్రి 8 గంటల సమయంలో సముద్ర మార్గంలో ఓ చేపల వేట బోటు ద్వారా 10 మంది సాయుధులు ప్రవేశించారు. వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు మొదలుపెట్టారు. వచ్చిన వారు ఉగ్రవాదులేనని స్పష్టమైపోయింది. వెంటనే పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. నగరమంతా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి, దాడులు జరుగుతున్న ప్రాంతాలను చుట్టుముట్టాయి.

ఉగ్రవాదులు దక్షిణ ముంబైలో ఎనిమిది చోట్ల దాడులకు తెగించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ మరియు టవర్‌, లియోపాల్డ్‌ కేఫ్‌, కామా హాస్పిటల్‌, యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్‌ హౌస్‌, మెట్రో సినిమా హాల్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆఫీస్‌ బ్యాంక్‌ స్ట్రీట్‌ మరియు సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలపై ఈ దాడులు జరిగాయి. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్‌లో మరియు విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి. మగ, ఆడ, శిశువు, ముసలి, ముతకా అనే తేడా లేకుండా దొరికిన వారందరినీ ఉగ్రవాదులు కాల్చి చంపారు.

26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు ఈ దారుణ హత్యాకాండ జరిగింది. ఈ దాడిలో 173 మంది మరణించగా 308 మంది గాయాల బారిన పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులు దాడులకు దిగినా, భారత పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఎదురు తిరిగి పోరాడాయి. తాజ్‌ ¬టల్‌లో దాడి చేసిన వారిని పట్టుకోవడానికి నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ రంగంలోకి దిగి, ఆపరేషన్‌ బ్లాక్‌ టొర్నడోని ప్రారంభించాయి.

బయటపడ్డ పాకిస్తాన్‌ పాత్ర

భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులంతా చనిపోగా, అజ్మల్‌ కసబ్‌ మాత్రమే సజీవంగా పట్టుబడ్డాడు. ఇంతటి దారుణ మానవ హననానికి పాల్పడటం పట్ల అతని ముఖంలో ఏ మాత్రం విచారం కనిపించలేదు. ఈ దారుణానికి పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఐఎస్‌ఐ ప్రేరిత లష్కర్‌ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థ కారణమని ప్రాథమిక విచారణలో తెలిసిపోయింది. కానీ కసబ్‌ తమ పౌరుడు కాదని పాకిస్తాన్‌ బుకాయిస్తూ వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం 21 నవంబరు 2012 న పూణెలోని ఎరవాడ జైలులో కసబ్‌ని ఉరితీశారు. భారత ప్రభుత్వం ముంబై దాడుల్లో పాకిస్తాన్‌ ప్రమేయంపై ఆధారాలు చూపించినా, అవి సరైనవి కాదంటూ నిరాకరిస్తూ వచ్చింది.

మరో పాత్రధారి హెడ్లీ

ఈ ఘటనలో మరో పాత్రధారి పాకిస్తాన్‌ సంతతికి చెందిన అమెరికా వాసి డేవిడ్‌ హెడ్లీ. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా పని చేసిన ఇతనికి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. ముంబైలో దాడులకు ముందు రెక్కీలు నిర్వహించడంలోనూ వారికి సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు తీసుకున్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టునుంచి పాకిస్తాన్‌కు వెళ్తుండగా హెడ్లీ పట్టుబడ్డాడు. అయితే అతన్ని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించలేదు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి హెడ్లీ అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

అవును మా పనే అది : నవాజ్‌ షరీఫ్‌

ముంబై మారణ¬మం వెనుక ఉన్నది పాకిస్థానే అని స్వయంగా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇటీవల డాన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ దేశంలో ఉగ్రవాద సంస్థలు చురుగ్గా ఉన్నాయని, వాటికి ప్రభుత్వాల మద్దతు కూడా ఉందని స్పష్టం చేశారు. అలా లేకపోతే.. సరిహద్దులు దాటి వెళ్లి ఏకంగా 150 మందికి పైగా ప్రజలను ఎలా చంపుతారని ఆయన ప్రశ్నించారు. రావల్పిండిలోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ నిలిచిపోవడాన్ని నిశితంగా విమర్శించారు. స్వయంగా పాక్‌ మాజీ ప్రధానే 26/11లో తమ దేశ పాత్రను అంగీకరించ డంతో ఆ దేశ నగ్నస్వరూపం ప్రపంచానికి మరింత స్పష్టంగా కనిపించింది. నవాజ్‌ షరీఫ్‌ తమ దేశ పాత్రను బయట పెట్టినందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అతనిపై కన్నెర్ర చేసింది. షరీఫ్‌తో పాటు మరో మాజీ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ, డాన్‌ పత్రిక అసోసియేట్‌ ఎడిటర్‌ సిరిల్‌ అల్మైదాలపై రాజద్రోహ కేసులు మోపింది. షరీఫ్‌ సునిశితమైన భద్రతా రహస్యాలను తన ఇంటర్వ్యూలో బయట పెట్టడం ద్వారా దేశాన్ని అపఖ్యాతిపాలు చేశారని ఆరోపించింది.

లఖ్వీకి పాక్‌ జైలులో రాజభోగాలు

ముంబై దాడులకు వెనుక పాకిస్తాన్‌ పాత్ర ఉందని యావత్‌ ప్రపంచానికి తెలిసిపోవడంతో ఆ దేశం తమ దేశంలోని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. దాడుల పాత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్‌ చీఫ్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీని 2009లో రావల్పిండి జైలులో బంధించింది. అయితే అక్కడ అతనికి వీవీఐపీ ¬దా ఇవ్వడం విశేషం. లఖ్వీ జైలులో ఉండగానే తన చిన్న భార్య ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. అంతేకాదు జైలులో ఉంటూనే మొబైల్‌ ఫోన్‌ ద్వారా బయటి ప్రపంచంతో తన కార్యకలా పాలు సాగించాడు. లఖ్వీ మొబైల్‌ సౌకర్యాన్ని తొలగిం చాలన్న అమెరికా అభ్యర్థనను ఏకంగా పాకిస్తాన్‌ ఆర్మీ నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. పైగా జైలుకు వచ్చే ఉగ్రవాద మూకలతో లఖ్వీ భేటీలు నిర్వహించేందుకు అధికారులు సహకరించారు.

1993లోనే ఘోరకలి

ముంబైకి 26/11 దాడులు కొత్త కాదు. 1993వ సంవత్సరంలో ముంబై (అప్పట్లో బొంబాయి) నగరంలో 13 చోట్ల వరుసగా బాంబులు పేలాయి. ఆ ఘటనల్లో 800 మందికి పైగా పౌరులు చనిపోగా 1500 మంది గాయపడ్డారు. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సహకారంతో పాకిస్తాన్‌ ఈ దారుణానికి పాల్పడింది. దాడులు జరగగానే దావూద్‌ పాకిస్తాన్‌ పారిపోయి తలదాచుకున్నాడు. దావూద్‌ కరాచీ నగరంలో ఉన్నట్లు తెలుస్తున్నా అతను తమ దేశంలో లేడని పాకిస్తాన్‌ ఇప్పటికీ బుకాయిస్తూనే ఉంటుంది.

ముంబై మహానగరంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌ చేపట్టిన ఈ తరహా ఉగ్రవాద ఘటనల్లో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాకిస్తాన్‌ను ఉద్రవాద దేశంగా ప్రకటించేందుకు ఆధారాలు ఉన్నా చైనా లాంటి దేశాలు అడ్డుపడుతూ వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఉగ్రవాద దాడులు మన దేశ భద్రతకే సవాలు విసిరాయి. మన ఆంతరంగిక భద్రత, నిఘా వ్యవస్థ లను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశాయి.

– క్రాంతి దేవ్‌ మిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *