Archive For The “సంపాదకీయం” Category

నీతివంతులైన సమర్థులను ఎన్నుకోవాలి!

By |

నీతివంతులైన సమర్థులను ఎన్నుకోవాలి!

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగునాట రాజకీయాలు వింత పోకడలు పోతున్నాయి. ఈ ఎన్నికల్లో తమను ఎందుకు గెలిపించాలో, గెలిపిస్తే దేశానికి, ప్రజలకు ఏమి చేస్తారో వివరించడం కన్నా కొందరిని దూషించడం, వారిని గెలిపిస్తే చిక్కులు వస్తాయని హెచ్చరించడం పైనే రాజకీయ పక్షాలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఒక వేలు ఇతరుల వైపు చూపితే మూడు వేళ్లు తమను చూపుతాయన్న ఇంగితం ఈ రాజకీయ పక్షాలకు లోపించినట్లుంది. మోదీని విమర్శించి, తమ ఘనత చాటుకోవాలనే…

Read more »

కుక్కలు చింపిన విస్తరి కానీయరాదు

By |

కుక్కలు చింపిన విస్తరి కానీయరాదు

రాజకీయ పార్టీకి లక్ష్యంగా దేశ ప్రగతి, ప్రజల సంక్షేమం ఎంత ముఖ్యమో పార్టీ నేతలకు మన రాజ్యాంగము, జాతీయత పట్ల స్పష్టమైన అవగాహన కూడా అంతే ముఖ్యం. ఈ కీలకమైన అంశమే తెలుగు పాలకుల్లో లోపించినట్లు తోస్తున్నది. ఎన్నికల వేళ ప్రత్యర్థులను ఎడాపెడా విమర్శించడం, అలవి మాలిన వాగ్దానాలు కురిపించడం సహజమని, ఉపేక్షించే స్థాయికి పౌరసమాజం చేరుకున్నది. కానీ రాష్ట్రంలోని అత్యధిక పార్లమెంటు స్థానాల్లో తమను గెలిపిస్తే కేరద్రంలో చక్రం తిప్పుతామని, ఢిల్లీ మెడలు వంచి నిధులు…

Read more »

అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

By |

అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

తెలుగునాట చోటుచేసుకురటున్న నేరాల, వివాదాల సందర్భంగా ప్రభుత్వ అధికారుల స్పందన, ప్రకటనలతో తెలుగు పాలకుల సత్యనిష్ఠ సందేహాస్పదం అవుతోంది. విశాఖపట్టణం విమానాశ్రయంలో గతేడాది ఆక్టోబరు నెలాఖరులో విపక్ష నేత జగన్‌మోహన రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సందర్భంలో ఆరధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి స్పందించిన తీరు వివాదాస్పదం కావడం ఇటీవలి చరిత్ర. పాలకపక్షం మెప్పుకోరి ముఖ్యమంత్రి మాటలనే పోలీసు అధికారి తన ప్రకటనలో అప్పగించాడని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా తెలంగాణ, ఆరధ్రప్రదేశ్‌ రెరడు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిరచిన…

Read more »

బలశాలి భారత్‌

By |

బలశాలి భారత్‌

పాకిస్తాన్‌ సైనికుల చేతికి చిక్కి సురక్షితంగా భారత్‌కు చేరిన మన వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ ఉదంతం దరిమిలా సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. పదాలు, వాక్యాలు, భావాలు వేరు వేరుగా ఉన్నా వాటన్నిటి సారం మాత్రం పాకిస్తాన్‌ బుద్ధి మారిందా, భారత్‌ దమ్ము పెరిగిందా అన్న ప్రశ్నల చుట్టూనే తిరగడం గమనార్హం. అత్యంత ఉత్కంఠ భరితంగా గడిచిన ఈ రెండు మూడు రోజుల్లో దేశ ప్రజల స్పందన, కాంగ్రెస్‌, తెదేపాల స్పందనల్లో తేడా కొట్టొచ్చినట్టు కనిపించింది….

