Archive For The “వినోదం” Category

సిద్ధార్థ-9

By |

సిద్ధార్థ-9

4. నది వొడ్డున సిద్ధార్థుడు అడవిలో ప్రవేశించాడు. నగరం నుంచి చాలా దూరం నడిచాడు. ఇంతకాలం తాను బ్రతికిన బ్రతుకును తలుచుకున్నప్పుడు అతనికి ఎంతో రోత వేసింది. తన కలలో చచ్చిపోయినట్టు కనిపించిన పిట్ట కమల పంజరంలోది కాదనీ, తన హృయపంజరంలో వున్నదేననీ అనుకున్నాడు. సంసారకూపంలో దిగి ఎంత కుళ్లును పోగుచేశాడు! అంత కాలం తాను బ్రతికి కూడా చచ్చినట్టేననుకున్నాడు. ఈ లోకంలో అతనికి సంతోషాన్ని, ఊరటను కల్పించ గలిగింది ఏమున్నది? ”అబ్బ! మూర్ఛవస్తే – చచ్చిపోతే-…

Read more »

మల్కంబ్‌కు మంచిరోజులు..

By |

మల్కంబ్‌కు మంచిరోజులు..

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో క్రీడలు సైతం ఎంతో భిన్నంగా, వైవిధ్యభరితంగా ఉంటాయి. సాంప్రదాయ క్రీడలు, గ్రామీణ, అంతర్జాతీయ.. ఇలా ఎన్నో రకాల ఆటలు మనకు కనిపిస్తాయి. అయితే వ్యాయామ క్రీడగా, పోల్‌ జిమ్నాస్టిక్స్‌గా పేరుపొందిన మల్కంబ్‌ క్రీడకు సైతం ప్రస్తుతం మంచిరోజులొచ్చాయనే చెప్పాలి. ప్రపంచస్థాయిలో మల్కంబ్‌ క్రీడల్ని నిర్వహించడమే కాదు, ఐపీఎల్‌ తరహాలో మల్కంబ్‌ లీగ్‌ను సైతం నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. ప్రపంచీకరణతో ప్రపంచీకరణ పుణ్యమా అంటూ భారత క్రీడారంగంలో అనూహ్యమైన మార్పులు చోటు…

Read more »

ఉత్తేజపరిచే విఫల, విషాదగాథ ‘జెర్సీ’!

By |

ఉత్తేజపరిచే విఫల, విషాదగాథ ‘జెర్సీ’!

‘విధి చేయు వింతలన్నీ… మతిలేని చేతలేనని’ అంటూ ‘మరో చరిత్ర’లో ఓ పాట ఉంది. కొన్ని సినిమాలను చూసినప్పుడు విధిని మించిన శత్రువు మనిషికి వేరే ఏముంటుంది? అనిపిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన ‘మాతృదేవోభవ’, ఇటీవల వచ్చిన ‘జెర్సీ’ని చూసినప్పుడు విధిని తిట్టుకోకుండా ఉండలేం! జీవితంలో తాను కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా దక్కించుకుంటూ లక్ష్యం దిశగా సాగుతున్న అర్జున్‌ అనే రంజీ క్రికెట్‌ ప్లేయర్‌ లైఫ్‌తో డెస్టినీ ఎలా ఆడుకుందన్నదే ‘జెర్సీ’ సినిమా. అర్జున్‌ (నాని) అనాథ. క్రికెట్‌ అంటే…

Read more »

జయాపజయాల వి’చిత్రలహరి’

By |

జయాపజయాల వి’చిత్రలహరి’

గత వారం ‘మజిలీ’ విజయంతో నాగ చైతన్య మాత్రమే కాదు… ఆ చిత్ర దర్శక నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వారం విడుదలైన సినిమాల్లో అలాంటి రిలీఫ్‌ను ‘చిత్రలహరి’ బృందం పొందిందనే అనుకోవాలి. ‘మజిలీ’ అంతటి విజయాన్ని అందుకోకపోయినా… వారి గత చిత్రాల ఫలితాలతో పోల్చినప్పుడు ‘చిత్రలహరి’ వేసవిలో కాస్తంత దాహార్తిని తీర్చిందనే భావించాలి. విజయ్‌ కృష్ణ (సాయి తేజ్‌) బాల్యం నుండే పరాజయాలతో ప్రయాణం సాగిస్తుండే మనిషి. తన పేరులో విజయం ఉంది…

Read more »

మల్లయుద్ధంలో మరాఠీ మెరిక…

By |

మల్లయుద్ధంలో మరాఠీ మెరిక…

కుస్తీ.. మల్లయోధుల క్రీడ. ఇతిహాసకాలం నాటి ఈ క్రీడలో నేటితరం మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొంటూ సత్తా చాటుకొంటు న్నారు. అయితే హర్యానా, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల నుంచి భారత కుస్తీలోకి దూసుకొస్తున్న యువతులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రాథమిక దశలో శిక్షణ పొందటానికి పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దంగల్‌ సినిమాకు తీసిపోని కథే మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లాకు చెందిన యువ మల్లయోధు రాలు మహిమా రాథోడ్‌ జీవితం. వస్తాదుల కుటుంబం మహారాష్ట్రలోని యావత్మాల్‌…

Read more »

పరిహారం!

