Archive For The “విశ్లేషణ” Category

అప్పుడేం చేశారు..?!

By |

అప్పుడేం చేశారు..?!

– మోదీ హత్యకు కుట్ర. రాజీవ్‌గాంధీ హత్య తరహా ప్లాన్‌ లేఖలో వరవరరావు పేరు. – ఇంటెలిజెన్స్‌ వర్గాలు – ఆర్‌టిసి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్తే కఠిన చర్యలు. త్వరలోనే ప్రక్షాళనకు కార్యాచరణ – సిఎం కెసిఆర్‌ – సీతయ్య ఎవరి మాటా వినడు. – చూస్తే జబ్బకు సంచి వేస్తారు. వీళ్ళకు పట్టిన ‘ఎర్రజబ్బు’ ఇపుడు ఎవరు వదిలిస్తారో ఏమో. – చూడండి. నేనేదైతే భయపడి మా నాన్నను హెచ్చరించానో సరిగ్గా అదే జరిగింది….

పూర్తిగా చదవండి

Read more »

బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

By |

బలపడిన భారత్‌-ఇండోనేషియా సముద్ర బంధం

17 వేల ద్వీపాలతో అతిపెద్ద ద్వీపసమూహ మైన ఇండోనేషియా హిందూ మహా సముద్రం, పసిఫిక్‌ మహా సముద్రంలో విస్తరించి ఉన్న దేశం. 2014 వరకు ఈ దేశానికి నిర్దుష్టమైన, స్థిరమైన సముద్ర విధానం అంటూ ఏదీ లేదు. కానీ ఎప్పుడైతే చైనా దక్షిణ చైనా సముద్రంలో కూడా తన సామ్రాజ్య వాద, విస్తరణవాద ధోరణిని చూపడం ప్రారంభిం చిందో, సముద్ర సిల్క్‌ మార్గం అంటూ భూభాగాల ఆక్రమణకు పాల్పడిందో అప్పుడు ఆసియాన్‌ దేశాలన్నీ మేలుకొన్నాయి. తమ సార్వభౌమత్వాన్ని…

పూర్తిగా చదవండి

Read more »

తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

By |

తొందరపడితే ఉత్తర కొరియా మరో పాక్‌ కాగలదు

2018, జూన్‌ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగవలసిన సమావేశం జరుగబోదని ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను రద్దు చేసుకోవడం, ద్వైపాక్షిక ఒప్పందాల నుండి ఏకపక్షంగా విరమించుకోవడం ట్రంప్‌కు అలవాటే. మే 24న ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో ‘ట్వీట్‌’ చేస్తూ, ‘సింగపూర్‌లో జూన్‌ 12న జరుగబోయే సమావేశాన్ని రద్దు చేస్తున్నాను, దీనివల్ల ఉత్తర కొరియాకే కాదు ప్రపంచానికి కూడా అసఫలత చేకూరనుంది’…

పూర్తిగా చదవండి

Read more »

టి-కాంగ్రెస్‌లో గందరగోళం

By |

టి-కాంగ్రెస్‌లో గందరగోళం

‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. అధిష్టానానికి ఎవరు ఇచ్చే నివేదికలు వాళ్లు ఇచ్చేస్తున్నారు. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంటోంది. ఏకంగా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి రావడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మూడు విడతల బస్సుయాత్ర తర్వాత ఇటీవల జరిగిన ఆ పార్టీ కీలక సమావేశంలో టిపిసిసి కార్యవర్గంతో పాటు, అన్ని జిల్లాల డిసిసి…

పూర్తిగా చదవండి

Read more »

మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

By |

మహానాడు ఖర్చు ప్రజల ముందుంచాలి

తెలుగుదేశం మహానాడు జాతర ముగిసింది. రాష్ట్రం మొత్తం నుండి తెలుగు తమ్ముళ్ళు పసుపు జాతరలో పాల్గొన్నారు. ఈ మహానాడు ద్వారా గత మహానాడులలో జరగని విధంగా తెలివిగా జాతీయ రాజకీయాలలో ప్రత్యేక పాత్ర పోషించాలని రాజకీయ తీర్మానం చేశారు. అంతకు మించి మహానాడు ద్వారా ప్రజలకు తెదేపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్ర బాబు అందించిన సందేశం శూన్యం. 3 రోజుల పాటు జరిగిన మహానాడులో మొత్తం 37 తీర్మానాలు చేశారు. అందులో 4 తీర్మానాలు కేంద్రం, మోదీ,…

పూర్తిగా చదవండి

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మొక్కుబడి భృతి ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అధికారపక్షం ఇప్పుడిప్పుడే తన అంబులపొదిలోని ఒకొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ సమరానికి సన్నద్దమవుతోంది. అందులో భాగమే ఆగమేఘాల మీద ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి. 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుందని, జాబు రానివాళ్ళకు రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇష్టారాజ్యంగా హామీలిచ్చి పీఠమెక్కిన చంద్రబాబు గత నాలుగేళ్ళగా ఆ హామీనే మరచి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తోండడంతో తూతూ మంత్రంగా వెయ్యి…

పూర్తిగా చదవండి

Read more »

హద్దుల్లో ఉంటే మంచిది

By |

హద్దుల్లో ఉంటే మంచిది

– ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే అధికారం మోదీకి లేదు. – మంత్రి నారా లోకేశ్‌ – వార్డ్‌మెంబర్‌గా కూడా గెలవకుండా మంత్రి కావడానికి మీకు అన్ని అర్హతలుంటాయి. కానీ ఈ దేశ ప్రధానికి ఏపిపై హక్కు ఉండదా ? – టిఆర్‌ఎస్‌కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే. – కాంగ్రెస్‌ పార్టీ – మరి కాంగ్రెస్‌కు ఓటేస్తే టిడిపికి వేసినట్లా ! – కొట్లాడి సాధించుకున్నం – దగా పడ్డం…

పూర్తిగా చదవండి

Read more »

ఇప్పుడు గెలిచారు కానీ…

By |

ఇప్పుడు గెలిచారు కానీ…

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోకసభ స్థానంలోను, నూర్‌పూర్‌ విధానసభ స్థానంలోను భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ రెండు చోట్లా నాలుగు ప్రతిపక్షాలు అంటే రాష్ట్రీయ లోకదళ్‌ (ఆర్‌ఎల్‌డి), సమాజవాది పార్టీ (ఎస్‌పి), బహుజన సమాజపార్టీ (బిఎస్‌పి) కాంగ్రెస్‌లు సంయుక్తంగా ఒకే ఒక్క అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రకటితమైనప్పటి నుంచి వీరు దాన్ని తమ ఘన విజయంగా భావించి, సంతోషంగా ఉన్నారు. భాజపాకు కాలం…

పూర్తిగా చదవండి

Read more »

ఎవరన్నారు అక్కడ కుల వివక్ష లేదని ?!

By |

ఎవరన్నారు అక్కడ కుల వివక్ష లేదని ?!

అయితే, ఇక్కడే మనం క్రైస్తవులుగా మతంమారిన ఎస్‌.సి.ల పరిస్థితి క్రైస్తవంలో ఎట్లా ఉన్నదనేది గమనించాలి. ‘క్రైస్తవంలోకి మారితే కులమూ, కుల వివక్ష ఉండవు’ అని మభ్యపెట్టి ఎస్‌.సి.లను హిందుత్వం నుండి క్రైస్తవానికి మతమార్పిడులు చేస్తున్నారు. కేరళ రాష్ట్రం కొట్టాయంలో క్రైస్తవుడిగా మతం మారిన ఎస్‌.సి. వ్యక్తిపై క్రైస్తవులే దాడి చేసి దారుణంగా చంపేశారు. ఆ వార్తను పత్రికలు ముఖ్యంగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ‘పరువు హత్య’ అనే శీర్షికపెట్టి వార్త రాసేసింది. వివరాలులోకి వెళ్తే.. కెవిన్‌ పి.జోసఫ్‌…

పూర్తిగా చదవండి

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

ఇదేం న్యాయం ! కృష్ణా పుష్కరాల సందర్భంగా వీధుల విస్తీర్ణతకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 హిందూ దేవాలయాలను కూల్చి వేసింది. ఈ విషయంపై హిందూ సమాజం గగ్గోలు పెడితే వాటన్నింటినీ సమీప ప్రదేశాలలో తిరిగి నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు, అధికారులు వాగ్ధానం చేశారు. కాని ఇంతవరకు ఆ పని మాత్రం జరగలేదు. అయితే ఇటీవల విజయవాడలోని విద్యాధరపురంలో రూ.80 కోట్లు ఖర్చుపెట్టి ముస్లిం తీర్థయాత్రకుల కొరకు ఆరంతస్థుల ‘హజ్‌ హౌస్‌’ నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు….

పూర్తిగా చదవండి

Read more »