Archive For The “అంతర్జాతీయం” Category

శ్రీలంక సంక్షోభం – ఎవరికి లాభం ?

By |

శ్రీలంక సంక్షోభం – ఎవరికి లాభం ?

అగ్రరాజ్యాలు అప్పనంగా పెడుతున్న పెట్టుబడులకు ప్రపంచంలోని ఎన్నో చిన్న దేశాలు ఆశపడి, చివరకు ఆ పెట్టుబడుల అప్పులను తీర్చలేక చతికిలబడిన ఉదాహరణలు ఎన్నో. అటువంటి తప్పులో ఇప్పటికీ కొన్ని చిన్న దేశాలు కాలేస్తూనే ఉన్నాయి. పైగా చైనా తన రాజ్యకాంక్షలో భాగంగా భారత్‌ చుట్టూ ఉచ్చు బిగించే కుట్రను అమలుచేయడానికి శాయశక్తులా ప్రయత్నించేందుకు అటువంటి చిన్నదేశాలను పెట్టుబడుల పేరుతో వాడుకుంటున్నది. చైనా పెట్టుబడుల కుట్రలో చిక్కుకున్న శ్రీలంక తిరిగి బయటపడినట్లు కనబడినా, అది తాత్కాలికమే అని ఇటీవల…

Read more »

అది రెండు దేశాలకూ మంచిది

By |

అది రెండు దేశాలకూ మంచిది

 వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన  కుదిరిన ఎస్‌-400 మిసైల్‌ ఒప్పందం  భారత్‌కు అమెరికా ఆంక్షల నుండి మినహాయింపు వివిధ రంగాల్లో సహాయ సహకారాన్ని పెంపొందించుకోవాలనే భారత్‌, రష్యా రెండు దేశాల ఆలోచన ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో కలుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలకు విరుగుడు కాగలదు. అనేక భాగస్వామ్య దేశాలతో నాణ్యమైన సంబంధాలను కలిగి ఉండాలన్న భారత్‌ విదేశాంగ సూత్రం ఇందులో భాగం కాగలదు. ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునేందుకు భారత,…

Read more »

మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

By |

మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

ఒకప్పుడు తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు చైనా చొచ్చుకురావడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. నిర్లిప్త ధోరణిని వదిలి ఇప్పటికైనా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన మాల్దీవులను రక్షించేందుకు భారత్‌ ప్రయత్నించాలి. వడ్డీ లేని అప్పులను ఇవ్వడం ద్వారా చైనా అప్పుల ఊబి నుండి బయటపడేందుకు ఆ దేశానికి సహకరించాలి. అలాగే మాల్దీవులలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు, ఆ దేశంతో సత్సంబంధాల మెరుగుదలకూ ప్రయత్నించాలి. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, మాల్దీవులలో ప్రభుత్వాలు…

Read more »

చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

By |

చైనా నయా వలసవాదాన్ని అడ్డుకున్న మలేషియా

వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (OBOR) ను చైనా కొత్త పేరుతో బెల్ట్‌ రోడ్‌ పధకం (BRI) అని పిలుస్తోంది. దీని ద్వారా చైనా ఆర్ధిక సామ్రాజ్యవాద విధానపు వలలో చిక్కి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పధకాల వల్ల తమతో కలిసే దేశాలకు లాభమే చేకూరుతుంది తప్ప నష్టం లేదని చైనా చెపుతున్నా, నిజానికి చైనా అమలుచేస్తున్న ఈ కొత్త తరహా ‘అప్పుల ఊబి దౌత్యవిధానం’ వల్ల ఆయా దేశాలు కుదేలవుతున్నాయి. చైనాకు తమ హంబన్‌తోట…

Read more »

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

By |

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు తెంచుకుంటున్న చైనా

చైనా రూపొందించిన ప్రపంచపటంలో భారతదేశంలో కశ్మీర్‌ను ‘ఇండియా కంట్రోల్డ్‌ కశ్మీర్‌’ అని ముద్రించి తన కుటిలత్వాన్ని ప్రకటించుకుంది. చైనాలో ఓ చలన చిత్రంలో జమ్ముకశ్మీర్‌ గురించి తప్పుగా చూపించినా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేట్‌ అభ్యంతరాలు తెలుపలేదు. మనదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌ గురించి అభ్యంతరకరంగా రూపొందించిన ఆ సినిమా మొదటివారంలోనే అక్కడ 56 కోట్లు సంపాదించింది. దీన్ని ప్రపంచమంతటా ప్రదర్శిస్తున్నారు. ఇలా చేస్తే ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయన్న స్పృహ కూడా సీబీఎఫ్‌సీ అధికారులకు…

Read more »

మోదీ ఆఫ్రికా పర్యటన

By |

మోదీ ఆఫ్రికా పర్యటన

– రువాండాకు 2 లక్షల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన మోదీ – ఉగాండా పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం – ఆఫ్రికా అభివృద్ధికి సహకరిస్తామని ప్రకటన ఆఫ్రికా దేశాలతో భారత్‌ సంబంధాలను పటిష్టపరచే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజులపాటు మూడు ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు. రువాండాతో ప్రధాని పర్యటన ప్రారంభమైంది. ఈ ఆఫ్రికా దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని మోదీయే. రువాండా దేశాధ్యక్షుడు పాల్‌ కాగెమే విమానాశ్రయంలో మోదీకి స్వాగతం చెప్పారు. ఒకప్పుడు…

Read more »

దేవుడి గడ్డమీద అవాంఛనీయ శక్తుల అడ్డా

By |

దేవుడి గడ్డమీద అవాంఛనీయ శక్తుల అడ్డా

దేవుడి సొంత గడ్డ.. ఇది మహోన్నత చరిత్ర కలిగిన కేరళకు ఉన్న పేరు. కానీ ఇవాళ ఆ పచ్చదనాల నేల దెయ్యాల అడ్డా. బీజేపీ అగ్రనేత లాల్‌ కిషన్‌ అడ్వాణీ హత్యకు కుట్రపన్నిన వారికి విముక్తి కల్పించాలని కోరిన నేల అదే. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పథక రచన జరిగినది కూడా అక్కడే. ఈ రెండు పాతకాలు కూడా ఆ రాష్ట్రం కేంద్రంగా విస్తరించేందుకు సకల సన్నాహాలు చేస్తున్న ముస్లిం ఉగ్రవాద ముఠాల, వారి…

Read more »

రష్యా పట్ల అమెరికా వ్యతిరేక వైఖరి ఎటు దారితీస్తుంది ?

By |

రష్యా పట్ల అమెరికా వ్యతిరేక వైఖరి ఎటు దారితీస్తుంది ?

అమెరికా – రష్యాల మధ్య నడిచిన ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రపంచం ఎంతో నష్టపోయింది. ఎక్కువగా రష్యా నష్టపోయింది. ఆర్థికంగా పతనమై, రాజకీయంగా ముక్కలైంది. కానీ ఈ యుద్ధంలో విజయం సాధించిన అమెరికా ఇప్పటికీ రష్యా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూనే ఉంది. ఆ వైఖరి వల్ల రష్యా చైనాకు దగ్గరయే ప్రమాదం పొంచి ఉందని, అలా జరిగితే ప్రపంచానికి మరింత నష్టమని వివరించే వ్యాసం ఇది. ట్రంప్‌ – పుతిన్‌ సమావేశం అయిపోయిన తరువాత కూడా దాని గురించిన…

Read more »

భారత్‌ – దక్షిణ కొరియా బలపడుతున్న బంధం

By |

భారత్‌ – దక్షిణ కొరియా బలపడుతున్న బంధం

‘ఈశాన్య ఆసియా (ఉత్తర కొరియా), దక్షిణాసియా (పాకిస్తాన్‌) ల మధ్య అణుబంధం బలపడితే అది భారత్‌కు ఆందోళన కలిగించే విషయమని అధ్యక్షుడు మూన్‌కు తెలిపాను. ఈ ప్రాంతంలో మేం శాంతిని కోరుకుంటున్నాము’. – భారత ప్రధాని మోది ‘ఇక్కడ గడిపిన నాలుగు రోజులను నేను మరచిపోలేను. ఇక్కడి ప్రజలు ఎంతో ఉదారంగా ఉంటారు. వారి కళ్లలో సజీవ దేవతామూర్తులు కనిపిస్తారు. భారతదేశ చరిత్ర సామరస్యానికి ప్రతీక. అలాగే ప్రధాని మోదీ కూడా ఆ విలువలకు గుర్తుగా నిలుస్తున్నారు’….

Read more »

చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

By |

చైనా అప్పుల బూచిని గుర్తిస్తున్న దేశాలు

చైనా విస్తరణవాదాన్ని మొదట్లో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పుడు కళ్ళు తెరిచింది. అంతర్జాతీయ విత్త నిధి (ఇంటర్‌ నేషనల్‌ మోనిటరీ ఫండ్‌) కూడా చైనా విధానాలపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ దేశాలను హెచ్చరించింది. దీనితో చైనా నిర్వహించే వార్షిక సమావేశాల పట్ల తూర్పు యూరోపియన్‌ దేశాల్లో ఆసక్తి తగ్గిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హంబన్‌తోట నౌకా కేంద్రంపై హక్కులను ఎలా వదులుకోవలసివచ్చిందో వివరిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల…

Read more »