By |

పరిహారం!

ఆదివారం. బ్రేక్‌ ఫాస్ట్‌లు ముగిసాయి. లివింగ్‌ హాల్‌లో రిటైర్డ్‌ లెక్చరర్‌ శివరావు హిందూ పేపర్‌ను దీక్షగా చదువుతున్నాడు. శివరావు కుమారుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన శ్రీమన్నారాయణ ల్యాప్‌టాప్‌లో మునిగి పోయాడు. ఉన్నత చదువులకై అతి త్వరలో విదేశాలకు వెళ్లబోతున్న శివరావు కూతురు, మధూలిక పుస్తకాలతో కుస్తీలు పడుతుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన శ్రీమన్నారాయణ భార్య, ఆదివారం కావడంతో గహిణిగా మరొక అవతారము దాల్చి, ఆనాటి స్పెషల్‌ లంచ్‌ ప్రిపరేషన్‌కు కావలసిన యేర్పాట్లలో మునిగి పోయింది. లివింగ్‌ హాల్‌కు…

Read more »

సిద్ధార్థ-8

By |

సిద్ధార్థ-8

3. సంసారం సిద్ధార్థుడు చాలా దినాలు లౌకిక జీవితాన్ని – దానికి అంటకుండా గడిపాడు. శ్రమణుడుగా ఉండినప్పుడు మొద్దువారిన అతని ఇంద్రియాలు తిరిగి మేలుకొన్నవి. అర్థాన్ని, కామాన్ని, అధికారాన్ని అతడు రుచిచూచాడు. కాని అంతకాలం హదయంలో శ్రమణుడుగానే వున్నాడు. కమల తెలివితో ఈ విషయాన్ని గ్రహించింది. అతని జీవితం ఎల్లప్పుడూ ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసము వీటి మీదనే లగ్నమై ఉండేది. లోకంలో సామాన్య జనంతో అతనికి సంబంధం లేదు. అతడు వారికి వేరుగానే వుండేవాడు. సంవత్సరాలు గడిచినవి….

Read more »

సిద్ధార్థ-7

By |

సిద్ధార్థ-7

2. ప్రజలలో సిద్ధార్థుడు కామస్వామిని చూడడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్దమహలు. నౌకరులు అతనిని తివాసీలమీద నడిపించుకుంటూ లోపలికి తీసుకవెళ్ళారు. యజమాని కోసం నిరీక్షిస్తూ గదిలో కూర్చున్నాడు. కామస్వామి వచ్చాడు. ఇద్దరు స్నేహసూచకంగా వందనాలు తెలుపుకున్నారు. ”నీవు బ్రాహ్మణుడవనీ, పండితుడవనీ, ఉద్యోగం కోసం తిరుగుతున్నావని విన్నాను. అయితే జరగక ఉద్యోగంలో చేరదలచా వన్న మాట” అన్నాడు షాహుకారు. ”నాకు జరగకపోవడమనేది ఏనాడూ లేదు. నేను చాలా కాలం శ్రమణులతో కలిసి ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను.”…

Read more »

త్రీ ఇడియట్స్‌

By |

త్రీ ఇడియట్స్‌

పరీక్ష హాల్లోంచి నిర్లిప్తంగా బయటికి చూస్తోంది వినీల. నిర్మలాకాశాన్ని చూసి ఆమె ఈర్ష్య పడింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎంత బాగుందో, అనిపించిందామెకు. ఆమె మనసులోని బరువును నిదర్శిస్తున్నట్టు నిండు కుండలు మోసుకెళ్తున్నారు కొందరు స్త్రీలు. వాళ్లు, ఊరి బయట ఉన్న తన కాలేజీకి దగ్గర ఉన్న పల్లెల వాళ్లు. ఎండాకాలమంటే తనకి పరీక్షల కాలం. వాళ్లకేమో నీటి ఎద్దడి కాలం. ఏటేటా వాళ్లు ఈ పని చేస్తూంటారు. పాపం, ఎంత కష్టపడుతున్నారో! వాళ్లు పడేది ఓ…

Read more »

క్రేజీ బాక్సర్‌..!

By |

క్రేజీ బాక్సర్‌..!

ఫ్లాయిడ్‌ మే వెదర్‌ ప్రపంచ బాక్సింగ్‌ అభిమానులకు, క్రీడాప్రియులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు. ఓ నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లోకి దూసుకువచ్చాడు. అతికొద్ది సమయంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. క్రేజీ క్రేజీ బాక్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు. అమెరికాలోని మిషిగాన్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం ఫ్లాయిడ్‌ మే వెదర్‌ జూనియర్‌ ఓ నిరుపేద బాక్సర్‌ ఇంట్లో జన్మించాడు. తండ్రి మే వెదర్‌…

Read more »