తీరు మారని కాంగ్రెస్‌

తీరు మారని కాంగ్రెస్‌

– కాంగ్రెస్‌వి మొదటి నుండి మత రాజకీయాలే

– ఇప్పుడు గుజరాత్‌లో చేస్తున్నదీ మత రాజకీయాలే

– తన మతాన్ని రాహుల్‌ ఎందుకు స్పష్టం చేయట్లేదు ?

కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ బ్రాహ్మణ వాదాన్ని అసహ్యించుకుంటూ, ఉదారవాదులతో కలసి హిందూ మతాన్ని ఎగతాళి చేస్తూ వచ్చింది. అంతేకాక, అయోధ్య అంశంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక ప్రమాణ పత్రంలో భగవాన్‌ రామ్‌ ఒక కల్పితం అని పేర్కొంది. అయితే ఆకస్మికంగా ఇప్పుడు వెనుకకు తిరగడాన్ని (U-turn) ఏమనుకోవాలి ?

రాహుల్‌గాంధి సోమనాథ్‌ ఆలయ సందర్శన తర్వాత అతడి మతం గురించి అనేక అనుమానాలు రేకెత్తాయి. వరుస ఎన్నికల పరాజయాల భారం మోస్తున్న కాంగ్రెసు ఇటీవల నాటకీయంగా గుజరాత్‌ రాజ్యసభ సీటును గెలుచుకుంది. అదే ఊపుతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాజపాతో తలపడాలని కాంగ్రెసు ఉవ్విళ్ళూరుతోంది. కాంగ్రెసు వారసుడు రాహుల్‌ గాంధి తన బుజ్జగింపు రాజకీయ చతురతలతో ఓటర్లను ప్రభావితం చేయడానికి గుజరాత్‌కు అనేక పర్యటనలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆయన వరుసగా హిందూ ఆలయాల సందర్శన చేపట్టారు. మైనారిటీ అనుకూల ముద్రను తొలగించుకోవాలనే ప్రయత్నంలో పటాన్‌లోని వీర్‌ మేఘమాయ ఆలయంలో ప్రార్థనలు చేసిన రాహుల్‌ గాంధి, ‘నేను శివభక్తుడిని, సత్యాన్ని నమ్ముతాను. భాజపా ఏమి చెప్పినప్పటికి నేను సత్యాన్నే నమ్ముతాను’ అని ప్రకటించారు.

రాహుల్‌గాంధి గుజరాత్‌లో చేసే ప్రతి ఎన్నికల ప్రచార కార్యక్రమంలోను దేవాలయ సందర్శన తప్పనిసరిగా ఉంటోంది. ఈ కొత్తశైలితో ఆయన ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇటీవలి ఆయన సోమనాథ్‌ ఆలయ సందర్శన పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఆయన పేరు ఆలయ హిందుయేతరుల రిజిష్టర్‌లో కనిపించిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రధాన, సామాజిక మాధ్యమాలలో మున్నెన్నడూ లేని చర్చల తుఫాను, గందరగోళం ప్రారంభమైంది. ఈ గందరగోళానికి తెరదిరచడానికి ఈ కాబోయే అధ్యక్ష అభ్యర్థి ప్రయత్నిరచడం లేదు. ఆయన మౌనం భాజపా ఆరోపణలకు మరింత విశ్వసనీయత కలిగించింది.

తన మతం విషయంలో స్పష్టత ఇవ్వడానికి నిరాకరించిన రాహుల్‌ మోసపూరిత వైఖరి బహిర్గతమయింది. కాంగ్రెసు దశాబ్దాలుగా పాటిస్తున్న బుజ్జగింపు రాజకీయాల ముసుగును ఈ సంఘటన తొలగించింది. గుజరాత్‌ ఎన్నికలలో హిందువులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సైతం బెడిసి కొట్టినట్లనిపిస్తోంది.

దేశాలన్నీ కృత్రిమ మేధస్సు, గ్రహాంతరవాస ప్రణాళికలతో మానవాళికి ద్వారాలు తెరుస్తున్న ఈ సమయంలో వ్యక్తిగత విశ్వాసాల గురించి చర్చ సమంజసమా? కాదా ? అని ఆలోచిస్తే, మతం ముఖ్యమైన గుర్తింపు చిహ్నం కనుక రాజకీయాలు దీని నుండి దూరంగా ఉండడం సాధ్యంకాని పని. మతమూ, రాజకీయాలు విడదీయలేనంతగా ముడిపడి ఉన్నందున బుజ్జగింపు రాజకీయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాస్తవానికి, భారతదేశ విభజనకు కారణమైన ఏకైక అంశం మతమే. కేవలం మతం ఆధారంగా భారతదేశం నుండి పాకిస్తాన్‌ విడిపోయింది. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడచిన తరువాత కూడా వినాశకరమైన దేశ విభజన, దాని విపరిణామాలతో భారతదేశం ఇప్పటికీ భారీ మూల్యం చెల్లిస్తూనే ఉన్నది.

ప్రజాస్వామిక, స్వేచ్ఛా సమాజ సూత్రాలను పాటిస్తున్న భారతదేశంలో ప్రతి భారతీయుడు తనకు నచ్చిన మతాన్ని అవలంబించే అవకాశం ఉంది. కాని ‘అందరు సమానమే. కాని కొందరు ఎక్కువ సమానులు’ అన్న భారత రాజ్యాంగ అధికరణాలు 25-30 లతో రాజ్యాంగం మైనారిటీల పట్ల అనుకూలత ప్రదర్శించింది. సమాజాన్ని మతపరంగా వర్గీకరించిన ఈ క్లాజులు దేశాన్ని మెజారిటీ, మైనారిటి వర్గాలుగా విభజించాయి. ఇంకా ఈ వర్గీకరణను మరింత ధృడపరుస్తూ స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తరువాత లౌకికవాదం (సెక్యులరిజం) దేశంపై రుద్దబడింది. నిజానికి లౌకికవాదం అంటే మత విశ్వాసాల విషయంలో తటస్థంగా ఉంటూ మత విభిన్నతను గౌరవించి, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేది. పాశ్చాత్య లౌకికవాద సిద్ధాంతాలకు భిన్నంగా ముస్లింలు వ్యక్తిగత చట్టాన్ని (Personal Law) అవలంబించడానికి అనుమతించి భారత సమాజంలో వైరుధ్యాలను పెంచింది. దీనివలన మతపెద్దల అధికారం గణనీయంగా పెరిగి వారు నిర్దేశించిన పార్టీకి ఓట్లు వేయాలని ఫత్వాలు జారీ చేసే వరకు వెళ్ళింది. కాలగమనంలో ఈ చట్ట విరుద్ధ సంబంధం నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఎన్నికల శైలిని మార్చే శక్తిగా మారింది.

ఎన్నికల తరుణంలో ముస్లింల కేటాయింపులు పెంచడం అనేది రాజకీయ నాయకుల తొందరపాటు రాజకీయాలలో మతానికి ఉన్న పాత్రకు, ప్రాధాన్యానికి అద్దం పడుతుంది. వాస్తవం చెప్పాలంటే, భారతదేశంలో జనాభా గణన సైతం మతాన్ని అనుసరించి జరుగుతోంది. అప్పటినుంచి రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకులను సమీకరించుకోవడానికి కీలక జనాభా విస్తరణను శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మైనారిటీలను మచ్చిక చేసుకోవడం మూలంగానే అధికారంలో ఉన్నారనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీనివలన వారికి మంచి సౌకర్యాలు లభించడమే కాక, వారి మత పర కార్యకలాపాలలో ప్రభుత్వం జ్యోక్యం చేసుకోదనే భరోసా కూడా లభిస్తుంది.

ప్రస్తుత చర్చకు వస్తే, రాహుల్‌గాంధికి తన ఇష్టం వచ్చిన మతం అనుసరించే స్వేచ్ఛ ఉంది. హిందూ సమాజం గురించి ఆయన మాట్లాడక పోయినట్లైతే తన మతం ఏదో చెప్పాలని ఆయనను ఎవరూ అడగకపోయి ఉండేవారు. ఇప్పుడు తన మోసపూరిత గుర్తింపును ప్రదర్శిస్తూ, ఆలయ సందర్శనలతో ఓటర్లను మచ్చిక చేసుకొనేందుకు బహిరంగంగా ప్రయత్నిస్తున్నాడు. కనుక ఆయన స్పష్టీకరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. రాహుల్‌గాంధి ఒక ‘జంధ్యధారి బ్రాహ్మణుడు’ అని పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు. కాని 1998 నాటి న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాసం రాహుల్‌గాంధి ఒక కేథలిక్‌ అని తెలిపింది.

కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ బ్రాహ్మణ వాదాన్ని అసహ్యించుకుంటూ, ఉదారవాదులతో కలసి హిందూ మతాన్ని ఎగతాళి చేస్తూ వచ్చింది. అంతేకాక, అయోధ్య అంశంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక ప్రమాణ పత్రంలో భగవాన్‌ రామ్‌ ఒక కల్పితం అని పేర్కొంది. అయితే ఆకస్మికంగా ఇప్పుడు వెనుకకు తిరగడాన్ని (U-turn)ఏమనుకోవాలి ?

రాహుల్‌గాంధీ మతమేమిటి ?

స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ కశ్మీరీ బ్రాహ్మణుడు. ఆయన కుమార్తె ఇరదిర. ఆమె ఫిరోజ్‌ అనే పార్శీ యువకుడిని ప్రేమిరచింది. వారిద్దరి పెళ్ళి చేసుకోడానికి నెహ్రూ అడ్డుపడితే గుజరాతీ వైశ్యుడైన మహాత్మాగారధీ ఫిరోజ్‌ను దత్తత తీసుకుని ఇరదిర ఫిరోజ్‌ల వివాహం జరిపిరచారు. అలా పార్శీ యువకుడైన ఫిరోజ్‌ ‘ఫిరోజ్‌ గారధీ’ కాగా, అతని భార్య శ్రీమతి ఇందిర ‘ఇరదిరా గారధీ’ అయ్యారు. వారి కొడుకు రాజీవ్‌ గారధీ ఇటలీకి చెరదిన క్రైస్తవ యువతి సోనియాను ప్రేమిరచి పెళ్లాడాడు. సోనియా మతం, ఇటలీ పౌరసత్వర ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరిప్పుడు రాజీవ్‌ గాంధీ-సోనియా గాంధీల కుమారుడైన రాహుల్‌గాంధీ మతమేమిటి ? కులమేమిటి ?

గుజరాత్‌ ఎన్నికల కోసం రాహుల్‌ ఆలయాల ప్రదక్షిణ చేపట్టారని తెలిసి, సోనియా మతంతో సహా రాహుల్‌ వంశ చరిత్ర మొత్తర ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోరది. తాను బ్రాహ్మణుడిని, హిరదువుని అని చాటుకో చూస్తున్న రాహుల్‌ ప్రయత్నర మొదటికే మోసం తెచ్చేట్లురది.

– తీగెల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *