కారుణ్యం పేరుతో జాతీయ భద్రతకు విఘాతం

కారుణ్యం పేరుతో జాతీయ భద్రతకు విఘాతం

ఉదారవాదులు, స్వచ్ఛంద సంస్థలు, ఐరాస ఏజన్సీలు, మీడియా-వంటి కలగూర గంప బృందాల నుండి విమర్శలను ఎదుర్కోవడం ప్రధాని నరేంద్రమోదీకి అలవాటైపోయింది. మామూలుగా అలవాటైన దేశీయ విషయాలకుతోడు ఇపుడు మయన్మార్‌లో రోహింగ్యాల కష్టాలపట్ల భారతదేశ వైఖరిని ఆయన వ్యతిరేకులు జోడించినట్లు తోస్తున్నది.

తన మయన్మార్‌ పర్యటన సందర్భంగా, మయన్మార్‌ ప్రాదేశిక సమగ్రతను గౌరవించే భారతదేశ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. రాఖైన్‌ ప్రావిన్స్‌లో రోహింగ్యా ఉద్యమంలో అంతర్లీనంగా ఉన్న వేర్పాటువాదానికి భారతదేశ వ్యతిరేకతను ఈ నిబద్దత సూచిస్తున్నది. ఈ విషయంపై మయన్మార్‌ సైనిక పాలకుల స్పందన తగినంతగా లేకపోవడం, పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లోని లక్షలమంది శరణార్థుల వలసల పట్ల పెరుగుతున్న ప్రపంచ ఆగ్రహం నేపథ్యంలో పోరాటం యొక్క ఈ పార్శ్వాన్ని దాదాపు ఎవరూ పట్టించుకోలేదు.

అక్రమ రోహింగ్యా శరణార్థులను ”తిరిగి పంపేందుకు” (సవజూశీత్‌ీ) భారత ప్రభుత్వం నిర్ణయం చేయడంతో, ”మానవతా సంక్షోభం” పట్ల సంవేదనారాహిత్య ఆరోపణను భారతదేశం ఎదుర్కొంటోంది. మరో శరణార్థి ప్రవాహానికి ద్వారాలు తెరవడానికి భారతదేశం ఇష్టపడడం లేదు. నోబెల్‌ పురస్కార గ్రహీత, ఆనాటి ప్రజాస్వామ్య ప్రతీక ఆంగ్‌సాన్‌ స్యూకిని ”సామూహిక హత్యాకాండ” కుట్రలో భాగం వహిస్తున్నట్లు ఆరోపించిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, ప్రతి నాయకుల జాబితాలో మోదీని సైతం జోడించడం తథ్యం. తన సందిగ్ధ ధోరణి వలన బంగ్లా ప్రధాని షేక్‌హసీనా సైతం వీరికి లక్ష్యంగా మారారు.

ఊహించినట్లే ఈ సమస్యకు మతపరకోణం సోకింది. ఒకవైపు మయన్మార్‌ సైనిక దుర్మార్గాలను అక్షరీకరించడానికి అంతర్జాతీయ మీడియా పోటీపడుతుండడము, మరోవైపు మానవ హక్కుల హడావిడికి యూరోపియా కూటమి (జుఖ) తన గళాన్ని జోడించడం నేపథ్యంలో రోహింగ్యా శరణార్థులు ముస్లింలు కావడమే భారతదేశ ఉదాసీనతకు కారణమనే సూచనలు వెలువడు తున్నాయి. టిబెటన్లు, చక్మాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీయ హిందువులు, ఆఫ్ఘనులు, శ్రీలంక తమిళులకు ఆశ్రయం కల్పించగలిగిన భారతదేశం శాపగ్రస్తులైన మయన్మార్‌ రోహింగ్యాలను కూడా స్వాగతించాలనే వాదన వినిపిస్తోంది.

ఉదాసీనతకూ ముస్లిం వ్యతిరేక పక్షపాతానికీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు భారతదేశ సంశయానికి కారణాలను పరిశీలించడం సముచితం.

రోహింగ్యా శరణార్థులు ఇప్పటికే దాదాపు 40,000 మంది ఇక్కడ స్థిరపడినట్లు అంచనా. చాలామంది వద్ద ఆధార్‌కార్డు, ఓటరుకార్డు ఉన్నప్పటికీ, వీరిలో చాలామంది అక్రమ వలస దారులే. అయితే, భారతదేశంలోని దాదాపు 20000మంది రోహింగ్యాలు స్థిరపడడానికి జమ్ము, లఢక్‌ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడమే విచిత్రం. మిగిలినవారు దిల్లీ, హర్యానాలోని మేవార్‌ ప్రాంతం, కోల్‌కతా, హైదరాబాద్‌ ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు.

మయన్మార్‌ సరిహద్దు జమ్ము, లఢక్‌లకు చాలాదూరంలో ఉంది. రోహింగ్యాలు నిశ్శబ్దంగా కశ్మీరు లోయకు కాకుండా ఈ ప్రాంతాలకు వెళ్ళడం, అనుమానాన్ని, కుట్రపూరిత ప్రణాళికను సూచిస్తు న్నది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను ఈ అంశం ప్రస్తావించినప్పటకీ, ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. అయితే, సామాజిక మాధ్యమాలు కుట్రసిద్ధాంతంతో ప్రతిధ్వనిస్తున్నాయి.

మరోవంక కేవలం బౌద్ధులకే కాక, రాఖైన్‌ ప్రావిన్సులోని నివాసులందరికి పౌరహక్కులు ఇవ్వాలని అంతర్జాతీయ సమాజం మయన్మార్‌పై ఒత్తిడి చేస్తోంది. అదే సమయంలో తిరుగుబాటు రాజకీయాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మయన్మార్‌కు ఉంది.

ఒకనాడు ఆక్రమించియున్న జపాన్‌కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేయడానికి రోహింగ్యా లకకు బ్రిటిష్‌వారు 1943-44లో ఆయుధాలను అందించినపుడు వివాదానికి బీజం పడింది. కాని రోహింగ్యా నాయకత్వం స్థానికి బౌద్ధులపై దాడులతో పౌరయుద్ధం ప్రారంభించింది. సరైన ఆలోచన లేకుండా 1947, 1948లలో రాఖైన్‌ ప్రావిన్స్‌ను తూర్పుపాకిస్తాన్‌తో విలీనం చేయాలని రోహింగ్యా నాయకత్వం కోరడంతో వీరిపై స్వామి ద్రోహ ఆరోపణలు మోపబడ్డాయి. అప్పటి నుంచి ముస్లిం తిరుగుబాటుతో రాఖైన్‌ ప్రావిన్స్‌ బాధపడుతుండగా సైనిక దమనకాండతో సమస్య మరింత విషమించింది.

1980ల నుండి రోహింగ్యా వేర్పాటువాదం మతం రంగును పులుముకున్నది. 2016 నాటి అంతర్జాతీయ విపత్తు బృందం నివేదిక ప్రకారం – క్షేత్రస్థాయిలోని ప్రధాన బృందం హరకత్‌ – ఆల్‌ – యాక్విన్‌ (నaవ)ని మక్కా, మదీనాలలో స్థావరంగల 20మంది బహిష్కృతుల బృందం నియంత్రిస్తోంది. ఇందులో చాలామంది పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో సైనిక శిక్షణ పొంది, తరువాత రాఖైన్‌లోని కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. పశ్చిమాసియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భారతదేశంలో ఉన్న వారి మద్దతుదారులు నaవకి నిధులందిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబైలో ఆగష్టు 2012 నాటి హింసాకాండను గుర్తు చేసుకుందాము.

నaవకు రాఖైన్‌లోని ముస్లిం మత పెద్దల మద్దతూ ఉంది. నaవ సూచనతో, ”రాఖైన్‌ ప్రాంతంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న పీడనను గమనిస్తే… భద్రతా దళాలకు వ్యతిరేకంగా ఉద్యమించటం ఇస్లాం ప్రకారం చట్టబద్ధమే, దీనిని వ్యతిరేకించిన వారు ఇస్లాంను వ్యతిరేకించినట్లే అనే ఫత్వాను రోహింగ్యాలకు, వివిధ దేశాల మతాధి కారులు ఇచ్చారని Iజ+ నివేదిక తెలిపింది.

రోహింగ్యా తీవ్రవాదులకు సురక్షిత ఆశ్రయం కల్పిస్తే పాశ్చాత్యుల మనస్సాక్షికి ఊరట కలగవచ్చు. అయితే, దీంతో భారతదేశంలో పంచమాంగదళం పురుడు పోసుకుంటుందేమో! (దేశ స్థిరత్వానికి భంగం కలిగించే విచ్ఛిన్నకర శక్తులే-ఈ పంచ మాంగదళం). కారుణ్యమా లేక జాతీయ భద్రతా? అనేది ప్రస్తుతం నిర్ణయం చేసుకోవలసిన విషయం.

– టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *