Archive For The “కదంబం” Category

ఆయనకి నేనంటే ఎంతో అభిమానం…

By |

ఆయనకి నేనంటే ఎంతో అభిమానం…

నేను హైదరాబాద్‌ నగరంలో సాటి వారిలో ఎన్నికగన్న వాడిననిపించుకోవటానికి మూలకారణం బోయి భీమన్న మహాశయులు. ఇది వినటానికి, చెప్పటానికి విస్మయం కలిగించవచ్చు. ఆయన నాకు చేసిన ఉపకారానికి తగిన ప్రేమాదర గౌరవాభి మానాలు చూపానో లేదో అనుకుంటే నాకే అదేదో వెలితి అనిపిస్తుంది. వారిని నేను కలుసుకున్న సమయం ఎటు వంటిదో కాని అది నాకు కలసి వచ్చింది. 1960లో అనుకుంటాను. ఆయనప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ అనువాద శాఖ సంచాలకులుగా పనిచేస్తూ ఉండే వారని జ్ఞాపకం….

Read more »

ఇంతవరకు గుర్తించలేదు..

By |

ఇంతవరకు గుర్తించలేదు..

అరవై ఏళ్ల నా సాహిత్య వ్యాసంగంలో కార్యకారణ సంబద్ధం ఇతమిత్థంగా తెలియని ఒక జిజ్ఞాస అప్పుడప్పుడు నాకు ఎదురవుతుంటుంది? నాలో నేనే మథనపడకుండా ఒకవేళ ఎవరినైనా అడిగినా వాళ్లు సంతృప్తికరమైన సమాధానం చెపుతారన్న నమ్మకమో, లేదా హామీ ఏమీ ఉండదు. ఈ ప్రశ్న ఏమిటంటే నేను వేళ్ల మీద ప్రస్తావించాల్సిన ప్రతిభావంతుడైన రచయితను ఏమీ కాకపోవచ్చు. కాని నిర్లక్ష్యానికి, నిరాదరణకు అంతో ఇంతో గురి అయినానేమోనని నా శంక. అప్పుడప్పుడు ఇది నాకు ఒక న్యూనతగా కూడా…

Read more »

నేను ఎంత చెప్పినా వినలేదు…

By |

నేను ఎంత చెప్పినా వినలేదు…

ముదిగొండ వీరభద్రమూర్తి గొప్పకవి. ‘నా ఊళ కేదార గౌళ’ అన్నాడే శ్రీశ్రీ, అట్లా కంచు కంఠం మూర్తిది. కమ్రమూ, కమనీయమూ, గంభీరమూ అయినది ఆయన కంఠస్వరం. బహు భోళా వ్యక్తిత్వం. మనస్వి. కవితాలోలురను ఆప్యాయత, అనురాగం అనే రెండు కళ్లతో ఆయన ఆకట్టు కుంటారు. ఏ కొంచెం సంతోషం కలిగినా దాన్ని కొండంతగా భావించుకుంటారు. కాళిదాసుదంటారు కదా! ‘శ్యామలా దండకం’ (అవునో! కాదో!). దీనిని వీరభద్రమూర్తి గానం చేసినప్పుడు ఆస్వాదించటం ఒక గొప్ప అనుభూతి. సుబంధుడనే ప్రాచీన…

Read more »

గుర్తుకొస్తున్నాయి..

By |

పదిహేను సంవత్సరాలకే నాకు సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి, సృజనాభిలాష, ఆలోచన, పరిశీలన మొగ్గ దశ నుంచి వికసన దశకు ఆకర్షించటానికి నేను చదివిన ఉన్నత పాఠశాల ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. ఏవో రంగురంగుల దృశ్యాల కలలలో తేలిపోవటాలు అవిదితంగానే మొదలైనాయి. నేను నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్లో పాఠశాల విద్యనభ్యసించాను. చదువులో ఎప్పుడూ వెనకబడి ఉండేవాణ్ణి. కానీ అత్తెసరు మార్కులతో ప్రతిఏడూ పరీక్ష గట్టెక్కేవాణ్ణి. మా ఊళ్లో ఉండే వైశ్య బాలమిత్ర గ్రంథాలయం నాకు దర్శనీయ…

Read more »

దిగవల్లి వేంకట శివరావుతో..

By |

దిగవల్లి వేంకట శివరావుతో..

సాహిత్య జ్ఞాపకాలు నేను మొట్టమొదటిసారిగా 1962లో ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఈస్టిండియా పరిపాలన కాలం నాటి భారతదేశ చరిత్రకు పరమ ప్రామాణికమైన ఆకర గ్రంథాలు సేకరించి తెలుగువారికి చెప్పిన వారూ అయిన దిగవల్లి వేంకట శివరావుని విజయవాడలో చూశాను. కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన గ్రంథాలను గూర్చి, ఆయన సంఘ సంస్కరణ కృషి మూర్తిమత్వాన్ని గూర్చి పరిశోధన సమాచారం సేకరిస్తూ మిమ్మల్ని చూడటానికి వచ్చానని విన్న వించుకున్నాను. ఆయన నా సుకృతం ఫలించి ఆదరించారు. తరువాత ఎప్పుడైనా…

Read more »

అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

By |

అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా – దేశ విభజన పచ్చి దగా ‘దేవుడు ఒకరిగా కలిపి రూపొందించిన వారిని మానవుడు విడదీయటం అతడికి శక్తికి మించిన పని. అది మానవ సాధ్యంకాదు’ – (హరిజన్‌ పత్రిక 6-4-1940). ‘దేశ విభజన అనేది పచ్చి దగా. అంతకన్న అసత్యం ఇంకొకటి ఉండదు. ఆ ఆలోచన వస్తేనే నా ఆత్మ పరిపూర్ణంగా అందుకు ఎదురు తిరుగు తుంది. తిరుగుబాటుకు సంసిద్ధమవుతుంది. దీన్ని ఒప్పుకోవడమంటే దైవాన్ని నిరాకరించడమే. దేవుడంటూలేడని అనడమే’…

Read more »

ఎండమూరితో అనుబంధం

By |

ఎండమూరి సత్యనారాయణరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ తర్వాత హైదరాబాద్‌ కేంద్రంలోనూ కార్యక్రమ నిర్వహణాధికారిగా పని చేయటం నాకు తెలుసు. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం ఉండేది. నేను రాసిన ‘జారుడు మెట్లు’ అనే నవలకు ఆనాటి తెలుగు సాహిత్య సృజనా ప్రపంచంలో చాలా పేరు రావటానికి ఎండమూరి నారాయణరావే కారణం. ఈయన ‘శ్రీవాత్సవ’ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. దక్షిణ దేశ తెలుగు సాహిత్య జగత్తును గూర్చి ‘శారదా ధ్వజం’ పేరుతో సత్యనారాయణరావు ఒక గ్రంథం…

Read more »

సాహిత్య పోటీ

By |

సాహిత్య పోటీ

1968వ సంవత్సరం. అప్పటి ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి’ సాహిత్య విషయమై పోటీ నిర్వహించింది. అంటే రాతప్రతులను ఆహ్వానించట మన్నమాట. అంతకు రెండేళ్లముందే ఇటువంటి పోటీ రాతప్రతుల పరీక్షలు ఆరంభించినట్లున్నది సాహిత్య అకాడమి. ఈ సంవత్సరం పోటీ రాతప్రతుల విషయం ఏమిటంటే ‘వ్యవహారిక భాషాచరిత్ర- వికాసం’. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి అలనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి కార్యనిర్వాహకవర్గ సమావేశాలలో, భాషా సాహిత్య పరిశోధనలలో, వికాస పథకాలలో ప్రముఖ పాత్ర నిర్వహించేవారు. బహుశా ఈ పోటీ విషయం ఆయనే సూచించి…

Read more »

స్వీయచరిత్రల గొప్పతనం

By |

స్వీయచరిత్రల గొప్పతనం

గడచిన రెండు శతాబ్దాలలో తెలుగులో దాదాపు మూడు వందల దాకా స్వీయచరిత్రలు వచ్చినట్లు నిర్ధారణ చేయవచ్చు. ఇందులో నేను వందకు పైగానే శ్రద్ధతో చదివి సారాంశం తెలుసుకున్నాను. ఒక పట్టిక కూడా తయారు చేశాను. ఇందువల్ల తెలుగు సాహిత్యంలో నన్ను ఎక్కువగా ఆకర్షించిన సాహిత్య ప్రక్రియ స్వీయచరిత్ర అనే చెప్పాలి. సుమారు 20 స్వీయచరిత్రలకు పరిచయాలనండి, ఉపోద్ఘాతాల నండి, లేదా తొలిపలుకులనండి నేను రాయవలసి రావటం, రాయటం సమకాలిక రచయితలలో అది నాకొక గొప్ప మన్నన కదా!…

Read more »

సరస్వతీ మహల్‌

By |

సరస్వతీ మహల్‌

తంజావూరు మహారాజా శరభోజి సరస్వతీ మహల్‌ లైబ్రరీ అంటే తెలుగువారికి అదొక పుణ్యనిలయం. సాహిత్య వారణాసి. ‘సాహితీ తరంగ సంగీత రసధుని, దేశ భాషలందు తెలుగు లెస్స’ అని నండూరి రామకృష్ణ మాచార్యులన్నారే అది నిరూపించుకొన్న నెలవు. ‘రమానటీ నర్తన రంగశాల’ అని సాహిత్య, సంగీత, నృత్య, రవళుల పులకిత నాయక రాజ్యమది. నారాయణ తీర్థులు, సదాశివ బ్రహ్మేంద్రయతి, శ్రీధర వేంకటేశ అయ్యావాళ్‌, మేలట్టూరి యక్షగానాలు అక్కడివే. రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు తెలుగును నవరస భరితం…

Read more »