పరస్పర అవగాహనను పెంచిన వుహాన్‌ సమావేశాలు

పరస్పర అవగాహనను పెంచిన వుహాన్‌ సమావేశాలు

ఆసియాఖండంలో ఈ మధ్య జరిగిన కొరియన్‌, వుహాన్‌ శిఖరాగ్ర సమావేశాలు ఆసియాలో శాంతి, సహకారాలు పెంపొందించే దిశగా ముగిశాయి. కొరియా శిఖరాగ్ర సమావేశం పూర్తయిన తరువాత ఇరు కొరియా దేశాలు సంయుక్తంగా ప్రకటనను వెలువరించాయి. వుహాన్‌లో భారత్‌, చైనా దేశాలు రెండు రోజులు సమావేశ మయ్యాయి. అయితే ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటనను వెలువరించలేదు. మోది, జీ ఆరు పర్యాయాలు సమావేశమయ్యారు. పరిష్కారం సాధ్యంకాని సమస్యలను పక్కనబెట్టి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులలో ఇరు దేశాలు ఎలా మసలుకోవాలన్న విషయంగా చర్చించుకున్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత భారత్‌, చైనాలు విడివిడిగా ప్రకటనలు జారీ చేశాయి. నిజానికి ఈ రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి సహకరించు కోవడానికి ఒక నూతన మార్గాన్ని ఎంచుకున్నాయి.

అమెరికా ప్రభావం

అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య విధానం వలన చైనాకు ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడానికి చైనా భారత్‌తో కలిసి ముందుకెళ్ళాలని భావించింది. ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశానికి నాందిగా గత మార్చిలో చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనలో మాట్లాడుతూ ‘చైనా డ్రాగన్‌.. భారత్‌ ఏనుగు పరస్పరం కలహించుకోకుండా రెండూ కలిసి నాట్యమాడాలి’ అన్నారు. గడచిన ఫిబ్రవరిలో బీజింగ్‌ ఉపాధ్యక్షుని ఉన్నతిలో భారత్‌ సహాయ పడినందుకు భారత్‌ కోరినట్టు ఖీూుజు (ఖీఱఅaఅషఱaశ్రీ ూష్‌ఱశీఅ ుaరస ఖీశీతీషవ) లో పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా చైనా వ్యతిరేకించలేదు. చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వలేదు. 2015లో దీ=Iజూ సమావేశాల తర్వాత ఇరుదేశాల ఉన్నతాధికారుల పరస్పర పర్యటనల వలన చైనా, భారత్‌ల మధ్య సంబంధా లలో కదలిక వచ్చింది.

చైనాతో జరగనున్న సమావేశాల ద్వారా చెప్పుకోదగ్గ గొప్ప నిర్ణయాలు ఏమీ జరగవేమోనని భారత్‌ ముందే చెప్పింది. భారత్‌ ఊహించినట్లుగానే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్యల వల్ల క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు ఏవీ మెరుగుపడలేదు. చైనా అధ్యక్షుడు ‘జీ’ భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మరొక కారణ మేమంటే 2013లో అమెరికాలోని సన్నిలాండ్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఒబామాతో జరిగిన సమావేశం ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. పైపెచ్చు అమెరికాతో చైనాకు దూరం పెరిగింది. భారత్‌తోను సంబంధాలు సరిగా లేవు. అయినా వీటన్నింటిని పక్కనపెట్టి కొన్ని విషయాలపై భారత్‌తో ఏకాభి ప్రాయానికి రావడానికి సిద్ధమైంది. దాని పర్యవసా నమే వుహాన్‌ సమావేశం. ప్రధాన విబేధాలైన మసూద్‌ అజర్‌ విషయం, ఎన్‌.ఎస్‌.జి.లో సభ్యత్వం విషయం, ఇరు దేశాల మధ్య ఉన్న సమతుల్యత లేని వాణిజ్య సంబంధాలు ఇవేవీ చర్చకు రాలేదు. చైనా కూడా పాకిస్తాన్‌ గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు.

