Archive For The “ప్రాంతీయం” Category

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

By |

సంచలన ప్రకటనలు ఓట్లు రాలుస్తాయా?

సమయం చూసి, సందర్భాన్ని బట్టి జనం నాడిని పట్టుకొని ప్రసంగించడంలో దిట్టగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో బాంబుల మీద బాంబులు పేల్చారు. అధికార వర్గాల్లో కలకలం సృష్టించారు. రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేస్తామని, అవసరమైతే పేరును మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు కలెక్టర్‌ల వ్యవస్థ కూడా అవసరం లేదని.. కలెక్టర్‌ పేరును జిల్లా పాలనాధి కారిగా మారుస్తామన్నారు. తానే ప్రతి జిల్లాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. దేశమే…

Read more »

బాబు పాలనలో బలి పశువులు

By |

బాబు పాలనలో బలి పశువులు

సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘం అభిశం సనకు గురయ్యారు. అంతేకాదు, ఎస్పీలు, సిఐలు, నిఘా విభాగం ఉన్నతాధికారి వరకు ఈసీ చేత మొట్టికాయలు వేయించుకున్నారు. ఎన్నికల వేళ ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా, అధికార పార్టీకి, ముఖ్య మంత్రికి లోబడి పని చేశారని వీరందరి మీద ఆరోపణ. ఈ ఆరోపణలను నిగ్గు తేల్చిన ఎన్నికల సంఘం ఈ అధికారులను ఎన్నికలతో సంబంధం లేని విభాగాలకు బదిలీ చేసింది. ఇది ఎన్నికల సమయంలో…

Read more »

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

By |

ఆత్మవిశ్వాసమా? అతివిశ్వాసమా?

అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సంతోషంలో ఉన్న కేసీఆర్‌ ఇప్పుడు.. లోక్‌సభ ఎన్నికల్లో తనదైన జోరును కొనసాగిస్తు న్నారు. మాటల దాడిని పెంచారు. ఎదుటి పార్టీలపై విమర్శల స్థాయికి కూడా పదును పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక పార్టీ అయిన బీజేపీపై తనదైన శైలిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరో అడుగు ముందుకేసి అసలు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పబోతు న్నాయని, వాటికి తానే నేతృత్వం వహిస్తానని కూడా చెప్పుకుంటున్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్‌…

Read more »

యూటర్న్‌ ఉపదేశాలు

By |

యూటర్న్‌ ఉపదేశాలు

రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లు 2 వేలకు పెంచాం.. మళ్లీ అధికారంలోకి వస్తే మరో వెయ్యి పెంచుతాం.. ఆడపడుచులకు పసుపు, కుంకుమ ఇచ్చాం.. మళ్లీ అధికారంలోకి వస్తే నాలుగో విడత, ఐదో విడత చెక్కులు కూడా ఇస్తాం.. నిరుద్యోగులకు 2 వేలు భృతిగా ఇస్తున్నాం.. రైతులకు 9 వేలు ఇస్తున్నాం.. అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం.. చంద్రన్న బీమా ఇస్తున్నాం.. ఇంకా ఎన్నో ఇచ్చేవాడిని.. కానీ మోదీ నాకు ఇవ్వడం లేదు.. ఇవీ తనను…

Read more »

పోరుబాట వదిలి పోటీకి…

By |

పోరుబాట వదిలి పోటీకి…

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రైతులు తమ డిమాండ్‌ల సాధనకు ఈ ఎన్నికలనే అస్త్రంగా ఎంచుకున్నారు. పండించిన పంటకు గిట్టుబాట ధర కల్పించాలనే డిమాండ్‌తో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయేసరికి పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బాటపట్టారు. పెద్దఎత్తున నామినేషన్ల పర్వానికి తెరదీశారు. గతంలో వీరు తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నాయకులకు తమ గోడును వినిపించేందుకు అసెంబ్లీ ముట్టడికీ విఫలయత్నం చేశారు. రహదారులను నిర్బంధించి వంటా…

Read more »

దూసుకెళ్తున్న వైకాపా

By |

దూసుకెళ్తున్న వైకాపా

ఊహించినట్టే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. విజయం కోసం పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఎన్నో సంవత్స రాలుగా పార్టీనే అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలను కాదని కొత్తగా పార్టీలో చేరిన బలమైన నాయకులకు టికెట్లు ఇస్తున్నాయి. ఇదంతా ఒకవైపు రాజకీయం మాత్రమే. మరోపక్క చూస్తే పార్టీల నాయకులు తమ అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను…

Read more »

హిందువులనకు తూలనాడితే అధోగతే !

By |

హిందువులనకు తూలనాడితే అధోగతే !

ప్రజానేతలు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. జవాబుదారీ తనంతో మాట్లాడాలి. కె. చంద్రశేఖరరావు ఇప్పటికీ ఉద్యమకారుడైతే ఈ మాటలు గుర్తు చేయవలసిన అవసరం లేదు. కానీ ఆయన రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 2014 ఎన్నికలలో బొటాబొటీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయినప్పుడు లేని దర్పం ఆయనకు ఇప్పుడు ఎలా వచ్చింది? అని ప్రజాస్వామికవాదులంతా ప్రశ్నించే రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం తెలంగాణ గౌరవాన్ని పెంచడమని ఆయన అనుకుంటే శుద్ధ పొరపాటు….

Read more »

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

By |

ఆరంభశూరత్వం.. ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల సమర శంఖారావం మోగించారు. మొన్నటిదాకా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఊసే ఎత్తని ఆయన ఆ వేదికపై తిరిగి కాంగ్రెస్‌, భాజపాలను తిట్టే కార్యక్రమానికి తెరదీశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెరాసకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే భారత్‌ దశ, దిశ మారుస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, భాజపాలు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. భారతావనిని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీని సైతం ఏర్పాటు…

Read more »

పోలవరంపై ఎవరిది చిత్తశుద్ధి !

By |

పోలవరంపై ఎవరిది చిత్తశుద్ధి !

పోలవరం ప్రాజెక్టు.. తెలుగువారికి ప్రాణధార.. ఈ విషయాన్ని నాటి బ్రిటిష్‌ పాలకులే నిర్ధారించారు. అప్పటి కాటన్‌ దొర గుర్రం మీద అంతర్వేది నుంచి వాజేడు, చంద్రుపట్ల వరకు గోదావరి ఒడ్డుపై తిరిగి ఎక్కడ ఆనకట్టలు కట్టవచ్చో పరిశీలించాడు. ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు. దరిమిలా దుమ్ముగూడెం దగ్గర పడవలకు పనికి వచ్చే లాకులు కట్టారు. ఆ తరువాత ఆంగ్లేయులు 1930 ల్లోనే పోలవరంపై ఆనకట్ట కట్టటానికి ప్రయత్నం చేశారు. గోదావరి మీదనే ఇంతటి పరిశీలన చేయటానికి కారణం…

Read more »

ఎన్నికల నగారా మోగింది..

By |

ఎన్నికల నగారా మోగింది..

అందరికీ తెలిసిందే.. అనివార్యంగా జరగాల్సిందే. కానీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు ఇప్పుడో టెన్షన్‌ మొదలైంది. అవే లోక్‌సభ ఎన్నికలు.. ఒక్క అధికార పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలూ ఈ ఎన్నికలను ఓ రకంగా కాలంగాని కాలంలో వచ్చిన వర్షాలుగానే భావిస్తున్నాయి. మొన్నటికి మొన్న మూడు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల బరిలో బొక్కబోర్లాపడినంత పనయ్యింది. పైగా ఇంకా ఆ ఝలక్‌ నుంచి తేరుకోలేదు. అందుకే లోక్‌సభ ఎన్నికలు ఇంకాస్త ఆలస్యమైతే బాగుండునన్న ఆలోచనలోనే అన్ని పార్టీలు ఉన్నాయంటున్నారు…

Read more »