బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

17 వేల ద్వీపాలతో అతిపెద్ద ద్వీపసమూహ మైన ఇండోనేషియా హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ మహా సముద్రంలో విస్తరించి ఉన్న దేశం. 2014 వరకు ఈ దేశానికి నిర్దుష్టమైన, స్థిరమైన సముద్ర విధానం అంటూ ఏదీ లేదు. కానీ ఎప్పుడైతే చైనా దక్షిణ చైనా సముద్రంలో కూడా తన సామ్రాజ్య వాద, విస్తరణవాద ధోరణిని చూపడం ప్రారంభిం చిందో, సముద్ర సిల్క్‌ మార్గం అంటూ భూభాగాల ఆక్రమణకు పాల్పడిందో అప్పుడు ఆసియాన్‌ దేశాలన్నీ మేలుకొన్నాయి. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సముద్ర విధానాన్ని రూపొందించుకోవడం ప్రారంభించాయి. సముద్ర జలాలపై తమ ఆధిపత్యాన్ని తెలుపుతూ చైనా చేసిన ప్రకటనలకు జవాబుగా 2014 తూర్పు ఆసియా సమావేశాల్లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో వీడొడో తమ దేశపు సముద్ర విధానాన్ని ప్రకటించారు. తమ దేశానికి చెందిన వివిధ ద్వీపాల మధ్య మార్గాలు నిర్ధారించడానికి, వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా చైనా సాగించదలచిన సామ్రాజ్యవిస్తరణను అడ్డుకు నేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని భావించారు.

సాబంగ్‌ నౌకా కేంద్రంలో ప్రవేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఇండోనేషియా సముద్ర వ్యవహారాల మంత్రి లుహుట్‌ పంద్‌ జైతన్‌ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సముద్ర సంబంధాలను ఏర్పరచడానికి తగిన భూమికను ఏర్పరచింది. సముద్ర దౌత్యాన్ని పటిష్టం చేసేందుకు వ్యూహాత్మక సాబంగ్‌ నౌక కేంద్రంలో భారత్‌కు ఆర్ధిక, సైనికపరమైన అనుమతిని ఇస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇండోనేషియా తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా నరేంద్ర మోదీ సాబంగ్‌ కేంద్రానికి నౌకలో వెళ్ళి అక్కడ ఒక ఆసుపత్రి, ఇతర సదుపాయాలను ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ వాతావరణం బాగాలేకపోవడంతో చివరి నిముషంలో ఆ కార్యక్రమం రద్దయింది. సాబంగ్‌ నౌకా కేంద్రం భారత్‌కు చాలా కీలకమైనది. ఎందుకంటే భారత నౌకావాణిజ్యంలో 40 శాతానికి పైగా సాగే మలక్కా మార్గంలో అండమాన్‌ నికోబార్‌ దీవులకు 500 నాటికల్‌ మైళ్ళ దూరంలో ఉన్న ఈ కేంద్రం చాలా వ్యూహాత్మకమైనది. అత్యాధునిక సదుపాయాలు లేకపోయినా సాబంగ్‌ నౌకా కేంద్రం 40 మీటర్ల లోతైన సముద్ర జలాలతో సబ్‌మెరైన్‌లకు కూడా ప్రవేశం కలిగించగలదు. ఇప్పుడు ఈ కేంద్రం భారత్‌కు అందుబాటులోకి రావడంతో భారత సముద్రతీరం సీషెల్స్‌ నుండి ఇండోనేషియా వరకు విస్తరిస్తుంది.

2016లో వీడొడో భారత పర్యటనకు వచ్చిన ప్పుడు రెండు దేశాలు నౌకా వాణిజ్యానికి సంబం ధించి మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించు కున్నాయి. 2017లో రెండు దేశాలు సంయుక్తంగా నావికాసైన్య విన్యాసాలు నిర్వహించాయి. సముద్ర జలాల్లో చైనా సాగిస్తున్న సామ్రాజ్యవిస్తరణ విధానాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, ఖచీజకూూూ వంటి అంతర్జాతీయ చట్టాల ప్రకారం సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించు కున్నాయి.

