Archive For The “స్ఫూర్తి కణాలు” Category

ఇటు వేదం, అటు ఖురాన్‌…

By |

ఇటు వేదం, అటు ఖురాన్‌…

అతను మహాపండితుడు. వేదాల్ని అధ్యయనం చేశాడు. శాస్త్రాలలో దిట్ట. సంస్కృత శ్లోకాలను అవలీలగా చెప్పేస్తుంటాడు. సంస్కృత భాషా ప్రచారమే జీవన ధ్యేయంగా పనిచేస్తుంటాడు. అనునిత్యం సంస్కృతం గురించే తపిస్తుంటాడు. సంస్కృతం తప్ప అతనికి మరొక ధ్యాస లేదు. ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌లో అతనో ప్రొఫెసర్‌. కాబూల్‌ యూనివర్సిటీ సైతం అతన్ని సంస్కృతం నేర్పించేందుకు ఆహ్వానించింది. చాలా మంది ఆయన్ను ప్రేమగా ‘శాస్త్రి’ అని పిలస్తారు. అతని సంస్కృత పాండిత్యం చూసి తాలిబాన్లు సైతం ఆయనకి శిష్యులయ్యారు….

Read more »

ఈ గుడి గురించి తెలుసా ?

By |

ఈ గుడి గురించి తెలుసా ?

తలపై కుంపటి.. చేతుల్లో వరదరాజ పెరుమాళ్‌ దేవతా మూర్తి.. ఆ కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలు.. అయినా పెరుమాళ్లు పంతులు కళ్లలో మాత్రం మిలమిలలాడే కృతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం మాత్రమే కనిపిస్తున్నాయి. జనం వేల సంఖ్యలో పోగై పెరుమాళ్‌ను, ఆయన చేతుల్లోని పెరుమాళ్‌స్వామిని చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు. అక్కడ నవాబు సైన్యం మొహరించింది. జాగీర్దారు వచ్చి ఓ కుర్చీపై కూర్చున్నాడు. కంచికి వెళ్లి వరదరాజ పెరుమాళ్‌ని దర్శించు కొని వస్తూ నా…

Read more »

ఆ భవనంలోకి వెళ్లనుగాక వెళ్లను..

By |

ఆ భవనంలోకి వెళ్లనుగాక వెళ్లను..

‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ కథ చాలా మందికి తెలుసు. సుల్తాన్‌ ఏక్‌ దిన్‌ మాత్రమే గడిపిన భవనం గురించి తెలుసా? ఇరవై తొమ్మిదేళ్లు ఏకధాటిగా నిర్మాణం చేసిన భవనం.. వేలాది మంది పనివాళ్లు కట్టిన భవనం.. ఒక్కటంటే ఒక్క రాత్రి అందులో సుల్తాన్‌ గడిపాడు. ఆ తరువాత వందల సంవత్సరాలు గడిచినా భవనంలో నివసించిన వాళ్లు లేరు. అతిరమ్యమైన భవనమైనా అది మిగతా భవనాల మధ్య షోకేసుకి మాత్రమే పరిమితమైపోయిన అమ్మాయి బొమ్మలా అలా ఉండిపోయింది….

Read more »

నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడుకుందాం రా?

By |

నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడుకుందాం రా?

ఆయన రథానికి ఒకటే చక్రం.. అది చాలదన్నట్టు ఏడు గుర్రాలు.. ఏడు వైపులకు లాగుతూ ఉంటాయి. పైగా గుర్రాలకు పగ్గాలుగా ఉన్నవి విషం విరజిమ్మే పాములు.. అంతేనా అంటే ఇంకా ఉందండీ.. ఆయన రథసారధి గుడ్డివాడు.. అవిటివాడు.. ఇక చాలు బాబూ ఈ కష్టాల లిస్టు అనకండి.. ఇది సశేషమే.. ఈ ఒంటి చక్రపు రథంపై, ఎవరి మాటా వినని ఏడు గుర్రాలకు పాములే పగ్గాలుగా బిగించుకుని, గుడ్డి, అవిటి సారథితో ఆయన వెళ్లాల్సిన దారికి ఆధారం…

Read more »

నడిచే రామకోటి పుస్తకాలు

By |

నడిచే రామకోటి పుస్తకాలు

కారడవిలో ఒంటరిగా పడున్నాడతడు. ముఖం చూస్తే ఏడ్చి ఏడ్చి సొలసినట్టు తెలుస్తోంది. కన్నీళ్ల చారికలు కనిపిస్తున్నాయి. అతను ఆహారం మానేసినట్టు బక్కచిక్కిన దేహం చెప్పకనే చెబుతోంది. అలా ఎన్ని రోజులు పడున్నాడో తెలియదు. అతని పెదవులు వణుకుతున్నాయి. కాదు కాదు కదులుతున్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ‘రాం… రాం … రాం…’ మరో మాట లేదు. ఒక్క ‘రాం రాం రాం’ తప్ప. అతని పేరు పరశురాం. ఊరు ఛపారా. రాయగఢ్‌ జిల్లా. రాముడంటే అతనికి ఎంతో…

Read more »

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

By |

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

‘రావోయ్‌ కలిసి క్రికెట్‌ ఆడుకుందాం’ అడిగాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర మిశ్రా. ఎందుకంటే తన బాడీగార్డ్‌కి క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో అతనికి తెలుసు. ముంబాయి ఇండియన్స్‌ అతని ఫేవరేట్‌ టీమ్‌. సచిన్‌ అంటే ప్రాణం. ‘సర్‌ మనిద్దరిలో ఒకరే ఆడగలం. మీరు ఆడితే నేను కాపలాగా నిలబడతాను. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత’ అని ఆ పోలీసు కానిస్టేబుల్‌ జవాబిచ్చాడు. అతని పేరు జావేద్‌ అహ్మద్‌ దార్‌. ఏళ్ల తరబడి జావేద్‌ దార్‌, శైలేంద్ర…

Read more »

మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

By |

మోహన్‌లాల్‌ కశ్మీరీ అలియాస్‌ ఆగా హసన్‌ జాన్‌

అఫ్గన్లను అడిగితే ఆయన పేరు మీర్జా కులీ కశ్మీరీ అని చెబుతారు. బ్రిటీషర్లకు, అఫ్గన్లకు మధ్య జరిగిన యుద్ధాల్లో ఆయన బ్రిటీషర్ల కోసం గూఢచర్యం చేశాడు. అఫ్గన్లను ఓడించేందుకు ప్రయత్నించాడు. తరువాత ఇరు సైన్యాల మధ్య సంధి చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇరానియన్లను ఆయన గురించి అడగండి! ఆయన పేరు ఆగా హసన్‌ జాన్‌ కశ్మీరీ అని చెబుతారు. ఆగా హసన్‌ జాన్‌ పర్షియన్‌ భాషలో ఉద్దండుడని ఆయన చరిత్రంతా చెబుతారు. కానీ ఆయన అసలు…

Read more »

కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు

By |

కశ్మీరీ హిందువుల కోసం ప్రాణాలర్పించిన గురువు

పండిత్‌ కృపారామ్‌ రెండు చేతులు జోడించి గురువు వైపే భక్తి శ్రద్ధలతో చూస్తున్నాడు. ఆయన వెంట వచ్చిన వారంతా కన్నీటితో గురువు వైపే చూస్తున్నారు. ‘గురుదేవా.. మా పరిస్థితి దయనీయంగా ఉంది. బతుకు దుర్భరమై పోయింది. మా ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నాం. మమ్మల్ని ఇస్లాంలో చేరమని బలవంతపెడుతున్నారు. నానా అత్యాచారాలకు గురిచేస్తున్నారు’ వేదికపై గురువు కూర్చున్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానముద్రలో ఉన్నారా గురువు. పండిత్‌ కృపారామ్‌ మాటలు విని కళ్లు తెరిచారు. కహ్లూర్‌ లోని చక్‌నన్కీలో…

Read more »

మంచుకొడలపై మహా సాహస చరిత్ర

By |

మంచుకొడలపై మహా సాహస చరిత్ర

దేహ్‌ శివా వర్‌ మోహ్‌ ఇహే శుభ్‌ కర్మన్‌ సే కభున టరూ నడరూ అరి సే జబ్‌ జాయే లడూ నిశ్చయ్‌ కర్‌ అపనీ జీత్‌ కరూ (ఈ దేహం దేవుడిచ్చిన వరం. మంచి పనులు చేయడంలో వెనకడుగు వేసేది లేదు. శత్రువుతో పోరాడేందుకు వెళ్తున్నప్పుడు నాలో భయం ఉండదు. దఢనిశ్చయంతో విజయం సాధించాలి.) భయంకరమైన రణరంగంలో రక్తం పారుతున్న ప్పుడు, ఆకాశం ఆ ఎరుపును పులుముకున్నప్పుడు, కత్తుల కణకణల మధ్య, సైన్యాల రణధ్వనుల మధ్య…

Read more »

సుజీత్‌ కుమార్‌ – పత్రికల్లో కనిపించని ఒక పతాక శీర్షిక

By |

సుజీత్‌ కుమార్‌ – పత్రికల్లో కనిపించని ఒక పతాక శీర్షిక

పాత్రికేయుడు మజీద్‌ హైదరీ మీడియా పాస్‌ చూపించుకుంటూ కారులో శ్రీనగర్‌లో తిరుగు తున్నాడు. అది పీర్‌బాగ్‌ బ్రిడ్జి ప్రాంతం. అతనికి దూరంగా తుపాకీ చేత పట్టుకున్న సిఆర్‌ఫిఎస్‌ జవాను కనిపించాడు. తలకు, ఒంటికి బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణ. చేతిలో ఏకె 47. ‘కశ్మీర్‌పై కర్కశ క్రూర దమనకాండకు ప్రతీక వీడు’ అంటూ మనసులోనే తిట్టుకున్నాడు మజీద్‌ హైదరీ. ఆయన కళ్లు హఠాత్తుగా రోడ్డు పక్కన కశ్మీరీలు చలికాలంలో ధరించే ఫేరన్‌ (ఓవర్‌ కోట్‌)ను ధరించి నేలమీద పాకుతున్న…

Read more »