మోది దౌత్యనీతి

మోది దౌత్యనీతి

– భారత విదేశాంగ విధానంలో నూతన మార్పులు

– ఇరుగు, పొరుగు దేశాలతో స్నేహపూర్వక వైఖరి

– ఇరాన్‌తో పెరిగిన బంధం

నరేంద్ర మోది ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుండే భారత విదేశాంగ విధానంలో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశానికి మేలు కలిగే విధంగా దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించారు. అందులో భాగంగానే మోది 2016లో ఇరాన్‌ దేశంలో పర్యటించారు. తత్ఫలితంగా ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహాని ఈ మధ్యనే భారతదేశ పర్యటనకు వచ్చారు.

ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రేహాని 2018 ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో పర్యటించారు. 400 సంవత్సరాల క్రితం ఖుతుబ్‌షాహి పాలకులు నిర్మించిన మక్కా మసీదును సందర్శించారు. అక్కడ ప్రార్థనలనంతరం ముస్లింలను ఉద్దేశించి ప్రసంగిస్తూ షియా, సున్నీ రెండు వర్గాలకు చెందిన ముస్లింలు కేవలం మక్కా మసీదులోనే కలిసి ప్రార్థన చేస్తారు. హైదరాబాద్‌లో షియా వర్గీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ప్రాంతంగా భారతదేశానికి పేరుందన్నారు. ప్రతిఒక్కరూ మత దురభిమాన హింసను విడనాడాలని కోరారు. మధ్య తూర్పు దేశాలు మత దురభిమాన హింసకు గురవుతున్నా యన్నారు. ‘ఇస్లామిక్‌ ప్రపంచంలో కొంతమంది ముస్లింలు సమస్యలతో సతమతమవుతున్నారంటే ముస్లింలందరూ ఇస్లాం బోధనలు సరిగా అర్థం చేసుకోలేదన్న మాట. ఇస్లాం ఎప్పుడు పెత్తనం చెలాయించాలని చెప్పదు’ అని ఉద్భోదించారు. అమెరికా విధానాలపై విరుచుకుపడ్డారు. అంతే గాకుండా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ముస్లిం లందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్‌, షియా మిలిటెంట్లకు మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. షియా మిలిటెంట్లకు ఇరాన్‌ మద్దతిస్తోంది. ఇటువంటి అనిశ్చిత సమయంలో ఇరాన్‌ అధ్యక్షుడు భారత పర్యటనకు రావడం ఆసక్తిని పెంచింది. రౌహాని భారత పర్యటనకు కొద్ది రోజుల ముందే ఇరాన్‌ ‘డ్రోన్‌’ ను ఇజ్రాయెల్‌ సైనికులు కూల్చి వేశారు. సిరియన్‌ సరిహద్దుల నుండి ‘డ్రోన్‌’ తమ దేశ సరిహద్దుల్లోకి రావడం వల్ల కూల్చి వేశామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. సిరియాలో ఉన్న ఇరాన్‌ సైనికదళం ఇజ్రాయెల్‌కి చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చివేసి దానికి ప్రతీకారం తీర్చుకుంది. దీనివల్ల మధ్య ప్రాచ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఈ మధ్యనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘జెరూసలెం’ ను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నామని ప్రకటించి ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య అగ్నికి అజ్యం పోశారు.

ఆసక్తికర విషయమేమిటంటే రౌహాని మన దేశానికి వచ్చే నెల రోజుల ముందే ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు మన దేశం వచ్చారు. భారత్‌-ఇజ్రాయెల్‌ దేశాల మధ్య పలు ఒప్పందాలు కూడా కుదిరాయి.

అమెరికాలో ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత ఇరాన్‌తో సంబంధాలు బలహీనపడ్డాయి. ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్‌ విధానంపై చేసుకున్న ‘జాయింట్‌ కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ ఆక్షన్‌’ ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నారు. ఇరాన్‌ న్యూక్లియర్‌ రివ్యూ ఒప్పందాన్ని కూడా అమెరికా తిరస్కరించింది. ఒకవైపు ఇంటర్నేషనల్‌ ఆటోమెటిక్‌ ఎనర్జీ ఎజెన్సీని ఇరాన్‌ అంగీకరిస్తే ట్రంప్‌ దానిని తిరస్కరించారు. జీజూూూ నుండి వైదొలగడాన్ని ట్రంప్‌ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా ఏకపక్షంగా ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కాప్స్‌కు అందించే సహాయాన్ని నిలిపివేశారు. ట్రంప్‌ ఇరాన్‌, అమెరికాల మధ్య దూరాన్ని మరింత పెంచారు. అమెరికా అవలం బిస్తున్న చర్యల వల్ల 2007 నుండి 2016 వరకు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆదాయ వర్గాల మధ్య వ్యత్యాసం చాలా పెరిగిపోయింది. దేశమంతటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇరాన్‌ మహిళలు బహిరంగ ప్రదేశాలలో ‘బురఖా’ ధరించడంపై సవాలు చేశారు.

1979లో ఇరాన్‌లో విప్లవం వచ్చింది. ఆ తర్వాత అధికారం ముస్లింల చేతుల్లోకి వెళ్ళి పోయింది. వారి నాయకుడు ఆలీ ఖొమెనీ. ఇతను ఇరాన్‌లో విప్లవం తీసుకొచ్చిన అయాతుల్లా రకుల్లా ఖొమెని కొడుకు. తండ్రి మరణించిన తర్వాత అలీ ఖొమెనీ అధికారాన్ని చేపట్టాడు. ఈయన మంత్రి వర్గంలో 12 మంది ఉంటారు. అందులో అరుగురిని అలీ ఖొమెనీ నియమిస్తాడు. ప్రభుత్వ పాలనంతా ఈ మంత్రి వర్గమే చూసుకొంటుంది. సామాజిక విముక్తి కొరకు దేశంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు చూసి ప్రస్తుతమున్న చట్ట సమ్మతి అధికారంలో ఉండాలా ? వద్దా ? అనే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపిస్తానన్నాడు. దేశంలో తలెత్తుతున్న వ్యతిరేకతను, ఆర్థిక స్థితిని చాలా సున్నితంగా, సమతుల్యతతో నెట్టుకొస్తున్నాడు. దేశంలో ఎలాంటి పరిస్థితులున్నా సిరియన్‌ సివిల్‌ యుద్ధంలో సాధించిన విజయాలు ఇరాన్‌కు స్థైర్యా న్నిచ్చాయి. లెబనాన్‌లో హిజ్‌బిల్లా వారికి, యెమెన్‌లో హైతి తిరుగుబాటుదారులకు ఇరాన్‌ మద్దతిస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకొంది. సున్నీలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియాకు ఇరాన్‌ ప్రాబల్యం హానికరంగా పరిణమించవచ్చని సౌదీ భావిస్తోంది. ఈ పరిస్థితి పశ్చిమ ఆసియా దేశాలలో దౌత్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

అంతర్జాతీయంగా ఏకాకవుతున్న ఇరాన్‌ భారతదేశంతో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించు కోవాలని కోరుతోంది. భారత్‌, ఇరాన్‌ల మధ్య స్నేహం 1950 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఇరుదేశాలు ూవతీజూవ్‌బaశ్రీ ూవaషవ aఅస టతీఱవఅసరష్ట్రఱజూ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాని రాను రాను ఈ రెండు దేశాల మధ్య దూరం పెరిగి ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. మహమ్మద్‌ రెజాషా నాయకత్వంలోని ఇరాన్‌, అమెరికా, పాకిస్తాన్‌, యుకె, టర్కీ దేశాలు కలిసి జజుచీుూ (జవఅ్‌తీaశ్రీ ్‌తీవa్‌వ ూతీస్త్రaఅఱఝ్‌ఱశీఅ) గా ఏర్పడ్డాయి. మరో వైపు భారత్‌ సోవియట్‌ రష్యావైపు మొగ్గు చూపింది. ఇరాన్‌ భారత్‌ల మధ్య మైత్రి ఒడంబడిక ఉన్నా 1965, 1971లో జరిగిన యుద్ధాలలో ఇరాన్‌ పాకిస్తాన్‌కు సహకరించింది. దీంతో ఇరాన్‌కు అమెరికాతో సంబంధాలు బెడిసికొట్టాయి. ఇరాన్‌ రాజకీయాలలో ముస్లిం హార్డ్‌లైనర్స్‌దే పై చేయి అయింది. ఫలితంగా ఇరాన్‌ ప్రజాస్వామ్యం నుండి దూరం అయింది. ఇరాన్‌ ప్రభావం భారత దేశంపై ముఖ్యంగా కశ్మీర్‌లోని ముస్లిం ప్రజలపై పడొచ్చని భారత్‌ భయపడింది. అదే సమయంలో సోవియట్‌ యూనియన్‌ అఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. సోవియట్‌ యూనియన్‌ దాడిని భారత్‌ ఖండించ లేదు. ఈ కారణంగా ఇరాన్‌ నిరాశకు గురైంది. ఇరుదేశాల మధ్య ఇన్ని విభేదాలున్నా భారత్‌ ఇరాన్‌తో స్నేహం కొనసాగించాలనే కోరుకుంది. 1977 వరకు భారత్‌ ప్రధానులు జవాహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి ఇరాన్‌లో పర్యటించారు. ఇరాక్‌తో ఎడతెగని పోరాటాలు చేస్తున్న ఇరాన్‌ చాలా కష్టంగా భారత్‌తో సంబంధాలను కొనసాగించింది.

ఇరాన్‌లో విప్లవం వచ్చిన తర్వాత 1993లో పి.వి.నరసింహారావు టెహరాన్‌ సందర్శించారు. దానికి ప్రతిగా 1995లో ఇరాన్‌ అధ్యక్షుడు అలీ అక్బర్‌ హష్మి ఢిల్లీని సందర్శించారు. ఆ సమయం లోనే ద్వైపాక్షిక చర్చలకు ప్రాణం పోశారు. మార్చి 1994లో కశ్మీర్‌ విషయంలో అమెరికా ప్రతి పాదనను వ్యతిరేకించి ఇరాన్‌ భారత్‌కు మద్దతు పలికింది. ఆ తర్వాత భారత్‌ ఇరాన్‌ల మధ్య సంబంధాలు సజావుగానే సాగాయి. 2001లో ప్రధానమంత్రి అటల్‌బిహారి వాజ్‌పేయి టెహరాన్‌ డిక్లరేషన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పుడు ఇరాన్‌ అధ్యక్షుడు ఖటామి కూడా సంతకాలు చేశారు. గ్యాస్‌ పైప్‌ లైన్‌, ఎల్‌.ఎన్‌.జి. శాస్త్ర, సాంకేతిక సహకారం విషయాలపై ఒప్పందాలు కుదిరాయి. మధ్య ఆసియాతో సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఇరాన్‌ ప్రాధాన్యాన్ని భారత్‌ గుర్తించింది. అహ్మది నెజాద్‌ ఎన్నికతో ఇరాన్‌ ఒంటరైనా భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంది. ఈ రెండు దేశాలు ముందడుగు వేసి సముద్ర తీర సంబంధాలను మెరుగు పరచుకొని ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి.

ఇరాన్‌తో భారత్‌కున్న మైత్రిని తెలియ జేయడానికి 2003లో గణతంత్ర దినోత్సవానికి ఇరాన్‌ అధ్యక్షుడు ఖటామీని గౌరవ అతిథిగా భారత్‌ ఆహ్వానించింది. ఆ సందర్భంలోనే సైనిక సహకారం, హైడ్రోకార్బన్‌లు లేని వ్యాపారం, చాబహార్‌ అభివృద్ధి. (చబహార్‌- ఫరంజ్‌-భమ్‌ రైలు మార్గం). ఒప్పందాలు కుదిరాయి. 2005లో అమెరికా ఒత్తిడి వల్ల Iూజుూలో ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్రోగ్రాంకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేసింది. 2006లో ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడు భారత్‌ ఇరాన్‌కు మద్దతు ఇవ్వలేదు. ఆ తరువాత తను అలా ఎందుకు చేయవలసి వచ్చిందో భారత్‌ వివరణ ఇచ్చుకుంది. ఇరాన్‌కు దౌత్యపరంగా సహాయం అందించడానికే ఆ విధంగా చేశానని భారత్‌ స్పష్టం చేసింది.

సవాళ్ళు

భారత్‌-ఇరాన్‌ వ్యవహారాల్లో ఎనర్జీ, అనుసంధానం ఈ రెండు ప్రధానంగా ఉండేవి. పాకిస్తాన్‌ నిరోధాన్ని దాటుకొని వెళ్ళడానికి ‘చాబహార్‌’ ప్రాజెక్టును భారత్‌ చేపట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి అవకాశాలు మెరుగవుతాయి.

భారత్‌, ఇరాన్‌, రష్యాలు చీశీత్‌ీష్ట్ర – ూశీబ్‌ష్ట్ర ుతీaఅరజూశీత్‌ీ జశీతీతీఱసవతీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముంబయి నుండి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నౌక మార్గం చాబహార్‌ ద్వారా వెళ్ళడం వలన దూరం, సమయం కలసి వస్తుంది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు 17 సంవత్సరాలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పుడు త్రైపాక్షిక ఒప్పందం కుదిరిన తర్వాత భారత్‌ చాబహార్‌ ప్రాజెక్టు అభివృద్ధికై 85 మిలియన్ల డాలర్లు అందించింది. చాబహార్‌ రేవు ప్రాముఖ్యతని చాటి చెప్పడానికి భారత్‌ మొదటి నౌకను గోధుమలతో పంపించింది. భారత్‌ చాబహార్‌ గురించి ఇంత శ్రమిస్తున్నా ఇరాన్‌ చాబహార్‌ అభివృద్ధికి చైనా, పాకిస్తాన్‌లను ఆహ్వానిస్తోంది.

ద్వైపాక్షిక ఒప్పందం

ఈసారి భారత్‌, ఇరాన్‌లు 9 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు సార్లు పన్ను వేయడాన్ని తప్పించడం, డిప్లామాటిక్‌ పాస్‌పోర్టు కలిగి ఉన్న వారికి వీసా మినహాయింపు, దోషులను అప్పగించే ఒప్పందం, సాంప్రదాయక ఔషధాలలో సహకారం, వాణిజ్య ప్రతిక్రియాత్మక సూచనలు, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, తపాల సహకారం మొదలైనవి.

చాబహార్‌ రేవులో ఒక భాగాన్ని 18 నెలలు ఉపయోగించడానికి భారత్‌కు అనుమతి ఇచ్చింది. చాబహార్‌ రేవు అభివృద్ధికి భారత్‌ 500 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ట్రంప్‌కు ఇరాన్‌ పట్ల అంతటి వ్యతిరేకత ఉన్నా భారత్‌ – ఇరాన్‌ల మైత్రిని అడ్డుకోవడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి కుదుట పడడానికి భారత్‌ చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం లేదు. అమెరికా అధికారి టిల్లెర్‌సన్‌ అమెరికా వైఖరి వివరిస్తూ భారత్‌కు ఇతర దేశాలతో ఉన్న వ్యాపార సంబంధాలలో జోక్యం చేసుకోమని ప్రకటించాడు. పాకిస్తాన్‌ ఓడరేవు గ్వడార్‌ను చైనా లీజుకు తీసుకుంది. కావున భారత్‌ చాబహార్‌ ఓడరేవును వ్యూహాత్మకంగా ఉపయోగించుకోనుంది. ఎనర్జీ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇరాన్‌ భారత్‌ను ఆహ్వానిస్తోంది. ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు భారత్‌ కరెన్సీని ఉపయోగించవ్చని కేంద్ర ప్రభుత్వం అనుమ తిచ్చింది. ఇప్పటి వరకు ఈ విధంగా నేపాల్‌, భూటాన్‌లలో భారత్‌ కరెన్సీలో డాలర్లు, యూరోల పెట్టుబడులపై ఆంక్షలు ఉన్నందువలన భారత్‌ ఈ నిర్ణయం తీసుకొంది. రెండు దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తీవ్రవాదం, ఉగ్రవాదం, మత్తుమందుల అక్రమ రవాణాను అరికట్టి సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేయాలని తీర్మానించాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇరాన్‌ కూడా ఇబ్బందులకు గురైంది. అయినా కాబూల్‌ పట్ల దాని దృష్టి భారత్‌ న్న భిన్నంగా ఉంది. అమెరికాను భారత్‌ ఆహ్వానిస్తే, ఇరాన్‌ రష్యా, చైనాలతో పని చేయాలని చూస్తోంది.

న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్స్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌’లో రౌహాని ప్రనసంగిస్తూ భారత్‌కు మద్దతు పలుకుతూనే భారత్‌పై అమెరికా ప్రభావం ఎంతవరకుంటుందో నని అనుమానం వ్యక్తం చేశారు. సిరియాలో అమెరికా జోక్యాన్ని ఆయన ఖండిస్తూ తమ దేశం 2015 న్యూక్లియర్‌ ఒప్పందానికి కట్టుబడి ఉందన్నారు. రౌహాని పర్యటన వల్ల భారత్‌ తన ఇరుగు, పొరుగు దేశాలతో సమతుల్యతను పాటించడంలో సఫలమైంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో మైత్రీ సంబంధం కలిగి ఉన్నా ఇరాన్‌ను దూరం చేసుకోకుండా సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ఇరాన్‌లోని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయమందించడం, అంతర్జాతీయంగా ఇరాన్‌ ఒంటరైనప్పుడు తోడుగా ఉండటం ఇవన్నీ భారతదేశ దౌత్యనీతికి అద్ధం పడుతున్నాయి. ఏది ఏమైనా మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు వచ్చింది. దానికి కారణం భారత్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అని చెప్పక తప్పదు.

– తీగెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *