Archive For The “స్పూర్తి” Category

ఈ పోరాటం ఆగదు..

By |

ఈ పోరాటం ఆగదు..

మహిళల అభ్యున్నతి కోసం అలుపెరుగని కృషి దైర్య, సాహసాలకు ప్రతీక ‘భన్సారీదేవి’ సమాజంలో మహిళల పట్ల రోజురోజుకి పెరిగిపోతున్న వివక్ష, లైంగిక హింస, గృహహింస, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు మొదలైన అమానవీయ చర్యలు ఆమెను తీవ్రంగా కలచివేశాయి. వాటిని రూపుమాపేందుకు ఆ యువతి తీవ్రంగా ఉద్యమించింది. ఏళ్ల తరబడి రాజీలేని పోరాటం చేసి చివరకు విజయం సాధించింది. ఆమె ఎవరో కాదు.. రాజస్థాన్‌కు చెందిన భన్వారీదేవి. 1997లో సుప్రీంకోర్టు మహిళల రక్షణ విషయంలో…

Read more »

ఆ భవనంలోకి వెళ్లనుగాక వెళ్లను..

By |

ఆ భవనంలోకి వెళ్లనుగాక వెళ్లను..

‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ కథ చాలా మందికి తెలుసు. సుల్తాన్‌ ఏక్‌ దిన్‌ మాత్రమే గడిపిన భవనం గురించి తెలుసా? ఇరవై తొమ్మిదేళ్లు ఏకధాటిగా నిర్మాణం చేసిన భవనం.. వేలాది మంది పనివాళ్లు కట్టిన భవనం.. ఒక్కటంటే ఒక్క రాత్రి అందులో సుల్తాన్‌ గడిపాడు. ఆ తరువాత వందల సంవత్సరాలు గడిచినా భవనంలో నివసించిన వాళ్లు లేరు. అతిరమ్యమైన భవనమైనా అది మిగతా భవనాల మధ్య షోకేసుకి మాత్రమే పరిమితమైపోయిన అమ్మాయి బొమ్మలా అలా ఉండిపోయింది….

Read more »

నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడుకుందాం రా?

By |

నీళ్లపై ఫుట్‌బాల్‌ ఆడుకుందాం రా?

ఆయన రథానికి ఒకటే చక్రం.. అది చాలదన్నట్టు ఏడు గుర్రాలు.. ఏడు వైపులకు లాగుతూ ఉంటాయి. పైగా గుర్రాలకు పగ్గాలుగా ఉన్నవి విషం విరజిమ్మే పాములు.. అంతేనా అంటే ఇంకా ఉందండీ.. ఆయన రథసారధి గుడ్డివాడు.. అవిటివాడు.. ఇక చాలు బాబూ ఈ కష్టాల లిస్టు అనకండి.. ఇది సశేషమే.. ఈ ఒంటి చక్రపు రథంపై, ఎవరి మాటా వినని ఏడు గుర్రాలకు పాములే పగ్గాలుగా బిగించుకుని, గుడ్డి, అవిటి సారథితో ఆయన వెళ్లాల్సిన దారికి ఆధారం…

Read more »

వారి ఉద్ధరణకే తన జీవితాన్ని అంకితం చేసింది

By |

వారి ఉద్ధరణకే తన జీవితాన్ని అంకితం చేసింది

సుధావర్గీస్‌ కేరళలోని కొట్టాయంకు చెందిన మహిళ. ఈమె 1949వ సంవత్సరంలో జన్మించింది. బీహార్‌లో నివసిస్తున్న ముషాహర్ల జీవన ప్రమాణా లను మెరుగుపరచడానికి అహర్నిశలు శ్రమించింది. బీహార్‌లో ముషాహర్లు ఎంతగా వెనకబడ్డా రంటే.. చాలా కాలం వరకు ఎలుకలను పట్టుకొని వండుకొని తిని జీవనం సాగించేవారు. వీరి జీవన విధానం చూసి సామాన్య ప్రజలు దూరంగా ఉంచే వారు. దాంతో ఊరికి దూరంగా గుడిసెల్లో జీవితం గడిపేవారు. అగ్రవర్ణాలవారు వీరిని చాలా నీచంగా చూసేవారు. సమాజంలో కులవివక్ష అప్పటికీ…

Read more »

ఆవుపేడతో బయోగ్యాస్‌

By |

ఆవుపేడతో బయోగ్యాస్‌

భారత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ‘ఆర్గానిక్‌ బయో- ఆగ్రో రీసోర్సెస్‌ ధన్‌’ (పేడ-ధనం) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం వ్యర్థాల నుండి ప్రత్యామ్నాయ ఆదాయం పొందడం. ఆవుపేడను, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్‌, బయో-సీఎన్జీ ఉత్పత్తి చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..! పంజాబ్‌లోని ¬షియార్‌పూర్‌ జిల్లాలో గల లాంబ్రీ గ్రామస్థులకు ఆక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకొన్న పనిగా అనిపించేది. అయితే ఆ అసాధ్యాన్ని కొంతమంది…

Read more »

నడిచే రామకోటి పుస్తకాలు

By |

నడిచే రామకోటి పుస్తకాలు

కారడవిలో ఒంటరిగా పడున్నాడతడు. ముఖం చూస్తే ఏడ్చి ఏడ్చి సొలసినట్టు తెలుస్తోంది. కన్నీళ్ల చారికలు కనిపిస్తున్నాయి. అతను ఆహారం మానేసినట్టు బక్కచిక్కిన దేహం చెప్పకనే చెబుతోంది. అలా ఎన్ని రోజులు పడున్నాడో తెలియదు. అతని పెదవులు వణుకుతున్నాయి. కాదు కాదు కదులుతున్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ‘రాం… రాం … రాం…’ మరో మాట లేదు. ఒక్క ‘రాం రాం రాం’ తప్ప. అతని పేరు పరశురాం. ఊరు ఛపారా. రాయగఢ్‌ జిల్లా. రాముడంటే అతనికి ఎంతో…

Read more »

తండ్రి బాటలోనే…!

By |

తండ్రి బాటలోనే…!

– ఉన్నతోద్యోగం వదిలి.. సేంద్రియ వ్యవసాయం వైపు.. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ఆరోగ్యం విలువ అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రమే తెలుస్తుందంటారు. అది నిజమే. అజ్మీర్‌లో నివసిస్తున్న పూల్‌చంద్‌కి తన కూతురు అంకిత కామెర్ల వ్యాధికి గురైనప్పుడే ఆరోగ్యం విలువ తెలిసింది. పూల్‌చంద్‌ సాధారణ రైతు కుటుంబంలోనే జన్మించినప్పటికీ ఉన్నత చదువులు చదివి డీడబ్ల్యూడీలో ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. ఇద్దరు కూతుళ్లు. అంకిత, ప్రణవి. అప్పుడు అంకిత వయస్సు మూడేళ్లు. కామెర్ల వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. జబ్బు నయం…

Read more »

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

By |

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

‘సామాజిక చైతన్యం ఉంటే చాలు విజయాలు సాధించవచ్చు’ అనే విషయాన్ని ఆ ఇద్దరు యువకులు మరోసారి నిరూపించారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భారతదేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లభించిందని ఇటీవలి నివేదిక తెలుపుతోంది. కాని అనేక ఇళ్ళకు ఇంకా విద్యుత్‌ సౌకర్యం రావాల్సి ఉంది. ఈ పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? కొందరు ‘అయ్యో.. పాపం’ అని ఆవేదన చెందుతారు. మరికొందరు ‘దేశంలో ఇప్పటికీ గ్రామాలు ఉన్నాయా?’…

Read more »

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

By |

‘మీతోనే ఉంటాను సాబ్‌..’

‘రావోయ్‌ కలిసి క్రికెట్‌ ఆడుకుందాం’ అడిగాడు సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర మిశ్రా. ఎందుకంటే తన బాడీగార్డ్‌కి క్రికెట్‌ అంటే ఎంత ఇష్టమో అతనికి తెలుసు. ముంబాయి ఇండియన్స్‌ అతని ఫేవరేట్‌ టీమ్‌. సచిన్‌ అంటే ప్రాణం. ‘సర్‌ మనిద్దరిలో ఒకరే ఆడగలం. మీరు ఆడితే నేను కాపలాగా నిలబడతాను. మిమ్మల్ని కాపాడటం నా బాధ్యత’ అని ఆ పోలీసు కానిస్టేబుల్‌ జవాబిచ్చాడు. అతని పేరు జావేద్‌ అహ్మద్‌ దార్‌. ఏళ్ల తరబడి జావేద్‌ దార్‌, శైలేంద్ర…

Read more »

సంకల్ప బలమే నిలబెట్టింది…

By |

సంకల్ప బలమే నిలబెట్టింది…

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. ఇది కేవలం సినిమా పాట మాత్రమే కాదు. ఇదే జీవిత సత్యం. కష్టపడితే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ సన్మతి జీవితమే. సమాజం మొత్తం తనను చిన్నచూపు చూసినా సంకల్ప బలంతో తన అంగవైకల్యాన్ని అధిగమించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శప్రాయురాలైంది. సన్మతి వెన్నెముక సరియైన స్థితిలో లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఆమె కుంగిపోలేదు. ధైర్యంగా…

Read more »