2015 సంవత్సరంలో మోది చైనా పర్యటనకు వెళ్ళినపుడు చైనా ప్రధాని లీకెకియాంగ్‌ మోదికి స్వాగతం పలికారు. అధ్యక్షుడు రాలేదు. ఇపుడు చైనా తన దౌత్య విధానంలో మార్పు తెచ్చుకుంది. మనదేశ ప్రధానికి గౌరవం ఇవ్వడానికి స్వయంగా చైనా అధ్యక్షుడు ‘జీ’ స్వాగతం పలికారు. ‘జీ’ వుహాన్‌లో ఎక్కువ సమయం మోదితోనే ఉన్నారు. మోదికి స్వాగతం చెపుతున్నపుడు హిందీ గీతం ‘తూహై వహే దిల్‌నే జిసే అప్నా కహా’ ఆలపించారు. వుహాన్‌ సరస్సు వెంట వ్యాహాళికి కలిసి వెళ్ళారు. ఇద్దరూ కలిసి హెరిటేజ్‌ మ్యూజియాన్ని దర్శించారు. ఇద్దరూ కలిసి ఒకే పడవపై ప్రయాణించారు. ఆ పడవపై ‘శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి’ అనే నినాదాలు కనిపించాయి. చైనా ప్రవర్తనలో కొంత సరళత కనిపించినా భారత్‌ కొన్ని విషయాలలో దృఢంగా నిలబడింది. దీవశ్ర్‌ీ తీశీaస ఱఅఱ్‌ఱa్‌ఱఙవ ను భారత్‌ వ్యతిరేకించింది. జూజుజ (చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌) ను వ్యతిరేకించింది. పాకిస్తాన్‌ పేరును ఎత్తకుండా తీవ్రవాదాన్ని ప్రోత్స హిస్తున్న దేశాలను, వాటి చర్యలను ఖండించాలని విదేశీ మంత్రుల సమావేశంలో చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒకవైపు మోది ప్రయత్నిస్తుంటే మరోవైపు కాంగ్రెస్‌ ప్రవక్త తన ‘ట్వీట్‌’ల ద్వారా ప్రధానిని అవమానపరిచే విధంగా వాఖ్యలు చేశారు. మోది వుహాన్‌లో ఉన్నా దేశభద్రత గురించి ప్రభుత్వం భారత్‌ – చైనా సరిహద్దులలో 96 కొత్త పోస్టులను ఏర్పాటు చేసింది. ఈ పోస్టులలో ఇండో – టిబెటన్‌ బార్డర్‌ పోలీసులను నియమించారు.

ఇరుదేశాల నాయకులు కొన్ని విషయాలలో ఒప్పందానికి వచ్చినా ఇంకొన్ని విషయాల్లో అది కుదరలేదు. భారత్‌ తీవ్రవాదాన్ని తుదముట్టించాలని ప్రకటిస్తే చైనా మాత్రం ఈ విషయంపై మృదువుగా స్పందించింది. ఎందుకంటే చైనాకు పాకిస్తాన్‌ మీద ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌తో చైనాకు వ్యూహాత్మకంగా ఉన్న ఆర్థిక సంబంధాలు విడదీయ రానివి. ప్రతీసారి చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూనే ఉంటుంది.

ఇరుదేశాల మధ్య ‘శాంతి’ నిలుపుకోవాలని, పరస్పర విశ్వాసం పెరిగే చర్యలు చేపట్టాలని, నమ్మకం, పరస్పర అవగాహన పెంచుకోవాలన్న విషయాలపై దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య సమాచార లోపం నెలకొనడం వల్లే డోక్లాం సమస్య తలెత్తిందని ఇక ముందు అలా జరుగకుండా ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు సరిహద్దు సమస్యల గురించి సమావేశమై సమస్యలు తలెత్తకుండా చూడాలనే నిర్ణయాకి వచ్చారు. భారతదేశం కూడా ఈ విషయంలో అవసరమైన మార్గదర్శకత్వం చేస్తానని తెలిపింది. సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్‌ భావిస్తోంది. కాని బీజింగ్‌ మాత్రం ఈ సమస్యను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది.

వైశ్వీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఆర్థిక విధానాలను రెండు దేశాలు ప్రస్తుతించాయి. చైనా భారత్‌తో తన సంబంధాల గురించి ప్రకటన చేస్తూ అంతర్జాతీయ సంబంధాలు మరింత ప్రజాస్వామి కంగా ఉండేలా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మద్దతుగా ఉంటామని, బహుముఖ వ్యాపారానికి మద్దతుగా నిలబడతామని ప్రకటించింది.

ఈ మధ్య చైనా ఆర్థిక స్థితి నెమ్మదించింది. అప్పులు పెరిగిపోయాయి. మరోవైపు అమెరికా నీతి మారిపోయింది. ఇలాంటి సమయంలో భారత్‌తో స్నేహమొక్కటే పరిష్కారంగా భావించిన చైనా ఆ దిశలో పావులు కదిపింది.

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు సమతూకంలో ఉంచుతూ రెండు దేశాల ఆర్థిక స్థితులు మెరుగు పడేలా భారత్‌ ప్రవర్తిస్తుంటే చైనా మాత్రం వ్యాపారంలో తనకే నియంత్రణ ఉండాలని కోరుకుం టోంది. తనే గెలుపొందాలని భావిస్తోంది. చైనా నిర్మిస్తున్న ూదీూ= (ూఅవ పవశ్ర్‌ీ ూఅవ తీశీaస) చైనా వ్యాపారాభివృద్ధికే. అంతేకాని వ్యాపార నష్టాలను గురించి మాట్లాడటానికి కాదని చైనా ఉద్దేశం. స్వేచ్ఛా వాణిజ్యం గురించి అన్ని దేశాలు సమర్థించాయి. ఇప్పటికే చైనా భారత్‌ నుండి వస్తున్న ఔషధాలకు, వ్యవసాయ ఉత్పత్తులకు, అల్యూమినియం, పశుమాంసానికి తలుపులు మూసివేసింది.

భారత్‌, చైనాల వ్యాపారం 84,44 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత్‌ ఎగుమతులు 40% పెరిగినా వాణిజ్య లోటు 51 బిలియన్ల డాలర్లుగా ఉంది. రెండు దేశాల మధ్య వ్యాపారం 100 బిలియన్లకు చేరవచ్చని విశేషజ్ఞులు అంచనా వేస్తున్నారు. త్వరితగతిన ఇలా పెరిగే వ్యాపారం భారత్‌ ఆర్థిక స్థితికి దురదృష్టంగా మారుతుందేమో!

రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడాలని, వ్యక్తి వ్యక్తికి సంబంధాలు ఏర్పడాలని, అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని, ఆర్థికంగా బహుముఖంగా ఎదగాలని, రాజకీయ, భద్రత విషయాలపై చర్చలు జరగాలని ఇరుదేశాల నాయకులు నిర్ణయించారు.

చైనా ‘పంచశీల’ గురించి లేవనెత్తగా భారత్‌ ఆ విషయాన్ని పక్కనబెట్టింది. 2019లో భారత్‌లో పర్యటించాలని మోది చైనా అధ్యక్షుడు ‘జీ’ ని ఆహ్వానించారు. వుహాన్‌లో జరిగిన సమావేశంలో చెప్పుకోదగ్గ విషయం ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక ఆర్థిక ప్రాజెక్టుపై ఇరు దేశాలు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించుకోవడం.

ఈ సమావేశాలు గొప్ప ఫలితాలు ఇవ్వనప్పటికి కొంత మంచే జరిగింది. ఇరు దేశాల నాయకులు తమ మధ్య ఉన్న అపనమ్మకాలను తొలగించు కున్నారు. తమ తమ సేవలకు వ్యూహాత్మక మార్గ దర్శనం చేయాలని రెండు దేశాలు నిర్ణయించు కున్నాయి. దీనివల్ల ఇద్దరి మధ్య విశ్వాసం, అవగాహన పెరుగుతుంది. భారత్‌ సైన్యాధ్యక్షుడు బిపిన్‌రావత్‌, జాతీయభద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో చర్చించి కూూజ వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి యోజనలు చేస్తారు. ఇరుదేశాల ణ+వీూ (సఱతీవష్‌శీతీ +వఅవతీaశ్రీ వీఱశ్రీఱ్‌aతీవ ూజూవతీa్‌ఱశీఅ) ల మధ్య ‘హాట్‌లైన్‌’లను ఏర్పాటు చేస్తారు. వివాదాస్పద సరిహద్దులను ఇరు దేశాల సైన్యాలు కాపలా కాస్తాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ విధంగా నిర్వహించి మంచి ఫలితాలు పొందామని సైన్యాధికారులు తెలిపారు. ఏది ఏమైనా సరిహద్దులలో గస్తీ పెంచి భారత్‌ జాగ్రత్త వహించవలసిందే.

– డా|| రామహరిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *