బంగ్లా సెగకు బెంగాల్‌ విలవిల

బంగ్లా సెగకు బెంగాల్‌ విలవిల

బంగ్లాదేశీయుల వరద ప్రవాహంతో తామరతంపరగా వృద్ధి చెందుతున్న జాతి వ్యతిరేక శక్తుల వలన పశ్చిమబెంగాల్‌లోనూ కశ్మీర్‌ వంటి పరిస్థితే తలెత్తుతోంది. బెంగాల్‌ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అల్లర్లకు బసిర్హత్‌, బదురియా ఇపుడు నెలవుగా మారాయి. ఈ ప్రశాంత ప్రాంతాలను అటువంటి నరకంగా మార్చవచ్చని విశ్వసించడం కష్టం. ఫేస్‌బుక్‌లో ఒక 17 ఏళ్ళ బాలుడు చేసిన కొన్ని విద్వేష వ్యాఖ్యల వలన మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని భావిస్తున్నారు.

ఓటు బ్యాంకుపైనే దృష్టి

పశ్చిమబెంగాల్‌లో ఇప్పుడున్న చొరబాట్లు, దొంగ రవాణా, మానవ అక్రమ రవాణా, ఇంకా కొన్ని ఇతర సమస్యలు బెంగాల్‌ అరిష్ట రూపాంతరీకరణను అర్థం చేసుకోవడానికి వరుసగా వచ్చిన ప్రభుత్వాల పాత్రను పరిగణించాల్సి ఉంటుంది. 34 సంవత్సరాల కమ్యూనిస్టు, వారి వెంట ఇప్పటి తృణమూల్‌ కాంగ్రెస్‌ (ువీజ) పాలకులు తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడంపై మాత్రమే దృష్టిపెట్టారు. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ నుండి ముస్లింలు ప్రవేశించి, స్థిరపడడానికి యుక్తిగా ప్రోత్సహించారు. తమ ‘భారత’ జాతీయతను స్థాపించుకోవడానికి వీలుగా ఈ ‘విదేశీ’ జాతీయులకు రేషన్‌ కార్డులు అందించారు. కమ్యూనిస్టులు ప్రారంభించి మూడు దశాబ్దాలు కొనసాగిన ఈ హానికర కార్యకలాపాలు ప్రస్తుత మమతాబెనర్జీ ప్రభుత్వం సైతం దత్తత తీసుకోవడంతో స్థిరత్వం పొందాయి. బసిర్హత్‌లో దశాబ్దాలుగా ఎప్పుడూ ముస్లిం జనాభానే ఉన్నప్పటికీ, వారు మతంమారిన, తరాల తరబడి ఉంటున్నవారే కాని గోడదూకి భారతదేశంలో ప్రవేశించినవారు కాదు. అందువలన పూర్వకాలంలో బహుళ మత సజాతీయ జనాభా మైత్రితో సహజీవనం చేసేవారు.

మమతాబెనర్జీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మహిళా ముఖ్య మంత్రి ఉన్న రాష్ట్రం భారతదేశంలో భద్రత (ప్రత్యేకించి మహిళలకు) తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నది. వివిధ ప్రభుత్వ శాఖలలో అవినీతి ప్రబలంగా ఉంది. నేరాల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది.

ఎన్నికల ఉద్దేశాలతో ఈ అక్రమ బంగ్లాదేశీ జాతీయుల ప్రవాహాన్ని అనుమతించడం వలన ఇప్పటికే ఉన్న సమస్యలు మరింతగా ముదిరాయి. డెబ్బై, ఎనభై దశకాలలో బెంగాల్‌లో జనాభా నిష్పత్తి మార్పుకు దిల్లీ పాలకులు సహకరించారు.

ఆసక్తికరంగా, సిపిఎం కురువృద్ధుడు జ్యోతిబసు నాయకత్వంలో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు పాలనలోనే బెంగాల్‌ దుర్గతి ప్రారంభమైంది. అభివృద్ధి మార్గంపై ఆయన నిర్లక్ష్యం పశ్చిమ బెంగాల్‌ తన పూర్వవైభవం కోల్పోయేలా చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్‌ అసాధారణ ప్రగతిని ప్రదర్శించి, దేశంలో అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

నెలకొల్పిన కర్మాగారాలు, కల్పించిన ఉపాధి óఅవకాశాలనుబట్టి పరిశీలిస్తే, మధ్య ఎనభైల వరకు బొంబాయి రాష్ట్రాన్ని (మహారాష్ట్ర, గుజరాత్‌లు కలిసి ఉన్న) దాటి, బెంగాల్‌ రెండవ అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా ఉండేది. బుద్ధదేవ్‌ భట్టాచార్య నేతృత్వంలోని కమ్యూనిస్టు పాలన చివరి రోజులు ఆయన పూర్వీకుల ఇనుపతెర సంవత్సరాలకు భిన్నం. కార్మిక అశాంతి, పెరిగిపోతున్న రుణాలు, పెట్టుబడిలేమి, విస్తృతమైన నిరుద్యోగాలతో బాధపడుతున్న కమ్యూనిస్టు పాలనను వారసత్వంగా పొందిన బుద్ధదేవ్‌ తన సహచరులను మరింత అభివృద్ధి దృక్పథంవైపు ఆకర్షించేందుకు ప్రయత్నించాడు.

జ్యోతిబసు పరిపాలన విధానంతో, శక్తివంతులైన శ్రామికవర్గం ఈ మార్పులతో క్రుంగిపోయి విశ్వాసం మార్చుకోవడం టిఎమ్‌సికి కలసి వచ్చింది. జ్యోతిబసు నిరంకుశ స్టాలినిస్ట్‌ పరిపాలనను 30 సంవత్సరాలు సహించిన బెంగాల్‌ ప్రజలు బుద్ధదేవ్‌ భట్టాచార్యకు మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించలేదు.

బెంగాల్‌ సామాజిక, రాజకీయ క్షేత్రంలో చాలాకాలం ఆధిపత్యం వహించిన కమ్యూనిస్టులు ఉత్తమ పనితీరు చూపకున్నప్పటికీ అధికారం నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు. సరిహద్దులు దాటి వచ్చిన అక్రమ బంగ్లాదేశీయులకు స్థిరత్వం కల్పించి, తమ ఓటు బ్యాంకును పెంపొందించుకోవడం వలననే ఇది సాధ్యమైంది. ఆ విధంగా దశాబ్దాలపాటు అదుపులేని చొరబాట్ల వలన పశ్చిమబెంగాల్‌లో బంగ్లాదేశీ ముస్లిం జనాభా భారీగా పెరిగిపోయింది.

2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్‌లో ముస్లిం జనాభా 27 శాతానికి పెరిగింది. దేశ విభజన పూర్వస్థాయికి వేగంగా చేరుతున్నట్లు ఈ గణాంకాలు చెపుతున్నాయి. 1941లో బెంగాల్‌లో ముస్లిం జనాభా అత్యధికంగా 29 శాతం ఉండేది. 1947లో సామూహిక వలసల తరువాత 1951లో ఉన్న 19.5 శాతంతో పోల్చినపుడు ప్రస్తుత గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక దశాబ్దంలో ఏర్పడిన వృద్ధిని ప్రత్యేకించి పరిశీలిస్తే సమస్య మరింత జటిల మవుతున్నదని అర్థం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్‌ 2001-11 దశాబ్దంలో ముస్లింల వృద్ధిరేటు 1.77 శాతం. దేశంలో మొత్తం ముస్లింల వృద్ధిరేటు 0.8 శాతంతో పోల్చినపుడు ఇది చాలా అధికం. రాష్ట్రంలోకి వచ్చిన విదేశీ ముస్లింల ప్రవాహమే ఈ అసాధారణ వృద్ధికి కారణం అని చెప్పవచ్చు.

ఈ కారణంగా బెంగాల్‌లో కొన్ని బంగ్లాదేశీ స్థానికత ఉన్న ముస్లింల ప్రాంతాలు ఏర్పడ్డాయి. అక్కడి నుండి హిందువులను తరిమివేయడమో లేదా వారంత వారే పారిపోవడమో జరిగింది. మిగిలిన విదేశీయులు తమ సౌకర్యాన్ని అనుసరించి షరియా వ్యవస్థను పాటించసాగారు. తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుగుణంగా ఉన్నందున కమ్యూ నిస్టులుకాని, ప్రస్తుత మమతాబెనర్జీ ప్రభుత్వం కాని ఈ పరిణామాల పట్ల దృష్టి పెట్టలేదు.

భారతదేశ స్వర్గం కశ్మీర్‌తో బసిర్హత్‌ను పోల్చలేక పోయినా, ఇక్కడ పరిస్థితులు త్వరలోనే చేయిదాటు తాయనడం అతిశయోక్తి కాబోదు. విచ్చల విడి తీవ్రవాదంతో బెంగాల్‌ సరిహద్దు ప్రాంతాలు ఉగ్రవాదుల స్వర్గధామాలుగా మారాయి. ఇటీవలి బంగ్లాదేశ్‌లోని దాడులు, లౌకిక బ్లాగర్ల హత్యలను భారతదేశం ఎంతోకాలం పట్టించుకోకుండా ఉండలేదు. 2014 ప్రేలుళ్ళ తరువాత బెంగాల్‌లోని బుర్ద్వాన్‌ జిల్లాలో దాగి ఉన్న బంగ్లాదేశీ ఉగ్రవాదులను కనుగొనడం, బంగ్లాదేశీ జాతీయుల (తీవ్రవాదుల) చెదురుమదురు అరెస్టులు, తగు చర్యలు తీసుకోవలసిన సమయం ఇదేనని సూచిస్తున్నాయి. ఎక్కువ ఓట్ల కోసం ఇస్లామీయ కఠినవాదులకు తలొగ్గడం జాతీయ భద్రతకు ముప్పు కాగలదు.

విచారకరంగా, వారి దేశంలోని సాంప్రదాయ వాద ముస్లిం ముఠాలను కట్టడిచేయడానికి బంగ్లాదేశ్‌ ప్రయత్నిస్తుండగా, మరోవైపు రాజకీయాలు, మైనారిటి బుజ్జగింపులు- అల్లర్లు, మానభంగాలు, పోలీస్‌స్టేషన్‌ భవనాలను దహనం చేస్తున్న విదేశీ సాంప్రదాయ వాదుల గుంపులను సృష్టిస్తున్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్టుద్వారా ఇటీవలి హింసాత్మక అల్లర్లకు కారణమైన బాలుడి విచారణకు చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న ప్పటికీ, సాంప్రదాయవాదులైన ఇస్లామిస్టులు షరియత్‌ చట్ట ప్రకారం ‘నేరస్తుడిని’ చంపివేయాలని పట్టుబడుతున్నారు.

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన సాంప్రదాయవాద ఇస్లామిస్టుల పెరుగుదల బెంగాల్‌ రాజకీయ పాలకులు సృష్టించినదేకాని మతపరమైనది కాదని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.

ప్రధానంగా శాంతిభద్రతల పరిస్థితిని మెరుగు పరచి, ఈ దుశ్చర్యలను చేస్తున్న వారిని గుర్తించి శిక్షించడం ద్వారా సాధారణ హిందువులు, ముస్లింలు శాంతియుతంగా జీవించగలుగుతారు. అదే సమయంలో, మత సంబంధిత కారణంతో బెంగాల్‌ రాష్ట్రం అకతాయిల బందీగా ఉండే ‘బనానా రిపబ్లిక్‌’ వంటి ప్రదేశం కాదని పునరుద్ఘాటిస్తూ అక్కడి ప్రజానీకానికి విశ్వాసం కలిగించాలి. స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, మహర్షి అరబిందోల జన్మభూమి పూర్వ, ప్రస్తుత పాలకుల పుణ్యమా అని ఇప్పుడు కష్టాల్లో చిక్కుకున్నది. మాతృభూమిలోని ఈ ప్రాంతాన్ని తీవ్ర సంక్షోభానుంచి కాపాడటానికి జాతీయవాదులు రాజకీయ అవసరాలను అధిగమించి ముందుకు రావడం చాలా అవసరం.

–  ఇంద్రనీల్‌ బసురే, హృదయవ్యాధి నిపుణుడు,

భారత్‌-అమెరికా అభివృద్ధి కౌన్సిల్‌ చైర్మన్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *