నిందితులు నిర్దోషులైతే మరెవరు దోషులు ?

నిందితులు నిర్దోషులైతే మరెవరు దోషులు ?

2జి కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న ఎ.రాజా యుపిఎ-1లో టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో స్కాంకు పాల్పడ్డాడు. అప్పటి ¬ంమంత్రి చిదంబరం, డిఎంకె అధినేత కరుణానిధి కనుసన్నల్లో ఈ స్కాం జరిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే ఇప్పుడు వచ్చింది కేవలం సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు మాత్రమే. తాము సమర్పిరచిన డాక్యుమెరటరీ సాక్ష్యాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని, కనుక ఈ కేసుపై హైకోర్టులో అప్పీలు చేసి నిందితులకు శిక్షపడేట్లు చూస్తామని సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెరట్‌ డైరెక్టరేట్‌ వర్గాలు వెల్లడిరచాయి.

దేశ ఖజానా దోపిడి ఆరోపణకు సంబంధించిన ‘2జి స్పెక్ట్రమ్‌ కేసు’ లో నిందితులు అందరినీ దిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ధోషులుగా పేర్కొంటూ 21 డిసెంబర్‌ 2017న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై దేశం ఆశ్చర్యం వ్యక్తం చేసిరది. ఈ తీర్పుకు కొద్ది రోజుల ముందు వెలువడిన బొగ్గు స్కాం కేసుకు సంబంధించిన తీర్పులో ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు శిక్ష పడింది. అలాగే 2జి స్కాం తీర్పుకు తర్వాత వెలువడిన దాణా స్కాం కేసుకు సంబంధించిన తీర్పులో కూడా ఆర్‌జెడి నేత లాలూకు శిక్ష పడింది. కాని ఈ రెండు కేసులకంటే వేల రెట్లు నష్టం కలిగించిన 2జి స్కాం కేసులో వ్యతిరేక తీర్పు రావడంతో దేశ పౌరులు తీవ్ర దిగ్భ్రారతికి లోనయ్యారు. ఎగువ కోర్టులలో నైనా 2జి నిందితులకు శిక్షపడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కోర్టు తీర్పుతో నిర్దోషులుగా బయటకు వచ్చామని కాంగ్రెసు, దాని మిత్రపక్షమైన డిఎంకె పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. నిరదితులు దోషులని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైరదని చెపుతున్న కోర్టు నిరదితులు నిర్దోషులని చెప్పడం లేదు. ఈ సత్యాన్ని గమనిరచిన సామాన్యుడు ఈ సంబరాలపై పెదవి విరుస్తున్నాడు. పదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి స్కాంలను చేసిన యూపిఎ కూటమి స్కాంలలో 2జి స్కాం అతి పెద్దది. దీనివల్ల దేశ ఖజానాకు లక్షా 76 వేల కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. వేలంలో తక్కువ ధరకు స్పెక్ట్రమ్‌ దక్కించుకున్న పలు కంపెనీలు నెలలు తిరగక ముందే వాటిలోని వాటాలను వేల కోట్లకు విదేశీ కంపెనీలకు అమ్ముకున్నాయి. ఈ అవినీతి సామాన్యుడికి కూడా కనిపిస్తూ ఉంటే, ఇది ఊహాజనిత స్కాం అని కాంగ్రెస్‌; దాని మిత్ర పక్షమూ, స్కాంలో ప్రధాన పాత్రధారి అయిన డిఎంకె వాదిస్తున్నాయి. డిఎంకె అధినేత కరుణానిధి రెండో భార్య కుమార్తె కనిమొళి; ఆ పార్టీ ఎంపి, అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజాలు వేలకోట్ల స్పెక్ట్రమ్‌ను చౌకగా తమ అనుయాయులకు అప్పగించారు. దీనికి ప్రతిఫలంగా వేల కోట్లు వీరికి ముట్టినా అదంతా నల్లధనం కనుక బయటికి కనిపించలేదు. అయితే స్వాన్‌ టెలికాం తనకు స్పెక్ట్రమ్‌ కేటాయించినందుకు డిఎంకె ఆస్థాన టెలివిజన్‌ ఛానల్‌ కళైంజర్‌ టివిలో 200 కోట్లు పెట్టుబడులు పెట్టడంతో దీని ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది.

