Archive For The “సాహిత్యం” Category

గుర్తుకొస్తున్నాయి..

By |

పదిహేను సంవత్సరాలకే నాకు సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి, సృజనాభిలాష, ఆలోచన, పరిశీలన మొగ్గ దశ నుంచి వికసన దశకు ఆకర్షించటానికి నేను చదివిన ఉన్నత పాఠశాల ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. ఏవో రంగురంగుల దృశ్యాల కలలలో తేలిపోవటాలు అవిదితంగానే మొదలైనాయి. నేను నరసరావుపేట మున్సిపల్‌ హైస్కూల్లో పాఠశాల విద్యనభ్యసించాను. చదువులో ఎప్పుడూ వెనకబడి ఉండేవాణ్ణి. కానీ అత్తెసరు మార్కులతో ప్రతిఏడూ పరీక్ష గట్టెక్కేవాణ్ణి. మా ఊళ్లో ఉండే వైశ్య బాలమిత్ర గ్రంథాలయం నాకు దర్శనీయ…

Read more »

తల్లిదండ్రులు చదవవలసిన పుస్తకం

By |

తల్లిదండ్రులు చదవవలసిన పుస్తకం

ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఒక వీడియో క్లిప్పింగ్‌ వచ్చింది. అందులో తండ్రి చాలా సీరియస్‌గా లాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ ఉంటాడు. కూతురు బిక్కుబిక్కుమంటూ వచ్చి ‘నాన్నా..’ అని పిలుస్తుంది. ‘ఏమిటి ? నేను పనిలో ఉన్నాను, డిస్ట్రబ్‌ చేయకు’ అన్నాడు నాన్న అంతే సీరియస్‌గా. ‘ప్లీజ్‌ నాన్నా!’ అని బ్రతిమిలాడింది కూతురు. ‘ఆ.. చెప్పు’ అన్నాడు మరింత అసహనంగా. పాప వెంటనే ‘మీ ఆదాయం ఒక గంటకి ఎంత ?’ అని అడిగింది. ‘2 వేలు!’ విసుగ్గా…

Read more »

దిగవల్లి వేంకట శివరావుతో..

By |

దిగవల్లి వేంకట శివరావుతో..

సాహిత్య జ్ఞాపకాలు నేను మొట్టమొదటిసారిగా 1962లో ప్రముఖ చరిత్ర పరిశోధకులు, ఈస్టిండియా పరిపాలన కాలం నాటి భారతదేశ చరిత్రకు పరమ ప్రామాణికమైన ఆకర గ్రంథాలు సేకరించి తెలుగువారికి చెప్పిన వారూ అయిన దిగవల్లి వేంకట శివరావుని విజయవాడలో చూశాను. కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన గ్రంథాలను గూర్చి, ఆయన సంఘ సంస్కరణ కృషి మూర్తిమత్వాన్ని గూర్చి పరిశోధన సమాచారం సేకరిస్తూ మిమ్మల్ని చూడటానికి వచ్చానని విన్న వించుకున్నాను. ఆయన నా సుకృతం ఫలించి ఆదరించారు. తరువాత ఎప్పుడైనా…

Read more »

ఆలు మగల (అను)బంధం

By |

ఆలు మగల (అను)బంధం

జీవితంలో ఈ అంచు నుంచి ఆ అంచు వరకు పరుచుకునే ఉండే దట్టమైన నీడ ప్రేమ. ఇందులో జీవన సహచరితో ఉండే ప్రేమకు ఎవరి జీవితంలో అయినా అసాధారణమైన స్థానం ఉంటుంది. భార్యాభర్తల నడుమ ప్రేమకు అనేక కోణాలు. జీవితం సుడిగుండంలో చిక్కుకు పోకుండా చేసినా, అందు లోకి నెట్టివేసినా భార్యాభర్తల మధ్య ప్రేమ ఫలితమే. కానీ భారతదేశంలో సంసార జీవితానికీ, భార్యాభర్తల అనుబంధానికీ ఉన్న పరిధులు వేరు. అయినప్పటికీ భార్యాభర్తల అనుబంధానికి పెద్ద స్థానమే ఉంది….

Read more »

అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

By |

అఖండ భారతదేశం – గాంధీజీ అభిప్రాయాలు

అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా – దేశ విభజన పచ్చి దగా ‘దేవుడు ఒకరిగా కలిపి రూపొందించిన వారిని మానవుడు విడదీయటం అతడికి శక్తికి మించిన పని. అది మానవ సాధ్యంకాదు’ – (హరిజన్‌ పత్రిక 6-4-1940). ‘దేశ విభజన అనేది పచ్చి దగా. అంతకన్న అసత్యం ఇంకొకటి ఉండదు. ఆ ఆలోచన వస్తేనే నా ఆత్మ పరిపూర్ణంగా అందుకు ఎదురు తిరుగు తుంది. తిరుగుబాటుకు సంసిద్ధమవుతుంది. దీన్ని ఒప్పుకోవడమంటే దైవాన్ని నిరాకరించడమే. దేవుడంటూలేడని అనడమే’…

Read more »

63 బహుమతి కథానికలు

By |

63 బహుమతి కథానికలు

సత్యాన్ని అన్యాపదేశంగా చెప్పి కర్తవ్య బోధ చేయడం కవులు, కథకులు చాలా కాలంగా చేస్తున్న పనే. దేశంలో నేడు అనేక అఘాయిత్యాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయన్నది కఠోర సత్యం. కలం పోటుతో వాటిని అరికట్టడం ముమ్మాటికి సాధ్యం కాదు. అయితే కథలలో ఇలాంటి అమానుషాలను జొప్పించి, లేదా కథా వస్తువుగా తీసుకొని కథలల్లితే ప్రజల్ని పారాహుషారని హెచ్చరించవచ్చు. ఆ మేరకు ఈ పుస్తక రచయిత నరసింహ ప్రసాద్‌ విజయం సాధించారనే చెప్పాలి. ఇలాంటి సామాజిక స్పృహ గల కథలు…

Read more »

ఎండమూరితో అనుబంధం

By |

ఎండమూరి సత్యనారాయణరావు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోనూ తర్వాత హైదరాబాద్‌ కేంద్రంలోనూ కార్యక్రమ నిర్వహణాధికారిగా పని చేయటం నాకు తెలుసు. నేనంటే ఆయనకి ఎంతో అభిమానం ఉండేది. నేను రాసిన ‘జారుడు మెట్లు’ అనే నవలకు ఆనాటి తెలుగు సాహిత్య సృజనా ప్రపంచంలో చాలా పేరు రావటానికి ఎండమూరి నారాయణరావే కారణం. ఈయన ‘శ్రీవాత్సవ’ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. దక్షిణ దేశ తెలుగు సాహిత్య జగత్తును గూర్చి ‘శారదా ధ్వజం’ పేరుతో సత్యనారాయణరావు ఒక గ్రంథం…

Read more »

కథాసుధా భాండం

By |

కథాసుధా భాండం

‘జోకొడతాను, ఊకొడతావా? ఊకొడతావా, కథ చెబుతాను?’ అని తల్లి ఒడిలో కథ ఆరంభమైంది. లాలిపాట, జోలపాట, అమ్మమాటతో ఆరంభమైన పాట, మాట, కథ అనంతవిశ్వంలో అద్భుత పరిణామాలను సృష్టించింది. అలాంటిదీ కథ! భారతీయ వాజ్ఞ్మయంలో కథ కొత్తది కాదు. రామాయణ, భారత, భాగవతాలలో గల ఎన్నో కథలను మనం చిన్నప్పటి నుండి అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల ద్వారా విన్నాం. జానపదులు చెప్పే బుఱ్ఱకథలు, హరిదాసులు చెప్పే హరికథలు, ఒగ్గుకథలు, భాగవతుల కథలు .. ఇలా బహు ముఖంగా…

Read more »

సాహిత్య పోటీ

By |

సాహిత్య పోటీ

1968వ సంవత్సరం. అప్పటి ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి’ సాహిత్య విషయమై పోటీ నిర్వహించింది. అంటే రాతప్రతులను ఆహ్వానించట మన్నమాట. అంతకు రెండేళ్లముందే ఇటువంటి పోటీ రాతప్రతుల పరీక్షలు ఆరంభించినట్లున్నది సాహిత్య అకాడమి. ఈ సంవత్సరం పోటీ రాతప్రతుల విషయం ఏమిటంటే ‘వ్యవహారిక భాషాచరిత్ర- వికాసం’. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి అలనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి కార్యనిర్వాహకవర్గ సమావేశాలలో, భాషా సాహిత్య పరిశోధనలలో, వికాస పథకాలలో ప్రముఖ పాత్ర నిర్వహించేవారు. బహుశా ఈ పోటీ విషయం ఆయనే సూచించి…

Read more »

మనువు…మరోచూపు

By |

మనువు…మరోచూపు

పురాణయుగం మొదలు ఇవాళ్టి వరకు హిందూ జీవనాన్నీ, విశ్వాసాలనీ ప్రశ్నించడానికి (నిజానికి కింఛ పరచడానికి) ఏ చిన్న అవకాశాన్ని వదులుకోని మేధావులు దేశంలో వేనవేలు. అలాంటి వారి చేతి గొప్ప ఆయుధమే ‘మనుస్మృతి’ లేదా మను ధర్మశాస్త్రం. కానీ మనువు, ఆయన ధర్మశాస్త్రం భారతదేశంలో కచ్చితంగా అమలైందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? యుగయుగాలు ఆస్మృతి ప్రజలు నెత్తిన ”రుద్దారా?” ఆయా నేరాలకి మనువు సూచించిన శిక్షలు అమలైనట్టు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు లభ్యమవుతున్న మను ధర్మశాస్త్రం అసలైనదేనా?…

Read more »