జిఎస్‌టి ముందుంది మరింత సుఖం

జిఎస్‌టి ముందుంది మరింత సుఖం

అయిదారు రకాల పన్నులకు బదులు ఒకటే పన్ను జిఎస్‌టిని వసూలు చేస్తున్నారు. దీని ద్వారా పన్ను ఎగవేతలు చాలా వరకు తగ్గాయి. ఒకే పన్ను విధానం వలన ప్రభుత్వం పన్ను వసూలుకు చేసే ఖర్చులు కూడా తగ్గాయి. దేశం జిడిపిలో 16 శాతంగా ఉన్న పన్ను వసూళ్లు త్వరలోనే 20 శాతానికి చేరుకొనే అవకాశం ఉంది. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా తయారయ్యే అవకాశం ఉంది.

వస్తువులు, సేవల పన్నును (జిఎస్‌టి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1 జూలై 2017 నుంచి అమలులోకి తెచ్చాయి. ‘ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్‌’ పేరిట ప్రధాని మోదీ నేతత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చారిత్రాత్మక పన్ను సంస్కరణ వస్తు,సేవల పన్ను. అయితే ఇది కొత్తగా విధించిన పన్ను కాదు. గతంలో ఉన్న పన్నుల స్థానంలో జిఎస్‌టి ని ప్రవేశపెట్టారు. జిఎస్‌టి వలన పన్నుల ఆదాయం కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న వితండ వాదంలో నిజం లేదు. తాజాగా జిఎస్‌టి పన్ను వసూలు గణాంకాలు కూడా దీన్ని నిరూపిస్తున్నాయి.

ఆదాయం లక్ష కోట్లు

2018 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా జిఎస్‌టి ఆదాయం లక్ష కోట్లను దాటింది. ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూలు 1 లక్షా 3 వేల 458 కోట్ల రూపాయలుగా నమోదైంది. మార్చితో ముగిసిన 2018 ఆర్ధిక సంవత్సరంలో 9 నెలల కాలానికి జిఎస్‌టి వసూలు రూ.7.41 లక్షల కోట్లుగా ఉంది. నెలకు సగటున రూ.89,885 కోట్లుగా జిఎస్‌టి వసూళ్లు ఉన్నాయి. వస్తు, సేవల పన్ను వలన రాష్ట్రాల ఆదాయం తగ్గితే, తగ్గిన పన్ను ఆదాయ లోటును భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వస్తు సేవల పన్ను విషయంలో ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నా, దీర్ఘ కాలంలో దేశ ఆర్ధిక వ్యవస్థకు మేలు చేస్తుందని ప్రపంచ బ్యాంకు కూడా తన అధ్యయనంలో తెలిపింది. ఆర్ధికవద్ధి రేటు పెరగడం, పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి వ్యాపారులు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో ఏప్రిల్‌లో జిఎస్‌టి లక్ష కోట్ల మార్కును దాటింది.

పెరిగిన పన్ను వసూళ్ళు

ఒకే దేశం-ఒకే పన్ను-ఒకే మార్కెట్‌ అన్న లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రవేశపెట్టిన జిఎస్‌టి వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు వినియోగదారులకు, పరిశ్రమ దారులకు తెలుస్తున్నాయి. తొలినాళ్లలో పన్ను రేట్లను చూసి ప్రజలు ఆందోళన చెందినా, రాను రాను సంక్లిష్టతలు తగ్గి పన్ను రేట్లు తగ్గడం, ఆ తగ్గిన పన్ను వినియోగ దారులకు అందటం మొదలయింది. దేశ వ్యాప్తంగా ఉన్న చిరువ్యాపారులు కూడా జిఎస్‌టిలో నమోదు అవుతున్నారు. ఇంతకు ముందు అసంఘటిత రంగంగా ఉన్న వీరు జిఎస్‌టిలో రిజిస్టరు అయ్యి, ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను పొందు తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న చెక్‌ పోస్టులను రద్దుచేసి దేశం మొత్తం ఒకే మార్కెట్‌గా తయారు చేశారు. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను పొందాలంటే సరుకు సరఫరా చేసిన సంస్థ జిఎస్‌టిలో రిజిస్టరు అయి ఉండాలి, ఇది వరకు పన్నులు చెల్లించకుండా బయట ఉండే జీరో దందా సంస్థల నుంచి కొనుగోలు చేసే చిన్న చిన్న వ్యాపారులు ఇప్పుడు ఖచ్చితంగా జిఎస్‌టిలో నమోదు అయిన సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ అంఘటిత రంగ వ్యాపారులు కొత్తగా పన్నుల పరిధిలోకి రావడంతో పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి.

మార్కెట్‌ వృద్ధి

గతంలో పన్నులకు సంబంధించిన అనేక అంశాలలో లావాదేవీల ఖర్చుతో కలపి ధరలు పెంచుతూ పోవడం, పన్నులపై కూడా మరో రకమైన పన్నులు చెల్లించవలసి రావడంతో భారత దేశపు ఉత్పత్తుల్లో చాలా వాటికి ప్రపంచ మార్కెట్లో పోటీని ఎదుర్కొనే సామర్ధ్యం ఉండేదికాదు. జిఎస్‌టి అమలుతో పన్నులపై పన్నులు విధించే అవకాశం లేకపోవడంతో తక్కువ ధరలతో భారత వస్తువులు ప్రపంచ మార్కెట్‌లో పోటీపడగలుగుతున్నాయి. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో ఆర్ధిక వ్యవస్థలు తమ పన్నుల విధానాలను సరళం చేసిన తర్వాత గణనీయంగా అభివద్ధి సాధించాయి. న్యూజిలాండ్‌లో 1986లో జిఎస్‌టి అమలులోకి వచ్చిన మరుసటి ఏడాది ఆ దేశ ఎగుమతులు 22 శాతం వద్ధి చెందాయి. భారత్‌ లాంటి పెద్ద దేశంలో జిఎస్‌టి ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పట్టినా, జిఎస్‌టి ఖచ్చితంగా భారత్‌ను ప్రబల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దగలదు.

వాళ్లకు నోరు పెగలటం లేదు

గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో జిఎస్‌టి అమలును ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వస్తుంటే దేశ శ్రేయస్సుకు అహర్నిశం కషి చేస్తున్న ప్రధాని మోదీ ఎంతో ధైర్యంతో జిఎస్‌టిని అమలులోకి తీసుకువచ్చారు. జిఎస్‌టి వల్ల రాష్ట్రాల ఆర్ధిక స్వాతంత్రం తగ్గిపోతుందని వాదించే భాజపా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రతి పక్ష కూటమి ప్రతి నెలా పెరుగుతున్న జిఎస్‌టి వసూళ్లను గురించి మాట్లాడకపోవడం విడ్డూరం.

దేశ భద్రతను కూడా పక్కన పెట్టి మైనార్టీ ఓట్ల కోసం నోట్ల రద్దును కూడా వ్యతిరేకించిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జిఎస్‌టిని కూడా వ్యతిరేకించారు. దొంగ నోట్లు, జీరో దందాకు కేంద్రమైన పశ్చిమ బెంగాల్‌ మైనార్టీ ప్రాంతాలకు నష్టం జరుగుతుందనే మమత జిఎస్‌టిని, నోట్ల రద్దును వ్యతిరేకించారనేది జగమెరిగిన సత్యం. మమతకు తోడు మైనార్టీ జపం చేసే అరవింద్‌ కేజ్రివాల్‌, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం జిఎస్‌టికి వ్యతిరేకంగా కూటమి కట్టి, జిఎస్‌టి వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని, ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని నానాహైరానా చేస్తున్నారు.

రాష్ట్రాలకు అత్యధికంగా పన్ను ఆదాయం లభించే పెట్రోలు, మద్యంపై ఇంకా జిఎస్‌టిని అమలు చేయలేదు. ఈ రెండింటిలోనే రాష్ట్రాలకు భారీగా ఆదాయం లభిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, పెట్రోలుపై సుమారుగా 20 వేల కోట్ల ఆదాయం ఒక్కో రాష్ట్రానికి లభిస్తుంది. పెట్రోలు ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేసిన ప్రతి పక్షాలు పెట్రోలు, మద్యంలను జిఎస్‌టి పరిధిలోకి తెమ్మని అడగకపోవడం గమనార్హం. వీటిని జిఎస్‌టి లోకి తెస్తే వాటి ధర చాలా తగ్గుతుంది. కాని దీంతో రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోతాయి. దీనిని దష్టిలో ఉంచుకొనే పెట్రోలు, మద్యం వంటి వాటని జిఎస్‌టి పరిధిలోకి తేలేదు.

తెలంగాణకు అధిక ఆదాయం

తెలంగాణలో జిఎస్‌టి అమలు కాకముందు 2016-17లో విలువ ఆధారిత పన్ను వ్యాట్‌ ద్వారా 34,235 కోట్ల రూపాయల ఆదాయం రాగా, జూలై 1, 2017 నుంచి అములులోకి వచ్చిన జిఎస్‌టి తర్వాత 2017-18లో పన్ను ఆదాయం మార్చి నాటికి 41,154 కోట్లకు పెరిగింది. మార్చి 2018లో తెలంగాణ పన్ను ఆదాయం 2,267 కోట్లుగా ఉంది. తెలంగాణలో ఏప్రిల్‌ నెలలో 24 నాటికే 3,040 కోట్ల జిఎస్‌టిని వసూలు చేసి సరికొత్త రికార్డును సష్టించింది. తెలంగాణ జిఎస్‌టి వసూలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

దేశ వ్యాప్తంగా మే నెలలో వసూలైన జిఎస్‌టి 94 వేల కోట్లకే పరిమితమైంది. ఏప్రిల్‌లో నమోదైన 1 లక్షా 3వేల 458 కోట్ల జిఎస్‌టి ఆదాయం మేలో కొంత మాత్రమే తగ్గింది. అయితే ఏప్రిల్‌ జిఎస్‌టి ఫైలింగ్‌ చివరి నెల కావడంతో పెద్ద ఎత్తున వసూళ్లు సాధ్యమయ్యాయన్నది గమనార్హం. మే నెలలో అవి కొద్దిగా తగ్గినా ఆశాజనకంగానే ఉన్నాయి. 9 నెలల సగటు జిఎస్‌టి ఆదాయం కన్నా ఇది ఎక్కువే.

మరింత పెరుగుదల

వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ, ఒకవైపు ఉత్పత్తి దారులు, మరోవైపు వినియోగ దారులపై పన్నుభారం తగ్గిస్తూనే, మరో వైపు పన్నుల సేకరణ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచగలదని జిఎస్‌టి ప్రమాణం చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పాలుపంచుకొని సహకార పద్ధతిలో సాగే ఫెడరలిజాన్ని చాటుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నట్లు కేంద్రం పెత్తనం దీనిలో ఏమాత్రం లేదు. కేంద్ర జిఎస్‌టి, రాష్ట్ర జిఎస్‌టిని సమన్వయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్ను అధికారులు వసూలు చేస్తారు. దీనిలో ఒకదానిపై ఒకటి అజమాయిషీ చేసే విధంగా ఉండటం వలన పన్ను ఎగవేత అనే భావనే ఉండదు. దీంతో భవిష్యత్తులో పన్ను వసూళ్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

మరింత సమర్థంగా..

ప్రస్తుతం పన్ను వసూలు అధికారులు, వ్యవస్థ సరిపడనంత లేకపోయినా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి అనే అంశాలను ప్రభుత్వం అంచనా వేేస్తోంది. పెద్ద ఎత్తున పన్ను అధికారులను నియమించడానికి కసరత్తు చేస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు పన్ను ఆదాయమే ముఖ్య ఆర్ధిక వనరు. 3 లక్షల కోట్లతో రక్షణ బడ్జెట్‌ నిర్వహించా లంటే పెద్ద ఎత్తున పన్ను వసూలు చేయాల్సిందే.

జిఎస్‌టి వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అయ్యింది. అయిదారు రకాల పన్నులకు బదులు ఒకటే పన్ను జిఎస్‌టిని వసూలు చేస్తున్నారు. దీని ద్వారా పన్ను ఎగవేతలు చాలా వరకు తగ్గాయి. పన్నుల భారం తగ్గింది కనుక వ్యాపారస్తులు కూడా పన్ను ఎగవేతకు సిద్ధపడటం లేదు. ఒకే పన్ను విధానం వలన ప్రభుత్వం పన్ను వసూలుకు చేసే ఖర్చులు కూడా తగ్గాయి. దేశం జిడిపిలో 16 శాతంగా ఉన్న పన్ను వసూళ్లు త్వరలోనే 20 శాతానికి చేరుకొనే అవకాశం ఉంది. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా తయారయ్యే అవకాశం ఉంది. పన్ను వసూళ్ల ద్వారా లభించిన ఆదాయాన్ని ప్రభుత్వం దేశాభివద్ధికి ఖర్చు చేసే వీలుంది.

ముందుంది మరింత సుఖం

2017 జూలై 1 నుంచి భారతదేశంలో జిఎస్‌టిని అమలు చేయడం ఒక విప్లవాత్మకమైన సంస్కరణ. ఇది మనదేశంలో వ్యాపారం చేసే తీరును మార్చి వేసింది. ఇంత పెద్ద స్థాయిలో మార్పులు చేయడం వల్ల ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా, రానురాను జిఎస్‌టి ఫలాలను ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కొద్ది పాటి ఇబ్బందులను భరిస్తే దాని వల్ల భారత ఆర్ధిక వ్యవస్థకు సుదీర్ఘకాలం ఆర్ధిక ప్రయోజనాలు లభించనున్నాయి.

అది తప్పు

ప్రజల నిత్యావసర వస్తువులను జిఎస్‌టి నుంచి మినహాయించి, కొన్ని వస్తువులకు తక్కువ పన్నులు విధించి ప్రభుత్వం సమతౌల్యం పాటించింది. ఆర్ధికంగా నిలదొక్కుకున్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్‌, పంజాబ్‌ లనుంచి పెద్ద ఎత్తున జిఎస్‌టి వసూలు అవుతోంది. ఈ ఆదాయాన్ని కేంద్రం దేశంలోని వెనుక బడిన ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకు కేటాయిస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలను దోచి ఉత్తరాదికి పెడుతుంది అనే ధోరణిలో ప్రతి పక్షాలు చూపిస్తున్నాయి. ఇది సమంజసం కాదు. దేశ వాణిజ్య రాజధాని ముంబై కావడంతో దేశంలోని అన్ని కంపెనీలు ముంబై కేంద్రంగా నడుస్తూ అక్కడే పన్నులు చెల్లిస్తున్నాయి. అక్కడ వసూలైన పన్నులన్ని మహారాష్ట్రకే కేటాయించాలి అంటే 40 శాతం వారికే ఇవ్వాలి. ఇలా చేస్తే దేశాన్ని ఎలా నడిపించగలం. తెలంగాణలో పన్ను ఆదాయం సింహభాగం హైదరాబాదు నుంచే లభిస్తోంది. అంత మాత్రం చేత జిల్లాలకు నిధులు కేటాయించవద్దు అనడం ఎంత తప్పో జిఎస్‌టి విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందనే ఏపి లాంటి రాష్ట్ర ప్రభుత్వాల వాదన అంతే తప్పు.

– ఆర్‌.సి.రెడ్డి ఉప్పల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *