భారత్‌ సేంద్రియ ఉత్పత్తుల అగ్రగామి కావాలి

భారత్‌ సేంద్రియ ఉత్పత్తుల అగ్రగామి కావాలి

– శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేవి యాంటీ ఆక్సిడెంట్స్‌

– ఇవి నాణ్యమైన ఆహారం నుండి లభిస్తాయి

– నాణ్యమైన ఆహారం సేంద్రియ సేద్యం వలనే సాధ్యం

– సేంద్రియ సేద్యం చేసేందుకు భారత రైతుకు అవకాశాలు పుష్కలం

సేంద్రియ ఆహారోత్పత్తుల డిమాండ్‌ రూపంలో అదృష్టం భారత రైతుల తలుపు తడుతోన్న ఈ తరుణంలో ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి. కోట్లాది నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, గ్రామీణ భారతంలో అద్భుతమైన సంపద సృష్టించాలి. భారతదేశం సేంద్రీయ సేద్యంలో అగ్రగామిగా అవతరించాలని; ఆరోగ్య, సౌభాగ్య భారతం కావాలని ఆశిద్దాం!

భారతమాతకు గత వైభవాన్ని ప్రాప్తింప జేయాలని దేశంలోని వివిధ రంగాల్లో వేర్వేరు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం అన్ని రంగాలలోనూ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయ ప్రధానమైన మనదేశం మొదట వ్యవసాయంలో అగ్రగామి కావాలి. అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన భారత్‌కు సేద్యంలో అగ్రస్థానం పాతదే కాని క్రొత్తది కాదు. ఎక్కడ పారేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే సూత్రాన్ని అనుసరించి సేద్యంలో మన ఆధిపత్యాన్ని పోయిన చోటనే వెతకాలి. అంటే మనం కోల్పోయిన దాన్ని ఎలా, ఎప్పుడు, ఎందుకు కోల్పోయామో తెలుసుకోవాలి. దాని కోసం మనం ఆహారోత్పత్తులు, వాటి నాణ్యతలకు చెందిన శాస్త్రీయ అంశాలను అర్ధం చేసుకోవాలి. ఆరోగ్యానికి అనేక విధాలుగా లాభదాయకమైన ఆర్గానిక్‌ పంటలలో ఆరోగ్యానికి తోడ్పడే ఒక భాగమైన ‘యాంటి ఆక్సిడెంట్స్‌’ గురించి తెలుసుకుందాం.

యాంటి ఆక్సిడెంట్స్‌

మనం రోజూ తినే ఆహారం శక్తిగా మారటం సహజ క్రియ. అలా మారే ప్రక్రియలో ఆక్సిడేషన్‌ ఒక భాగం. ఈ క్రమంలో అణువులు లేదా పరమాణువులు ఎలక్ట్రాన్‌లను కోల్పోతాయి. దానితో పాటు జరిగే గొలుసుకట్టు క్రియలో కణాలను నష్టపరిచే లేదా నాశనం చేసే క్రియకు దోహదపడే ఫ్రీరాడికల్స్‌ కూడా ఉత్పన్నం అవుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో దుర్భర పరిణామాలు సంభవిస్తాయి. వృద్ధాప్యం, మతిమరపు, పార్కిన్‌సన్‌, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్‌ వంటి రోగాలు వాటిలో కొన్ని.

సేంద్రియ సేద్య అవశ్యకత

అదృష్టవశాత్తు ఫ్రీీరాడికల్స్‌ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా మనకు ప్రకృతి ద్వారా మన ఆహారంలో లభిస్తున్నాయి. అందుకే యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఫ్రీరాడికల్స్‌ను తొలగించే స్కావెంజర్స్‌ అంటారు. ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ లభ్యత పుష్కలంగా ఉన్నంత కాలం మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సారప్రదాయిక సేద్యర జరిగిన రోజుల్లో భారతీయుల ఆరోగ్యర మూడు పూవులు ఆరు కాయలుగా ఉరడేది. భారత ప్రజానీకం మేలైన ఆహారం పొరది, ఆయురారోగ్యాలతో వర్థిల్లగా సకల జనుల శ్రమశక్తితో సమకూడిన సిరిసంపదలతో భారతదేశం భాగ్యసీమగా విలసిల్లిరది. నేడు వినిపిస్తున్న, కనిపిస్తున్న పలురకాల వ్యాధులు నాటి భారతీయుల్లో ఉరడేవి కావు. వందల సంవత్సరాల పాటు విదేశీయులు మనపై దాడి చేసి, అపార ధన సంపదను దోచుకుపోయినా కూడా 1947లో స్వాతంత్య్రర పొరదే నాటికి భారత్‌ మిగులు బడ్జెట్‌లోనే ఉరది కానీ, ఎవరికైనా రుణపడి గాని, లోటు బడ్జెట్‌లో గాని లేదన్నది చారిత్రక సత్యర. అరత సంపదను కూడబెట్టిన శ్రమశక్తి, దానికి తోడ్పడిన ఆరోగ్యర భారతీయుల్లో ఇప్పుడు ఎరదుకు ? ఎలా? సన్నగిల్లిందో తెలుసుకురటే మనం సమస్య మూలాన్ని గ్రహిరచినట్లే.

అనివార్యమైన రసాయన ఎరువుల వాడకం, ఫలితం

స్వాతంత్య్రానంతరం పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి అధిక ఆహారోత్పత్తి అవసరమైంది. ప్రతిదానికీ పాశ్చాత్యులను అనుకరిరచడానికి అలవాటు పడిన మన దేశంలో వ్యవసాయం కూడా దారితప్పి పాశ్చాత్యీకరణ బాట పట్టిరది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల ప్రయోగాలతో దిగుబడి పెరిగిరది. ఆహారోత్పత్తి పెరగటంతో పాటు ప్రజల ఆరోగ్యం క్షీణించటం కూడా పెరిగింది. ఈ రసాయన వ్యవసాయం ద్వారా ఆహారంలో నాణ్యత లోపించటం వలన, ఆహార పదార్ధాలలో మిగిలిపోతున్న రసాయన అవశేషాల వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, క్రొత్త క్రొత్త వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు.

ఇద్దరిలో ఒకరికి క్యాన్సర్‌

వర్తమాన పరిస్థితులు ఇలాగే కొనసాగితే మానవ జీవితకాలంలో అమెరికాలో పురుషుల్లో సగటున ప్రతి ఇద్దరిలో ఒకరికి, స్త్రీలలో సగటున ప్రతి ముగ్గురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు ఉందని 2011-13 అమెరికా పరిశోధనలు వెల్లడించాయి. క్రింది లింకులోని 14వ పుట చూడండి.

https://www.cancer.org/content/dam/cancer-org/research/cancer-facts-and-statistics/annual-cancer-facts-and-figures/2017/cancer-facts-and-figures-2017.pdf

మన దేశంలో కూడా పెరుగుతున్న కాన్సర్‌

మనదేశంలో కూడా రోజురోజుకూ కాన్సర్‌ విపరీతంగా పెరుగుతున్నది. యన్‌.పి.కె. వంటి వివిధ రకాల రసాయనిక ఎరువుల వినియోగం వలన 1950 నుంచి 1999 వరకు 43 రకాల పంటలలో యాంటీ ఆక్సిడెంట్స్‌ గాఢత గణనీయంగా తగ్గిందని పరిశోధన ఫలితాలు వెల్లడించాయి. (davis, et al, 2004, US and Mayer, 1997, White broadly, 2005 of UK.) దాంతో యాంటీ ఆక్సిడెంట్స్‌ను కృత్రిమంగా ఉత్పత్తి చేసి మానవ దేహాలకు అందించి చూస్తే అవి పనిచేయకపోగా కొన్ని హాని చేస్తున్నాయి!

యాంటిఆక్సీడెంట్స్‌ అవశ్యకత, లభ్యత

ప్రస్తుత పరిస్ధితులలో సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సాధారణ మానవ దేహానికి అందించవలసిన యాంటీ ఆక్సిడెంట్స్‌ పరిమాణం సగటున రెండు, మూడింతలు కావల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మరల ప్రకృతివైపు దృష్టి సారించి ఫలితాలను చూశాక ప్రకృతి సిద్దంగా తయారైన పండ్లు, కూరలు, ఆహారధాన్యాలు, పాలు వంటి వాటి ద్వారా లభించే యాంటి ఆక్సిడెంట్స్‌ తప్ప మరోమార్గం లేదని నిర్ధారించుకున్నారు. ఈ దిశగా జరిగిన పరిశోధనల్లో కొలెస్ట్రాల్‌ను అదుపు చేసేందుకు మార్కెట్‌లో దొరికే మందులకన్నా సోయాబీన్‌లో ఉన్న ఫైటోకెమికల్స్‌ అంటే యాంటి ఆక్సిడెంట్‌లే మెరుగ్గా పలాంటి ఇతరదోషాలు లేకుండా చక్కగా పని చేస్తాయని వెల్లడిస్తున్న పరిశోధన (DurantiI-et-al., 2004) ఫలితం పేర్కొనదగినది. మానవ మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని సంరక్షించడానికి సహజంగా లభించే ఆహారోత్పత్తుల్లో లభించే యాంటి ఆక్సిడెంట్స్‌ మాత్రమే సర్వశ్రేష్టమైనవని శాస్త్రీయంగా ఋజవయ్యాక యాంటి ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా లభించే ఆహారోత్పత్తుల కోసం అన్వేషణ, తపన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఇది మన దేశానికి మంచి అవకాశం. అసలు మొక్కలలో ఫైటో కెమికల్స్‌ లేదా యాంటి ఆక్సిడెంట్స్‌ ఎందుకు తయారవుతాయి, ఎలా నిల్వ ఉంటాయి, మనకెలా అందుతాయి వంటివి తెలుసుకుందాం.

సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు, (Ultra Violet Rays) వాటి ప్రభావానికి లోను కాకుండ చేపట్టే రక్షణ క్రియలు ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. మొక్కలు కూడా అలాంటి రక్షణ చర్యల్లో భాగంగా ఫైటో కెమికల్స్‌ను తయారు చేసుకుంటాయి. ఆర్గానిక్‌ సేంద్రీయ విధానంలో మొక్కలు తెగుళ్ళు, కీటకాలు, వ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవటానికి అధికమొత్తంలో యాంటి ఆక్సిడెంట్స్‌ను తయారు చేసుకుంటాయి. మొక్కల్లో అలా తయారైన ఫైటోకెమికల్స్‌ వాటి అవసరం తీరాక మొక్కల్ల్లో నిల్వ ఉండిపోతాయి. అవే యాంటీ ఆక్సిడెంట్స్‌లో ప్రధానాంశం. అలా మొక్కల్లో పోగుపడిన యాంటీ ఆక్సిండెంట్స్‌ పండ్లు, ఆకులు, కాయలు, ధాన్యం ద్వారా మనకు సహజంగా లభిస్తున్నాయి. ఈ యాంటీ ఆక్సిండెంట్స్‌ లభ్యత స్ధాయి భూమి తీరు, సేద్యం విధానాలను బట్టి ఉంటుంది. రసాయనిక పరువులు నేలలోని సహజ జీవక్రియను క్షీణింప జేస్తుండగా, సేంద్రియ పరువులు జీవక్రియను వృద్ధిచేస్తున్నట్లు వెల్లడైంది. అలాగే చురుకైన జీవక్రియ కలిగిన వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తి అయిన ఆహారోత్పత్తుల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్ల స్ధాయి హెచ్చుగా ఉంటుంది.

అరటే మొక్కల నుండి మనకు పొట్ట నింపుకో డానికి కావాల్సిన ఆహారం, ఆరోగ్యాన్ని నిల్పుకోడానికి అవరమైన ఔషధశక్తి కూడా లభిస్తోంది. ఈ సౌలభ్యం భూమండలం అంతటా లేదా ప్రపంచం లోని అన్ని దేశాలకు సహజంగానే సమానంగా లేదు. పంటలు పండించటానికి సారవంతమైన భూములు, శ్రమించే చేతులు, తగిన నీటి వనరులు కావాలనే షరతు అందరికి సమానమే. ముఖ్యమైన మరో అంశం సేద్యం చేసే విధానం. మనకు మొక్కల నుండి ఆహారం, ఆరోగ్యం పుష్కలంగా లభించాలంటే భూమి సారాన్ని, జీవ చైతన్యాన్ని సంరక్షించే సేంద్రియ సేద్యం అన్నింటికన్నా మెరుగైనది. కనుక సేంద్రియ సేద్యంతో లభించిన ఆహారోత్పత్తుల కోసం ప్రపంచమంతటా డిమాండ్‌ మొదలైంది.

భారత రైతులే రేపటి రాజులు

రేపటి డిమాండ్‌కు తగిన మేర సేంద్రియ ఆహారోత్పత్తులను అందించగలిగిన రైతన్నలదే రేపటి రాజ్యం. సేంద్రియ సేద్యంతో ‘భారతదేశంలో ఒకప్పుడు రైతే రాజు’ అన్న మాటను మళ్ళీ మన రైతులు సార్థకం చేయగలరు. భారత్‌ను కేవలం అన్నపూర్ణగానే కాక ఆరోగ్య ప్రదాయినిగా కూడా ప్రపంచం ముందు నిలుపగలరు.

రేపటి ప్రపంచ అవసరాలను, మనకు ఉన్న వనరులను పరిశీలిస్తే విస్తారమైన సాగు నేలలు, అపార మానవశక్తి, ఏడాది పొడవునా అత్యధిక సమయం ప్రసరించే సూర్యకిరణాల సాయంతో ప్రపంచ అవసరాలు తీర్చగల అవకాశం భారత రైతులకే వున్నట్లు స్పష్టమవుతోంది.

సేంద్రియ సేద్యానికి భారీ యంత్రసామాగ్రి అవసరం లేకపోవటం, చిన్న కమతాలలో శ్రద్ధగా సేద్యం చేయగలిగిన మానవ వనరు, వేల సంవత్స రాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన సేద్య అనుభవం భారత గ్రామీణ రైతాంగానికి కలిసొచ్చే అంశాలు.

లక్ష్య సాధన, కార్యాచరణ మార్గం

ఇది వాస్తవ రూపం దాల్చాలంటే

– ప్రజలకు సేంద్రీయ ఆహారం (Organic Plant Produce) వల్ల మహాభాగ్యమైన ఆరోగ్యం లభిస్తుందని విశ్వసనీయ వర్గాల (ప్రభుత్వముల) ద్వారా ప్రచారం జరగాలి.

– ఈ ప్రచారంలో ప్రజలు మోసపోకుండా వాస్తవమైన (genuine) సేంద్రీయ ఆహారము (Organic Plant Produce) PGS (Participatary Guarantee Scheme) సర్టిఫికెట్‌ విధానం అమలులో ఉంది. దీని ద్వారా ప్రజలకు సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం పెరుగుతుంది.

– ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సంస్థలు విశ్వసించే పరిశోధన ఫలితాలు సవివరంగా ఉంచినప్పుడు మన ప్రజలతోపాటు అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలకు కూడా తెలియడంతో మన సేంద్రీయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు మార్కెట్‌ ఏర్పడి మన రైతుల సేంద్రీయ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన డిమాండ్‌ ఏర్పడుతుంది.

పరిశోధించవలసిన అంశాలు

– Total Antioxidant capacity of various plant based organic food versus conventional chemical based food.

– Antioxidants focused dietary guidance.

– How the efficacy of chemical therapies substantially increase with the support of high capacity of antioxidants food intake.

– Meta analysis.

– ఆహారంలోని రసాయన అవశేషాల వల్ల (Chemical residues) ధ్వంసం అవుతున్న మానవాళి ఆరోగ్యం.

దేశంలోని శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు ఆలోచించి మరిన్ని పరిశోధనారశాల గురిరచి విస్తృతంగా చర్చించాలి. దేశవ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు (ICAR Research Centers), అందులో అగ్రశ్రేణి (Worldclass) మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఏ ఏ ప్రయోగాలు చేయాలో స్పష్టీకరించి పరిశోధనకు తగిన నిధు లివ్వాలి. ఇది కూడా ఏటేటా రసాయన ఎరువులపై ఇచ్చే సబ్సిడీ వ్యయంలో అల్పారశం మాత్రమే.

అవకాశం రూపంలో అదృష్టం తలుపు తట్టినపుడు అందిపుచ్చుకోగలిగిన వ్యక్తులు, దేశాలు అదృష్టవంతులుగా, భాగ్యశాలురుగా చరిత్రకెక్కుతారు. సేంద్రియ ఆహారోత్పత్తుల డిమాండ్‌ రూపంలో అదృష్టం భారత రైతుల తలుపు తడుతోన్న ఈ తరుణంలో ప్రభుత్వాలు వారికి అండగా నిలవాలి. కోట్లాది నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, గ్రామీణ భారతంలో అద్భుతమైన సంపద సృష్టించాలి. భారతదేశం సేంద్రీయ సేద్యంలో అగ్రగామిగా అవతరించాలని; ఆరోగ్య, సౌభాగ్య భారతం కావాలని ఆశిద్దాం!

– రచయితలు

చిట్టూరి సుబ్రహ్మణ్యం, ట్రస్టీ,

వెంకటకృష్ణ, సలహాదారు, ఏకలవ్య ఫౌండేషన్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *