Archive For The “క్ర్రీడ” Category

క్రేజీ బాక్సర్‌..!

By |

క్రేజీ బాక్సర్‌..!

ఫ్లాయిడ్‌ మే వెదర్‌ ప్రపంచ బాక్సింగ్‌ అభిమానులకు, క్రీడాప్రియులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు. ఓ నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లోకి దూసుకువచ్చాడు. అతికొద్ది సమయంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. క్రేజీ క్రేజీ బాక్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు. అమెరికాలోని మిషిగాన్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం ఫ్లాయిడ్‌ మే వెదర్‌ జూనియర్‌ ఓ నిరుపేద బాక్సర్‌ ఇంట్లో జన్మించాడు. తండ్రి మే వెదర్‌…

Read more »

ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

By |

ఖేలో ఇండియా కొత్త ఊపిరి..

గత ఆరున్నర దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైన భారత క్రీడారంగానికి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్త ఊపిరి పోసిందనే చెప్పాలి. సూపర్‌ హిట్‌ 2018 ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌ను న్యూఢిల్లీ వేదికగా విజయవంతంగా నిర్వహించారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా మొత్తం 16 క్రీడాంశాలలో 12వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాలలోపు వారే కావడం…

Read more »

మోదీ మార్కు.. భలే మార్పు..!

By |

మోదీ మార్కు.. భలే మార్పు..!

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత క్రీడారంగం మొదటి ఆరున్నర దశాబ్దాలలో సాధించిన ప్రగతి ఒక ఎత్తయితే నరేంద్ర మోదీ ప్రధానిగా గత ఐదేళ్ల కాలంలో సాధించిన ప్రగతి మరో ఎత్తుగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగానికి జవసత్వాలను అందించడంతో పాటు క్రీడారంగ సమూల ప్రక్షాళనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నిస్తేజంగా, నిద్రాణంగా తయారైన భారత క్రీడారంగాన్ని జాగృతం చేయటానికి మోదీ ఖేలో ఇండియా పేరుతో…

Read more »

సాటిలేరు నీకెవ్వరూ..

By |

సాటిలేరు నీకెవ్వరూ..

టెన్నిస్‌ ఎవర్‌గ్రీన్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ 36 ఏళ్ల వయసులోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఏటీపీ టూర్‌ చరిత్రలోనే వంద టైటిల్స్‌ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 2019 దుబాయ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు. రాయల్‌ గేమ్‌ టెన్నిస్‌లో తరాలు మారుతున్నా స్విట్జర్లాండ్‌ ఎవర్‌గ్రీన్‌ స్టార్‌ ఫెదరర్‌ జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. రెండుదశాబ్దాల తన టెన్నిస్‌ కెరియర్‌లో ఇప్పటికే 20 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించి 2019 దుబాయ్‌…

Read more »

ఇద్దరూ ఇద్దరే !

By |

ఇద్దరూ ఇద్దరే !

భారత మహిళా బ్యాడ్మింటన్‌కు రెండు కళ్ల లాంటి సింధు, సైనాలలో ఎవరు గొప్ప? సైనా ప్రత్యర్థిగా సింధు వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తోంది? అన్న ప్రశ్నలపై ప్రస్తుతం బ్యాడ్మింటన్‌ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే వారిద్దరిని పోల్చడం ఏమాత్రం తగదని బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు, విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌లో నిన్నటి వరకూ చైనా మాత్రమే సూపర్‌ పవర్‌. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌, జపాన్‌, తైవాన్‌ వంటి దేశాలు సైతం చైనా ఆధిపత్యానికి…

Read more »

పతనావస్థలో పాక్‌ క్రీడారంగం..!

By |

పతనావస్థలో పాక్‌ క్రీడారంగం..!

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు క్రీడాసంబంధాలు సైతం తీసికట్టుగా మారిపోతున్నాయి. భారత్‌తో సంబంధాలు బెడిసికొట్టడంతో పలువిధాలుగా పాక్‌ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై పోతోంది. ఆ దేశ క్రీడారంగం సైతం పతనం అంచులకు చేరింది. భారత్‌ తోడ్పాటు లేకుంటే మనుగడ సాగించలేమన్న వాస్తవం ఇప్పటికే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, పాకిస్తాన్‌ హాకీ సమాఖ్యలకు అర్థమైపోయింది. భారత్‌, పాకిస్తాన్‌.. దక్షిణాసియాలోనే రెండు ముఖ్య దేశాలు. 1947కు ముందు అఖండ భారత్‌లో భాగంగా ఉన్న ఈ రెండు…

Read more »

సత్తా చాటుతున్న మనీకా..

By |

సత్తా చాటుతున్న మనీకా..

భారత టేబుల్‌ టెన్నిస్‌ మహిళల విభాగంలో మనీకా బాత్రా శకానికి తెరలేచింది. గతేడాది ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా గేమ్స్‌లో సాధించిన అసాధారణ విజయాలతో 23 ఏళ్ల మనీకా టీటీ(టేబుల్‌ టెన్నిస్‌) రాణిగా నిలిచింది. టేబుల్‌ టెన్నిస్‌లో చైనా, జపాన్‌, కొరియా, స్వీడన్‌, జర్మనీ, హాంకాంగ్‌, సింగపూర్‌, నైజీరియా వంటి దేశాల ఆధిపత్యానికి భారత్‌ సవాలు విసిరే రోజులొచ్చాయి. భారత టేబుల్‌ టెన్నిస్‌ ఉనికి కోసం నానా పాట్లు పడుతున్న సమయంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ముగిసిన…

Read more »

దూసుకొస్తున్నారు..!

By |

దూసుకొస్తున్నారు..!

భారత మహిళా క్రికెట్‌కి మంచి రోజులొచ్చాయనే చెప్పాలి. మిథాలీరాజ్‌, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ వంటి డైనమిక్‌ ప్లేయర్లు తమ సత్తా చాటుతుంటే, అదే స్ఫూర్తితో స్మృతి మందానా, జెమీమా రోడ్రిగేజ్‌లు అంచనాలకు మించి రాణిస్తూ వారేవ్వా అనిపించుకొంటున్నారు. మనదేశంలో మహిళా క్రికెట్‌కు లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఐసీసీ ఆదేశాలతో మహిళా క్రికెట్‌ను సైతం బీసీసీఐకి అనుబంధంగా చేర్చుకోవడంతో ప్రోత్సాహం, ఆదరణతో పాటు ప్రచారం కూడా కొంతమేర పెరిగింది. గత మూడు దశాబ్దాలుగా భారత…

Read more »

ప్రతిభకు పట్టం

By |

ప్రతిభకు పట్టం

క్రీడాకారులకు ప్రభుత్వాలు అందించే పౌర పురస్కారాన్ని మించిన గౌరవం మరొకటి ఉండదనే చెప్పాలి. అర్జున, ద్రోణాచార్య, రాజీవ్‌ ఖేల్‌రత్న లాంటి అవార్డులు ఎన్ని లభించినా కేంద్ర ప్రభుత్వం అందించే ‘పద్మశ్రీ’కి ఎంపిక కావడం పట్ల క్రీడ రంగానికి చెందినవారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. అంతటి గౌరవాన్ని తెలుగు తేజాలు గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ సొంతం చేసుకొన్నారు. భారత ప్రభుత్వం ఇటీవల 112 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటిస్తే…

Read more »

ఇదేం సంస్కారం!?

By |

ఇదేం సంస్కారం!?

భారత క్రికెట్‌కు జెంటిల్మన్‌ గేమ్‌గా పేరుంది. అయితే నేటితరం క్రికెటర్లు కొంతమంది ఆ పేరుకు తలవంపులు తెస్తున్నట్లుగా అనిపిస్తోంది. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ క్రికెట్‌ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా, ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ ఇటీవల ప్రసారమైన ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా సోషల్‌ మీడియాకు చిక్కి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీసీసీఐ సస్పెన్షన్‌ వేటుతో జట్టులో…

Read more »