2జి స్పెక్ట్రమ్‌ కేసు

టెలికాం కంపెనీలు విద్యుదయస్కాంత తరంగాల్లో ఒక శ్రేణి అయిన స్పెక్ట్రమ్‌ను సెల్‌ఫోన్‌ సాధనాలకు సమాచార బట్వాడా కోసం వాడుకుంటాయి. ఇది పరిమితమైన వనరు. దీనికి నిర్దిష్ట పౌనఃపున్యాలు ఉంటాయి. వేలం పద్ధతిలో ఈ పౌనఃపున్యాలను వివిధ కంపెనీలకు కేటాయిస్తారు. కానీ అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తమ అనుయాయులకు స్పెక్ట్రమ్‌ను కట్టబెట్టడానికి ‘మొదట వచ్చిన వారికి మొదటి కేటాయింపు’ అన్న చందంగా వ్యవహారాన్ని మార్చింది. 2007 మే మాసంలో టెలికాం మంత్రిగా ఎ.రాజా బాధ్యతలు స్వీకరించగా ఆగస్టులో కంపెనీలకు స్పెక్ట్రమ్‌ కేటాయింపులు జరిగాయి. ‘మొదట వచ్చిన వారికి మొదటి కేటాయింపు’ పద్థతిలో ఈ కేటాయింపులు జరుగగా ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలమైన కంపెనీల కోసం ఆ సమయాన్ని కుదించి ఆ కంపెనీలకు తక్కువ ధరకు స్పెక్ట్రమ్‌ కేటాయింపు జరిగేలా చేశారు. 2008 అక్టోబరు, నవంబరు నాటికి స్పెక్ట్రమ్‌ కేటాయింపులు పొందిన స్వాన్‌ టెలికాం, యునినార్‌, టాటా టెలీ సర్వీసెస్‌ తమ వాటాలను భారీ ధరలకు విదేశీ కంపెనీలు ఎటిసలాట్‌, టెలినార్‌లకు అమ్ముకున్నాయి.

ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన అప్పటి క్రంప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ తన నివేదికలో ఈ వేలం వలన ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు తన నివేదికలో పేర్కొన్నారు. 2010 నవంబర్‌లో కాగ్‌ తన నివేదికను వెల్లడించగా ప్రతిపక్ష భాజపా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో టెలికాం మంత్రి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011 ఫిబ్రవరిలో రాజాను సిబిఐ అరెస్టు చేసింది. రాజా తర్వాత టెలికాం మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కేసుకు సంబంధించిన ఆధారాలను చాకచక్యంగా మాయం చేశారు. కేసు మొత్తం యుపిఎ-2 ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది కనుక కేసును నీరుగార్చే విధంగా విచారణ సాగింది. కంటి తుడుపు చర్యగా రాజాను పదవి నుంచి తొలగించి అరెస్టు చేశారు. కూటమి నుంచి డిఎంకె బయటికి వచ్చినట్లు నాటకమాడించారు. కాంగ్రెస్‌ పెద్దలు చిదంబరం, కపిల్‌సిబల్‌ ఈ వ్యవహారాన్నంతటిని తమ చాకచక్యంతో చక్కబెట్టారు. కాంగ్రెస్‌కు ఈ వ్యవహారాన్ని సిబిఐకు అప్పగించడం కూడా ఇష్టం లేదు. అయితే సుప్రీం కోర్టులో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో దీనిపై విచారణ జరపాలని సిబిఐను సుప్రీం ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు 2012 ఫిబ్రవరి రెండో తేదీన సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జస్టిస్‌ జి.ఎస్‌.సింఘ్వి, జస్టిస్‌ ఎ.కె. గంగూలి ఇచ్చిన తీర్పుతో 122 లైసెన్సులను రద్దు చేశారు. లైసున్సులు వచ్చాక తమ కంపెనీల్లోని వాటాలను అమ్ముకున్న మూడు కంపెనీలకు 5 కోట్ల రూపాయల చొప్పున జరిమానా విధించింది. 2జి లైసెన్సుల కేటాయింపులపై ట్రాయ్‌ కొత్తగా సిఫార్సులను చేయాలని తీర్పునిచ్చింది.

కాగ్‌ అంచనాల ప్రకారం 1.76 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను రూ.3 వేల కోట్లకే కంపెనీలు దక్కించుకున్నాయి. స్పెక్ట్రమ్‌ కేటాయింపుకు అర్హత లేకున్నా కేవలం రూ.1537 కోట్లకు స్పెక్ట్రమ్‌ పొందిన స్వాన్‌ టెలికాం తన కంపెనీలో 45 శాతం వాటాను యుఎఇకి చెందిన కంపెనీ ఇటిసలాత్‌కు రూ.4200 కోట్లకు అమ్మింది. కేటాయింపు పొందిన మరో కంపెనీ యునిటెక్‌ వైర్‌లెస్‌ రూ.1661 కోట్లకే స్పెక్ట్రమ్‌ పొంది, కంపెనీలో 60 శాతం వాటాను రూ.6200 కోట్లకు నార్వేకు చెందిన టెలినార్‌ కంపెనీకి అమ్ముకుంది. 2జి కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న ఎ.రాజా నీలగిరి నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలిచి యుపిఎ-1లో టెలికాం మంత్రిగా ఉన్న సమయంలో స్కాంకు పాల్పడ్డాడు. అప్పటి హోంమంత్రి చిదంబరం, డిఎంకె అధినేత కరుణానిధి కనుసన్నల్లో ఈ స్కాం జరిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కంపెనీలకు లబ్ది చేకూర్చినందుకు రూ.3000 కోట్ల లంచాలు రాజాకు అందాయని సిబిఐ ప్రధాన ఆరోపణ. అయితే మారిషస్‌, సీషెల్స్‌లలో రాజా భార్య పేరున ఉన్న బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ అయ్యింది.

రాజాకు ముందు కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేసిన కరుణానిధి మనుమడు దయానిధి మారన్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఎయిర్‌సెల్‌ – మాక్సిస్‌ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. తనకు స్పెక్ట్రమ్‌ కేటాయించాలంటే ఎయిర్‌సెల్‌లో వాటాలను మలేసియాకు చెందిన మాక్సిస్‌ కంపెనీకి అమ్మాలని దయానిధి వత్తిడి తెచ్చాడని ఎయిర్‌సెల్‌ అధినేత శివశంకరన్‌ సిబిఐకు ఫిర్యాదు చేశాడు. దీనికి ప్రతిగా మాక్సిస్‌ గ్రూపు దయానిధి కుటుంబ చానెల్‌ జెమినీలో పెట్టుబడులు పెట్టింది. కళైంజర్‌ టివిలో పెట్టుబడుల్లో నిందితులు కొత్త పద్ధతిని అవలంబించారు. స్వాన్‌ ప్రమోటర్లు కరీంమొరానీకి చెందిన కంపెనీ ద్వారా కళైంజర్‌లో పెట్టుబడులు పెట్టారు. మొదటగా కరీం తమ్ముడి కూరగాయల వ్యాపార సంస్థకు ఈ నగదు బదిలీ చేసి అక్కడి నుంచి కరీం సంస్థకు డబ్బు బదిలీ చేశారు. అలానే తన ఆధ్వర్యంలోని జెమినీ టివికి దొంగచాటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ లైన్లను తను మంత్రిగా ఉన్న సమయంలో వాడారు. స్పెక్ట్రమ్‌ కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు దయానిధి మారన్‌పై కూడా అభియోగాలు ఉన్నాయి. మొత్తంగా కరుణ కుటురబం ఎలాంటి కరుణ లేకుండా దేశ సంపదను దోచుకుందనేది నిర్వివాదాంశం. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ తంతుకు మూగ కాపలాదారుగా ఉండి సంపదను దొంగలకు అప్పగించారనే నిందను ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు.

మోదీకేం సంబంధం ?

ప్రధాని మోది తప్పుడు ప్రచారం ద్వారా లేని స్కాంను ఉన్నట్టుగా ప్రచారం చేశారని గొంతెత్తి అరుస్తున్న కపిల్‌ సిబల్‌ ఈ కేసు యుపిఎ హయారలోనే మొదలై, సుప్రీరకోర్టు ఆదేశాల ప్రకారమే సిబిఐ చేతుల్లోకి వెళ్ళిరదని, 2014కు మురదే జరిగిన ఈ వ్యవహారంతో 2014 తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీకి ఎటువంటి సంబంధం ఉండదని తెలీదా ? తెలిసీ ఇదొక నాటకమా !

ఇప్పుడు వచ్చినది కూడా కేవలం సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు మాత్రమే. తాము సమర్పిరచిన డాక్యుమెరటరీ సాక్ష్యాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని, కనుక ఈ కేసుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసి నిందితులకు శిక్షపడేట్లు చూస్తామని సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెరట్‌ డైరెక్టరేట్‌ వర్గాలు వెల్లడిరచాయి.

బొగ్గు స్కాంలో మధు కోడాకు శిక్ష

దిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బొగ్గు స్కాం కేసులో ఝార్ఘండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోడాతో పాటు జార్ఖండ్‌ మాజీ బొగ్గు కార్యదర్శి హెచ్‌సి గుప్తా, ముఖ్య కార్యదర్శి అశోక్‌ కుమార్‌ బసు, వాణీ స్టీల్స్‌కు చెందిన విజయ్‌ జోషీలకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది. న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ ఈ తీర్పును వెలువరించారు. వివిధ కంపెనీలకు బొగ్గు కేటాయింపులు చేయడం ద్వారా మధు కోడాకు సుమారు 4 వేల కోట్ల రూపాయల లంచం ముట్టింది. ఈ బొగ్గు కేటాయింపుల సమయంలో బొగ్గు శాఖ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వద్దే ఉంది.

యుపిఎ పాలన స్కాంల మయం

పదేళ్ల యుపిఎ పాలన పూర్తిగా స్కాంలతో సాగింది. పదేళ్ల పదవీ కాలంలో మన్మోహన్‌సింగ్‌ వరుసగా పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. సోనియా నాయకత్వంలో జరిగిన ఈ స్కాంలను సింగ్‌ మౌనంగా చూస్తూ ఉండిపోయారనే నిందను భరించవలసి వచ్చింది.

– 1.76 లక్షల కోట్ల 2జి స్కాం అతిపెద్దది కాగా, 2010లో కామన్వెల్త్‌ కుంభకోణంతో దేశ పరువు అంతర్జాతీయంగా మంట గలిసింది.

– 2004-12 మధ్య బొగ్గు గనుల కేటాయింపులో విపరీతమైన అవినీతి చోటు చేసుకుంది. ఈ బొగ్గు కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.8 లక్షల కోట్ల నష్టం జరిగింది.

– ఆగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల స్కాంలో కాంగ్రెస్‌ నాయకులకు రూ.4000 కోట్ల లంచాలు ముట్టాయి. సోనియా తన మాత దేశం ఇటలీ నుంచి 12 వివిఐపి హెలి కాప్టర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికిగానూ లంచాలు లంచాలు ముట్టాయనేది ఆరోపణ.

– టాట్రా ట్రక్కుల కొనుగోలులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది.

– ముంబైలో అమరవీరుల కోసం నిర్మించిన ఆదర్శ్‌ అపార్ట్‌మెంట్ల వ్యవహారంలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగింది.

ఇలా వరుస కుంభకోణాలతో యూపిఎ ప్రభుత్వం దేశ సంపదను లూటీ చేసింది. కపిల్‌సిబల్‌ వంటి కాంగ్రెస్‌ పెద్దలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ లాంటి విచారణ సంస్థలను తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నంత కాలం, కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నించినంత కాలం అవినీతి విషయంలో దొంగలు తప్పిచుకుంటూనే ఉంటారు.

దాణా స్కాంలో లాలూకు జైలు

రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 21 ఏళ్ల నాటి దాణా కుంభకోణంలో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మరో 15 మంది దోషులేనని తేల్చింది. 1991-94 మధ్య దేవ్‌గఢ్‌ ఖజానా నుంచి రూ.89.27 లక్షల మొత్తాన్ని తప్పుడు వివరాలతో కాజేయడానికి సంబంధించిన కేసులో లాలూని కోర్టు దోషిగా తేల్చింది. బిహార్‌ రాష్ట్రం విడిపోక ముందు 1996లో దాణా స్కాం వెలుగులోకి వచ్చింది. దీని విలువ రూ.950 కోట్లని అంచనా వేసి 61 కేసులు నమోదు చేశారు. 2000 సంవత్సరంలో బిహార్‌ విభజన జరిగి ఝార్ఖండ్‌ ఏర్పాటు చేసినప్పుడు 39 కేసులను ఆ రాష్ట్రానికి బదిలీ చేశారు. 20 లారీల్లో ఇందుకు సంబంధించిన పత్రాలను ఝార్ఖండ్‌ రాజధాని రాంచీకి తరలించారు. చాయిబాసా జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అమిత్‌ కరే పశు సంవర్ధక శాఖ కార్యాలయాల్లో తనిఖీలు చేయడంతో దాణా స్కాం వెలుగులోకి వచ్చింది. 1997లో అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సిబిఐ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నిందితుడని పేర్కొంది. లాలూపై మొత్తం ఆరు కేసులు విచారణలో ఉండగా ఈ తీర్పుతో రెండు కేసులలో శిక్ష పడినట్టైంది. మొదటి కేసులో ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడటంతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును లాలూ ఇదివరకే కోల్పోయారు.

2జి స్కాంను బయటపెట్టిన కాగ్‌ వినోద్‌ రాయ్‌

ప్రముఖ ఆర్ధికవేత్త, మాజీ ఐఎఎస్‌ అధికారి 2008 నుంచి 2013 మధ్య భారత క్రంప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా సేవలందించారు. తన హయాంలో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం 2జి స్కాంకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. దీంతో పాటు కామన్వెల్త్‌ క్రీడల కొనుగోళ్ల కుంభకోణం పైనా కీలకాంశాలను వెల్లడించారు.

1972 బ్యాచ్‌, కేరళ క్యాడర్‌కు చెందిన ఈ ఐఎఎస్‌ అధికారి వినోద్‌ రాయ్‌ కలెక్టర్‌ ¬దాలో త్రిశూరు జిల్లాలో చెరగని ముద్ర వేశారు. నీతి నిజాయితీలకు మారు పేరైన రాయ్‌కు బురద అంటించేందుకు అవినీతి బురదలో కూరుకుపోయిన కపిల్‌సిబల్‌ వంటి కాంగ్రెస్‌ ప్రముఖులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో వారంతా తమను తాము కడిగిన ముత్యాలుగా భావించు కుంటూ, రాయ్‌ను అన్ని పదవులకు రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని ఒక కొత్త డిమాండ్‌ తెరపైకి తెస్తున్నారు.

గతంలో 1984-89 మధ్య కాగ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన టి.ఎన్‌.చతుర్వేది కూడా వినోద్‌రాయ్‌ మాదిరిగా బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలులో అవకతవకలను బయటకు తెచ్చారు. అతని పై కూడా కాంగ్రెస్‌ ఇలానే దాడి చేసింది.

–  ఆర్.సి.రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *