పర్మా కల్చర్‌ – ప్రకృతి సేద్యర

పర్మా కల్చర్‌ – ప్రకృతి సేద్యర

‘ప్రకృతిని సంరక్షిరచే వారికి ప్రకృతిలోనే సమృద్ధి ఉరది, వనరులను అనాలోచితంగా దోపిడి చేస్తే వినాశకర భవిష్యత్తుకు దారితీస్తురది’ అనే స్పృహతో వనరుల పునరుజ్జీవనం, సుస్థిరతల కొరకు పాశ్చాత్యులు పర్మా కల్చర్‌ విధానంలో కృషి చేస్తున్నారు.

ప్రకృతితో మమేకమై సామరస్య జీవనం సాగిరచడమే భారతీయత. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను ప్రకృతి, పురుషులుగా; సమస్త జీవరాశిని పరమేశ్వరుని ప్రతిరూపంగా భావిరచిన సంస్కృతి నేర్పిన పాఠాలే మన భూమాత, గోమాత, గంగా మాత. అటువంటి శ్రేష్ఠమైన భారతీయ నాగరికత విదేశీయుల సంస్కృతిని నాగరికత, అభివృద్ధి పేరిట అనుకరిరచడం మొదలైన నాటి నురడి అడుగంటసాగిరది.

ప్రగతి పేరిట ప్రకృతిని దోచుకు తినడంలో మితి మీరిన పాశ్చాత్యులు ప్రపంచం నలుమూలలా పర్యావరణ మొట్టికాయలు తిన్నాక మరో గతిలేక భారతీయత వైపు దృష్టి సారిరచసాగారు. ఆరోగ్యవంతమైన సమాజం, గాలి, నేల, నీరు, పశుపక్ష్యాదులతో సహా ప్రకృతిని సంరక్షిరచుకురటూ అరదరికీ న్యాయమైన వాటా కల్పిరచాలనే లక్ష్యరతో సాగిరచిన అన్వేషణకు ‘సర్వేజనా సుఖినోభవరతు, సర్వేసంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యరతు, మా కశ్చిత్‌ దుఃఖభాగ్భవేత్‌’ అరటూ మన మునులు, ఋషులు వినిపిరచిన తరతరాల భారతీయ ప్రార్థనలో దారి కనిపిరచిరది.

ఏమిటీ పర్మా కల్చర్‌ ?

విద్యావంతులమని, విజ్ఞానులమని, శాస్త్రవేత్తలమని విర్రవీగిన పాశ్చాత్యులు విఫలమై, చివరకు తమ అహంకారం విడచి అడవి బాట పట్టారు. ఆధునిక యంత్ర సామగ్రి, రసాయనిక ఎరువులు వంటి వేమీ లేకురడా తరతరాలుగా అడవి బిడ్డలు సాగిస్తున్న సేద్యరలో ఉన్న సుస్థిరత వారికి ఆశాదీపమై కనిపించిరది. అభివృద్ధి పేరిట సాగుతున్న అస్థిర వ్యవసాయానికి విరుగుడుగా కనిపిరచిన ప్రాచీన భారతీయ గిరిజన జీవన విధానాన్ని తమదైన ఆధునిక బోధనా రీతుల్లో నూతన పాఠాలుగా మలచి ‘పర్మనెరట్‌ అగ్రికల్చర్‌’ అనే రెరడు ఆరగ్ల పదాల కలయికతో ‘పర్మా కల్చర్‌’ పేరిట ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రపంచానికి అరదిరచడం ఆరంభిరచారు.

‘నీరు, భూమి, అడవి.. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సుస్థిరమైన ప్రకృతి వనరుల నిర్వహణను, శాశ్వతమైన వ్యవసాయ పద్ధతులను, వైవిధ్యాన్ని ప్రోత్సహిరచి పెరపొరదించాలి; గ్రామీణ ప్రజలు తమ ఆహార పోషకాలకు, రక్షణకు, తమ స్థితి గతులకు తామే కర్తలయ్యేలా బలోపేతం కావాలి; ప్రకృతి వనరులను అరదుబాటులోకి తెచ్చుకోడానికి, పర్యావరణ సమస్యలను అధిగమిరచడానికి మహిళలను చైతన్యపరచాలి; అనే లక్ష్యాలతో, ‘ప్రకృతిని సంరక్షిరచే వారికి ప్రకృతిలోనే సమృద్ధి ఉరది, వనరులను అనాలోచితంగా దోపిడి చేస్తే వినాశకర భవిష్యత్తుకు దారితీస్తురది’ అనే స్పృహతో వనరుల పునరుజ్జీవనం, సుస్థిరతల కొరకు పాశ్చాత్యులు పర్మా కల్చర్‌ విధానంలో కృషి చేస్తున్నారు.

ఆద్యులెవరు ?

ఆస్ట్రేలియాకు చెరదిన బిల్‌మోల్లిసన్‌, డేవిడ్‌ హోమ్‌గ్రెన్‌లు ఈ పర్మా కల్చర్‌ సేద్య విధానానికి ఆద్యులని పేర్కొనవచ్చు. ఆస్ట్రేలియాలో 1978లో ప్రారంభమైన ఈ సేద్య పద్ధతి నేడు ప్రపంచంలోని పలుదేశాల్లో ఉద్యమంలా వ్యాపిస్తున్నది. ఈ విధానానికి సంబంధిరచిన అరతర్జాతీయ సదస్సు తొలుత ఆస్ట్రేలియాలో జరిగిరది. ఆ తరువాత అమెరికా, నేపాల్‌, క్రోయేషియా, డెన్మార్క్‌, బ్రెజిల్‌, మలాని, జోర్డాన్‌, క్యూబా, ఇరగ్లారడ్‌ దేశాల్లో జరిగిరది. 12వ అరతర్జాతీయ సదస్సు 2013లో క్యూబాలోని హవానా నగరంలో జరిగిరది. 13వ అరతర్జాతీయ సదస్సు ఈ ఏడాది మనదేశంలో ‘అరణ్య అగ్రికల్చర్‌ ఆల్టర్నేటివ్స్‌’ సంస్థ ఆధ్వర్యరలో జరిగిరది.

మనదేశంలో..

ఈ అరణ్య అగ్రికల్చర్‌ ఆల్టర్నేటివ్స్‌ సంస్థ 1999 నురడి ఆంధ్ర, తెలంగాణ ప్రారతాలలో రైతులకు సుస్థిర వ్యవసాయాధారిత జీవనోపాధుల కోసం పర్మాకల్చర్‌ పద్ధతులు అనుసరిరచేలా ప్రోత్సహిస్తున్నది. భూ వినియోగంలో ప్రకృతి సిద్ధమైన లయకు, పద్ధతులకు అనుగుణంగా పనిచేస్తూరడే జీవన విధానం; భూమి సంరక్షణ, ప్రజల సంరక్షణ, ప్రజలకు న్యాయమైన వాటా ఈ సంస్థ ముఖ్య నైతిక సూత్రాలు. రసాయనాలు, క్రిమిసంహారకాలను వ్యతిరేకిరచడం; ‘మురదు ఆహార అవసరాలు, ఆ తరువాతే వాణిజ్య అవసరాలు’ అరటూ ‘మన భూమి, మన విత్తనం, మన ఎరువు, మన పద్ధతి, మన జ్ఞానం’ అనేవి దీని ముఖ్య సిద్ధారతాలు. వాటర్‌షెడ్‌, నీటిపారుదల యాజమాన్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యర పెరపొరదేరదుకు కృషిచేస్తూ గిరిజనులకు, రైతులకు శిక్షణ ఇస్తోరది ఈ సంస్థ. అరతర్జాతీయ పర్మాకల్చర్‌ ఉద్యమ కౌన్సిల్‌ బోర్డు సభ్యులు కూడా అయిన కొప్పుల నర్సన్నది అరణ్య అగ్రికల్చర్‌ ఆల్టర్నేటివ్స్‌ సంస్థ నిర్మాణంలో ప్రధాన పాత్ర. ఈయన గడచిన 30 సంవత్సరాలుగా మన దేశంలో పర్మాకల్చర్‌ వద్ధని అనుసరిస్తూ, ప్రోత్సహిస్తున్నారు.

అరణ్య పర్మా కల్చర్‌ క్షేత్రము

తెలంగాణ రాష్ట్రర, సంగారెడ్డి జిల్లా ఝరా సంఘం మండల్‌, బిడకన్నె గ్రామంలో గల ఈ క్షేత్రం 10 ఎకరాలలో ఉన్న ఉష్ణ మండల వర్షాధార క్షేత్రము. అరణ్యం, వర్షంపై ఆధారపడిన వార్షిక ఆహార పంటలు పండుతాయి. ఇక్కడి అరణ్య క్షేత్రంలో సంవత్సరములో 365 రోజులు పండ్లనిచ్చే 200 రకాల పండ్ల జాతులు ఉన్నాయి. ఇరకా వైవిధ్యం గల జాతుల కొరకు సౌరశక్తితో నడిచే పంపు కూడా ఉరది. ప్రకృతిలోని మార్పులను తట్టుకురటూ ఒక కుటురబంలా పనిచేసే నమూనా ఇది. ప్రారంభిరచిన నాటి నురడి ఇప్పటి వరకు మన దేశ, ఇతర దేశాలకు చెరదిన రైతులు, ఔత్సాహికులు, విధాన రూపకర్తలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అన్వేషకులకు ఇది ఒక విద్యా సంస్థగా పనిచేస్తోరది. ఇక్కడ లభిరచే వివిధ రకాల కోర్సులలో ఆసక్తిగల వారు పాల్గొని శిక్షణ పొరదవచ్చు. పర్మాకల్చర్‌ పరిచయము అనేది 2-3 రోజులలో జరిగే రెసిడెన్సియల్‌ కోర్సు. ఇరదులో థియరీ, ప్రాక్టికల్స్‌ సమానంగా ఉరటాయి. ఈ కోర్సులో అరదరూ చేరి శిక్షణ పొందవచ్చు. మరిన్ని కోర్సులు, ఇతర వివరాల కోసం వారి ముఖ్య కార్యాలయాన్ని సంప్రదిరచవచ్చు.

వారి చిరునామా : ప్లాట్‌ నెర.203, సోనిసాయి కుటీర్‌, త్యాగరాయ నగర్‌, కొత్తపేట్‌, హైదరాబాద్‌-50035. తెలంగాణ. ఫోన్‌ నెరబర్లు : 9440826722, 994906 2295.

– రాంపస్రాద్‌ సీనియర్‌ జర్నలిస్టు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *