శిశువుకు అమృతం – తల్లి పాలు

శిశువుకు అమృతం – తల్లి పాలు

ఆగస్టు 1న తల్లి పాల దినోత్సవ ప్రత్యేకం

ప్రతి తల్లి తన శిశువుకిచ్చే మొదటి పోషక దివ్య ప్రసాదం తన పాలు. అందులో శివువుకు కావలసిన శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక వృద్ధికి తోడ్పడే అంశాలన్నీ ఉన్నాయి. కాని రకరకాల వ్యాపార ప్రకటనలను చూసి తల్లులు దారి తప్పి, అజ్ఞానంతో తమ శిశువులకు తమ పాలను పట్టకుండా నష్టం చేస్తున్నారు.

తల్లిపాలలో పోషక విలువలు

నవజాత శిశువుకు తల్లిపాలు సంపూర్ణ, సర్వాంగీణ వృద్ధికి తోడ్పడే ఆహారమని ఆధునిక శాస్త్రవేత్తలు మనకు తెలియ జేస్తున్న సమాచారం అత్యంత స్వల్పం. వారికి తెలిసిందే అల్పం. తెలిసింది కూడా పాదర్శకంగా వెల్లడించే నిర్మల హృదయం వారికి కొరవడింది. శ్రేష్ఠమైన, అంతర్నిహితమైన, మాతా శిశువులకు అనుకూలమైన పోషక వ్యవస్థను ఈ సృష్టి పకడ్బందీగా ఏర్పరచింది.

ప్రతి 100 మి.లీటర్ల తల్లిపాలలో పోషక విలువలు కిందివిధంగా ఉంటాయి.

– ప్రోటీన్‌లు (మాంసకృత్తులు) 1.3 గ్రాములు – కేసిన్‌

– ఫాట్‌లు (క్రొవ్వు పదార్థాలు) 3.8 గ్రాములు – లాక్టిక్‌ ఆమ్లం

– కార్బోహైడ్రేట్‌లు (పిండి పదార్థాలు) 6.7 గ్రాములు – లాక్టోజ్‌

వీటితో పాటుగా ఉచిత ప్రమాణాలతో విటమిన్‌లు, హార్మోన్‌లు, ఖనిజాలు, లవణాలు, పోషక బాక్టీరియాలు లెక్కకు అందనన్ని ఉంటాయి. ప్రతి కణము, అణువులో ఒక కాంతిపుంజం ఉంటుంది. ఆ దివ్యపుంజమే శిశువుకు చక్కటి ఆరోగ్యం కలిగిస్తుంది. ఆవుపాలు, మారుతల్లి పోషణ లేదా డబ్బాపాలలో ఈ కాంతిపుంజం ఉండదు. కనుక సొంత తల్లిపాలతో శిశువుకు కలిగిన ఫలితాలు దివ్యంగానే ఉంటాయి.

తల్లి పాలు లేకుంటే..

తల్లి పాలు తన శిశువుకే సమంజసంగా ఉంటాయి. ఇంకో శిశువుకు కొంత అసమంజసం గానే ఉంటాయి. తల్లిపాలు సరిపోకుంటే తగిన చికిత్సను ఆయుర్వేద వైద్యుని ద్వారా చేయించాలి.

ఇదీ విఫలమయితే ‘మారు తల్లి’ సహకారం తీసుకోవాలి. అట్టి మారుతల్లి సహకారం తీసుకోవాలంటే ఆమె వైఖరి, ప్రేమ, ఆత్మీయత, ఆరోగ్యం మొదలైనవి పరిశీలించాలి.

శిశువు సహజ సాంకేతికాల ద్వారా ఆకలిని వ్యక్తపరచినప్పుడే పాలు పట్టాలి.

పరస్పర మానవ సంబంధం లేకుండా మధ్యవర్తి స్త్రీల నుండి వ్యాపార ధోరణిలో పాలు సేకరించి, ఏజెంట్ల ద్వారా అవసరమున్న శిశువులకు అందించి పోషించే విధానం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడున్న మానవ సంస్కార స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెప్పాలంటే ఈ పద్ధతి భవిష్యత్తులో విషఫలాలివ్వచ్చు.

పై పద్ధతి కంటే మెరుగైంది దేశీ ఆవుపాలు పట్టడం. ఇందులో పోషక విలువలు సుమారుగా ఉండి సరిపోతాయి.

కర్మాగారాల పాలపొడి నుండి తయారయే పాల వల్ల ఊబకాయం, బుద్ధి మాంద్యం, హర్మోనల్‌ సమస్యలు, ఇన్ఫెక్షన్‌, అలర్జీ మొదలగునవి దాపురించే అవకాశముంది. అకాల రజస్వల, బాలురకు వక్షోజాలు పెరుగుట వంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి.

మన కర్తవ్యం

సమాజ హితైషులందరూ తల్లిపాలను శిశువులకు అందించే పనిలో భాగం పంచుకోవాలి.

తల్లి పోషణ కరువైన శిశువుల సమాచారం సేకరించి, స్థానిక బస్తీలో లేదా పక్క బస్తీలో సంవేదనా శీలురైన (సమాజ హితం పట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగిన వారు) తల్లులను వెదకి, ఆ కుటుంబంతో అనుసంధానం చేయాలి.

కర్మాగారం నుండి తయారయే పాలు, పాలపొడుల వల్ల కలిగే దుష్పరిణామాలను విస్తృతంగా ప్రచారం చేయాలి.

బాలింతల యోగ క్షేమాలు, బాలింతతనం విశిష్ఠత, ఆ సమయంలో నిర్వహించవలసిన బాధ్యతలను ఇంటింటికి తెలపాలి.

– డా|| గౌడ జనార్ధన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *