సేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలోసేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలో సవాళ్ళు, అవకాశాలు

సేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలోసేంద్రియ వ్యవసాయ పరిశోధన, విస్తరణలో సవాళ్ళు, అవకాశాలు

ప్రస్తుతం మన దేశంలో సేంద్రీయ వ్యవసాయంపై జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా లేవు. దీనిపై అవగాహన కల్పించే విద్యా విధానాలు అమలు కాకపోవడం శోచనీయం. అనేక విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణను కొనసాగిస్తున్నప్పటికీ వాటికి ఉన్న వనరులు చాలా పరిమితమైనవే. వ్యవసాయంలో ఉత్పాదకత, లాభాలు ఉండాలంటే దీర్ఘకాలం ఓ విధానంపై పరిశీలన చేయవలసి ఉంటుంది. అందుకు తగిన పరిశోధన, ప్రణాళిక కూడా తప్పనిసరి.

నేడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయం, సేంద్రియ ఆహారం పట్ల క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక వ్యవసాయం (రసాయన విధానం) ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సేంద్రీయ పద్ధతుల్లో పరిష్కారం లభిస్తుండడమే. ముఖ్యంగా వ్యవసాయంలో వాతావరణ మార్పులు, నీరు-నేల స్వభావం, జీవ వైవిధ్యం వంటి పర్యావరణపరంగా ఎదురయ్యే ఇబ్బందులను సేంద్రీయ విధానం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. అంతే కాకుండా నాణ్యమైన ఆహారోత్పత్తులను అందజేస్తుంది. మన దేశంలోని రైతులు సేంద్రీయ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి, గ్రామాభివృద్ధికి, పశు సంపదను పెంపొందించు కోవడానికి ఈ విధానాన్ని అందిపుచ్చుకోవలసిన అవసరం ఉంది. అందుకు సేంద్రీయ వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించడంతోపాటు, తగిన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలను అందుబాటులో ఉంచాలి.
వాస్తవానికి ప్రస్తుత బయోటెక్‌ విధానంలో వ్యవసాయ పరిశోధనలకు అందుతున్న నిధులు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది, ప్రైవేటు పెట్టబడులు తదితరాలు సేంద్రీయ వ్యవసాయ పరిశోధనలకు సమకూరడం లేదనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ-ప్రైవేటు రంగాల్లో ఆదరణ కూడా అంతంత మాత్రమే. కాని భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయంపై పరిశోధనలు ఎంతో ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. వైవిధ్య భరితమైన వాతావరణ పరిస్థితులు భారతదేశానికి సొంతం.
ప్రస్తుతం మన దేశంలో సేంద్రీయ వ్యవసాయంపై జరుగుతున్న పరిశోధనలు ఆశాజనకంగా లేవు. దీనిపై అవగాహన కల్పించే విద్యా విధానాలు అమలు కాకపోవడం శోచనీయం. అనేక విశ్వవిద్యాలయాలు రాష్ట్ర స్థాయిలో సేంద్రీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణను కొనసాగిస్తున్నప్పటికీ వాటికి ఉన్న వనరులు చాలా పరిమితమైనవే. వ్యవసాయంలో ఉత్పాదకత, లాభాలు ఉండాలంటే దీర్ఘకాలం ఓ విధానంపై పరిశీలన చేయవలసి ఉంటుంది. అందుకు తగిన పరిశోధన, ప్రణాళిక కూడా తప్పనిసరి. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ కీలకాంశాలుగా ఉంటూ, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా ఉండే పరిశోధన నమూనా దీనికి అవసరం ఉంటుంది. ఈ విషయాలలో సేంద్రీయ వ్యవసాయ పరిశోధన  ఎక్కువ సవాళ్ళతో కూడినదని చెప్పక తప్పదు.

సంప్రదాయ, సేంద్రియ విధానాలు – లక్షణాలు

సేంద్రీయ, సంప్రదాయిక (రసాయన) వ్యవసాయంపై ప్రయోగాలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా పరస్పర విరుద్ధ స్వభావాలతో కూడుకుని ఉంటాయి. సేంద్రీయ వ్యవసాయం రైతుకు సహాయకారిగా ఉండగా, సంప్రదాయిక వ్యవసాయం వాణిజ్య అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సేంద్రీయ వ్యవసాయం కేంద్రీకత విధానం కావడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు న్నాయి. కాని సంప్రదాయ వ్యవసాయంలో ఆ అవకాశం లేదు. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయం పోటీని పెంచుతుంది. సంప్రదాయిక వ్యవసాయం ద్వారా వర్గాల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాము. రెండింటి పరిధిలో కూడా వ్యత్యాసం ఎక్కువే. సంప్రదాయిక వ్యవసాయంతో పోలిస్తే సేంద్రీయ వ్యవసాయానికి పరిధి ఎక్కువనే చెప్పుకోవాలి. సేంద్రీయ వ్యవసాయం ప్రకతిపె ఆధారపడి ఉంటుంది. ఇందుకు పర్యావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే తక్కువ పరిధి ఉన్న సంప్రదాయిక వ్యవసాయంతో పోలిస్తే ఎక్కువ పరిధి ఉన్న సేంద్రీయ వ్యవసాయం ఉత్తమ ఫలితాలను ఇవ్వాలంటే ఎక్కువ పరిశోధనలు చేయాల్సి ఉంది.

లక్ష్యం

సేంద్రీయ వ్యవసాయ అసలైన లక్ష్యం సేంద్రీయ సూత్రాలు, వినూత్నమైన సంప్రదాయాలు, మార్కెటింగ్‌, పారదర్శకమైన సమగ్రత, పరస్పర సహకారం, సంపూర్ణ వ్యవస్థలు, సరైన వ్యయ గణనల ద్వారా నిరంతర వ్యవసాయానికి, మార్కెట్‌ అభివద్ధికి తోడ్పాటును అందించడమే. స్థానిక అవసరాలను బట్టి ఫలితాలను పొందడానికి సేంద్రీయ వ్యవసాయం ఎంతో సహాయకారిగా ఉంటుంది. నిరంతర అభివద్ధి అనే నూతన సంప్రదాయానికి పునాదులను కూడా వేస్తుంది. తద్వారా ప్రైవేటు సంస్థలు, వాటాదారులు కూడా లబ్ది పొందుతారు.
సేంద్రియంలో లాభాలు ఎక్కువ
ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానాలకు సేంద్రీయ వ్యవసాయాన్ని జోడించగలిగితే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొవడానికి ఆదర్శనీయమైన విధానంగా నిలుస్తుంది. అంతే కాకుండా వ్యవ సాయార్థిక అంశాలు, అత్యధిక కార్మికుల అవసరం, ఉత్పత్తి, లాభాలపై ప్రభావం చూపుతుంది. సేంద్రీయ వ్యవసాయంపై అధిక పరి శోధనలు వ్యవసాయంలో ఆర్థికపరమైన పోటీతత్వాన్ని పెంచుతాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయిక విధానాలు వాణిజ్యపరమైనవి కావడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఈ సంప్రదాయ విధానంలో ఎక్కువమంది ఒకే రకమైన ఆహారోత్పత్తులను పండించడంతో వాటి ధరలు పడిపోతున్నాయి. సంప్రదాయ వ్యవసాయంతో పర్యావరణానికి కూడా హాని కలుగుతోంది. దీనివల్ల మానవ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం సమీప భవిష్యత్తులో లేకపోలేదు. కాబట్టి ఖచ్చితమైన వ్యయ గణనను పెంపొందించేందుకు, పెట్టుబడిదారులు లబ్ది పొందేందుకు, నిరంతర వ్యవసాయం కొనసాగడానికి సేంద్రీయ విధానాలే ఉత్తమంగా నిలుస్తాయి. అంతేకాకుండా నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు లభిస్తాయి. ధరల విషయంలో కూడా పూర్తి నియంత్రణను సేంద్రీయ వ్యవసాయం కలిగిస్తుంది. ఏదైమైనప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలో పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సంబంధిత అంశాలపై లోతుగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది

.

సేంద్రియ వ్యవసాయం – పరిశోధన, వ్యూహం

సేంద్రీయ వ్యవసాయంపై జరిగే పరిశోధనలు ప్రధానంగా మూడు అంశాలపై దష్టి సారించాలి. మొదటిది ప్రపంచవ్యాప్తంగా గ్రామాలలో సాగు భూములను పెంపొందించడం, రెండవది ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న వారి ఆహార అవసరాలను తీర్చడం, సహజ వనరుల పరిరక్షణకు కషి చేయడం. మూడవది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకోవడం.
మొదటి విధానంలో
– విలువ ఆధారిత ఆహార గొలుసులను సష్టించి వాటి నిర్వహణను మెరుగుపరిచేందుకు కషి చేయడం. దానివల్ల చిన్న తరహా ఆహార గొలుసుల ఆర్థిక సామర్థ్యం పెంచేందుకు వీలుపడుతుంది.
– సేంద్రీయ క్షేత్రాల పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థిరత్వాల మరింత మెరుగుదల,
– సేంద్రీయ ఉత్పత్తులను వినియోగించడంలో వినియోగదారుల ప్రాధాన్యాలు, అవరోధాల అధ్యయనం,
– స్థానిక అంశాల ఆధారంగా పథకాల అభివృద్ధి,
– సేంద్రీయ వ్యవసాయం చేసే వారికి సర్టిఫికెట్లను జారీ చేయడం ద్వారా గుర్తింపునిచ్చి ప్రోత్సహించడం.
రెండవ విధానంలో
– సేంద్రీయ పదార్థాల ద్వారా పంటకు లభిస్తున్న ఖనిజాలు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అంచనా వేయడం,
– పంట-పంటకు మధ్య కాలాన్ని లెక్కించడం, సేంద్రీయ పంటలను పెంపొందించడంపై దష్టి,
– సేంద్రియ క్షేత్రాల పునరుద్ధరణ, దిగుబడుల స్థిరత్వాన్ని మెరుగు పరుస్తూ, దిగుబడులలో సేంద్రియ, సాంప్రదాయ వ్యవసాయాల మధ్య అంతరాలను తగ్గించడం, మొక్కల ఆరోగ్యం, ఉత్పాదకత పెంచడం,
– సేంద్రియ సేద్యం కోసం పంటలు, పశువుల పెంపకం, పునరుద్ధరణపై దృష్టి.
– క్రియాత్మక వ్యవసాయ జీవ వైవిధ్యం : అంటే పంటలకు చీడలు కలిగించే క్రిమి కీటకాలను నిరోధించే పక్షులు, జంతువుల పెరుగుదలకు కావలసిన పరిస్థితులు మెరుగుపరచడం,
– నేల ఆరోగ్యం, భూసారం : దీనికోసం చిక్కుడు జాతి, స్థానిక మొక్కలు, ప్రయోజనకర భూ సూక్ష్మ జీవుల ద్వారా నేల ఆరోగ్యం, భూసారం నిర్మించడం, పంట మార్పిడి ద్వారా పోషక విలువల మెరుగుదల, ప్రత్యామ్నాయ పోషక వనరులు, పునర్వినియోగ ఉత్పత్తుల వినియోగం, వాతావరణ మార్పులను తట్టుకోవడాన్ని ప్రోత్సహించే నేలల నిర్వహణ మార్గాలు.
మూడవ విధానంలో
– సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రజల ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. జీవ వైవిధ్యానికి అధిక ప్రాధాన్యం లభిస్తుంది.
– సంప్రదాయ వ్యవసాయ విధానాలను నిషేధించాలి. తద్వారా కాలుష్య నివారణకు అవకాశాలు ఏర్పడతాయి. ఆహార నాణ్యత, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, వాతావరణ పరిస్థితులపై సానుకూల ప్రభావం ఉంటుంది.


 – సేంద్రీయ వ్యవసాయ పంటలు అంతర్జాతీయ ప్రమాణాలు, నిబంధనలకు  అనుగుణంగా ఆమోదం పొందేలా కషి చేయాలి. ఉత్పత్తులకు సంబంధించి తరచూ తనిఖీలు, వాటికి ధవీకరణలను ఇవ్వాలి. దానితో ఆహార భద్రత వ్యవస్థకు ఊతం లభిస్తుంది. మెట్రిక్‌ ఆధారిత ధవీకరణ పత్రాల వ్యవస్థకు మార్గం సుగమం అవుతుంది.
సేంద్రియ వ్యవసాయం – బలోపేతం చేసే చర్యలు

రైతు విద్య

సేంద్రీయ వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యంగా రైతులను చైతన్యపరచడం ఎంతో అవసరం. పెట్టుబడిదారులు, మార్కెట్‌తో రైతులు అనుసంధానమయ్యేలా చేయాలి. అందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలి. తద్వారా సేంద్రీయ వ్యవసాయం చేసే వారితోపాటు దానిపై ఆధారపడిన మార్కెట్‌, పెట్టుబడిదారులు, వినియోగదారులు అందరూ లబ్ది పొందుతారు.

నెట్‌వర్కింగ్‌

సేంద్రియ వ్యవసాయ పరిశోధన ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. దానిని అభివృద్ధి చేయ వలసిన అవసరం ఉంది. అంతేకాకుండా శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలాలను రైతులకు అందించాలి. సేంద్రీయ వ్యవసాయం రైతులతోపాటు వినియోగ దారులకు కూడా మేలు చేస్తుంది కనుక సేంద్రీయ ఆహార పదార్థాల ఉత్పత్తిని పెం

పొందించాలి.

శిక్షణ, సమాచార వినిమయం

సేంద్రియ వ్యవసాయం రైతులకు, వినియోగ దారులకు మేలు చేస్తుంది. ఆరోగ్యవంతమైన ఆహారం పొందటం మనిషి ప్రాథమిక హక్కు. అందుకే సేంద్రియ ఆహారం కేవలం సంపన్న వినియోగ దారులకు మాత్రమే కాక సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలి. అయితే సేంద్రియ వ్యవసాయ పురోగతి, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, ప్రక్రియల అభివృద్ధి, ప్రధానంగా రైతుల అవసరాలు, భవిష్యత్తు సవాళ్ళపై ఆధారపడి ఉంటాయి. పరిశోధనలు, మార్గదర్శక క్షేత్రాల ద్వారా లభించిన పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చడం ఒక ముఖ్యమైన పని. క్షేత్ర స్థాయి రైతులకు నిపుణుల సలహాలు, సైద్ధాంతిక, నైపుణ్య కోర్సుల అందజేత, శాస్త్రవేత్తలకు, సలహాదారు లకు, విస్తరణ కార్యకర్తలకు, శిక్షణ కార్యక్రమాలు మొదలైన విభిన్న పద్ధతుల అవసరం ఉంటుంది.
సేంద్రియ వ్యవసాయం గురించి సాంకేతిక నిపుణులు, వీడియోలు, సదస్సులు, చిన్న పుస్తకాలు, కరపత్రాలు, బ్రోచర్లు, నివేదికలు, వెబ్‌సైట్లు వంటి వాటి ద్వారా నిర్దిష్ట అంశాలపై సమాచార వినిమయం; ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమంలో సంచలన వార్తలు, యు ట్యూబ్‌ ఛానల్‌లో సేంద్రియ వ్యవసాయం గురించిన విజ్ఞానం ఉంచటం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులు, విస్తరణ స¬ద్యోగులతో నిరంతర సంబంధాలు కొనసాగించడానికి సమావేశాలు, సదస్సులకు హాజరు కావడం చాలా ముఖ్యం. సేంద్రియ రంగంలో ప్రపంచ పరిణామా లను పర్యవేక్షిస్తూ లిఖితం (సశీషబఎవఅ్‌a్‌ఱశీఅ) చేయడం మంచిది.

మార్కెటింగ్‌ విధానాలు

రైతులు ఏ ఏ పంటలు పండించాలి, ఏ మార్కెట్‌ కోసం పండించాలి అనే సరైన నిర్ణయాలు తీసుకోనేందుకు మార్కెట్‌ సమాచారం అవసరం. వినియోగదారులు, ముఖ్యంగా నాణ్యత కోరే వినియోగదారుల ఆకాంక్షలను బట్టి పంటలు నిర్ణయించుకోడానికి రైతులకు వారితోపాటు ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించటం చాలా అవసరం. సామాజిక శాస్త్ర పరిశోధన మార్కెట్‌ అధ్యయనాన్ని దాటి ఆలోచించవలసి ఉంటుంది. సేంద్రియ ఆహారం గురించిన అవగాహనను వినియోగదారులలో కల్పించి, ప్రోత్సహించేందుకు పరిశోధనలు సహాయపడాలి. సేంద్రియ వ్యవసాయం ద్వారా లభించే వివిధ ప్రయోజనాల పూర్తి విలువను రైతులు పొందే విధంగా విధాన నిర్ణేతలు సహాయపడాలి. అన్ని ఆహార వ్యవస్థలు ఆహార సార్వభౌమత్వానికి, సహజ ఆహార లభ్యతకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది.

నిబద్ధత

నిలకడైన ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి సేంద్రియ వ్యవసాయ ఉత్పాదన ప్రక్రియల పరిశోధనలకు మరిన్ని నిధులు అత్యవసరంగా అందించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, మానవులు, మరియు పశువుల ఆరోగ్యాలపై ఆహారంలో అవశేషాల ప్రభావాన్ని నిర్ధారించడానికి పరిశోధన అవసరం ఉంది. తద్వారా నిలకడైన ప్రజారోగ్య విధానం నిర్ధారించడానికి వీలవుతుంది. అయితే దీనికి డబ్బు ఒకటే సరిపోదు. సుస్థిరత దిశలో సాగడంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి రాజకీయ, పౌరసమాజ నిబద్ధత అవసరం.

అంతర్జాతీయ సహకారం

సేంద్రీయ వ్యవసాయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తద్వారా ఆయా దేశాల మధ్య సేంద్రీయ వ్యవసాయంలోని పరిశోధనలు, వాటి ఫలితాలను పరస్పరం ఇచ్చిపుచ్చు కుంటూ ముందుకు సాగేందుకు వీలుపడుతుంది.

ముగింపు

సేంద్రీయ వ్యవసాయం పై పరిశోధనల చేసే శాస్త్రవేత్తలు జీవ సంబంధిత అంశాలు, సామాజిక శాస్త్రాల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించాల్సి ఉంది. శాస్త్రవేత్తలు, రైతుల మధ్య పెంపొందే సజనాత్మక భాగస్వామ్యం తక్కువ ఆదాయం ఉన్న ప్రాంతాలలో కొత్త మార్కెట్లకు ఊతం కల్పిస్తూ వ్యవసాయ-పర్యావరణ మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రసాయన వ్యవసాయం చేసి నష్టపోయిన కుటుంబాలు సేంద్రీయ వ్యవసాయం ద్వారా లబ్ది పొందుతాయి. ముఖ్యంగా సేంద్రీయ విధానం ప్రభుత్వ రంగ పెట్టుబడులు, సేంద్రీయ ఉత్పత్తుల మార్కెట్‌ అభివద్ధి, స్థానిక ఆహార భద్రత, గ్రామాల నిరంతర అభివద్ధిపై ప్రత్యేక దష్టిని సారిస్తుంది. పరిశోధనల ద్వారా వచ్చే ఫలితాలు ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులపై కనీస అంచనాలను అందజేస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఆహార పరిరక్షణ అవసరం వంటి అంశాల వలన సేంద్రీయ వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగే  అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

–  డా.వి.ప్రవీణ్ రావు, వైస్‌ ఛాన్స్‌లర్‌, పి.జె.టి.ఎస్‌. వ్యవసాయ విశ్వవిద్యాలయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *