పక్కదారి పడుతున్న రిజర్వేషన్లు

పక్కదారి పడుతున్న రిజర్వేషన్లు

‘క్రైస్తవ చర్చి విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కార్యక్రమాల ద్వారా మతం మారుస్తూ ఉంటే నేను తప్పనిసరిగా క్రైస్తవులను ఈ దేశం వదలి వెళ్లిపొమ్మని చెపుతాను’

– మహాత్మా గాంధీజి.

‘ఒక హిందువు మతం మారితే, హిందువుల సంఖ్య తగ్గినట్లే కాదు, ఒక శత్రువు పెరిగినట్లు’

– స్వామి వివేకానంద.

‘ఇస్లాం లేక క్రైస్తవ మతాలలోకి మారడం దళిత వర్గాలను జాతీయతా భావనకు దూరం చేస్తుంది’

– డా|| బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌.

గత డెబ్భై సంవత్సరాలుగా దేశంలోని పౌరసమాజం సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాల విదేశీ దాడులు, బానిసత్వం కారణంగా దేశంలో, పౌరసమాజంలో ఎన్నో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. స్వాతంత్య్రానంతరం ఆర్థిక, సామాజిక ఆంశాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది. అయితే ఈ రిజర్వేషన్ల అమలు ఒడిదొడుకుల మధ్య నత్తనడకన కొనసాగుతూనే వివిధ ఆటంకాల మధ్య సత్ఫలితాలు సాధించలేకపోతోంది. ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించాల్సిన రిజర్వేషన్ల అమలు లో చిత్తశుద్ధి లేకపోవడంతో అసమానతలను మరింత పెంరుగుచున్నాయి.

రాజ్యాంగం నిర్దేశించిన దళిత, గిరిజన రిజర్వేషన్ల అమలు అనేక ఒడిదొడుకుల మధ్య పక్కదారి పడుతోంది. అందుకు నియంత్రణ లేని మతమార్పిడులు ఒక కారణంగాను, ఒక సమస్యగాను చెప్పవచ్చు. దళిత, గిరిజన రిజర్వేషన్‌ విధానాన్ని నియమ నిబంధనల ప్రకారం అమలు చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత పాటించక పోవడంతో విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన వివక్ష, అన్యాయం జరుగుతోంది. ఇది జగమెరిగిన సత్యం. కేవలం అధికారం కోసం వెంపర్లాడే రాజకీయ విధానాలు, సంతుష్టీకరణ విధానాలే క్షేత్రస్థాయిలో అడ్డంకిగా మారాయి. మతమార్పిడులతో నిజమైన దళిత, గిరిజన వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అక్రమంగా మతంమారిన వారు దక్కించుకొంటు న్నారు. ఇందుకు మిషనరీల పాత్ర కీలకంగా ఉంది. నిర్దేశించన రాజ్యాంగం, ప్రభుత్వ నిబంధనతో విచారణ జరపకుండానే రెవిన్యూ అధికారులు దళిత, గిరిజన కుల ధవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడ మతంమారిన వారు దళిత, గిరిజన కుల ధవీకరణ పత్రాలతో ఎన్నికలలో పోటీ చేస్తున్న విషయం గమనించవచ్చు.

ఇటీవల కరీంనగర్‌ జిల్లా ఓ రిజర్వుడ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.ఎల్‌.ఎ. తాను క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తినని తన పెళ్లి క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం జరిగిందని ఓ బహిరంగసభలో ప్రస్తావించారు. సాక్షాత్తు శాసనాలు చేయాల్సిన సభలో ప్రతినిధిగా ఉన్న సభ్యులే ఈ విధంగా అక్రమంగా రిజర్వేషన్లను అనుభవిస్తుంటే సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉండాలి. ఉన్నతస్థాయి ఎన్నికలలో ఈ పరిస్థితి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఊహించవచ్చు. దీనిని బట్టి ఏ మేరకు దళిత, గిరిజన రిజర్వేషన్లు పక్కదారి పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మతం మారిన క్రైస్తవులకు దక్కేలా జిఓ 25 జారీ చేసి దుస్సాహసం చేసి దళిత, గిరిజనులను మోసం చేస్తున్నది.

ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలో కొండ నరేష్‌ అనే సామాజిక కార్యకర్త ఆ మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ? ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారు లబ్దిదారులుగా ఉన్నారా ? అని రెవిన్యూ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దానికి సంబంధిత అధికారులు ఆర్‌.సి.నెం:సి/26/2017తో మెమో లేఖ ఇస్తూ మండలంలో 19 చర్చిలు, 8 మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ లేఖ ద్వారా క్షేత్రస్థాయిలో కుల ధవీకరణ పత్రాలు జారీ చేయడంలో అధికారుల తీరు బహిర్గతం అవుతుంది. ఒక గ్రామంలో చర్చి నిర్మాణం జరగాలంటే కనీసం 30 కుటుంబాలు క్రైస్తవులుగా ఉండాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద క్రైస్తవ జనాభా ఎంత ? అనే రికార్డులు లేవు. చర్చిలకు పాలకమండళ్లు లేవు. చర్చిల నిర్వహణ, చట్టబద్ధతపై మైనారిటీ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు, సమాచారం లేదు. మతంమారిన క్రైస్తవుల సమాచారం సేకరించే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు.

అంటే నిజమైన దళిత, గిరిజనులకు దక్కాల్సిన రిజర్వేషన్లను చిత్తశుద్ది లేకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించి వారి భవిష్యత్తుతో చెలగాటం అడుతుందని భావించాల్సి వస్తుంది.

రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్‌. అంబేడ్కర్‌ మదిలో నుండి జీవం పోసుకున్న రిజర్వేషన్ల విధానం ఎన్నో కోట్లమంది జీవితాలకు దిశా, దశ చూపించింది. నిజానికి 1935లోనే షెడ్యూల్డ్‌ కులాల జాబితా తయారయి 1936లో బ్రిటిష్‌ పార్లమెంటు ఆమోదించింది. అప్పుడు కూడ ఆంగ్లేయులు మతంమారిన క్రైస్తువులను ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చలేదు. మతంమారిన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డ్‌ కులాల వ్యక్తిగా పరిగణింపజాలడని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ 1977లో తీర్పునిచ్చింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డ్‌ కులాలవారు షెడ్యూల్డ్‌ కులాల ప్రయోజనాలను పొందజాలరని సుప్రీంకోర్టు 1986లో తీర్పునిచ్చింది. అలాగే విద్యాశాఖ ఉత్తర్వు జి.ఒ.ఎం.ఎస్‌. 1973 ప్రకారంగా క్రైస్తవ మతం పుచ్చుకున్న ఎస్సీలు బిసి-సిలుగాను, ముస్లిం మతం పుచ్చుకున్న ఎస్సీలు ఓసిలుగా, క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ఎస్టీలు ఓసిలుగాను పరిగణింప బడతారు. మతంమారిన బిసి-ఎ, బి, సి, డి గ్రూపులవారు ఒసిలుగా పరిగణించబడతారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కి చెందిన గంటీల జాన్‌ అలియాస్‌ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారారు. తరువాత కూడా షెడ్యూల్డు కులస్తుడుగా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో మార్పు చేసుకోకుండా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లను దుర్వినియోగ పరుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ప్రభుత్వ యంత్రాంగం తగిన విచారణ జరిపి ఎస్సీ సర్టిఫికెట్‌ తొలగించి బీసీ-సి సర్టిఫికెట్‌ ఇచ్చింది. జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి కో కన్వీనర్‌ పాపారాయుడు శంషాబాద్‌కి చెందిన జాన్‌ రాజ్‌ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు అయి కూడా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా దళితులకి చెందాల్సిన రేజర్వేషన్‌ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకుని తన ూజ సర్టిఫికెట్‌ తొలగించి జాన్‌ రాజుకి బిసి-సి సర్టిఫికెట్‌ ఇవ్వమని శంషాబాద్‌ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సందర్భాలలో తగిన విచారణ జరిపిన జిల్లా స్థాయి విచారణ కమిటీ (డిఎల్‌ఎస్సి) జాన్‌ రాజు అనే వ్యక్తి నిజమయిన దళితుడు కాదని అతనిని క్రైస్తవుడిగా నిర్ధారించుకుని, అతని ూజ సర్టిఫికెట్‌ని రద్దు చేసి అతనికి బిసి-సి సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. ఇదే కాకుండా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధపడింది.

చూస్తే ఇది చాలా చిన్న విషయంలా కనిపించినప్పటికి దీని వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. ‘క్రైస్తవ చర్చ్‌ విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కార్యక్రమాల ద్వారా మతం మారుస్తూ ఉంటే నేను తప్పనిసరిగా క్రైస్తవులను ఈ దేశం వదలి వెళ్లి పొమ్మని చెపుతాను’ అని గాంధీజీ; ‘ఒక హిందువు మతం మారితే, హిందువుల సంఖ్య తగ్గినట్లే కాదు, ఒక శత్రువు పెరిగినట్లు’ అని స్వామి వివేకానంద; ‘ఇస్లాం లేక క్రైస్తవ మతాలలోకి మారడం దళిత వర్గాలను జాతీయతా భావనకు దూరం చేస్తుంది’ అని రాజ్యాంగం నిర్మాత డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వివిధ సందర్భాల్లో ఘంటాపథంగా పేర్కొన్నారు.

మతమార్పిడి వల్ల కూడా హిందూ జనాభా తగ్గిపోతోంది. అనేకమంది ప్రముఖులు మతమార్పిడులు అనైతికమైనవి, అధార్మికమైనవి, దేశ సమైక్యతకు, సమగ్రతకు గొడ్డలిపెట్టని అన్నారు. మతమార్పిడుల ద్వారా రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల లబ్ది, హక్కుల సాధనలో నిజమైన దళిత, గిరిజన వర్గాలు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారన్నది అంగీకరించాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తరువాత ఈ విదేశీ దురాక్రమణ స్వరూపం మారింది. నేరుగా దాడి చేయడానికి వీలులేదు. అందుకు పరోక్ష పద్ధతులు ఎంచుకున్నారు. తమ జన సంఖ్యను పెంచుకోవడం ద్వారా అక్రమణను కొనసాగిస్తున్నారు. అందుకు తమ జనాభాను పెంచుకోవడం, మరోపక్క హిందువులను తమ మతంలోకి మార్చడం అనే రెండు రకాల వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీంతో షెడ్యూల్డ్‌ కులాల, తెగల ప్రజలు రిజర్వేషన్లతో అనుభవించాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, హౌసింగ్‌ లోన్లు, వ్యాపార అభివద్ధి కోసం బ్యాంక్‌ ఋణాలు, ఉద్యోగ అవకాశాలు, కార్పొరేషన్‌ ఋణాలు, ఎన్నికలలో రిజర్వుడ్‌ స్థానాలలో పోటీ, దళిత, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్రాలు చేపడుతున్న పథకాలు వంటివి నిస్సందేహంగా పక్కదారి పడుతున్నాయి. రిజర్వేషన్ల అమలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చేపట్టడంపై ప్రభుత్వాలు తక్షణమే దష్టి సారించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యలు, సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

మతమార్పిడుల వల్ల కుటుంబ సంబంధాలు ఛిద్రమౌతున్నాయి. వైషమ్యాలు, సంక్షోభాలు పెరుగుతున్నాయి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల లబ్ది, హక్కుల సాధనలో నిజమైన దళిత, గిరిజన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం.

ఈ సమస్య పరిష్కారానికి జాతీయ ఎస్సీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి, ధర్మజాగరణ సమితి, సామాజిక సమరసత వేదిక లాంటి సంస్థలు చేస్తున్న ఉద్యమాలు అభినందనీయం. దీనిపై విస్తత చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఎఎస్‌ అధికారిని నియమించి వివిధ సంస్థలు, శాఖల ఆధ్వర్యంలో సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆశిద్దాం.

– కొట్టె మురళీకష్ణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *