Archive For The “కధ” Category

కేలిక

By |

కేలిక

 చారిత్రక కథ కొండగుట్టల మధ్యన సాగుతోంది వారి ప్రయాణం. కొందరు ఎద్దుల బళ్లలో కూర్చొని ఉంటే, యువకులు మాత్రం చేతికర్రలు, కత్తులు చేతబూని బళ్ల ముందూ, వెనుక నడక సాగిస్తున్నారు. చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల అందరిలోనూ అలసట ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ప్రయాణం మరికొంత దూరం సాగాక, ముందు బండిలో కూర్చొని ఉన్న అరవై ఏళ్ల వ్యక్తి, తన ముందు నడక సాగిస్తున్న యువకులను ఉద్దేశించి చెప్పాడు. ‘సాయంసందె వేళ కావొస్తుంది….

Read more »

అజ్ఞాత వ్యక్తి

By |

అజ్ఞాత వ్యక్తి

ఇది కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ. ఆ రోజు సత్యంగారింటికి అతను వచ్చాడు. ‘అయ్యా…. నన్ను గురవయ్య అంటారు. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చాను. నేను వారాలు చెప్పుకుని బతుకుతుంటాను. ఈ రోజు తమ ఇంటికి భోజనానికి వస్తాను’ అన్నాడు. ‘అదెంత భాగ్యంలెండి. మీరు నిరభ్యంతరంగా మా ఇంట్లో భోజనం చేయవచ్చు’ అన్నాడు సత్యం. సత్యంగారికి ఊళ్లో యాభై ఎకరాల భూమి ఉంది. పట్నంలో వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిలో ఆయన భాగస్వామి. నిర్వహణలో భాగం…

Read more »

జీవితమే సఫలం

By |

జీవితమే సఫలం

ప్రోత్సాహక బహుమతి పొందిన కథ సౌమ్యకి మనసంతా ఆందోళనగా ఉంది. కంటిమీద కునుకు రావటం లేదు. భవిష్యత్తు గురించి కించిత్‌ ఆందోళనగా ఉంది. ‘రేపు తర్వాత నా ప్రణాళిక ఏమిటి? నేను ఏం చెయ్యాలి? సమయాన్ని ఎలా వెళ్లబుచ్చాలి? ఉద్యోగం లేకుండా ఒక్క క్షణమైనా ఊహించుకో గలనా?’ తను ఇప్పుడు ఏలుతున్న తన సామ్రాజ్యం- ఒక సంస్థకి హెడ్‌గా ఉంటూ, పని ప్రారంభించగానే చుట్టూ ఉండే తన కొలీగ్స్‌, మీటింగులు, ఏ సమస్య ఎదురైనా చిటికెలో పరిష్కరించగలిగే…

Read more »

అసలైన దేవుడు

By |

అసలైన దేవుడు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఆకాశానికీ, అవనికి దారాలు కడుతూ.. ఒకటే వాన. బంగాళాఖాతంలో వాయుగుండమట. అయిదార్రోజుల్నుండీ అదే పరిస్థితి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణశాఖ వారి హెచ్చరిక. అర్ధరాత్రి దాటి చాలసేపైంది. ఆ కాలనీలో కరెంట్‌ లేదు. కన్ను చించుకున్నా కానరాని చీకటి. మెరిస్తే తప్ప తెలియని ఉనికి. చలికి తట్టుకోలేక చుట్టూ దుప్పటి బిగదీసుకుని కూర్చు నున్నాడు రంగబాబు. అతనా గేటెడ్‌…

Read more »

గాలివాన

By |

గాలివాన

మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన ఇల్లు, ఆ ఇంట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆయన చదువుకునే గది అతిశుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతబల్ల; దానిమీద ఒక మూలగా ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ ఉంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునేచోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని…

Read more »

ఒకటే చీర

By |

ఒకటే చీర

”నీవు తిని వచ్చిన తరువాత నేబోయి తిని వత్తునుగాని, ముందు నీవేగి తినిరా; చీకటి పడినను నాకు భయములేదు” అని అత్త యనెను. అచ్చరనయినను పిశాచముగా జేసివైచు కోక కట్టుకొని కూర్చున్న కోడలొక్క నిమిషమాలోచించి- ‘కాదు కాదు, మీరే ముందు వెళ్లవలయును. మీరు వచ్చిన తరువాతనే నేను” అని అనెను. ‘మానమును మరియాదయు ఎక్కువ వారికిగాని మముబోటి తక్కువ వారికి గావమ్మా. కాబట్టి ఆ సంగతి వదిలిపెట్టు. నీకు మధ్యాహ్నము కూడ కూడులేదు. పైగా చిన్నదానవు, చీకటిలో…

Read more »

గోదావరి సుడులు

By |

గోదావరి సుడులు

వరదలు కట్టి ప్రవహిస్తున్న గోదావరిలో సుడి గుండాలు తిరుగుతూన్నట్లు రామమూర్తి హృదయం లోనూ ఆవేదనలు సుడులు చుట్టుతున్నాయి. 15 ఆగస్టు 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశపు అవతార పురుషుడు. తేజ స్వరూపుడు, ప్రేమమూర్తి విశ్వంలో లీనమై పోయినాడు. 15 ఆగస్టు 1948లో స్వతంత్రోత్సవం కూడా జరిగిపోయింది. కాని ఈ దుర్భరావేదన మాత్రం తప్పటం లేదు, తాను రాజమహేంద్రవరం నుంచి అయిదేండ్లు క్రిందట హైదరాబాద్‌ రాష్ట్రంపోయి నిజాం ప్రభుత్వం వారి పబ్లిక్‌ వర్క్సు శాఖలో ఉద్యోగం సంపాదించుకున్నాడు….

Read more »

పరిచయుడు

By |

పరిచయుడు

ఆనాడు నేను చాలా పెందలాడే ఇంటిదగ్గరనుంచి బయలుదేరి కాఫీ హోటలుకు వెళ్లాను. ఇంకా నేను ఏమీ పుచ్చుకోలేదు. ఇంతలోకే ‘ఏమోయ్‌, ఇక్కడున్నావా? చాలా మారిపోయినావే!’ అంటూ ఎవరో ఒకాయన నన్ను పలుకరించాడు. నేను ఆయన ముఖం వంక తేరిపార జూశాను. ఎవరో పోల్చుకోలేక పోయినాను. ఖద్దరు బట్టలు కట్టుకొన్నాడు. చామన చాయ. దృఢంగా ఉన్నాడు. మీసం మటుకు కాస్త నెరిసింది. చూడటంతోటే ఆయన చదువుకొన్నవాడనీ, చాలా పెద్దమనిషి అనీ అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఆయన ఎవరైంది నాకు…

Read more »

జై

By |

జై

పాతికేళ్లకింద మనదేశం రిపబ్లిక్‌ అయిందని ఆరోజు పండుగదినం. ఆ పండుగను ఘనంగా, వైభవంగా, కోలాహలంగా చేసుకుంటున్నారు- అట్లా చేసుకోగలవాళ్లందరూ. ఢిల్లీ మహానగరంలో రాష్ట్రపతి నివాసం నుండి ఇండియా గేట్‌దాక ఉన్న సువిశాలమయిన మార్గం పేరు రాజపథం. ఆ పథానికి అది పెద్ద పండగ దినం. విజయచౌక్‌ అనే ఆ సుందరమైన కూడలీ, రాజసంతో రాజిల్లే ఆ రాజ పథమూ – లుట్యెన్స్‌ దొర కేవలం ఈ రిపబ్లిక్‌ దినోత్సవ నిమిత్తమే ఊహించి, రూపకల్పన చేశాడా అన్నంతగా –…

Read more »

నిష్క్రమణ

By |

నిష్క్రమణ

ఏదో పరమార్థంతో మొలకెత్తి పెరిగినట్టుంది ఆ వృక్షం. దాని కింద ఉన్న ఓ రాతి బెంచీ మీద చేతి సంచి పక్కకి పెట్టి దిగాలుగా కూర్చుండి పోయాడు సుబ్బప్ప. వచ్చిన పని కాలేదు. ఊరికి తిరిగి వెళ్లాలన్నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలాగో ఇల్లు చేరుకున్నా వాడిపోయిన అమ్మ ముఖాన్ని చూడాల్సి వస్తుంది. ఉన్న కాస్త భూమి తన తండ్రి గతించిన తర్వాత, పినతండ్రి దౌర్జన్యంతో అతని వశం చేసుకున్నాడు. అమ్మ గిరియమ్మ మరిదితో పోరాడలేక ఊరుకుంది….

Read more »