రెండు దేశాల మధ్య బంధం

తూర్పు దేశాలతో సఖ్యం అనే విధానానికి తగినట్లుగా మే 29 నుండి రెండు రోజులపాటు ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. నిజానికి భారత, ఇండోనేషియాల మధ్య రెండు సహస్రాబ్దాల సాంస్కతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. 1వ శతాబ్దంలోనే భారత వ్యాపారస్తులు ఇండోనేషియాకు వెళ్లారని చరిత్ర ఆధారాలు లభ్యమవుతున్నాయి. హిందూమతం, బౌధ్ధమతం ఇండోనేషియాలో బాగా వ్యాపించాయి. రామాయ ణాన్ని అక్కడ ‘యాదవాద్వీప’ అని అంటారు. బాలి, సులవేసి దీవులలో చాలామంది ఇప్పటికీ హిందూ సాంస్కతిక విలువలను పాటిస్తారు. బోర్డుదూర్‌, పరమ్‌ బానన్‌ దేవాలయాలు ఈ ద్వీప సముదా యంపై హిందూ, బౌద్ధ మతాల ప్రభావాన్ని ప్రతిబింబి స్తాయి. 9వ శతాబ్దంలో అరబ్‌ వ్యాపారులతోపాటు ఇక్కడ ప్రవేశించిన ఇస్లాం 13వ శతాబ్దంనాటికి ప్రధాన మతమయ్యింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ముస్లిం అధిక్య దేశంగా మారినప్పటికి ఇండోనేషియాలో రామాయణ, మహాభారత ప్రభావం మాత్రం పోలేదు. రెండు దేశాలమధ్య బలమైన సాంస్కతిక సంబంధాలను గుర్తుచేస్తూ రామాయణ, మహాభారతాలు ప్రధాన అంశంగా జకార్తాలో ఏర్పాటైన గాలిపటాల పండుగను ప్రధాని మోదీ ప్రారంభించారు. విద్యకి దేవతగా భావించే గణేశుని బొమ్మ ఒకప్పుడు ఇండోనేషియా మారకద్రవ్యంపై (కరెన్సీ నోట్లు) ఉండేది.

భారత, ఇండోనేషియాలకు ఒకేరకమైన ఆర్ధిక, సార్వభౌమ లక్ష్యాలున్నాయి. 1955లో అలీన ఉద్యమం, ఆఫ్రికా ఉద్యమానికి మద్దతు పలికిన ఆసియా-ఆఫ్రికా బాండుంగ్‌ సదస్సు రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు గుర్తు. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో 1951లో మొదటి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు హాజరయ్యారు. అప్పుడు రెండు దేశాలు స్నేహ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే 1974లో సముద్ర జలాల్లో సరుహద్దులను నిర్ణయించుకుంటూ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీనివల్ల నికోబార్‌, సుమిత్ర దీవుల సరిహద్దులు నిర్ణయ మయ్యాయి. కొంతకాలం స్తబ్దత తరువాత అన్ని ఆసియన్‌ దేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్న తూర్పుదేశాల విధానాన్ని అనుసరించి భారత్‌ 1990లో ఇండోనేషియాతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది. 1995లో జరిగిన బహుస్తరీయ మిలాన్‌ విన్యాసాలతో భారత, ఇండోనేషియాల మధ్య సముద్ర సంబంధాలు కొత్త జీవం పోసుకున్నాయి. 2002 నుండి రెండు దేశాలు కలిసి అండమాన్‌ ప్రాంతంలో నౌకా నిఘా (జూ=ూూు) ను నిర్వహిస్తున్నాయి.

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచుకుంటూ రెండు దేశాలు ‘భారత, ఇండోనేషియాల మధ్య ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో నౌకాయాన సంబంధాలలో సహకారం, ఉమ్మడి విధానం’ అనే పత్రంపై సంతకాలు చేశాయి. అప్పటివరకూ ఆసియన్‌ దేశాల మధ్య ఆసియా – పసిఫిక్‌ భౌగోళిక రాజకీయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగేది. కానీ ఈ పత్రం రూపొందిన తరువాత ఇండో-పసిఫిక్‌ విధానం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడిఉండటానికి చైనా తిరస్కరించడంతో అనేక దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని ద ష్టిలో పెట్టుకుని భారత, ఇండోనేషియాలు రూపొందించు కున్న పత్రంలో ‘ఖచీజకూూూ వంటి అంతర్జాతీయ చట్టాలను, సార్వభౌమాధికారం, భౌగోళిక ప్రతిపత్తి, స్వేచ్ఛాయుత, పరస్పర ప్రయోజనకారక వాణిజ్య, పెట్టుబడి విధానాన్ని గౌరవిస్తూ స్వేచ్చా, పారదర్శక, నిబంధనలు గౌరవించే, శాంతియుత, సుసంపన్న, సమీకత ఇండో-పసిఫిక్‌ ప్రాంతం ఏర్పాటుకు కషి చేస్తాము’ అని రెండు దేశాలు పేర్కొన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో అభివద్ధికి సముద్ర జలాల రక్షణ అవసరాన్ని కూడా రెండు దేశాలు నొక్కి చెప్పాయి. భారత్‌ సాగర్‌ విధానం, ఇండోనేషియా జి.ఎం.ఎఫ్‌. విధానాలకు అనుగుణంగా రెండు దేశాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.

ఇండోనేషియాలో అలజడి

భారత్‌ మాదిరిగానే వివిధత్వం కలిగిన ఇండో నేషియా సమాజంలో కూడా ఇస్లామిక్‌ ఛాందసవాదం మూలంగా సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలోని కొన్ని చర్చిలలో వరుస బాంబు పేలుళ్లు జరిగి 13 మంది చనిపోయారు. ఈ పేలుళ్లు రంజాను సందర్భంగా జరగడం గమనార్హం. సాధారణంగా రంజాను మాసాన్ని పవిత్రతకు గుర్తుగా భావిస్తారు. కానీ మతఛాందసవాదులు మాత్రం అప్పుడే దాడులు చేయ డానికి అనువైన సమయమని అనుకుంటున్నారు. ఈ పేలుళ్ళకు కారణం ఇటీవల (ఇండోనేషియా) దేశానికి సిరియా నుండి తిరిగివచ్చిన మాజీ ఐ.ఎస్‌. కార్యకర్తలని దర్యాప్తులో తేలింది. తీవ్రవాదాన్ని పూర్తిగా అణచివేయాలన్న భారత విధానానికి పూర్తిగా మద్దతుపలికే ఇండోనేషియా గూఢచారి సమాచారాన్ని పంచుకునేందుకు, తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరించేందుకు సంసిద్ధతను తెలిపింది.

రక్షణ, ఆయుధాలు

రక్షణ, ఆయుధ తయారీ రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని రెండు దేశాల అధినేతలు నిర్ణయిం చారు. దీనితోపాటు మందుల తయారీ, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకరించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ రంగాలకు సంబంధించి 15కు పైగా ఒప్పందా లపై సంతకాలు చేశాయి. పర్యాటక సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు చాంది ప్రాంబనన్‌, తాజ్‌ మహల్‌ అనే ప్రపంచ వారసత్వ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాయి.

వాణిజ్యం రెట్టింపు

ఆసియాన్‌ దేశాల్లో ఇండోనేషియాతోనే భారత్‌కు అత్యధిక వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. ఇండోనేషియా నుంచి పామాయిల్‌, బొగ్గు అత్య ధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ది రెండవ స్థానం. 2016-17 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17 బిలియన్‌ డాలర్లు ఉంది. దీనిని 2025 నాటికి రెట్టింపు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. పర్యాటక, వాణిజ్య రంగాలకు కొత్త ఊపును తెచ్చేందుకు అండమాన్‌ నికోబార్‌ దీవులు, సుమిత్ర ప్రాంతం మధ్య రాకపోకలను మరింత సులభతరం చేయాలని నిర్ణయించుకున్నాయి. తమ ‘అవినీతి రహిత, పౌర ప్రాధాన్య, అభివద్ధి దోహద’ ప్రభుత్వ విధానాల్లో భాగంగా ఇండోనేషియా వాసులకు 30 రోజుల ఉచిత వీసా పద్ధతిని ప్రవేశ పెడుతున్నట్లు భారత సంతతికి చెందినవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ప్రకటించారు.

త్రైపాక్షిక ఒప్పందం

చైనా దురాక్రమణ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరొక ఆసియాన్‌ దేశం వియత్నాం. భారత్‌, ఇండోనేషియా, వియత్నాంల మధ్య త్రైపాక్షిక సముద్ర సహకార ఒప్పందం మూడు దేశాలకు మేలు చేస్తుందని భావిస్తున్నా అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే నవంబర్‌ 2018లో భారత, ఇండోనేషియా, ఆస్ట్రేలియాల మధ్య మాత్రం మొట్టమొదటి సీనియర్‌ అధికారుల స్థాయి త్రైపాక్షిక సంభాషణలు ప్రారంభమవుతాయని నేతలు ప్రకటించారు. ఈ సంభాషణల ప్రాధాన్యతను గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్‌ మెడ్‌ కాఫ్‌ ‘భారత, ఇండోనేషియాలు తమ భౌగోళిక ప్రత్యేకతలను దష్టిలో పెట్టుకుని నూతన ప్రాంతీయ కూటముల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి కూటములతో కలవడం ఆస్ట్రేలియాకు కూడా ప్రయోజనకారి’ అన్నారు.

చైనాకు చెక్‌

చైనా విస్తరణవాద విధానాలపట్ల వ్యతిరేకత వ్యక్తంచేస్తున్న ఇండోనేషియా నతునా దీవులపై చైనా కన్ను పడకుండా చూసుకునేందుకు ఆ ప్రాంతానికి ఉత్తర నతునా సముద్రం అని కొత్తగా నామకరణం చేసింది. దీనిద్వారా చైనా ప్రత్యేక ఆర్ధిక నడవా వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడింది. ఇండోనేషియా తీసుకున్న ఈ చర్య చైనాకు కొంత అసంతప్తి కలిగించింది. దీనితో తమ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకునేందుకు ఇండోనేషియా కొన్ని మౌలికసదుపాయాల అభివద్ధి ప్రాజెక్ట్‌లను చైనాకు అప్పగించింది. 2016 నుండి తమ సముద్ర జలాల్లోకి తరచుగా చొచ్చుకువస్తున్న చైనా దుశ్చర్యలను దష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో నిఘాను ఇండోనేషియా మరింత పెంచింది. అలాగే చైనాకు గట్టి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశ్యంతో సముద్ర జలాల వ్యవహారాల మంత్రి వీడొడో నతునాలోని రనై మిలటరీ స్థావరాన్ని సందర్శించారు. అలాగే తరచూ అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించే చైనాకు చెక్‌ పెట్టడం కోసం ఇండోనేషియా భారత్‌, జపాన్‌, అమెరికా మొదలైన దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో పడింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను సాధించాలంటే భారత్‌తో సత్సంబంధాలు అత్యవసరమని ఇతర ఆసియాన్‌ దేశాల మాదిరిగానే ఇండోనేషియా కూడా భావిస్తోంది. ఆ దిశగానే నౌకాయాన సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు అడుగు ముందుకు వేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాల మధ్య సంబంధాల్లో ఈ నూతన అధ్యాయం ‘ఆసియాలో సమీకరణలను పూర్తిగా మార్చివేస్తుంది’ అని ప్రముఖ విశ్లేషకుడు సి. రాజా మోహన్‌ అన్నారు. ఇండో నేషియాకు తన మొదటి పర్యటనలోనే ప్రధాని మోదీ ఇండోనేషియాతో కుదుర్చుకున్న నౌకాయాన ఒప్పందం ఆసియాలో సాగుతున్న ‘ప్రాబల్యం కోసం పోటీ’ లో కీలక పాత్ర వహిస్తుందనడంలో సందేహం లేదు. న

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *