Archive For The “జాతీయం” Category

చట్టం తేవాల్సిందే..

By |

చట్టం తేవాల్సిందే..

అయోధ్య రామజన్మభూమి అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాజకీయ లబ్ది కోసం ఈ అంశాన్ని వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, వాస్తవానికి ఈ పరిస్థితికి కారణం న్యాయస్థానం చేస్తున్న అంతులేని జాప్యమే. దశాబ్దాల తర్వాత అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ విచారణకు రావడానికి మరో ఎనిమిదేళ్లు పట్టింది. పైగా వాయిదాలు. న్యాయం కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలంటూ రామభక్తులు ఆగ్రహం…

Read more »

దరిద్రానికి మతం ఉందా ?

By |

దరిద్రానికి మతం ఉందా ?

పెక్యులరిజం – 24 ‘తక్కువేమి మనకు – మోది ఒక్కడుండు వరకు’ అని బోలెడు సంతోషపడ్డారు నష్టజాతకులైన హిందువులు. ”ప్రధానమంత్రి 15 అంశాల కార్యక్రమం” కింద మైనారిటీల మెహర్బానీ కోసం మౌనమోహన్‌ బినామీ సింగ్‌ 2008లో ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్పులను విచ్చలవిడిగా ప్రకటించినప్పుడు నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి. మెజారిటీ వర్గాన్ని దారుణ వివక్షకు గురిచేసే దిక్కుమాలిన పథకాన్ని తన రాష్ట్రంలో అమలు పరిచేది లేదని ఆయన ధైర్యంగా ఎదురు తిరిగాడు. కోర్టు తీర్పులను సైతం లెక్క చెయ్యక హిందువుల…

Read more »

ఆద్యంతం ఉత్కంఠభరితం

By |

ఆద్యంతం ఉత్కంఠభరితం

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. ప్రజా తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. స్ట్రాంగ్‌ రూముల్లోంచి అభ్యర్థుల భవిష్యత్తు తొంగిచూస్తోంది. రసవత్తరంగా సాగిన బహుముఖ పోటీలో విజేత లెవరో అంచనాలకు కూడా అందని పరిస్థితి నెలకొంది. మారిన పరిస్థితులు అసెంబ్లీ రద్దు చేసిన నాటికి, పోలింగ్‌ తేదీ నాటికి రాష్ట్రంలో ప్రజానాడి గణనీయంగా మారిపోయింది. టీఆర్‌ఎస్‌ తమదే అధికారమన్న ధీమాతోనే ముందస్తు ఎన్నికలకు సిద్దపడింది. సమయాన్ని ఏమాత్రం వథా చెయ్యకుండా క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లింది. అసెంబ్లీ రద్దునాడే 105 స్థానాలకు…

Read more »

ముస్లింలకేనట మొదటి హక్కు !

By |

ముస్లింలకేనట మొదటి హక్కు !

పెక్యులరిజం-23 మండువేసవి. మిట్ట మధ్యాహ్నం. స్కూలు నుంచి 3 కిలోమీటర్లు చెమటలు కక్కుతూ నడిచి 14 ఏళ్ల శ్రుతి ఇంటికొచ్చింది. ఒంటిమీద చెంబెడు నీళ్లు కుమ్మరించుకుందామంటే పెరట్లో కుండ ఖాళీ. వీధి నల్లాలో రెండురోజులుగా నీళ్లు రావటం లేదు. ఉసూరుమంటూ కూలబడి ‘అమ్మా! ఆకలేస్తోంది అన్నం పెట్టు’ అంది. కంచంలో అన్నం తెచ్చిన తల్లికి బిడ్డ కళ్లనీళ్లతో కనిపించింది. ‘ఎందుకమ్మా! ఏమైంది’ అంటే జవాబివ్వలేదు. వెక్కుతూ అన్నం తిని, కాసేపటికి స్థిమిత పడ్డాక రెట్టించి అడిగితే కారణం…

Read more »

మైనారిటీల స్వర్గం… హిందువులకు తప్ప !

By |

మైనారిటీల స్వర్గం… హిందువులకు తప్ప !

పెక్యులరిజం – 22 ఇంటిపేరు సమానత్వం ! ఇల్లంతా అసమానతల దుర్గంధం !! చట్టం ముందు అందరూ సమానులే అని ఘోషిస్తుంది భారత రాజ్యాంగం 14వ అధికరణం. కాని ‘ఇండియా దటీజ్‌ భారత్‌’లో పౌరులందరూ సమానులు ఎంతమాత్రం కారు. ఉన్నవి రెండే తరగతులు 1.ఎక్కువ సమానులు 2. తక్కువ సమానులు. ఈ రకం అసమానత ప్రపంచమంతటా ఉన్నదే ననుకోండి. సంఖ్యాపరంగా బలవంతులైన వాళ్లు ఎక్కువ సమానులు. అల్పసంఖ్యాకులైన బలహీనులు తక్కువ సమానులు. ఇది సాధారణం లోకరీతి. మన…

Read more »

అతనే పెద్ద రేపిస్టు..

By |

అతనే పెద్ద రేపిస్టు..

నిజం నిప్పు లాంటిది. దాన్ని జేబులోనో, గుప్పెట్లోనో దాచలేము. అలాంటిదే తాలిబ్‌ హుస్సేన్‌ ఉదంతం. అతను ఎవరన్నది దేశంలో చాలా మందికి తెలియదు. కానీ ఒంటి చేత్తో కథువా రేప్‌ కేసును దేశవ్యాప్తంగా సంచలన వార్తగా మార్చాడు. ఎక్కడో జమ్మూ ప్రాంతం కథువాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఒక సంఘటనకు దేశమంతటా ప్రచారం కల్పించడంలో, దేశవ్యాప్తంగా ‘సేవ్‌ ఆసిఫా’ ఉద్యమాన్ని నడిపించడంలో తాలిబ్‌ హుస్సేన్‌దే కీలక పాత్ర. ఈ యువ లాయర్‌ పత్రికలు, టీవీ ఛానెళ్లతో…

Read more »

రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

By |

రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

కాంగ్రెస్‌ ఆరోపణల వెనుక ఎవరున్నారు? ఒకటి మాత్రం నిజం. భారతదేశం కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన అధునాతన ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దక్కక భంగపడిన ప్రత్యర్థి కంపెనీ రచ్చ చేస్తోంది. ఇలాంటి కుట్రలో ప్రతిపక్షాలు భాగస్వామ్యం అవడం నిజంగా వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. దేశం ఏమైతే మాకేమిటి? మాకు పదవులు కావాలి అనుకునే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి సరైంది కాదు. రాఫెల్‌.. రాఫెల్‌.. రాఫెల్‌…..

Read more »

హిందువులకు మత హక్కు లేదా ?

By |

హిందువులకు మత హక్కు లేదా ?

పెక్యులరిజం – 18 ‘తమాషా ఏమిటంటే సమాజం ముందుగా సమర్ధించరాని ఒక రూలు తెచ్చిపెడుతుంది. తరవాత దాన్ని సమర్థించుకుందుకు వివరణలు, నిరూపణలు ! మానవత్వాన్ని బాధపెట్టే వైఖరి సమర్ధింపు కోసం మానవాళి ప్రాచీనకాలం నుంచీ కారణాలు వెతుకుతున్నది. మానవ విలువలనేవి కాగితాల మీదే మిగిలాయి. చారిత్రకంగా స్త్రీలు అసమానతకు గురయ్యారు. అందుకే వారు హక్కుల కోసం పోరాడేది. ప్రసిద్ధ ఫెమినిస్టు సుసాన్‌ ఆంధోనీ చక్కగా చెప్పింది ఇలా : మగాళ్లకు హక్కుల కంటే ఎక్కువ ఏమొద్దు మహిళలకు…

Read more »

ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

By |

ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాలలో ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) మరింత పట్టు బిగుస్తున్నదా? ఇటీవల జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తే ఔనన్న సమాధానమే సరైనదని పిస్తుంది. ఇస్లామాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్‌ అజీజ్‌ సిద్దికి తొలగింపు, అందుకు ఐఎస్‌ఐ చూపిన పట్టుదల గమనిస్తే పాకిస్తాన్‌ ఆ నిఘా సంస్థ ఉక్కు పిడికిలిలో మరింతగా బిగుసుకుపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఐదు దశాబ్దాల తరువాత అక్కడి న్యాయవ్యవస్థలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇందుకు మరొక రుజువుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు,…

Read more »

అయ్యప్పకు అపచారం

By |

అయ్యప్పకు అపచారం

– పెక్యులరిజం – 17 వినేవాళ్లు ఉండాలేగాని – చాడీలు చెప్పే సోంబేరులకు ఏమి కొదవ? నౌషాద్‌ అహ్మద్‌ఖాన్‌ అని ఒక హక్కులరాయుడు ఉన్నాడు. ఆయన పుట్టింది మహమ్మదీయ మతంలో. ఆ మతంలో మసీదులో నమాజును మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఏ వయసు ఆడవాళ్లనూ వారితో కలవనివ్వరు. స్త్రీలను అనుమతించే కొన్ని మసీదుల్లో కూడా వారికంటూ ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. మగవారితో సమానంగా కూర్చోనివ్వరు. అందులో మహిళల పట్ల వివక్ష ఏదీ నౌషాద్‌ సాహెబ్‌కి కనపడలేదు. ఎప్పటి…

Read more »