వివాదాల మధ్య సాగిన కెనడా ప్రధాని పర్యటన

వివాదాల మధ్య సాగిన కెనడా ప్రధాని పర్యటన

ఫిబ్రవరి 17న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో 8 రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీలో అడుగు పె2ట్టారు. అప్పటి నుంచి ఆయన పర్యటన వివాదాల మధ్యే సాగింది. సాధారణంగా ఏ దేశాధినేత వచ్చినా విమానాశ్రయానికి స్వయంగా వెళ్ళడం, స్నేహ పూర్వకమైన ఆలింగనలు, పలకరింపులతో స్వాగతం పలికే భారత ప్రధాని కెనడా ప్రధాని ట్రూడోకు అలా స్వాగతం చెప్పలేదు. కనీసం ట్విట్టర్‌లో కూడా పర్యటన గురించి ప్రస్తావించలేదు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ‘సాదాసీదాగా’ జరిగిన స్వాగత కార్యక్రమాన్ని గురించి పత్రికలు ‘సుతిమెత్తని నిరసన’గా అభివర్ణించాయి. ట్రూడో కుటుంబం మాత్రం భారతీయ పద్దతిలో ‘నమస్కారం’ చేసి ఆతిథ్య దేశపు మన్ననలు పొందాలని ప్రయత్నించినా వారికి మాత్రం వ్యవసాయ శాఖ సహాయమంత్రి గజేంద్ర షెకావత్‌ ఆహ్వానమే లభించించింది. ఆ తరువాత ట్రూడో కుటుంబం తాజ్‌ మహల్‌ చూడటానికి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ‘సాదాసీదా’ స్వాగతమే లభించింది. కేవలం జిల్లా అధికారులు మాత్రమే వారితోపాటు ఉన్నారు. కెనడా ప్రధానితో సర్వసాధారణమైన, అధికారిక, దౌత్యపరమైన ¬దాలోనే వ్యవహరించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు చెప్పినప్పటికీ పూర్తి స్థాయి స్నేహం, సత్సంబంధాలు కనిపించలేదు.

వివాదాస్పద పర్యటన

సాధారణంగా ఏ దేశాధినేత పర్యటనలోనైనా అధికారిక కార్యక్రమాలు, సంప్రదింపులకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ట్రూడో పర్యటనలో మాత్రం ఢిల్లీలో సంప్రదింపులకు కేవలం ఒక రోజు మాత్రమే కేటాయించారు. కెనడా అధికారులు రూపొందించిన ఎనిమిది రోజుల పర్యటన ప్రణాళికలో దౌత్యపరమైన అంశాలకు ప్రాధాన్య మివ్వకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. ట్రూడో కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది. సైనికుల గౌరవందనం స్వీకరిం చడంతో దేశాధినేతల పర్యటనలు ప్రారంభమవు తుంటాయి. ట్రూడో కూడా అలా చేసి ఉంటే పర్యటన సాధారణ రీతిలోనే సాగి ఉండేది. ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు కెనడా మద్దతు తెలుపుతోందన్న అసంతప్తి కొంతవరకు తగ్గి ఉండేది. కానీ కెనడా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకో కుండా సాంస్కతిక ప్రదేశాల సందర్శనకే ప్రాధాన్య మిచ్చినట్లు కనిపించింది. ట్రూడో తాజ్‌ మహల్‌, మధురలోని ఏనుగుల సంరక్షణ కేంద్రం, అమత్‌ సర్‌లోని హర్‌మందిర్‌ సాహిబ్‌, సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్‌ దేవాలయాలను సందర్శించారు. దానితోపాటు ముంబైలో బాలీవుడ్‌ ప్రముఖులను కలిశారు. ఢిల్లీలో జామామస్జిద్‌ సందర్శించారు. చివరికి క్రికెట్‌ కూడా ఆడారు. ఈ సాంస్కతిక దౌత్యంతో పాటు ట్రూడో ముంబైలో 90 నిముషాల పాటు మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశ మయ్యారు. భారతీయ కంపెనీల నుండి 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ఒప్పందాలు కూడా కుదుర్చు కున్నారు. ఈ సాంస్కతిక దౌత్యం మాత్రం సజావుగా సాగింది. ఇది బహుశా 2020లో స్వదేశంలో ఎన్నికలను దష్టిలో పెట్టుకుని రూపొందించినది కావచ్చును. ఈ సాంస్కతిక దౌత్యం వల్ల ఆ ఎన్నికల్లో లాభపడవచ్చునేమోకాని తాము అనుసరిస్తున్న విదేశాంగ విధానం పట్ల మోదీ ప్రభుత్వంలో ఉన్న అసంతప్తిని మాత్రం అది తొలగించలేకపోయింది.

కెనడా ద్వంద్వ వైఖరి – ఖలిస్తాన్‌కు మద్దతు

కెనడా ప్రధాని అమత్‌సర్‌లో కేవలం హర్‌మందిర్‌ సాహిబ్‌ను సందర్శిస్తారని మొదట దౌత్యవర్గాలు వెల్లడించాయి. పర్యటనలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌ సింగ్‌ను కలిసే కార్యక్రమం లేదు. దీనికి కారణం ట్రూడో ప్రభుత్వం సాగిస్తున్న ఖలిస్తాన్‌ అనుకూల ధోరణిని అమరేందర్‌ సింగ్‌ మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ట్రూడో కేబినెట్‌లో రక్షణ మంత్రిగా ఉన్న, ఖలిస్తానీ మద్దతుదారైన హర్జిత్‌ సింగ్‌ సజ్జన్‌ను కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. హర్జిత్‌సింగ్‌ గత యేడాది భారత్‌కు వచ్చినప్పుడు ఆయనతో సమావేశం కావడానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి నిరాకరించారు కూడా. కానీ ఢిల్లీలో అడుగు పెట్టినప్పటి నుంచి తన పర్యటన వివాదాస్పదం కావడం, కొంత వ్యతిరేకతను కూడా ఎదుర్కోవలసి రావడంతో ట్రూడో చివరి క్షణంలో తన కార్యక్రమాన్ని మార్చుకుని అమరేందర్‌ సింగ్‌తో సమావేశం కావడానికి సిద్దపడ్డారు. 25 నిముషాల పాటు జరిగిన సమావేశంలో ట్రూడో, అమరేందర్‌ సింగ్‌లు వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య సత్సంబంధాల గురించి చర్చలు జరిపారు. కెనడా బందంలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రి హర్జిత్‌ సింగ్‌ సజ్జన్‌కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాదు ఖలిస్తాన్‌ వేర్పాటువాద విషయం ప్రముఖంగా చర్చకు రావడంతో నష్టానివారణ చర్యగా ట్రూడో ‘సమైక్య భారతానికే తమ మద్దతు’ అని ప్రకటించారు. అలా ప్రకటిస్తూనే ‘మేము హింసకు, తీవ్రవాదానికి వ్యతిరేకం. కానీ వేరువేరు దక్పధాలు, అభిప్రాయాలను మన్నించడం కెనడాకు ఉన్న బలమని మేము నమ్ముతాము’ అన్నారు. ఈ ప్రకటనపై విమర్శకులు తమ అస్త్రాలను సంధించారు. ఒక పక్క సమైక్య భారతానికి మద్దతు తెలుపుతూనే మరోపక్క వేర్పాటువాదులకు ప్రోత్సాహం ఇవ్వడం ఏమిటని నిలదీశారు.

భారత్‌ స్నేహహస్తం

2015లో మోదీ కెనడాలో పర్యటించారు. 42 సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని కెనడాలో పర్యటించడం అదే మొదటిది. కెనడాతో సత్సంబంధాలను ఏర్పరచుకునేందుకు మోదీ తన స్నేహహస్తాన్ని అందించారు. అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌ను కలిసి వ్యూహాత్మక సంబంధాలకు పునాదులు వేశారు. రాగల ఐదేళ్లలో 3.2 మిలియన్‌ కిలోల యురేనియం సరఫరా చేయాడానికి కెనడా అంగీకరించడం మోదీ సాగించిన దౌత్యానికి విజయమని నిపుణులు పేర్కొన్నారు కూడా. భారత్‌కు 45 సంవత్సరాల క్రితం యురేనియం సరఫరా ఆపేసిన కెనడా కంపెనీ కామ్కో కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ భారత అణు కార్యక్రమాభివద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇది 1954లో భారతదేశపు మొట్టమొదటి అణు రియాక్టర్‌ సిరస్‌కు యురేనియం సరఫరా చేసింది. కానీ 1974లో భారత్‌ అణు పరీక్షలు నిర్వహించిన తరువాత అప్పటి కెనడా ప్రధాని పియర్‌ ట్రూడో భారత్‌పై అణు నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుండి కామ్కో యురేనియం సరఫరా ఆపేసింది.

ఒకప్పుడు భారత, కెనడాల మధ్య ఉన్న బలమైన సత్సంబంధాలు రెండు సంఘటనలతో దెబ్బతిన్నాయి. వాటిలో ఒకటి, 1974లో ‘స్మైలింగ్‌ బుద్ధా’ పేరుతో భారత్‌ నిర్వహించిన అణు పరీక్షలు. రెండు, 1985 జూన్‌లో కెనడా నుండి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంపై జరిగిన బాంబుదాడి. ఈ దాడివల్ల విమానం అట్లాంటిక్‌ సముద్రంలో కూలిపోయి అందులోని 329 ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 182 మంది కెనడా భారతీయులు ఉన్నారు. కెనడాలో నివశిస్తున్న సిక్కు తీవ్రవాదులే ఈ దాడికి కారణమని దర్యాప్తులో తేలింది.

ఖలిస్తాన్‌ ఉద్యమం ఉధతంగా ఉన్నప్పుడు 1984లో సిక్కు వేర్పాటువాదులను హర్‌ మందిర్‌ సాహిబ్‌ నుండి బయటకు తెచ్చేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్‌ బ్లూస్టార్‌ అనే సైనిక చర్యకు అనుమతిచ్చింది. ఆ సైనిక చర్యలో సిక్కు తీవ్రవాద నాయకులైన భింద్రన్‌ వాలే, అమ్రీక్‌ సింగ్‌, జనరల్‌ సహాబేగ్‌ సింగ్‌ మొదలైనవాళ్లు చనిపోయారు. దీనితో ఆగ్రహించిన సిక్కులు ఇందిరాగాంధీని హత్యచేశారు. తమ నాయకురాలి హత్యతో కోపగించిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో పెద్దయెత్తున సిక్కులను ఊచకోతకు గురిచేశారు. 1980 నాటికే కెనడాలో సిక్కుల సంఖ్య బాగా ఉండేది. కానీ 1984 తరువాత అది మరింత పెరిగింది. ఖలిస్తాన్‌ వేర్పాటువాదులంతా కెనడాలో తలదాచుకున్నారు.

తమ స్వార్థం కోసం భారత్‌పై విషం

కెనడాలో ప్రస్తుతం సిక్కు జనాభా మొత్తం దేశ జనాభాలో 1.4 శాతం ఉంటారు. అధికారంలోకి రావడం కోసం ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీ సిక్కులకు మద్దతుగా నిలిచింది. ట్రూడో క్యాబినెట్‌లో ఉన్న నలుగురు సిక్కు మంత్రులు ఖలిస్తానీ మద్దతుదారులనే ఆరోపణలు ఉన్నాయి. ట్రూడో హయాంలో సిక్కు తీవ్రవాదం మళ్ళీ బలం పుంజుకుంటోంది. డిసెంబర్‌, 2017లో కెనడాలోని 14 గురుద్వారాలకు చెందిన కమిటీ కెనడాలో భారతీయ దౌత్యవేత్తల ప్రవేశాన్ని నిషేధించింది. అలాగే ఇంగ్లండ్‌, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కూడా ఇటువంటి ప్రకటనలే వెలువడ్డాయి. దీనితో దేశం బైట బలపడుతున్న సిక్కు వేర్పాటువాదం పంజాబ్‌ లోని ప్రజలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళన భారత ప్రభుత్వంలో కలిగింది. ఏప్రిల్‌ 2017లో 1984 సిక్కు అల్లర్లను ‘మారణకాండ’ గా అభివర్ణిస్తూ కెనడా పార్లమెంట్‌ తీర్మానం చేసింది. లిబరల్‌ పార్టీకి చెందిన హరీందర్‌ మల్హి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్ష న్యూ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జగ్మీత్‌ సింగ్‌ బలపరిచారు. ఈ జగ్మీత్‌ సింగ్‌కు భారత ప్రభుత్వం 2013లో వీసా నిరాకరించింది. ఎయిర్‌ ఇండియా విమానం కూల్చివేత కుట్రలో ప్రధాన పాత్ర పోషించిన తల్వీందర్‌ సింగ్‌ పర్మార్‌ చర్యలను ఖండించడానికి జగ్మీత్‌ సింగ్‌ అంగీకరించలేదు. కొన్ని నివేదికల ప్రకారం కెనడాకు చెందిన కొన్ని సమూహాలు కాశ్మీర్‌ వేర్పాటువాదులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని తేలింది.

భారత ప్రభుత్వపు అభ్యంతరాలను పట్టించుకో కుండా ట్రూడో సిక్కు తీవ్రవాదులకు బహిరంగంగానే మద్దతు తెలుపుతూ వచ్చారు. ఖలిస్తాన్‌ ఉద్యమం భారత్‌లో సిక్కులు గురైన మానవహక్కుల ఉల్లంఘనల ఫలితమేనని ట్రూడో ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. మైనారిటీ వర్గాల మనోభావాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం కోసమే ఖలిస్తాన్‌ వాదనకు మద్దతు తెలుపుతున్నామని వివరిస్తోంది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌లో చనిపోయిన సిక్కు వేర్పాటువాదుల సంస్మరణార్ధం జరిగిన ఖాల్సా దినోత్సవానికి ట్రూడో హాజరయ్యారు. ఇలా సిక్కు వేర్పాటువాదులకు మద్దతునివ్వడం పట్ల భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్షిక ఖాల్సా దినోత్సవ సందర్భంగా ఒంటరియో గురుద్వారా కమిటీ 2020లో ఖల్సాపై జనాభిప్రాయసేకరణ జరపాలంటూ ఏకంగా ఒక తీర్మానమే ఆమోదించింది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే మే, 2017లో ఒక మాజీ సి ఆర్‌ పి ఎఫ్‌ అధికారిని వాంకోవర్‌ విమానాశ్రయంలో ఆపేసిన కెనడా ప్రభుత్వం అందుకు కారణం చూపుతూ ‘తీవ్రవాదం, వ్యవస్థీకత, సంపూర్ణ మానవహక్కుల ఉల్లంఘనకు, మారణకాండకు పాల్పడిన ఒక ప్రభుత్వానికి సహకరించిన అధికారిగా అతనికి తమ దేశంలో ప్రవేశించే అనుమతి ఇవ్వలేం’ అని స్పష్టం చేసింది. సిక్కు వేర్పాటువాదులపట్ల ట్రూడో ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరి రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగిస్తోంది. ఈ అపనమ్మకాన్ని, అసంతప్తిని తొలగించడానికి ప్రయత్నిచాల్సిందిపోయి ట్రూడో రాజకీయ ప్రయోజనాలకోసం, ఎన్నికల లాభాల కోసం సిక్కు వేర్పాటువాదుల గుణగానం చేశారు.

ఫిబ్రవరి 23న సమావేశమైన ట్రూడో, మోదీలు తీవ్రవాద నిర్మూలన, వాణిజ్యాభివద్ధి వంటి విషయాలపై చర్చించారు. విద్యుత్‌ రంగంలో సహకారంతో పాటు వివిధ రంగాలలో సహకారానికై ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తరువాత సంయుక్త సమావేశంలో మాట్లాడిన మోదీ ‘మతాన్ని రాజకీయాల కోసం, వేర్పాటువాదాన్ని ప్రేరేపించడం కోసం ఉపయోగించుకోవాలన్న ధోరణిని ఏమాత్రం సహించలేం. అలాగే మా దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను కూడా అంగీకరించలేం’ అని స్పష్టం చేశారు. ఇద్దరు దేశాధినేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో కూడా ‘ఏ దేశం తన భూభాగాన్ని తీవ్రవాద, హింసాత్మక కార్యకలాపాలకు ఉపయోగించనివ్వ కూడదు’ అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయడానికి, భారత్‌కు కలిగిన అసంతప్తిని తొలగించడానికి ట్రూడోతో పాటు కెనడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ చేసిన ప్రయత్నాలు ఫలవంతం కాలేదనే చెప్పాలి. ఆవిధంగా భారత్‌తో సంబంధాలను బలపరచుకునే సదవ కాశాన్ని ట్రూడో ప్రభుత్వం చేజార్చుకుంది.

– డా||రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *