Archive For The “ధారావాహిక” Category

జీవనస్రవంతి -31

By |

జీవనస్రవంతి -31

: జరిగిన కథ : పెద్ద భవనంలోకి వెళ్లాక జీవన్‌కి పై చదువు చదవాలనే కోరిక పుట్టింది. అదే సందర్భంలో జీవన్‌ స్నేహితుడు కిరణ్‌ నిరుద్యోగిగా మారాడు. పెళ్లి కూడా నిశ్చయమైంది. బాధలో ఉన్న కిరణ్‌ని శ్రీ జననీ ఫుడ్స్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా చేరమన్నాడు జీవన్‌. కిరణ్‌ చాలా సంతోషించాడు. పెళ్లి జరిగిన వెంటనే చేరిపోయాడు. జీవన్‌ పైచదువు కోసం ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. యాజులుగారు తాము వస్తున్నామని, ఇల్లు సిద్ధం చేయమని ఉత్తరం రాశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని…

Read more »

జీవనస్రవంతి -30

By |

జీవనస్రవంతి -30

: జరిగిన కథ : పెద్ద ఇంట్లోకి వెళ్లిన తరువాత శ్రీ జననీ ఫుడ్స్‌ వ్యాపారం మరింత పెరిగింది. తన పెళ్లి గురించి తల్లి అడిగితే ఇప్పుడే కాదన్నాడు జీవన్‌. రోజూ వ్యాహ్యాళికి వెళుతున్న జీవన్‌కి ఆ ప్రదేశంలో ‘దెయ్యాలకొంప’గా పేరుపడిన పాత భవనాన్ని కొనాలనే ఆలోచన వచ్చింది. వెంటనే పనులు ప్రారంభించాడు. ఆ దెయ్యాల భవనం కొనడం గురించి మీనాక్షి ఆందోళన చెందింది. హనుమత్‌ రక్ష రేకు కట్టించమంది. జీవన్‌ దెయ్యాలను పోగొట్టే మంత్రగాడిని పిలిపించాడు….

Read more »

జీవనస్రవంతి – 29

By |

జీవనస్రవంతి – 29

ధారావాహిక : జరిగిన కథ : జగన్నాథం తాతయ్య పెట్టిన ఉంగరం, తన గోల్డ్‌మెడల్‌ రెంటినీ అమ్మడానికి నగలు అమ్మే షాపుకు వెళ్లిన జీవన్‌ను షాపులోని సేఠ్‌ చగన్‌లాల్‌ దొంగగా అనుమానించి, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ని పిలిపించాడు. ఇన్‌స్పెక్టర్‌ వస్తూనే జీవన్‌తో కరచాలనం చేసి, జీవన్‌ గురించి 60 లక్షలు విలువ చేసే ఇంటినే వదులుకున్న వ్యక్తి అని చెప్పగానే చగన్‌లాల్‌ జీవన్‌కి క్షమాపణ చెప్పాడు. చివరకు 2 లక్షలకు ఉంగరాన్ని కొన్నాడు. దాంతో జీవన్‌ గోల్డ్‌మెడల్‌ అమ్మలేదు….

Read more »

జీవన స్రవంతి – 25

By |

జీవన స్రవంతి – 25

: జరిగిన కథ : జగన్నాథంగారింటికి ఆయన కొడుకు కుంటుంబం రావడంతో పరిస్థితి బాగాలేదని గ్రహించిన జీవన్‌ ఆ రాత్రి అక్కడ పడుకోకుండా తల్లితో కలిసి ఇంటికెళ్లిపోయాడు. జీవన్‌ గురించి అడిగిన స్రవంతికి అన్ని వివరాలు చెప్పారు జగన్నాథం గారు. తెల్లారి జగన్నాథంగారిని కొడుకు రఘురాం జీవన్‌ గురించి, అతనికి ఆస్తి పంచుతూ రాసిన విల్లు గురించి అడిగాడు. రుణపడ్డవాడికి కొంత డబ్బు చేతిలో పెట్టాలి గానీ, ఆస్తులు రాసివ్వడం ఏమిటంటూ నిలదీశాడు. జగన్నాథంగారు కోపంతో ‘నీవు…

Read more »

జీవనస్రవంతి -24

By |

జీవనస్రవంతి -24

: జరిగిన కథ : కనబడకుండాపోయిన ఉంగరం వెతికి జగన్నాథంగారి వేలికి తొడిగింది మీనాక్షి. ఆయన మిత్రులు వచ్చి మీనాక్షి వంట తిని బాగుందని, వీళ్లని వదులుకోవద్దని చెపుతారు. జీవన్‌ కంప్యూటర్‌ కోర్సు చెయ్యాలని అనుకున్నాడు. కొన్నాళ్లకి జగన్నాథం గారింటికి ఆయన కొడుకు రఘు, కోడలు రజనీ, మనుమరాలు స్రవంతి, మనుమడు రవి వచ్చారు. మాటల్లో రఘు, రజనీలకు తనంటే ఇష్టం లేదని తెలుసుకున్నాడు జీవన్‌. ఆ రాత్రి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర జగన్నాథంగారు తన పక్కన…

Read more »

జీవనస్రవంతి -23

By |

జీవనస్రవంతి -23

: జరిగిన కథ : ‘నా ఇంట్లోనే ఉండండి’ అన్న జగన్నాథం గారితో పూర్తిగా ఇక్కడే ఉండటం కుదరదని చెప్పిన మీనాక్షి, జీవన్‌లు జగన్నాథంగారు ఒంటరిగా కాక, ఎప్పుడూ ఎవరో ఒకరితో కలిసి ఉండేవిధంగా ప్రణాళిక వేశారు. అది జగన్నాథంగారికి కూడా ఇష్టమైంది. జగన్నాథంగారికి యాక్సిడెంట్‌ జరిగిన విషయం ఆయన కొడుకు రఘురాంకి ఉత్తరం రాయించాడు జీవన్‌. రఘురాం మొక్కుబడిగా సమాధానం రాశాడు. అందుకు జగన్నాథంగారు చాలా నొచ్చుకుని, తన భార్య కొడుకుపై దిగులు తోనే చనిపోయిందని…

Read more »

జీవనస్రవంతి – 22

By |

జీవనస్రవంతి – 22

: జరిగిన కథ : ప్రమాదానికి గురైన పెద్దాయనను హాస్పిటల్‌లో చేర్చాడు జీవన్‌. ఆయన తన తాతయ్యే అని చెప్పి, వైద్యం ఖర్చులను తన దగ్గరున్న హెల్ప్‌లైన్‌ డబ్బు నుండి కట్టాడు. ఆయనకెవరూ లేరని, ఒంటరి వాడని, పేరు జగన్నాథం అనీ తెలుసుకున్నాడు. ఆయనకు స్పృహ వచ్చాక ‘తాతయ్యా’ అని పిలిచి, తనను మనవడుగా భావించుకోమని, ఇకనుంచి మీ అన్ని అవసరాలు నేను చూస్తానని చెప్పాడు. జగన్నాథంగారిని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి చేశాక ఆయనను ఆయన ఇంటికే…

Read more »

జీవనస్రవంతి-21

By |

జీవనస్రవంతి-21

‘అలా అనుకుని ఆలస్యం చేస్తే ఈలోగా తాతయ్య ‘షాక్‌’తో చనిపోవచ్చు. ‘ఆలస్యం అమతం విషం’ అన్నారు. వేగంగా పోనియ్‌ ఆటోని’ అన్నాడు జీవన్‌. ముసలాయన గాయం నుండి కారుతున్న రక్తం తన షర్టుని తడుపుతున్నా పట్టించుకోకుండా ఆయన క్షేమాన్ని గురించే ఆలోచిస్తున్న జీవన్‌ వైపు ఆశ్చర్యంగా చూశాడు రాఘవ. ‘ఏమిట్రా జీవన్‌! ఆయనేదో నీకు నిజంగానే తాతయ్యన్నట్లు తెగ ఇదైపోతున్నావేమిటి!’ ‘ఒరే రాఘవా! చూడగానే తెలుస్తోంది కదురా.. ఆయనను చూసుకునే వాళ్లెవరూ లేరని! ఉంటే, ఈ వయసులో…

Read more »

జీవనస్రవంతి-16

By |

జీవనస్రవంతి-16

జరిగిన కథ జీవన్‌ చీకటి పడకముందే కరణం గారి ఇల్లు చేరాడు. కరణం దంపతులు అతనిని ఆహ్వానించి ఆ రాత్రి స్నానం, భోజనం, పడక ఏర్పాట్లు చేసారు. కరణంగారు తెల్లారి జీవన్‌తో పని పూర్తయ్యేవరకు ఉండాలని, అప్పటి వరకు ఊరు చూడమని చెప్పారు. అంతలో లోపల ఏడుస్తున్న పసిపిల్లను తెచ్చి ఆడిస్తూ, కరణంగారు తన కూతురు జాహ్నవి దుస్థితి గురించి జీవన్‌తో చెప్పుకున్నారు. అది విని జీవన్‌ బాధపడ్డాడు. అతనికి ఒక ఉదాత్తమైన ఆలోచన వచ్చింది. ఇక…

Read more »

జీవనస్రవంతి -15

By |

జీవనస్రవంతి -15

జరిగిన కథ జీవన్‌ని మల్లెవాడకు చేర్చమని పూజారి రామారావుకి చెప్పారు. అలా జీవన్‌, రామారావులు మల్లెవాడకు బయలుదేరి కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. వీరిద్దరికి తోడుగా రంగనాథం కలిశాడు. ముగ్గురూ మల్లెవాడకు చేరారు. అప్పటికి చీకటి పడుతున్నది. మొదట రంగనాథం, తరువాత రామారావు తమ ఇళ్ల వద్ద ఆగిపోగా, జీవన్‌ ఒక్కడే తన పెట్టె పట్టుకుని కామేశం గారింటికి నడక సాగించాడు. చివరికి చీకటి పడకముందే గమ్యాన్ని చేరుకున్నాడు జీవన్‌. —- —– కరణంగారిది, ఎత్తు అరుగుల పెద్ద…

Read more »