Archive For The “పర్యాటకం” Category

భిన్న సంస్కృతుల ‘గోవా’

By |

భిన్న సంస్కృతుల ‘గోవా’

విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైనది ‘గోవా’. ప్రకృతి సిద్ధమైన సుందర దృశ్యాలతో, చారిత్రక కట్టడాలతో, పవిత్రమైన పుణ్య క్షేత్రాలతో గోవా విజ్ఞాన, విహార యాత్రలకు అనువైన, ప్రసిద్ధి పొందిన ప్రదేశంగా వాసికెక్కింది. గోవాను సందర్శించే పర్యాటకులకు పోర్చుగల్‌ రాజధాని ‘లిస్బన్‌’ ను చూసిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు వారు చాలకాలం పాలించారు. పరిశోధనాత్మక దృక్పథంతో పరిశీలించినట్లైతే ఇక్కడ ప్రత్యేకమైన పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్నట్లుగా అర్థమౌతుంది. అయితే పౌరాణిక గాథను బట్టి…

పూర్తిగా చదవండి

Read more »

జ్వాలాయాం వైష్ణవీ దేవి

By |

జ్వాలాయాం వైష్ణవీ దేవి

జగజ్జెగీయమైన జ్వాలా క్షేత్రం శ్రీ వైష్ణవీ దేవి క్షేత్రం. సతీదేవి పుర్రె (కంకాళం) పడినందువలన దీన్ని జ్ఞాన క్షేత్రమని అంటారు. ద్వాపరయుగంలో మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఈ జ్వాలా దేవిని విజయం కోసం అర్చించి అర్జునుడు వైష్ణవీ దేవి దీవెనలు పొందాడని పురాణ కథనం. జమ్ము నుండి 40 కి.మీ. దూరంలో ఉన్న కాట్రాకు బస్సు లేక రైలులో వెళ్ళవచ్చు. అక్కడి నుండి నడుచుకుంటూ గాని, గుర్రాల మీద గాని వైష్ణవీ దేవి మందిరానికి…

పూర్తిగా చదవండి

Read more »

వారణాస్యాం విశాలాక్షి

By |

వారణాస్యాం విశాలాక్షి

మాతా ! అన్నపూర్ణేశ్వరీ ! భిక్షాందేహి ! అని పిలిస్తే బిడ్డ ఆకలి తెలిసిన అమ్మవలే ఆదరించే అన్నపూర్ణాదేవి కొలువున్న కమనీయ క్షేత్రం వారణాసి. విశాలమైన కన్నులు కలది విశాలాక్షి. శక్తి క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ కాశీ విశ్వేశ్వరుడు నెలకొన్న వారణాసే నేటి కాశీ క్షేత్రం. సప్తమోక్షపురాల్లో ఒకటైన శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీని మహా శ్మశానమని, శివానంద క్షేత్రమని అంటారు. ఇది అనాథక్షేత్రం. ఎన్ని రాజ్యాలు అంతరించినా కాలచక్రమున యుగకల్పములు దొర్లుచుండినను కాశీ క్షేత్ర మహిమకు,…

పూర్తిగా చదవండి

Read more »

అద్భుత క్షేత్రం ‘అన్నవరం’

By |

అద్భుత క్షేత్రం ‘అన్నవరం’

– సత్యదేవుని లీలలు అనంతం తూర్పు గోదావరి జిల్లాలోని పంపానదీ తీరాన వెలసిన ‘హరి హర హిరణ్య గర్భాత్మక వీర వెంకట సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి అమ్మవారు కలియుగ దైవాలుగా ప్రసిద్ధి చెందారు. ఈ క్షేత్రంలో సత్యదేవుడు ఎలా వెలిశాడంటే ! స్థల పురాణం ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని పీఠికాపురం (పిఠాపురం) దగ్గరలో గోరుస గ్రామ ప్రభు రాజా ఇనుగంటి వెంకట రామనారాయణ ఏలుబడిలో అరికెలపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. ఆ ప్రాంతంలోనే మహాభక్త…

పూర్తిగా చదవండి

Read more »

ఉజ్జయన్యాం మహా కాళీ

By |

ఉజ్జయన్యాం మహా కాళీ

‘మహామంత్రాధిదేవతాం ధీర గంభీరతాం | మహాకాళీ స్వరూపిణీం మాం పాలయమాం ||’ ‘ఎక్కడైతే స్త్రీమూర్తికి గౌరవం లభిస్తుందో అదే దేవతల స్థానం. ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని త్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం’. సప్త మోక్షదాయక పురాలలో ఇదీ ఒకటి. ఈ ఆలయం మహాకాళేశ్వరానికి సమీపాన ఉంది. ఇక్కడే అవంతిమాయి అమ్మవారు ఉన్నారు. ఆమె పేరు నుండే అవంతిక అని పేరు వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి.మీ. దూరంలో క్షిప్రా నది…

పూర్తిగా చదవండి

Read more »

పీఠ్యాయాం పురుహుతిక

By |

పీఠ్యాయాం పురుహుతిక

ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు 18 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడికి అన్ని ప్రాంతాల నుండి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. సతీదేవి పీఠభాగం ఇక్కడ పడినందువల్ల ఇది పీఠికాపురంగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రమే పిఠాపురంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని ప్రతీ శుక్రవారం బంగారు చీరతో అలంకరిస్తారు. ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వరస్వామి చాలా ప్రసిద్ధి. కుక్కుటం అంటే కోడి. లింగం కోడి రూపంలో ఉండటం వల్ల ఆ పేరు వచ్చిందని ఇక్కడి వారంటారు. కోడి…

పూర్తిగా చదవండి

Read more »

పచ్చని అందాలకు ప్రతీక కోనసీమపచ్చని అందాలకు ప్రతీక కోనసీమ

By |

పచ్చని అందాలకు ప్రతీక కోనసీమపచ్చని అందాలకు ప్రతీక కోనసీమ

– జగ్గన్నతోట ప్రభల తీర్థానికి విశేష గుర్తింపు తూర్పుగోదావరి జిల్లాకు దక్షిణ దిశగా, సముద్రతీరానికి సమీపాన ఎల్లప్పుడు పచ్చని ప్రకృతితో విరజిల్లే అద్భుతమైన ప్రాంతమే కోనసీమ. ఇక్కడ సప్త గోదావరులు వశిష్ఠ, గౌతమి, వైనతేయ, కౌశిక, భరద్వాజ, ఆత్రేయ, వృద్ధగౌతమ్‌ అనే పేర్లతో శాఖోపశాఖలై విస్తరించి ఉన్నాయి. ఎటు చూసినా జలసిరులతో, కొబ్బరి, అరటి, పనస, మామిడి, పసుపు, జామ తోటలతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, పవిత్ర స్థలాలు దర్శనమిస్తాయి.  ప్రభలతీర్థ…

పూర్తిగా చదవండి

Read more »

కైలాసకోన

By |

కైలాసకోన

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరులో సుదూర ప్రాంతమైన నారాయణి వనం నుంచి సుమారు 15 కి.మీ. దూరంలో దట్టమైన అటవి ప్రాంతంలోని కొండలలో దాగున్న అద్భుతమైన జలపాతమే కైలాసకోన. శివుని స్వస్థలంగా భావించే ఈ కొండలు సుమారు 10 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇక్కడే కైలాసకోన జలపాతాన్ని గుర్తించారు. పవిత్రతకు మారుపేరుగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు. పుత్తూరు, నారాయణి వనానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు పర్యాట కేంద్రంగా కైలాసకోన, అక్కడి…

పూర్తిగా చదవండి

Read more »

ఏకవీరాదేవి

By |

ఏకవీరాదేవి

మాహూర్యే ఏకవీరికా అనగా మాహూర్యపు రమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరికాదేవి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరములో ఈమె వెలసింది. ఈ ప్రాంతాన్ని మయూరపురమని కూడా అంటారు. సతీదేవి మోచేయి ఈ ప్రాంతంలో పడిందని ఇక్కడి వారందరంటారు. ఈ ప్రదేశంలో 3 పర్వతాలు కలవు. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రెండవ పర్వతముపైనా అత్రి అనసూయ ఆలయము కలదు. 3వ శిఖరము మీద ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపమలో ఉంటుంది. ఇక్కడ…

పూర్తిగా చదవండి

Read more »

అందాల సోయగాల ‘అరకులోయ’

By |

అందాల సోయగాల ‘అరకులోయ’

అరకులోయ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని ఇక్కడి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్‌ ఊటీ (ఉదక మండలం) అని పిలుస్తుంటారు. ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. విశాఖ (వైజాగ్‌) నగరానికి ఇది 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్‌ నుండి అరకులోయకు రైలు మార్గంలో వెళితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భారతదేశంలోనే ఎత్తైనటువంటి బ్రాడ్‌గేజ్‌ రైల్వేమార్గం ‘శిమిలీ గుడ’ ఇక్కడే ఉన్నది. మార్గం మధ్యలో 84 వంతెనలు, 58 సొరంగాలు (టనెల్స్‌) లను దాటి వెళ్ళాల్సి ఉంటుంది….

పూర్తిగా చదవండి

Read more »