Archive For The “సినిమా” Category

విజువల్‌ వండర్‌ ‘2.ఓ’

By |

విజువల్‌ వండర్‌ ‘2.ఓ’

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌కు, దర్శకుడు శంకర్‌కు చిట్టచివరి విజయం ‘రోబో’నే. ఆ తర్వాత రజనీకాంత్‌ నటించిన సినిమాలేవీ ఘన విజయాలను సొంతం చేసుకోలేకపోయాయి. అలానే శంకర్‌ దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయలేదు. వీరిద్దరి కలయికలో మళ్లీ సినిమా, అదీ ‘రోబో’కు సీక్వెల్‌ అనగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దానికి తోడు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా భారతదేశంలోనే అత్యధిక బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తోందని తెలియగానే అంచనాలు అంబరాన్ని అంటాయి. పైగా ఈ సినిమా…

Read more »

నారసింహ క్షేత్రాలు

By |

నారసింహ క్షేత్రాలు

మన దేశంలో ఉన్న ప్రముఖ నారసింహ క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్‌లోని వేదగిరి, వేదాద్రి క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం! వేదగిరి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కేంద్రం నుండి 15 కి.మీ. దూరంలో, పెన్నా నది ఒడ్డున వేదగిరి లక్ష్మీనారసింహస్వామి క్షేత్రం కొలువుదీరింది. దీన్ని ‘నరసింహుని కొండ’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని క్రీ.శ. 870-915 మధ్య పల్లవ రాజైన విక్రమవర్మ నిర్మించినట్లు తెలుస్తోంది. స్థల పురాణం కశ్యప మహర్షి లోకకల్యాణం కొరకు యజ్ఞం చేసినప్పుడు,…

Read more »

విజయ్‌ పథంలో.. టాక్సీవాలా

By |

విజయ్‌ పథంలో.. టాక్సీవాలా

తెలుగులో కొత్త కథలు రావడం లేదన్నది వాస్తవం. అయితే పాత కథలనే కొత్తగా చెబుతున్న సినిమాలను మనవాళ్లు ఆదరిస్తున్నారు. చెప్పాలనుకున్న పాయింట్‌కు కాస్తంత వినోదాన్ని జోడించి, విసుగు తెప్పించ కుండా రెండు గంటల్లో చూపితే సంతృప్తి పడుతున్నారు. హారర్‌ చిత్రాల విషయంలో అయితే లాజిక్‌ జోలికి కూడా పోవడం లేదు. ఆ కోవకు చెందిన సినిమానే ‘టాక్సీవాలా’. గత ఐదారేళ్లుగా తెలుగులో ఎంటర్‌టైనింగ్‌ హారర్‌ మూవీస్‌ కుప్పలు తెప్పలుగా వచ్చిపడు తున్నాయి. అలా వస్తున్న డబ్బింగ్‌ చిత్రాలకూ…

Read more »

వివాదాలతో గట్టెకాలని చూసిన ‘సర్కార్‌’

By |

వివాదాలతో గట్టెకాలని చూసిన ‘సర్కార్‌’

తమిళనాట యువ కథానాయకులు అజిత్‌, విజయ్‌ మధ్య గట్టి పోటీ కొన్ని సంవత్సరాలుగా ఉంది. జయ లలిత ఉండగా అజిత్‌కు పరోక్ష మద్ధతు ఇస్తుండే వారు. దాంతో సహజంగానే విజయ్‌ అభిమాను లకు అన్నా డీఎంకే అంటే గిట్టేది కాదు. కారణాలు ఏవైనా విజయ్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా ఏదో ఒక వివాదం రాజుకునేది. వివాదాలను హైలైట్‌ చేసుకోవడం వల్లే విజయ్‌ సినిమాలు కొన్ని సక్సెస్‌ అయ్యాయనే వారూ లేకపోలేదు. విజయ్‌ తాజా చిత్రం ‘సర్కార్‌’ పరిస్థితి…

Read more »

ఫ్యాక్షన్‌ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ‘అరవింద సమేత’

By |

ఫ్యాక్షన్‌ కథలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ ‘అరవింద సమేత’

పేరున్న వ్యక్తుల తొలి కలయికలో వచ్చే సినిమా లపై భారీ అంచనాలు ఏర్పడటం కొత్తేమీ కాదు. అయితే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ఎన్టీయార్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు మాత్రం అది పండగే. చిత్రం ఏమంటే ఇద్దరూ కూడా పరాజయాలలో ఉన్న సమయంలో ఈ కలయిక జరగడం చాలామందిని అనేక సందేహాలకు గురిచేసింది. ఎలాగైనా విజయం సాధించాలనే ఒత్తిడిలో తప్పటడుగులు వేస్తారేమోననే భయాన్నీ కలిగించింది. మొత్తానికి దసరా పండగకు వారం ముందే వచ్చిన ‘అరవింద…

Read more »

‘నోటా’ మీట నొక్కిన ప్రేక్షకులు!

By |

‘నోటా’ మీట నొక్కిన ప్రేక్షకులు!

కథానాయకులకు ఉండే ఇమేజ్‌ను బ్రేక్‌ చేయాలంటే బలమైన కథను ఎంపిక చేసుకుని జనం ముందుకు రావాలి. కానీ కేవలం గత చిత్రాలకు భిన్నమైన పాత్రలను తయారు చేసుకుంటే ప్రేక్షకులు ఏమాత్రం హర్షించరని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు అదే తరహాలో ‘నోటా’ జనం ముందుకు వచ్చింది. ‘పెళ్లిచూపులు’ సినిమాలో అమాయక బద్ధకస్తుడి పాత్ర చేసి విజయ్‌ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నాడు. దానికి పూర్తి భిన్నమైన యారొగెంట్‌ మెడికో పాత్ర ‘అర్జున్‌రెడ్డి’తో యూత్‌లో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. మళ్లీ…

Read more »

గ్యాంగ్‌స్టర్‌ వారసుల ఆధిపత్య పోరు నవాబ్‌

By |

గ్యాంగ్‌స్టర్‌ వారసుల ఆధిపత్య పోరు నవాబ్‌

గ్యాంగ్‌స్టర్‌ మూవీ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘గాడ్‌ ఫాదర్‌’. దాని స్ఫూర్తితోనే మణిరత్నం అప్పుడెప్పుడో కమల్‌ హాసన్‌తో ‘నాయకుడు’ సినిమా తీశారు. దక్షిణాదిన ఆ తరహా జానర్‌ సినిమా అనగానే అందరూ ముందుగా ఉదహరించేది ‘నాయకుడు’ మూవీనే. అలాంటి మణిరత్నం పలు జానర్స్‌లో సినిమాలు తీసి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ గ్యాంగ్‌స్టర్‌ జానర్‌కే వచ్చారు. అదే ‘నవాబ్‌’. అయితే ఈ సినిమా ఓ సామాన్యుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడన్నది కాదు.. గ్యాంగ్‌స్టర్‌…

Read more »

కొంచెం లవ్‌… కొంచెం సెంటిమెంట్‌తో నన్ను దోచుకుందువటే

By |

కొంచెం లవ్‌… కొంచెం సెంటిమెంట్‌తో నన్ను దోచుకుందువటే

సీనియర్‌ నటుడు కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి చూస్తుండగానే ఆరేడేళ్లు గడిచిపోయాయి. అతను నటించిన సినిమాల్లో మంచి విజయం సాధించినవి ఏవైనా ఉన్నాయంటే అవి ‘ప్రేమకథా చిత్రమ్‌, సమ్మోహనం’ మాత్రమే. నటుడిగా భిన్నమైన పాత్రలు చేయాలన్న కసి సుధీర్‌బాబులో ఉన్నా… ఆ స్థాయి కథలేవీ అతన్ని పలకరించడం లేదు. ఆ మధ్య హిందీ చిత్రం ‘భాగీ’లోనూ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. మల్టీస్టారర్‌ మూవీ ‘శమంతకమణి’లో ఇప్పటికే నటించాడు. మరో మల్టీస్టారర్‌ ‘వీరభోగ వసంతరాయలు’ విడుదల…

Read more »

హారర్‌ జానర్‌లో కాస్తంత భిన్నంగా ‘యూ టర్న్‌’

By |

హారర్‌ జానర్‌లో కాస్తంత భిన్నంగా ‘యూ టర్న్‌’

ఈ మధ్య కాలంలో మళ్లీ సినిమాల పబ్లిసిటీ హోరు పెరిగిపోయింది. దాంతో అన్ని సినిమాలూ విజయవంతమవుతున్నాయనే భ్రమ ప్రేక్షకులకు కలుగుతోంది. తీరా థియేటర్‌కు వెళ్లి చూసిన తర్వాత ఇందులో అంత గొప్పతనం ఏముందనే ప్రశ్న వారి మనసుల్లో ఉదయిస్తోంది. యావరేజ్‌ మూవీని కూడా పబ్లిసిటీతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించాలన్నది నిర్మాతల తాపత్రయం. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కాబట్టి నెగెటివ్‌ టాక్‌ వచ్చినా కాడి దించేయకుండా ఎంతోకొంత పబ్లిసిటీ చేస్తే కొద్దిపాటి పెట్టుబడి అయినా వెనక్కి…

Read more »

‘శ్రీనివాస కళ్యాణం’ చూతము రారండి!

By |

‘శ్రీనివాస కళ్యాణం’ చూతము రారండి!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచంలోని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పెద్దలు జరిపే పెళ్లిళ్లు, మహిళలు చేసే వ్రతాలు, పేరంటాలు, పర్యావరణ హితానికై జరిపే హోమాల గురించి మాట్లాడుకుంటారు. కానీ పాశ్చాత్య ప్రభావానికి లోనైన మనం వాటికి నిదానంగా దూరమవుతున్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ పెళ్లి, దాని ప్రాధాన్యం గురించి ఎవరైనా చెబితే పాత చింతకాయ పచ్చడిగా భావించడం మామూలే. ఆరోగ్యకరమైనప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిని సైతం స్వీకరించాల్సిందే. అలాంటిదే…

Read more »