Archive For The “మంచి మాట” Category

రామాయణం- ఆధునిక జీవనం

By |

రామాయణం- ఆధునిక జీవనం

భారతీయ సంస్కతికి మూలస్తంభాల వంటి గ్రంథాలు మూడున్నాయి. అవే రామాయణ, భారత, భాగవతాలు. వీటిలో భారతం మన నిజ జీవితం. రామాయణం ఆదర్శజీవితం. భాగవతం దివ్య జీవితం. మనం నిజ జీవితంలో ఎన్ని రకాల రాగద్వేషాలతో కొట్టుకు పోతున్నామో భారతం చెబుతుంది. మనం ఎంత ఆదర్శప్రాయమైన జీవితం గడపవచ్చో రామాయణం తెలియజేస్తుంది. ఏ రకంగా జీవిస్తే మనం దివ్య జీవితం గడపగలుగుతామో భాగవతం బోధిస్తుంది. ఆయా గ్రంథాలలో పాత్రలు, ప్రవత్తులు, కథలు, సందర్భాలు అన్నీ ఈ ఆశయాలకి…

Read more »

బ్రతకడానికి ఎన్నో దారులు

By |

బ్రతకడానికి ఎన్నో దారులు

సింహం తనకు నచ్చిన కొద్దిమాంసం మాత్రమే తిని మిగిలిన ఏనుగు మొత్తాన్ని అలా వదిలేస్తుంది. దానిని మిగిలిన జంతువులు తిని తమ ఆకలి తీర్చుకుంటాయి. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. ‘నేను సింహాన్ని. నేను ఏనుగును చంపగలను కాబట్టి చంపాను, అందుకని ఇదంతా నాకే కావాలనేం లేదు. అడవిలో ఉండే జంతువులన్నీ బతకాలి’ అనుకుంటుంది. మనిషి సింహంలా బతకాలి. ఇవ్వాళ ముఖ్యంగా మన విద్యార్థులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్య వైఫల్యం. ఏదో ఒకదానిలో విఫలం…

Read more »

కార్యశీలుడు ఎలా ఉండాలి ?

By |

కార్యశీలుడు ఎలా ఉండాలి ?

తనియ బండకుండ మును గోసికొన జవి చేటె కాదు; విత్తు చేటు గలుగు; బక్వమైన గొనిన ఫలమించు, జెడదు బీ జంబు; గార్యసిద్ధి చందమిట్లు||                 5-2-56 ధృతరాష్ట్రుడు విదురునితో ‘నీవు చెప్పిన మాటలతో నా మనసు కొంత కలత తీరింది. నీతి, అవినీతి మొదలైన విషయాల గూర్చి మరికొంత నాకు చెప్పు. నా మనసు తేరుకుంటుంది’ అని అడుగగా, విదురుడు అనేక విషయాలు చెబుతాడు. ఆ సందర్భంలో…

Read more »

ఎవరు పుణ్యాత్ములు ?

By |

ఎవరు పుణ్యాత్ములు ?

చెల్లియుండియు సైరణ సేయునతడు బేదవడియును నర్థికి బ్రియముతోడ దనకు గలభంగి నిచ్చునతండు బుణ్య పురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య||    5-2-42 ఒక సందర్భంలో విదురుడు లోకంలో ఎవరిని పుణ్యపురుషులని ప్రజలు కీర్తిస్తారో, ఎవరికి ప్రజల మన్నన కోరకుండానే లభిస్తుందో, ధృతరాష్ట్రునితో చెబుతాడు. ఆ లక్షణాలు ధర్మరాజునందు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి దేశప్రజలు వారిపట్ల సద్భావంతో ఉన్నారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం జరిగితే ప్రజాభిప్రాయం ఎటువైపు మొగ్గు చూపుతుందో తెలిసినట్లే. ‘మహారాజా, తనకు…

Read more »

రాజు రాజనీతిని అనుసరించాలి

By |

రాజు రాజనీతిని అనుసరించాలి

అరిది విలుకాని యుజ్జ్వల శరమొక్కని నొంచు; దప్పి చనినం జను; నే ర్పరి యైనవాని నీతి స్ఫురణము పగరాజు నతని భూమిం జెఱుచున్‌||    5-2-36 ధృతరాష్ట్రుడు విదురునితో ‘సంజయుని ద్వారా నేను చెప్పి పంపిన సందేశానికి ధర్మరాజు ఏమన్నాడో తెలియలేదు. దానితో నా మనసు కలవరపడుతున్నది. నీవు బుద్ధిమంతుడవు. ధర్మాధర్మాలు తెలిసిన వాడవు, రాజనీతి ఎరిగినవాడవు. నీవు విషయాన్ని విశదపరచి నా మనసు కుదుట పరచుము” అని అంటాడు. ఆ సందర్భంలో విదురుడు అనేకమైన నీతులు బోధిస్తూ,…

Read more »

నిద్ర రావట్లేదా ?

By |

నిద్ర రావట్లేదా ?

బలవంతుడు పై నెత్తిన బలహీనుడు, ధనము గోలుపడిన యతడు, మ్రు చ్చిలవేచువాడు, గామా కులచిత్తుడు నిద్రలేక కుందుదురధిపా||    5-2-21 సంజయుడు ఉపప్లావ్యం నుండి తిరిగి హస్తినాపురం చేరుకున్నాడు. వెంటనే, రాత్రి సమయమైనప్పటికీ ధృతరాష్ట్రుని కలుసుకొని, రాయబారం లోని సారాంశం చెప్పాడు. వివరంగా మరునాడు నిండుసభలో తెలుపుతానని తన యింటికి వెళ్ళిపోతూ ధృతరాష్ట్రునితో ”అసలు జూదమాడిన నాటి పాపం, దానికి నీ ఉపేక్ష – అక్కడే చిచ్చు పుట్టింది. లోకమంతా నీవు అధర్మపరుడవని నిందించే వరకు ఓర్చుకొని ఉండి…

Read more »

శాంతిప్రియులే తెలివైనవారు

By |

మది సుఖము గోరి, దుఃఖం బొదవం గల కార్యములకు నుత్సాహము సే యుదు రొప్పని తృష్ణంబడి చదురేమియు లేని యట్టి జనులాతురులై||     5-1-306 ద్రుపదుని పురోహితుడు హస్తినాపురం వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, భీష్ముడు ద్రోణుడు మొదలైన పెద్దలందరిని దర్శించాడు. వారి గుణగణాలు ప్రశంసించి వారిని సుముఖులను చేసుకొన్నాడు. నిండు సభలో మాట్లాడుతూ, పాండవులు సమర్థులైనప్పటికి యుద్ధాన్ని కోరటం లేదని, శాంతినే కోరుతున్నారనీ, వారి పాలు రాజ్యం వారికి ఇవ్వవలసినదిగా కోరుతున్నారనీ స్పష్టంగా చెప్పాడు. పురోహితుని మాటలలో…

Read more »

పుణ్యవర్తనులే పూజనీయులు

By |

విమల వంశంబునను బుణ్యవృత్తమునను వరలు నీతని రక్తంబు వసుమతీశ ధరణిపై నెన్ని బిందువుల్‌ దొరగె నన్ని వర్షములు గల్గు నిందనావర్ష భయము|| విరాటుడు జూదమాడుతున్నా, తనకుమారుని విక్రమాన్ని మనస్సులో చిత్రించుకొంటున్నాడు. ఉత్తరుడు బృహన్నలను వెంట దీసుకుపోయాడు కదా, తప్పక విజయం సాధిస్తాడు అని కంకభట్టు అనటం, ఆడ, మగ కాని పేదవానిని గొప్పజేసి మాట్లాడటం, విరాటుడికి ఎబ్బెట్టుగా తోచింది. ‘కురువీరులపై ఉత్తరకుమారుని విజయాన్ని నగర ప్రజలకు తెలియపరచండి. నగరాన్ని అలంకరించండి. ప్రజలంతా విజేత ఉత్తరకుమారునికి ఘనంగా స్వాగత…

Read more »

ఆయుధబలం

By |

ఆయుధబలం

వీని గొని గట్టి మైమఱు వేనుంగును మఱియు నెట్టివేనియు దునియం గా నేయ నగునె? కైదువు లేని యలవు కలిమి పర లెస్సై యున్నే                             4-4-107 భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామాదులతో కౌరవసైన్యం దండెత్తి వచ్చి, విరాటనగరానికి ఉత్తరాన ఉన్న గోవులను ఆక్రమించి తోలుకొని పోసాగింది. నగరంలోని యోధులందరూ విరాటరాజు వెంట సుశర్మతో యుద్ధం చేయటానికి దక్షిణానికి వెళ్ళడం వలన, అప్పుడు కౌరవసైన్యంతో తలపడి గోవులను…

Read more »

ప్రత్యుపకారం చేయకపోవటం అమానుషం

By |

ప్రత్యుపకారం చేయకపోవటం అమానుషం

 ఇతని యాశ్రయమున మనమెల్ల బ్రదికి యున్నవారము గావున నుగ్ర రిపుల పాలువడకుండ విడిపింప బాడి యితని నెయిదు మెయిదుము రథరయ మెసకమెసగ ||                      4-3-204 మహాబలశాలియైన కీచకుడు,  ఉపకీచకులు ఒక గంధర్వునిచే చంపబడ్డారని విన్న కౌరవులు, అది భీముని పనే అని భావించి, పాండవులు అజ్ఞాతవాసము విరాటుని నగరములో చేస్తుండవచ్చని ఊహించారు. విరాటుని ఆవులమందలను కౌరవ సైన్యము ఆక్రమించి మళ్ళించుకొని వస్తుంటే, పాండవులు వాటి రక్షణకోసం యుద్ధం చేయటానికి ముందుకు…

Read more »