Read more »

జన జాగృతి

By |

జన జాగృతి

వారు చేస్తే సిద్ధాంతం.. ఇతరులు చేస్తే రాద్ధాంతం.. టీడీపీ నేత, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ వైకాపాలో చేరడాన్ని గంటా శ్రీనివాసరావు తప్పుపడుతూ రాజకీయ నాయకులకు నైతికత ఉండాలని సుద్దులు చెప్పారు. మరి సోనియా, రాహుల్‌లను ఘోరంగా విమర్శించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని ఏమనాలి? తాము చేస్తే అది సిద్ధాంతం, ఇతరులు చేస్తే అది అనైతికత అని తెదేపా విశ్వాసం. టీడీపీలో ఉంటే టిక్కెటు రాదనే.. అవంతి శ్రీనివాస్‌, ఆమంచి కృష్ణమోహన్‌ పార్టీని వీడారని లోకేశ్‌ చెప్తే,…

Read more »

మరో మోతాదు

By |

మరో మోతాదు

ఇది ప్రతీకారం కాదు. మత ఛాందసం నెత్తికెక్కిన ఉగ్రవాద మూకలకు భారత్‌ చెప్పిన మరో గుణపాఠం. ఫిబ్రవరి 26 వేకువన భారత వైమానిక దళ విమానాలు అధీన రేఖను దాటి జైష్‌ ఎ మహమ్మద్‌ కీలక శిబిరం మీద దాడి చేశాయి. అందిన సమాచారాన్ని బట్టి ఇది చావుదెబ్బ. ఈ మాట మన అధికారులు చెప్పలేదు. ఇలాంటి భీకర దాడి ఒకటి జరిగినట్టు పాకిస్తాన్‌ అధికారులు ఆగమేఘాల మీద చేసిన ట్వీట్‌తో లోకానికి తెలిసింది. చాలా నష్టం…

Read more »

ఉగ్రవాదం కంటే హీనం!

By |

ఉగ్రవాదం కంటే హీనం!

ఉగ్రవాదులుగా చలామణి అవుతున్న పాక్‌ ప్రేరేపిత ఇస్లాం మతోన్మాదులు ఎలాగూ నెత్తురు రుచి మరిగిన పులులే. పుల్వామా ఘాతుకాన్ని చూసిన తరువాత కూడా ఈ దేశంలో నివసిస్తున్న చాలా శక్తులలో మార్పు రావడం లేదు. రుచి మరిగిన పులుల వైపు, ఆ పులులను మేపుతున్న దేశం మీదే వారు ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. ఈ నేరం నాది కాదు అని మళ్లీ అత్యంత నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా పాకిస్తాన్‌ జవాబు ఇచ్చింది. ఇది పుల్వామా దాడి ఘటన మీద పాక్‌…

Read more »

మోదీ ప్రసంగం

By |

మోదీ ప్రసంగం

అది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో ప్రధాని సమాధానం. కానీ ఫిబ్రవరి ఏడున నరేంద్రమోదీ చేసిన ఆ ఉపన్యాసం ఈ లోక్‌సభలో చేసిన దాదాపు తుది పెద్ద ప్రసంగం. లోక్‌సభ సమరాంగణం సిద్ధమవుతున్న తరుణంలో మోదీ విశ్వరూపం చూపారు. నూరు గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిందని సామెత. ప్రధాని ప్రసంగం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పాలిట అలాంటి గాలివానే. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను వేలెత్తి చూపే…

Read more »

మాల్యా ఆటకట్టు

By |

మాల్యా ఆటకట్టు

ఇంకా కొంత సమయం పడితే పట్టవచ్చు. కానీ విజయ్‌ విఠల్‌ మాల్యా అనే పెద్ద ‘ఆర్థిక నేరగాడు’ త్వరలో భారతదేశానికి రావడం ఖాయమని నాలుగో తేదీ తేలిపోయింది. ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌కు సమీపంలో తన ఎస్టేట్‌లో దర్జాగా గడుపుతున్న ఈ మద్యం వ్యాపార దిగ్గజం ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని ఇంగ్లండ్‌ కోర్టులు కూడా విశ్వసించక తప్పలేదు. కానీ చివరిసారిగా ఇంగ్లండ్‌ కోర్టులో వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ తతంగం అంతా పూర్తయ్యి,…

Read more »

మన ఆదర్శపౌరులు!

By |

మన ఆదర్శపౌరులు!

సార్వత్రిక ఎన్నికల పండుగ తరుముకొస్తోరది. ఎన్నికల ప్రకటన వెలువడడానికి కొద్దిరోజుల ముందు నుండి, ఎన్నికలు పూర్తయిన పిదప కొద్దిరోజుల దాకా మనదేశంలో పండుగ వాతావరణం నెలకొనడం పరిపాటి. ప్రచారం కోరే వారి నురడి ప్రకటనలు, ఇంటర్వ్యూలు సేకరించే పనిలో పత్రికా విలేకరులకు, టివి చానళ్ళ వారికి బోల్డంత పని. సాధారణ ప్రచార సాధనాలైన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తయారు చేసే వారికి చేతినిండా పని. జండాలు తయారు చేసే వారి నుండి వాటిని మోస్తూ జైకొట్టే…

Read more »