Archive For The “టి.వి” Category

మీరు.. నేను… ఓ పాట…

By |

మీరు.. నేను… ఓ పాట…

కొన్ని వందల సన్నివేశాల్లో చెప్పలేని విషయాన్ని అయిదారు నిమిషాల పాటలో వివరంగా చెప్పవచ్చు. అందుకే చలన చిత్రాల్లో పాటలకు ఎనలేని విలువనిస్తారు. పాటకు ప్రాణం పోయడానికి పాట రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు, సమర్థవంతంగా సమన్వయపరుస్తూ దర్శకుడు ప్రాణం పెడతారు. అలా ప్రాణంపెట్టి రూపొందించిన పాట సహజంగానే వీక్షకుల గుండె తలుపు తడుతుంది. ఆ విధంగా అలరించిన పాటలను ప్రత్యేకంగా పేర్కొంటూ ఈటివి సినిమా ఛానల్‌ ‘మీరు… నేను…. ఓ పాట’ (ప్రతి శనివారం రాత్రి 10…

పూర్తిగా చదవండి

Read more »

మంత్రివర్గ విస్తరణ – విశేషాలు

By |

మంత్రివర్గ విస్తరణ – విశేషాలు

కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా పాలక పక్షనేత ఎక్కువగా అనుయాయులనూ, పార్టీ సహచరుల్ని నిత్యం ఊరించే విధంగా వాడుకలో ఉంచే మాట ‘మంత్రివర్గ విస్తరణ’. అలా ఊరించి ఆశావహుల్ని నిద్రపుచ్చడానికో, జోలపాడడానికో ఉపయోగించే పల్లవిని నిజంగా అమలులో పెడితే ఎక్కడో అక్కడ అసంతృప్తి చెలరేగుతుంది. ఎందుకంటే ఎంతటి వ్యూహకర్తైనా అందరినీ మెప్పించే పరిస్థితి ఉన్న రాజ్యాంగ పరిమితుల ద్వారా కానీ, ఎప్పట్నించో అమలులో ఉన్న వివిధ విభాగాల సమీకరణలవల్ల కానీ వీలుకాదు. అయితే ఎప్పుడో అప్పుడు విస్తరించక…

పూర్తిగా చదవండి

Read more »

సైసై సయ్యారే! దర్శకేంద్రుడి పాటల సందడి

By |

సైసై సయ్యారే!  దర్శకేంద్రుడి పాటల సందడి

ప్రజాదరణ పొందిన దర్శకుని చిత్రాల తాలూకు వెనక కథా కమామీషూ ఆ మధ్య వచ్చిన సుప్రసిద్ధ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘సౌందర్య లహరి’ (ఈటివిలో గతంలో వచ్చిన ప్రోగ్రాం) సవిస్తారంగా చెప్పేసింది. ఇప్పుడు తాజాగా వారికే చెందిన చిత్రాలలోని పాటల వెనుక సంగతుల్ని ఆడియన్స్‌ ముందు విప్పి చెప్పడానికి కొత్త కోటింగ్‌ డాన్సు భంగిమలతో అలరించడానికి ‘సైసై సయ్యారే’ (ఆగస్టు 22 నుంచి రాత్రి 9.30కి ప్రతి మంగళవారం వస్తున్నది) ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమంపై ఓ పరిశీలన. ఇది…

పూర్తిగా చదవండి

Read more »

ఆకులు కలిసిన శుభవేళ…

By |

ఆకులు కలిసిన శుభవేళ…

భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే మిగతా 28 రాష్ట్రాలకు చెందిన రాజకీయాలు ఒక తీరు నుంటే, ఒక్క తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు మాత్రం వేరుగా ఉండి ఆది నుంచి వైవిధ్యాన్ని సంతరింప చేసుకున్నాయి. ఈ వైవిధ్యానికి మరో పరాకాష్ట ఆగస్టు 21న ఆల్‌ ఇండియా అన్నాడిఎంకెలో రెండు పక్షాలు ఒక్కటిగా (విలీనం) అయినట్లు వచ్చిన ప్రకటన. ఈ వార్త కేంద్ర బిందువుగా ప్రధాన ప్రాంతీయ ఛానళ్ళు దాదాపు అన్నీ చర్చలు, ప్రత్యేక కార్యక్రమాలు ఆగస్టు 21, 22 తేదీల్లో…

పూర్తిగా చదవండి

Read more »

భారత క్రికెట్‌ ఖజానాకు తూట్లు…

By |

భారత క్రికెట్‌ ఖజానాకు తూట్లు…

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్‌ బోర్డు భారత నియంత్రణ మండలికి కష్టకాలం వచ్చిపడింది. నిన్నటి వరకూ పట్టిందల్లా బంగారంలా ఉంటూ వచ్చిన బిసిసిఐకి పరీక్షా సమయం ప్రారంభమయ్యింది. ఐసిసి వార్షిక పంపకాల ఫార్ములా మార్పుతో వేల కోట్ల రూపాయల వాటా నష్టపోయిన బిసిసిఐకి టి-20 ప్రపంచకప్‌ నిర్వహణతో 190 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చింది. అంతేకాదు బిసిసిఐ ప్రస్తుత కార్యవర్గ సభ్యుల దుబారా ఖర్చుతో మరో 439 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని వినోద్‌ రాయ్‌ నేతత్వంలోని…

పూర్తిగా చదవండి

Read more »

జీవన ధర్మాలు తెలిపే ధారావాహిక శనీశ్వరుని దివ్య చరిత్ర

By |

జీవన ధర్మాలు తెలిపే ధారావాహిక శనీశ్వరుని దివ్య చరిత్ర

శనైశ్వరుడు – మనలో చాలామంది ఈ పేరు వినగానే కాస్తంత భయందోళనకు గురవుతారు. సాధారణంగా శని అంటే ఏదో చెడ్డ చేస్తాడని సకల దుఃఖాలూ కలగ చేస్తాడని ఓ జనాంతిక ధోరణి ఉంది. కానీ అది కేవలం ఓ అపోహ మాత్రమే. ఇతర దేవతా, దేవుళ్లలాగానే శనీశ్వరుడూ ఓ దేవతామూర్తి. మనిషి వెళ్లకూడని మార్గాన్ని అనుసరిస్తూన్నా, చేయకూడని పని చేస్తున్నా, అలా చేయడం వల్ల కలిగే ఫలాన్ని తెలియజేప్పే సత్‌సంస్కృతి గల దివ్య పురుషుడు శనైశ్వరుడు. ఈ…

పూర్తిగా చదవండి

Read more »

వేడి వేడిగా ‘వీకెండ్‌ కామెంట్‌’

By |

వేడి వేడిగా ‘వీకెండ్‌ కామెంట్‌’

ఎప్పటికప్పుడు ప్రపంచంలో నలుమూలల జరిగే వార్తలు అప్పటికప్పుడే చేరవేసే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇబ్బడిముబ్బడిగా అందుబాటులో ఉండగా తిరిగి ఇలా ‘వీకెండ్‌ కామెంట్‌’ (వారంతపు వ్యాఖ్య) ఎందుకు ? అన్న సందేహం చాలామందిని వేధిస్తూ ఉండే అంశం. నిజమే. ఎప్పుడు సంభవించే, సంభ విస్తున్న పరిణామాలను ప్రమాణాలకు అనుగుణంగా అప్పడే అందించేసే ప్రత్యక్ష ప్రసారాలు అనేకం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి వార్తల్ని యథాతథంగా అందచేస్తాయి. దానివల్ల కొన్ని విషయాలు వీక్షకునికి తెలియాల్సినంతగా తెలిసే సౌకర్యం…

పూర్తిగా చదవండి

Read more »

సమాచార సహిత శ్రావణ శోభ

By |

సమాచార సహిత శ్రావణ శోభ

‘కాస్త ఆగు, ఈ ఆషాఢం పోనీ, వచ్చే శ్రావణంలో మనమ్మాయికి పెళ్ళి ప్రయత్నాలు, అబ్బాయికి ఉద్యోగాన్వేషణ కార్యక్రమాలు ప్రారంభిద్దాం’ ఇదో గృహస్థు తన సహధర్మచారిణితో ‘ఏమిటీ మీరసలు ఇంటి ఆలోచన చేయడమే లేదు’ అన్న ఫిర్యాదుకు సంధించిన తీరు. ఇలా ఏ కొత్త పని చేయాలన్నా శ్రావణం వంటి శుభమాసంలో ఆరంభించడం హైందవ సంస్కృతిలో ఓ అంతర్భాగ విషయం. అసలు శ్రావణంలో ఏ కోరిక తలుచుకుని ప్రారంభించినా ఇట్టే అయిపోతుంది అన్న భరోసాను కూడా ‘శ్రావణ శోభ’…

పూర్తిగా చదవండి

Read more »

బుల్లితెరకు కొత్త అందం బిగ్‌బాస్‌

By |

బుల్లితెరకు కొత్త అందం బిగ్‌బాస్‌

ఒకప్పుడు సినీతారలు టి.వి.కార్యక్రమాల్లోకి రమ్మంటే, అదేదో చిన్న చూపుగా భావించేవారు. ఇంకా చెప్పాలంటే ఓ నటి, నటుడు టి.వి. కార్యక్రమాల్లో పాల్గొంటే, వాళ్ళకి సినిమాల్లో కథలు లేనివారుగా వర్గీకరించే వారు. కాని ఎప్పుడైతే 2000వ సంవత్సరంలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రయోక్తగా వచ్చిన కౌన్‌బనేగా కరోడ్‌పతీ చిన్న తెరపై సునామీ సృష్టించేసిందో అప్పట్నించి వివిధ భాషల్లో ఒక రకంగా టి.వి.షోల్లో తమ ప్రతిభను చూపడానికి పోటాపోటీగా పెద్ద తెరపై పేరొందిన వాళ్ళంతా క్యూలు కట్టడం ప్రారంభించారు. ఆ వరసలో…

పూర్తిగా చదవండి

Read more »

మాదక ద్రవ్యాల మహమ్మారి!

By |

మాదక ద్రవ్యాల మహమ్మారి!

పదేళ్ళుగా మాదకద్రవ్యాల సరఫరా  చాపకింద నీరులా ఇరు రాష్ట్రాల్లోనూ ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నా, పదిరోజుల క్రితం దానికి సంబంధించిన ముఠాల వ్యవహారం హైదరాబాదులో బయటపడడంతో ఈ విషయంపై అందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనల వివరాలు, అసలు మాదకద్రవ్యం పట్ల మనిషి, ముఖ్యంగా యువతరం ఎలా ఆకర్షిత మవుతోందీ, ఇది ఏ స్థాయిలో ఉంది? దీన్ని అధిగమించడానికి అవలంబించవలసిన మార్గాలూ తదితరాల్ని ఈటివి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ ఛానళ్ళు జూలై 7న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ప్రత్యేక…

పూర్తిగా చదవండి

Read more »