Archive For The “Index” Category

ఎక్కడ చిత్తశుద్ధి..!

By |

ఎక్కడ చిత్తశుద్ధి..!

ఇటీవల గోదావరి నదిలో మంతూరు, వాడపల్లి మధ్య జరిగిన ఘోర లాంచీ ప్రమాదం అత్యంత విషాదకరమైనది. ఆ ప్రమాదంలో 22 మంది అమాయకులు జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం జరగటానికి రెండు రోజుల ముందే అదే స్థలంలో గోదావరిలో మరొక లాంచీ అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ ప్రమాదం నుండి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటం సంతోషకరం. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉన్నందునే ఇది సాధ్యమైంది. దీనికి కొద్దిరోజుల ముందు కొన్ని నాటు పడవలు ఇసుక తిన్నెలలో కూరుకుపోయాయి. గత…

పూర్తిగా చదవండి

Read more »

చనిపోయినప్పుడు వినిపించేది కాదు

By |

చనిపోయినప్పుడు వినిపించేది కాదు

ప్రపంచ భాషల్లో గల సామాజిక, ధార్మిక, మానసిక, తాత్విక, సర్వమత గ్రంథాలన్నింటిలోనూ శ్రీమత్‌ భగవద్గీత అత్యుత్తమమైనది. ఈ గ్రంథం వేదాలు, ఉపనిషత్తులు, యోగ దర్శన, ధర్మ గ్రంథాల సారమని పండితులు విశ్వసిస్తారు. ఇది జాతి, మత, కుల, లింగ, వర్ణ భేదం లేక మానవులందరికి సుఖశాంతులను, వారి అభ్యుదయానికి మార్గదర్శనం చేసే మూల గ్రంథం. అందుకే ప్రపంచ భాషలన్నిటి లోకి భగవద్గీత అనువాదమైంది. మనదేశ న్యాయ స్థానాలలో సాక్ష్యమిచ్చే ప్రతి హిందువుకు ప్రమాణ గ్రంథమైంది. ఈ మధ్య…

పూర్తిగా చదవండి

Read more »

ఏమి సాధించారు యువరానర్‌ ?!

By |

ఏమి సాధించారు యువరానర్‌ ?!

‘మీరు బిజెపికి ‘బి’ టీమ్‌ అని రాహుల్‌గాంధి అంటున్నాడు. మీరేమంటారు?’ ‘పిచ్చి రాహుల్‌గాంధీకి కర్ణాటక రాజకీయాల ఎబిసిడిలు తెలియవు. తమకి అవసరమైనప్పుడు మమ్మల్ని వాడుకున్న కాంగ్రెసువాళ్లు ఇప్పుడు మమ్మల్ని ‘బి’ టీమ్‌ అంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి బిజెపి కంటే కాంగ్రెస్‌ ఎక్కువ ప్రమాదకారి. ఇవాళ మేము బిజెపి పక్కన నిలబడి ఒక దగ్గు దగ్గితే చాలు. కాంగ్రెసు కర్ణాటకలో కొట్టుకుపోతుంది’. ఇదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు దేవయ్య కొడుకు…

పూర్తిగా చదవండి

Read more »

ఎవరు గెలిచారు?

By |

ఎవరు గెలిచారు?

అతి పెద్ద పార్టీగా నిలిచిన భాజపాను గవర్నర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించారు. అయితే భాజపాపై లేని పోని అభాండాలు వేసి, కల్పిత ఫోన్‌ కాల్స్‌, కల్పిత కథనాలతో ప్రజలను కాంగ్రెస్‌ అయోమయానికి గురిచేసింది. ఇలాంటి సమయంలో 104 సీట్లు సాధించి కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని సునాయాసంగా వదులుకోడానికి సిద్ధమై, విశ్వాస పరీక్ష కంటే ముందుగానే తాను రాజీనామా చేస్తున్నట్లు సభలో ప్రకటించి, హుందాగా వ్యవహరించి పదవి నుంచి తప్పు కున్నారు. ఇది ప్రజలను ఆలోచింప…

పూర్తిగా చదవండి

Read more »

ట్రంప్‌ నిర్ణయ ఫలితం ఎలా ఉండబోతోంది?

By |

ట్రంప్‌ నిర్ణయ ఫలితం ఎలా ఉండబోతోంది?

ట్రంప్‌ నిర్ణయం మధ్య ప్రాచ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చు. ఇరాన్‌ దుశ్చర్యలను అడ్డుకోవడానికే తను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ అంటున్నాడు. యూరోపియన్‌ దేశాలు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విఫలమైతే సౌదీ అరేబియా అణ్వాయుధాలు సమకూర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాను రాను మూర్ఖపు దేశాల అణ్వాయుధాలను కలిగి ఉండాలనే కోరికను ఎవరూ లొంగదీయలేరు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తను చేసిన వాగ్దానాలను ట్రంప్‌ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు. ఎన్నికల సమయంలోనే ట్రంప్‌ తను గెలిస్తే…

పూర్తిగా చదవండి

Read more »

అగ్నికణం వీర సావర్కర్‌

By |

అగ్నికణం వీర సావర్కర్‌

మే 28 సావర్కర్‌ జయంతి ప్రత్యేకం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌.. ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు.. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌…

పూర్తిగా చదవండి

Read more »

అరాచకం అంచున బెంగాల్‌

By |

అరాచకం అంచున బెంగాల్‌

ఏప్రిల్‌ 7న టిఎంసి గుండాల దుర్మార్గాలు తారాస్థాయికి చేరాయి. ఆరాంబాగ్‌ ఎస్‌డిఓ కార్యాలయం దగ్గర టిఎంసి గూండాలు ఫార్వర్డ్‌ బ్లాక్‌కు చెందిన మహిళా కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళా అభ్యర్థి, ఆమె కోడలి వస్త్రాలను తొలగించడమే కాక వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా కెమెరాల్లో రికార్డ్‌ అయింది. పశ్చిమ బెంగాల్‌లో పూర్తిగా అరాచక పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. పంచాయతీ ఎన్నికల్లో తణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోటీగా ఎవరు నామినేషన్‌లు వేయకుండా చూసేందుకు భయపెట్టడమేకాక…

పూర్తిగా చదవండి

Read more »

వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

By |

వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు

అక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేసే అద్భుత కథాకథన చక్రవర్తి వాకాటి పాండురంగారావు ధర్మపత్ని వాకాటి ప్రమీలా దేవి ఇక లేరు. మే 18న హైదరాబాద్‌లో ఆమె స్వర్గస్థులయ్యారు. కాళహస్తీశ్వర మాహత్మ్యం వంటి కావ్యాన్ని వ్రాసిన మహాకవి ధూర్జటి ఆమె పూర్వజులు. ఆమె తండ్రి డి.వెంకటేశ్వర్లు నెల్లూర్‌ వి ఆర్‌ కాలేజీలో గణిత అధ్యాపకులు. ఆమె మాతామహులు సీ.రామయ్య. ఆయన చేయి తిరిగిన రచయిత. ఆధునిక భారత ఆధ్యాత్మిక దీప్తి వంటి దివ్యజ్ఞాన సమాజానికి పేరెన్నికగన్న…

పూర్తిగా చదవండి

Read more »

టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు

By |

టి-కాంగ్రెస్‌లో కుల కుంపట్లు

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగు తోంది? అంతర్గతంగా సమన్వయం ఎలా సాగు తోంది? సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సంసిద్ధమవుతోందా? లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఆ పార్టీలో ఉన్నవాళ్లకే సమాధానాలు దొరకడంలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బస్సుయాత్ర మినహా కాంగ్రెస్‌పార్టీ చెప్పుకోదగ్గ రీతిలో కార్యాచరణ సిద్ధం చేయడం లేదంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. హస్తినలో తనకున్న పలుకుబడితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిగతా నాయకులకు, సీనియర్లకు రాహుల్‌గాంధీ ద్వారా చెక్‌ పెట్టించారన్న ఆరోపణ లున్నాయి. రాహుల్‌ కోటరీలోని…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో బంగారు గనులు అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తన భూభాగంలో చైనా భారీ స్థాయిలో మైనింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో 6వేల కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి, ఇతర లోహాలు ఉన్నట్లు స్థానిక మీడియాలో ఓ కథనం వచ్చింది. భారత్‌, చైనాల మధ్య ఇది మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మనదేశ సరిహద్దు పక్కనే ఉన్న లుంజేకౌంటీలో ఈ మైనింగ్‌ ప్రాజెక్టును చైనా చేపట్టిందని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌…

పూర్తిగా చదవండి

Read more »