Archive For The “పుస్తక సమీక్ష” Category

వైదిక నాగరికత చరిత్ర మొదటి సంపుటి

By |

వైదిక నాగరికత చరిత్ర మొదటి సంపుటి

వైదిక నాగరికత చరిత్ర మొదటి సంపుటిలో రచయిత కొవ్విరెడ్డి జగ్గారావు జంబూ ద్వీపం, భరత వర్షం, హిందూ పదం, సరస్వతీ నది, సింధూ నాగరికత, ఆర్య నిగూఢ శబ్దార్థం, ఆర్యావర్తం, మధ్య ఆసియావాదం, సంస్కృత భాష లిపి, వేదాలు, మహాకావ్యాలు మొదలైన అంశాల గురించి వివరంగా తెలియజేశారు. ఇందులో భూగోళం గురించి వివరిస్తూ భూగోళాన్ని దేవభాగం లేదా జంబూ ద్వీపం అనే వారని, జంబూ ద్వీపానికి దక్షిణ భాగాన భరత వర్షం ఉండేదని తెలియజేశారు. హిందూ పదం…

పూర్తిగా చదవండి

Read more »

ఆవిడెవరు?

By |

ఆవిడెవరు?

అంజని – నందివాడ భీమారావు పురస్కారం, అడవి బాపిరాజు పురస్కారం, వాకాటి పాండురంగా రావు పురస్కారం తదితర బహుమతులు పొందిన కన్నెగంటి అనసూయ రచించిన ‘ఆవిడెవరు’ కథానికల సంపుటి పాఠకుల ముందుకు వచ్చింది. ఈ పుస్తకంలో పదిహేను కథలను పొందు పరిచారు. కథల్లో సమస్యల్ని వివరించి పరిష్కారాల్ని పాఠకుల విజ్ఞతకే వదిలిలేయకుండా వివరించడం ఈ పుస్తకం ప్రత్యేకత. నలుగురు కూతుళ్ళు ఉన్న తనను వృద్ధాప్యంలో ఎవరు చూడాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ‘బాధ్యత నాది కాదంటే నాది కాదు’…

పూర్తిగా చదవండి

Read more »

సాహిత్య సేవ ‘ఇట్ల సుత’

By |

సాహిత్య సేవ  ‘ఇట్ల సుత’

‘కర్ణుడు తల్లి కోరికను మన్నించి పాండవుల పక్షాన చేరితే ఏమై ఉండేది’ అని 1998లో యథాలాపంగా కలిగిన ఒక అసాధారణ ఆలోచనను 2000 సంవత్సరం నుండి అనేక ఊహలు, ఆలోచనల మథనం, విరామం, ఆర్థిక వ్యయ ప్రయాసలు, పునర్‌ నడక అనే చట్రంలో తిరుగుతూ అంతిమంగా 2017లో ప్రత్యేకించి తెలంగాణ యాసలో 21 అధ్యాయాలుగా పుస్తక రూపంలో వరిగొండ కాంతారావు ప్రచురించిన పుస్తకం ‘ఇట్ల సుత’ ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన మహా సంగ్రామమే మహాభారత యుద్ధం….

పూర్తిగా చదవండి

Read more »

సత్యాన్ని బోధించిన ‘స్వామి వివేకానంద’

By |

సత్యాన్ని బోధించిన ‘స్వామి వివేకానంద’

వివేకానందుని జీవితమే ఒక నిరంతర యజ్ఞం. యజ్ఞం కర్మణ్యతకు ప్రతీక. నిరంతర శ్రమ సాధించిన లక్ష్యం. యుగయుగాల సాంస్కృతిక వికాసం, భౌతిక, ధార్మిక ప్రగతి భారత సంస్కృతిలో భాగం. అలాంటి యజ్ఞానికి నిరంతర కర్మ యోగానికి ప్రతీక స్వామి వివేకానంద. ‘ఈ జీవితం వస్తుంది, పోతుంది. సంపద, కీర్తి, భోగాలు మూడునాళ్ళ ముచ్చటే. ఒక క్షుద్ర కీటకం వలె చనిపోవడం కన్నా సత్యాన్ని బోధిస్తూ మరణించడం ఉత్తమం’ అన్నారు స్వామి వివేకానంద. వారి 150వ జయంత్సుత్సవ సందర్భంగా…

పూర్తిగా చదవండి

Read more »

మరుగున పడిన పల్లెపాటలు వెలుగు చూశాయి !

By |

మరుగున పడిన పల్లెపాటలు వెలుగు చూశాయి !

గ్రాంథికం పండితుల భాష. వ్యావహారికం సామాన్యుల భాష. గ్రాంథికాన్ని జన వ్యావహారిక భాష చేయడానికి పెద్ద ఉద్యమం జరిగింది. తెలుగు నాట ఎన్నో యాసలు, (మాండలికాలు) పలుకుబడులు ఉన్నాయి. ఒక ప్రాంతపు యాస వేరొకరికి విచిత్రంగా ఉంటుంది. అందువలన ఈ పల్లె పలుకుబడులకు ఎలాంటి ఉద్యమాలు రాలేదు. అయితే వారి ప్రాంతీయ అభిమానంతో చాలా మంది మాండలికాలతో రచనలు చేసినా అందులో జన వ్యావహారిక భాషనే 80-90 శాతం వాడారు. శతాబ్దాలుగా పల్లెల్లో సందర్భానికి తగిన విధంగా…

పూర్తిగా చదవండి

Read more »

సద్గుణ సంపదల సమాహారం ‘సహృదయ సాంగత్యం’

By |

సద్గుణ సంపదల సమాహారం ‘సహృదయ సాంగత్యం’

‘సహృదయ సాంగత్యం’ వ్యాసావళిలో 22 వ్యాసాలున్నాయి. మొదటి 20 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి. సాధారణంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, కీర్తి శిఖరాలను అధిష్టించిన ప్రసిద్ధుల గురించి రాయడానికి ఎవరైనా సిద్ధపడ తారు. దీనికి భిన్నంగా శ్రీ హర్షవర్ధన్‌ పేరు, ఊరు లేని వారి గురించి ఎందుకు రాయాలను కున్నారో అర్థం కాదు. ఇక్కడ పేరు, ఊరు లేనివారు అనడం వారి గురించి 90 శాతం ప్రజలకు తెలియదన్న భావంతో రాసింది. అలాంటి వ్యక్తుల గురించి రాయడానికి కారణం…

పూర్తిగా చదవండి

Read more »

పనికొచ్చే కథలు ఉపయోగపడే ఉదంతాలు!

By |

పనికొచ్చే కథలు  ఉపయోగపడే ఉదంతాలు!

‘Anecdotesµ’ అంటే కథలు లేదా ముచ్చట్లు. మన్నవ గిరిధరరావు సంకలనం చేసిన ఈ పుస్తకంలో రెండు వందల పైచిలుకు ఉదంతాలున్నాయి. ఇవి ముచ్చట్లు మాత్రమే. ఈ పుస్తకాన్ని ముందు ‘పనికొచ్చే కథలు’ అన్న పేరుతో తెలుగులో సంకలనం చేశారు. ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సోమంచి పూర్ణచంద్ర రావు వాటిని ఆంగ్లంలోనికి అనువదించారు. తెలుగులో వచ్చినవి ఇతర భాషలో రావడం ఎప్పుడూ హర్షణీయమే ! సాధారణంగా బండి కదలాలంటే గుర్రం/ఎద్దులను బండి దగ్గరకు రప్పిస్తారు….

పూర్తిగా చదవండి

Read more »

సుభాషితాల సముద్రం

By |

సుభాషితాల సముద్రం

సంస్కతం సుభాషితాల సముద్రం. ఎంత ఈద గలిగితే అంత లోతులు చూడగలం. అందులో ఎంత లోతుకు దూకితే అన్ని రత్నాలు దొరుకుతాయి. అలాంటి వేల శ్లోకాల సమాహారం ప్రభల వేంకట నరసింహం రాసిన ‘సుభాషిత రత్నాకరము’. బాలుడిగా మొదలుపెట్టి ముదిమి వయసు వరకూ రచయిత విన్న, చదివిన, కంఠోపాఠం చేసుకున్న, సారోగతం చేసుకున్న వివిధ శ్లోకాలు, సుభాషితాలను ఆయన క్రోడీకరించి, ఒక చోట పొందుపరిచారు. ఆశ్చర్యం ఏమిటంటే రచయిత జువాలజీ ప్రొఫెసర్‌. ఆ పని చేస్తూనే ఆయన…

పూర్తిగా చదవండి

Read more »

సంగీత, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు

By |

సంగీత, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు  శ్రీకృష్ణదేవరాయలు

విజయనగర సామ్రాజ్యం హిందూ సంస్కృతిని లోకానికి తెలియజేసింది. ఈ పుస్తక రచయిత్రి విజయనగర సామ్రాజ్య నిర్మాణం, విద్యారణ్య స్వామి గురించి వివరించారు. సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి రాజుల గురించి విశదీకరించారు. కృష్ణదేవరాయల జననం, వారి విజయ యాత్రలు, వాటి గొప్పదనం గురించి విపులీకరించారు. ఆముక్తమాల్యద గ్రంథంలో శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిని చక్కగా ప్రస్తావించారని పేర్కొన్నారు. సాహిత్యాభిమానం, నాట్యాభిమానం, శిల్పకళాభిమానాన్ని రచయిత్రి చక్కగా వివరించారు. కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలు విజయనగర సామ్రాజ్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఎలా చాటి చెప్పారో…

పూర్తిగా చదవండి

Read more »

ఇంటిల్లిపాదీ చదవగల ఉత్తమ గ్రంథం ఏష ధర్మః సనాతనః

By |

ఇంటిల్లిపాదీ చదవగల ఉత్తమ గ్రంథం  ఏష ధర్మః సనాతనః

  బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచన కర్త, సమన్వయ సరస్వతి, ఋషిపీఠం మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకులు. తెలుగు వారికి వీరు సుపరిచితులే ! సనాతన ధర్మ వైభవాన్ని ప్రచారం చేయటం వీరి సంకల్పం. ఏష ధర్మః సనాతనః (ఇదీ మన సనాతన ధర్మం) పేరిట ఋషిపీఠం ప్రచురించిన దాదాపు 600 పేజీల గ్రంథం, 195 వ్యాసాల సంపుటి. ఇవి ఈనాడు దినపత్రికలో ‘అంతర్యామి’ శీర్షికలో, ‘నది’ మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమై, ప్రజల మన్ననలను…

పూర్తిగా చదవండి

Read more »